రాజ్, కావ్య అడవిలో చిక్కుకుపోతారు. దట్టమైన అడవి నుంచి బయటపడే దారి కోసం వెతుకుతుంటారు. మరోవైపు యామిని నియమించిన రౌడీలు కావ్యను చంపడానికి అడవిలో వారిని వెంటాడుతుంటారు. ఆ కిల్లర్స్‌ను పట్టుకొని కావ్య, రాజ్‌లను రక్షించడానికి అప్పు అడవిలోకి ఎంటర్ అవుతుంది.
భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది అని, గూగుల్‌లో ధైర్యం అని టైప్ చేస్తే తన పేరే వస్తుందని కావ్య ముందు బిల్డప్‌లు ఇస్తాడు రాజ్. ఇంతలోనే తొండ కనిపించడంతో భయపడి గెంతులు వేస్తాడు. అతడిని చూసి నవ్వుకుంటుంది కావ్య. నడిచి నడిచి కాళ్లు నొప్పులు పుట్టడంతో ఆగిపోతుంది కావ్య. దాహం వేస్తుందని, మంచినీళ్లు కావాలని అంటుంది. ఇదేమైనా నా పుట్టిల్లా ఏది ఎక్కడుందో తెలియడానికి అని రాజ్ సెటైర్ వేస్తారు.
ఒక అమ్మాయికి దాహంగా ఉందంటే కనీసం వాటర్ ఇచ్చి సాయం చేయలేరా అని కావ్య అంటుంది. రాజ్ అటూ ఇటూ చూస్తాడు. ఏమైందని కావ్య అడుగుతుంది. అమ్మాయి అన్నారు కదా ఎక్కడుందా అని చూస్తున్నానని జోకులు వేస్తాడు. మీరు ఇద్దరు పిల్లల తల్లిలా ఉన్నారు...అమ్మాయి ఏంటి అని ఆటపట్టిస్తాడు. మీరు కూడా నలుగురు పిల్లల్లా తండ్రిలా ఉన్నారని కావ్య రివర్స్ కౌంటర్ వేస్తుంది.
వాటర్ కోసం వెతకడానికి రాజ్ బయలుదేరబోతాడు. అడవి జంతువుల సౌండ్ వినిపించడంతో భయపడిపోతాడు. కావ్య కోసం కష్టపడి నీళ్లు సంపాదిస్తాడు రాజ్.
రాజ్, కావ్యలను చూస్తారు రౌడీలు, వారి వెంట పడతారు. ఆ రౌడీల బారి నుంచి తప్పించుకోవడానికి కావ్య రాజ్ ఓ చోట దాక్కుంటారు. రౌడీలు తమ వైపు రాకుండా తెలివిగా వారిని దారి మళ్లిస్తాడు రాజ్. ఆయాసంతో పరిగెత్తలేక ఓ చోట ఆగిపోతారు కావ్య, రాజ్. రౌడీలను ఎదుర్కోవడానికి రాజ్ సిద్ధమవుతాడు.
కానీ తెగింపు అన్నిసార్లు మంచిదికాదని, సమయం మనది కానప్పుడు తప్పించుకొని పారిపోవడం మంచిదేనని అతడిని వారిస్తుంది కావ్య. గతంలో జరిగినట్లు మళ్లీ మీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనని నోరుజారుతుంది. గతంలో నాకు ఏం జరిగింది అని రాజ్ అనుమానంగా అడుగుతాడు. కోమాలోకి వెళ్లారు కదా దాని గురించి మాట్లాడానని కావ్య కవర్ చేస్తుంది.
రౌడీలకు యామిని ఫోన్ చేస్తుంది. కావ్య స్టోరీని ఫినిష్ చేశావా లేదా అని రౌడీ గ్యాంగ్ లీడర్‌ను అడుగుతుంది. కావ్య తమ నుంచి తప్పించుకొని రాజ్‌తో కలిసి అడవిలోకి పారిపోయిందని గ్యాంగ్ లీడర్ చెబుతాడు. అడవి తమకు కొట్టిన పిండి అని వారిని పట్టుకొని కావ్యను చంపేస్తానని యామినికి మాటిస్తాడు రౌడీ గ్యాంగ్ లీడర్.
తనకు ఆకలిగా ఉందని కావ్య అంటుంది. అరెరె అవునా...బిర్యానీ ఓకేనా అని రాజ్ పంచ్‌లు వేస్తాడు. నా కోసం అది చేస్తా...ఇది చేస్తా అన్నారు. ఒక్క పూట కూడా భోజనం పెట్టలేరా అని కావ్య అంటుంది. టైమ్ చూసి దెబ్బ కొట్టారు కదా అని రాజ్ అంటాడు. అమ్మాయిలం కదా అవకాశం వచ్చినప్పుడే ఆడుకోగలం అని కావ్య అంటుంది. కావ్య ముందు నడుస్తుండగా సడెన్‌గా రాజ్ కనిపించకుండాపోతాడు. దాంతో కావ్య భయంతో వణికిపోతుంది.
మరోవైపు అడవిలో రాజ్, కావ్యల కారు ఆగిపోయిన ప్లేస్‌ను అప్పు కనిపెడుతుంది. రౌడీలకు దొరికేలోపు వారిని ఎలాగైనా కాపాడాలని అనుకుంటుంది. రాజ్ కోసం కావ్య అటు ఇటూ చూస్తుంటుంది. నేను ఇక్కడ ఉన్నానని దూరం నుంచి రాజ్ పిలుస్తాడు. రాజ్ దగ్గరకు వచ్చిన కావ్య...ఆడపిల్లను అలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తారని కొడుతుంది.
ఇందాక మీకు ఆకలిగా ఉందని అన్నారు కదా...మీ కోసం ఫుడ్ తేవడానికి వెళ్లానని చెప్పి కొన్ని ఫ్రూట్స్ కావ్యకు ఇస్తాడు. తన కోసం రాజ్ రాత్రిపూట, అడవిలో రిస్క్ తీసుకోవడం చూసి కావ్య ఇంప్రెస్ అవుతుంది. ఇద్దరు కలిసి పండ్లు తింటారు. రాజ్ తెచ్చిన పండ్లు తిన్న తర్వాత కళ్లు తిరిగినట్లు అవుతుంది. కావ్య, రాజ్ మత్తులోకి జారుతారు. వారిని రౌడీలు చూస్తారు. కావ్యను రౌడీ గ్యాంగ్ లీడర్ కత్తితో పొడుస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం