బ్రహ్మముడి జూన్ 4 ఎపిసోడ్: మరదలిని మోసం చేసిన రాజ్- కావ్యను చంపేయమని యామిని ఆర్డర్- రాహుల్ దొంగతనం బయటపెట్టిన స్వప్న!-brahmamudi serial today episode june 4th 2025 swapna exposes rahul star maa brahma mudi jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్రహ్మముడి జూన్ 4 ఎపిసోడ్: మరదలిని మోసం చేసిన రాజ్- కావ్యను చంపేయమని యామిని ఆర్డర్- రాహుల్ దొంగతనం బయటపెట్టిన స్వప్న!

బ్రహ్మముడి జూన్ 4 ఎపిసోడ్: మరదలిని మోసం చేసిన రాజ్- కావ్యను చంపేయమని యామిని ఆర్డర్- రాహుల్ దొంగతనం బయటపెట్టిన స్వప్న!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ జూన్ 4 ఎపిసోడ్‌లో రిసార్టులో మరదలు యామినిని వదిలేసి కావ్యతో బయటకు వెళ్తాడు రాజ్. అది చూసిన యామిని నన్నే ఇంత మోసం చేస్తావా బావ. దీనికి కావ్య భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అని అనుకున్న యామిని కిల్లర్‌కు కాల్ చేసి కళావతిని చంపేయమని ఆర్డర్ ఇస్తుంది. రాహుల్ చోరీని స్వప్న చెబుతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 4వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యతో మరో రూమ్‌లో రాజ్‌ను చూసిన రూమ్ బాయ్ పండు షాక్ అవుతాడు. సర్ మీరు ఇక్కడ అని పండు అంటే.. ఇందాక టిప్ ఇవ్వలేదనే కదా ఇదిగో తీసుకో అని డబ్బులు ఇస్తాడు రాజ్. సార్ ఇది మోసం అని పండు అంటే.. ఏంటయ్యా మోసం.. వంద ఇచ్చేదానికి వెయ్యి రూపాయలు ఇచ్చిన సరిపోదా మీకు అని కావ్య అంటుంది.

కోపంగా వెళ్లిన పండు

అది కాదు మేడమే ఇందాక 201 రూమ్‌లో అని పండు చెప్పబోతుంటే యూసఫ్.. నా ఫ్రెండ్ యూసఫ్ గురించే చెబుతున్నాడు. నేను చూసుకుంటా అది నువ్వు వెళ్లురా అని రాజ్ అంటాడు. వెళ్తాను. ఎక్కడ చెప్పాలో అక్కడే చెబుతాను అని కోపంగా పండు వెళ్లిపోతాడు. వాడేంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని కావ్య అంటే.. ఇందాక యూసఫ్‌తో చూశాడుగా. అదే అంటున్నాడు. ఇప్పుడు వాడికి నేను హైదరాబాద్ వెళ్లలేదని చెబితే ఫీల్ అవుతాడు. నేను వెళ్లి ఆపుతాను అని రాజ్ అంటాడు.

నన్ను డ్రాప్ చేస్తానని మాటిచ్చారు అని కావ్య అంటే.. అయ్యో అంతలా చెప్పాలా. వాడికి చెప్పేసి వస్తాను అని రాజ్ వెళ్లిపోతాడు. లాభం లేదు. ఈయనను త్వరగా తీసుకెళ్లిపోవాలి అని కావ్య అనుకుంటుంది. ఈయన జెంటిల్‌మెన్ సినిమాలో అర్జున్ అనుకున్నా కానీ, నాని సినిమా జెంటిల్‌మెన్ లాంటోడని ఇప్పుడే అర్థమైంది. ఆడపిల్లకు (యామిని) అన్యాయం జరుగుతుంటే ఊరుకోను నేను అని యామిని కోసం పండు చూస్తాడు.

మేడమ్ మీతో వచ్చిన సర్ మంచివాళ్లు కాదు. రూమ్ నెంబర్ అని పండు చెప్పబోతుంటే.. ఏరా పండు కంప్లైంట్ ఇస్తున్నావా అని రాజ్ అంటాడు. కంప్లైంట్ కాదు మీ కన్నింగ్‌నెస్‌ గురించి బయట పెడుతున్నా. మీరు చేస్తున్నా చీటింగ్ గురించి చెబుతా అని పండు అంటాడు. చీటింగ్ ఏంటని యామిని అంటుంది. మీరు ఏకపత్నివ్రతుడు అనుకున్నా. కానీ, అమ్మాయిలతో ఆడుకుంటారని అనుకోలేదు అని పండు అంటాడు.

సంబంధం ఉందని

దాంతో నేను నా ఫ్రెండ్‌ను కలుద్దామని వెళ్లా. పొరపాటున వేరే రూమ్‌కి వెళ్తే అక్కడ ఇంకో అమ్మాయి ఉంది. ఆమెతో నాకు సంబంధం ఉందని పరుగెత్తుకుంటూ వచ్చేశాడు అని రాజ్ చెబుతాడు. కానీ, యామిని నమ్మదు. దాంతో యామిని భుజాలపై చేయి వేసి మాట్లాడుతుంది. దాంతో యామిని నమ్మేస్తుంది. పండు ఎంత చెప్పిన యామిని వినదు. యామినిని రాజ్ తీసుకెళ్లిపోతాడు.

ఇలా లాభం లేదని కావ్యకు నిజం చెప్పాలని పండు వెళ్తాడు. వేరే అమ్మాయితో రాజ్ ఉన్నాడని చెబితే నాకు తెలుసు. నాకు చెప్పేగా వెళ్లాడు. ఆయన మా శ్రీవారు. యామిని ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని కావ్య అంటుంది. దాంతో పండు షాక్ అవుతాడు. తర్వాత బెడ్ మీద రాజ్‌పైకి యామిని పడుతుంది. ఇంతలో కావ్య కాల్ చేసి మీరు బిజీగా ఉన్నట్లున్నారు. నేను వెళ్లిపోతున్నాను అంటుంది.

అలా అంటే ఎలారా అని అబ్బాయితో మాట్లాడినట్లు రాజ్ వెళ్తాడు. కిరణ్ అనే ఫ్రెండ్ వచ్చాడు. బై చెప్పి వస్తాను అని రాజ్ వెళ్లిపోతాడు. కళావతికి నా ప్రేమ విషయం చెప్పేసి పెళ్లికి ఒప్పించి ఆ విషయమంతా యామినికి చెప్పేయాలని అని రాజ్ అనుకుంటాడు. రాజ్, కావ్య ఇద్దరు కలిసి వెళ్తారు.అది యామిని చూస్తుంది.

కావ్యకు భారీ మూల్యం

నన్ను ఇంత చీట్ (మోసం) చేస్తావా బావ. ఫ్రెండ్ అని చెప్పి కావ్య దగ్గరికి వెళ్తావా. నాకే అబద్ధం చెబుతావా. కావ్య నేను వేసిన ప్లాన్‌ను చెడగొట్టావ్ కదా. నువ్వు చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించుకుంటావ్ అని యామిని కిల్లర్‌కు కాల్ చేస్తుంది. పనేంటో చెప్పండి అని అతను అంటే.. ఇలా బిల్డప్ ఇచ్చే ఏం చేయలేదు. కావ్యను చంపిరారా అంటే యాక్సిడెంట్ చేశావ్ అని యామిని అంటే అందుకే రాజ్ మీ దగ్గర ఉన్నాడుగా అని కిల్లర్ అంటాడు.

సగంలో వదిలేసిన పనిని పూర్తి చేయి అని యామిని అంటే.. మళ్లీ కావ్య మీద అటాక్ చేయమంటున్నారా అని కిల్లర్ అంటాడు. అవును, కానీ, ఈ సారి నీ స్టైల్‌లో గన్, రివాల్వర్‌తో కాదు. నేను పడుతున్న బాధేంటో తనకు తెలియాలి అని ఏదో ప్లాన్ చెబుతుంది యామిని. వాళ్లతో గొడవ పెట్టుకోవాలి. ఆ గొడవలో కావ్య చనిపోవాలి. ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందని రాజ్‌కు అనుమానం రాకూడదు. నేను చూసుకుంటా అని కిల్లర్ చెబుతాడు.

కావ్య ఈసారి నువ్వు తప్పించుకోలేవు. మా బావను బాధపెట్టకుండా పెళ్లి చేసుకుందామనుకున్నా. కానీ, నిన్ను చంపక తప్పడం లేదు. ఐయామ్ సారీ అని కావ్యపై రివేంజ్ స్కెచ్ వేస్తుంది యామిని. మరోవైపు వంటింట్లో అప్పుతో సరసాలు ఆడుతాడు నడుం గిల్లుతాడు కల్యాణ్. వెంటనే అప్పు వెనక్కి తిరిగేసరికి కల్యాణ్‌కు వాత పడుతుంది. ఇద్దరు రొమాన్స్ గురించి వాదించుకుంటే స్వప్న వస్తుంది.

నడుము గిల్లిన కల్యాణ్

దాంతో తడబడతాడు కల్యాణ్. ఇంతలో రాహుల్ వచ్చి కాశ్మీర్‌కు హనీమూన్ ప్లాన్ చేసుకోవచ్చుగా ప్లాన్ ఇస్తాడు. స్వప్న మాట్లాడుతుంటే మెల్లిగా నడుముకు ఉన్న బీరువా తాళాలు తీస్తాడు రాహుల్. అప్పును స్వప్న ఏదోటి అంటుంటే ఎవరో పిలుస్తున్నట్లుగా అప్పు, కల్యాణ్ ఇద్దరు వెళ్లిపోతారు. ఇప్పుడు హ్యాపీగా వెల్లి గిల్ట్ నగలు పెట్టొచ్చు అని రాహుల్ వెళ్లి బీరువాలో డూప్లికేట్ నగలు పెడుతుంటాడు.

వెంటే వచ్చిన స్వప్న అది చూస్తుంది. రాహుల్ అని అంటుంది. రెండు రోజుల నుంచి నాకు అనుమానం వస్తుంది. భర్త అయి ఉండి సొంత భార్య నగలు దొంగలించాలని చూస్తున్నావా అని స్వప్న అంటుంది. ఓ నేను ఇంకా దొంగతనం చేస్తున్నా అనుకుంటుందా. గిల్ట్ నగల విషయం తెలిసిపోయిందని భయపడ్డా అని రాహుల్ అనుకుంటాడు. కింద హాల్లోకి అందరి ముందుకు వెళ్లి రాహుల్ నగలు దొంగతనం చేస్తున్నాడు, కాసేపు అయితే అమ్మేసేవాడు అని స్నప్న బండారం బయటపెడుతుంది.

దొంగతనం ఎందుకు చేశావురా అని అంతూ నిలదీస్తారు. నువ్ ఈ దొంగతనం చేయలేదని వీళ్లందరికి చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పు అని రుద్రాణి అంటుంది. రాహుల్ మాత్రం సైలెంట్‌గా ఉంటాడు. లాకర్ తాళాలు ఎలా తీశావో, దొంగతనం ఎలా చేశావో చెప్పు అని స్వప్న అంటుంది. అంటే, స్వప్న చెప్పేది నిజమే అని రాహుల్ ఒప్పుకుంటాడు.

రాహుల్‌కు శిక్ష

ఇప్పుడు చెప్పు అత్త ఏం చేస్తావో అని స్వప్న అంటుంది. ఇప్పుడు రాజ్, కావ్య కలవబోతున్నారు. రుద్రాణి మనసు బాధపెడితే ఆ ఉక్రోషంతో ఏదైనా చేస్తుంది అని ఇందిరాదేవికి మెల్లిగా చెబుతుంది అపర్ణ. రాహుల్ చెప్పిన అబద్ధాల గురించి, ఆఫీస్‌కు పంపిస్తే చేసిన మోసం, ఇంట్లోనే ఉండమంటే సొంత భార్య నగలే కొట్టేస్తున్నాడు అని స్వప్న బాధపడుతుంది.

ఇప్పుడు నీ కొడుకుతో కాపురం చేయాలా అని రుద్రాణిని నిలదీస్తుంది స్వప్న. రాహుల్ తప్పు చేశాడు. వాడికి ఏ శిక్ష పడాలో భార్యగా నువ్వే డిసైడ్ చేయాలి అని ఇందిరాదేవి అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం