తీర్చుకుంటున్నారా అని కావ్యను ఉద్దేశించి రాజ్ మనసులో అనుకుంటాడు. తనకు మెహందీ పెట్టడం రాదని వైదేహితో చెప్పి తప్పించుకోవాలని చూస్తాడు. కానీ వైదేహి వినకుండా రాజ్‌ను యామిని పక్కన కూర్చోబెడుతుంది.
మెహందీ ఫంక్షన్ జరగకుండా ఆపుతానని అన్నావుగా...ఏం చేస్తావని అప్పును అడుగుతుంది అపర్ణ. మీరే చూస్తారుగా అని అప్పు చెబుతుంది. యామినికి రాజ్ మెహందీ పెట్టడానికి రెడీ అవుతాడు. అప్పుడే యామినికి రౌడీ గుణ ఫోన్ చేస్తాడు. అతడి ఫోన్ చూడగానే యామిని కంగారు పడుతుంది. పీటలపై నుంచి లేస్తుంది. తాను దేశం వదిలి పారిపోవాలని అనుకుంటున్నానని, అందుకు సాయం చేయమని యామినిని అడుగుతాడు గుణ.
లేదంటే ఇప్పుడే పోలీసుల దగ్గరకు వెళ్లి రాజ్, కావ్యలను చంపమని తనతో డీల్ చేసుకున్నది మీరే అని చెబుతానని యామినిని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తలో మాట అంటూ యామినిని ఇరివేట్ చేస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్. వారి మాటలు పట్టించుకోకుండా ఇంపార్టెంట్ పని అంటూ మెహందీ ఫంక్షన్ నుంచి హడావిడిగా వెళ్లిపోతుంది యామిని.
గుణను రాజ్, కావ్య ఎక్కడ చూస్తారో అని యామిని టెన్షన్ పడుతుంది. అసలు ఎందుకొచ్చావ్ ఇక్కడికి, నన్ను పోలీసులకు పట్టించడానికా అంటూ గుణపై ఫైర్ అవుతుంది. తాను సెలైంట్‌గా వెళ్లాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని యామినిని బ్లాక్‌మెయిల్ చేస్తాడు గుణ. యామిని, గుణ మాట్లాడుకోవడం అప్పు, కళ్యాణ్ చాటు నుంచి వింటారు.
దగ్గర అంత డబ్బు లేదని తప్పించుకోవాలని చూస్తుంది యామిని. కానీ ఆమె మాటలు నమ్మడు గుణ. సాయంత్రం లోపు డబ్బులు ఇవ్వకపోతే నాతో పాటు మిమ్మల్ని జైలు ఊచలు లెక్కపెట్టి ఇస్తానని యామినికి వార్నింగ్ ఇస్తాడు గుణ. యామినిని డబ్బుల కోసం గుణ బ్లాక్‌మెయిల్ చేయడం ఆమె తల్లిదండ్రులు చూస్తారు. ఏమైందని అడుగుతారు. వారికి జరిగింది చెప్పబోగా...అక్కడికి అప్పు, కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. వారిని చూసి వణికిపోతుంది యామిని.
స్వప్న కూడా ఫంక్షన్‌కు వస్తుంది. రాహుల్, రుద్రాణి తప్పించుకొని ఇక్కడికి వచ్చారని అంటుంది. యామిని కోసం రుద్రాణి, రాహుల్ వెతుకుతుంటారు. కావ్యను చంపమని రౌడీలకు డబ్బులు ఇవ్వడం ఏంటి అని యామినికి క్లాస్ ఇస్తాడు తండ్రి. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే సహించేది లేదని అంటాడు. తండ్రి మాటలను పట్టించుకోదు యామిని. తనకు ఎలాగైనా కోటి ఇచ్చి కాపాడమని తండ్రిని రిక్వెస్ట్ చేస్తుంది యామిని. మరోదారి లేక కూతురి కోసం డబ్బులు అరెంజ్ చేయడానికి సిద్ధమవుతాడు యామిని తండ్రి.
యామిని దగ్గరకు వచ్చి...కావ్య ఫ్యామిలీ ఈ పెళ్లి ఆపకుండా నేను ఏం చేయడానికి సిద్ధమని ఆమెకు మాటిస్తుంది. రాజ్‌తో నీ పెళ్లి నేను జరిపిస్తానని యామినితో చెబుతుంది. చీరలో అందంగా ముస్తాబై కనిపిస్తుంది కావ్య. మీ ఆయన మరో అమ్మాయిని పెళ్లిచేసుకోబోతుంటే...నువ్వు పెళ్లి కూతురిలా రెడీ కావడం ఏంటో అర్థం కావడం లేదు అని కావ్యతో అంటుంది స్వప్న. యామినితో రాజ్ పెళ్లి జరగదని కావ్య అంటుంది.
కావ్యను చీరలో చూసి రాజ్ ఫిదా అవుతాడు. కావ్య వెళ్లబోతుండగా...పారిపోకే పిట్ట అంటూ పాటపాడుతాడు. నన్ను చూసే మీరు పాట పాడారు అంటూ రాజ్‌తో గొడవపడుతుంది కావ్య. ఈ చీరలో పుత్తడిబొమ్మలా మెరిసిపోతున్న దేవతలా కనిపిస్తున్నారని కావ్యను పొగుడుతాడు రాజ్. అతడి పొగడ్తలతో కావ్య సిగ్గుపడిపోతుంది. ఇంకొన్ని గంటల్లో మరో అమ్మాయితో పెళ్లి పెట్టుకొని నన్ను పొగడటం ఏంటి అని రాజ్‌ను నిలదీస్తుంది కావ్య.
సంబంధిత కథనం