స్వప్న కళ్లు గప్పి కిటీకి గుండా కిందికి దిగిపారిపోతారు రాహుల్, రుద్రాణి. తన ఐడియా ఎలా ఉందని తల్లితో అంటాడు రాహుల్. ఐడియా లేటుగా వచ్చినందుకు కొడుకుకు క్లాస్ ఇస్తుంది రుద్రాణి. ఇద్దరు కలిసి రాజ్, యామినిల నిశ్చితార్థానికి బయలుదేరుతారు. వారు పారిపోవడం స్వప్న చూస్తుంది. ఈ విషయం ఇందిరాదేవికి ఫోన్ చేసి చెబుతుంది.
రాజ్, యామినిల నిశ్చితార్థ పనులను అపర్ణ, ఇందిరాదేవి దగ్గరుండి చూసుకుంటారు. వారికి యామిని తల్లి వైదేహి థాంక్స్ చెబుతుంది. కొన్నిపనులు ఎవరి చేతుల మీదుగా జరగాలో వాళ్లే చేస్తే బాగుంటుందని ఇందిరాదేవి అంటుంది. రాజ్ తరఫున యామిని తల్లికి తాంబూలం ఇస్తుంది అపర్ణ. మీ అత్తగారి చేతుల మీదుగానే తాంబూలాలు తీసుకుంటున్నాం అని కావ్యను చూసి విజయగర్వంతో పొంగిపోతుంది యామిని. పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందని అప్పటివరకు ఏమైనా జరగొచ్చు అని కళ్లతోనే యామినికి బదులిస్తుంది కావ్య.
వధూవరులు ఉంగరాలు మార్చుకోవాలని పంతులు అంటాడు. రూమ్‌లో ఉన్న ఉంగరాలు తీసుకురావడానికి వైదేహి వెళుతుంది. ఆమెను ఏమార్చి ఉంగరాలు కొట్టేస్తుంది కనకం. ఉంగరాలు కనకం కొట్టేసిన విషయం తెలియక ఖాళీ డబ్బాను పూజారికి ఇస్తుంది. అందులో ఉంగరాలు లేకపోవడంతో పూజారి షాకవుతాడు. ఉంగరాలు ఏవని వైదేహి, యామినిలను అడుగుతాడు.
పెళ్లి జరగడం కంటే ఆగిపోవడమే ఎక్కువైందని ధాన్యలక్ష్మి సెటైర్లు వేస్తుంది. ఈ పెళ్లి జరగకపోవడమే మంచిదిలా ఉందని ముత్తైదువలు అంటారు. కొత్త ఉంగరాలే తొడగాలా...ఒకరి ఉంగరాలు మరొకరం మార్చుకుంటే ఇబ్బంది ఏం ఉండదుగా అని పూజారిని అడుగుతుంది యామిని. సమస్య ఏం ఉండదని పూజారి బదులిస్తాడు. తన వేలికి ఉన్న ఉంగరం రాజ్‌కు తొడుగుతుంది యామిని. ఆ సీన్ చూడలేక కళ్లు మూసుకుంటుంది కావ్య. ప్లాన్ ఏ వర్కవుట్ కాకపోవడంతో...ప్లాన్ బీ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెడతారు కనకం, అప్పు.
తనకు ఉంగరం తొడగమని రాజ్‌తో అంటుంది యామిని. అదే టైమ్‌లో బెలూన్స్ పగలగొడతాడు కళ్యాణ్. అందరూ అటూ వైపు చూస్తారు.ఆ గ్యాప్‌లో యామిని వేలికి రాజ్ చేతిలోని ఉంగరాన్ని తొడిగేస్తుంది కనకం. పంతులు ఆ సీన్ చూస్తాడు.
తమ పెళ్లికి ముహూర్తం పెట్టమని పంతులతో అంటుంది యామిని. ఎలాగూ కనకం పెళ్లికి ఆపేస్తుందని కాబట్టి ఏదో ఒక ముహూర్తం పెట్టాలని ఫిక్సవుతాడు పంతులు. రేపు ఉదయం ఏడు గంటలకు మంచి ముహూర్తం ఉందని పంతులు అంటాడు.
రాజ్, యామినిలకు కంగ్రాట్స్ చెబుతుంది కావ్య. థాంక్యూ అని బదులిస్తుంది యామిని. అప్పుడే అప్పుకు కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు. కావ్య, రాజ్‌లపై ఎటాక్ చేసిన గుణ నోరు విప్పాడని, యామిని తన చేత ఈ పని చేయించిందని ఒప్పుకున్నాడని అంటాడు. గుణను అడ్డుపెట్టుకొని యామిని నిజ స్వరూపం బయటపెట్టాలని అప్పు స్కెచ్ వేస్తుంది. తన ప్లాన్‌ను కుటుంబసభ్యులతో చెబుతుంది.
కావాలనే గుణను యామిని ఇంటికి వచ్చేలా చేస్తుంది అప్పు. గుణకు యామిని డబ్బులు ఇస్తుండగా వీడియో తీస్తుంది. మరోవైపు రాజ్, యామిని సంగీత్ ఫంక్షన్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ డాన్స్‌లతో ఇరగదీస్తారు. రాజ్‌తో కలిసి కావ్య డ్యాన్స్ చేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం