బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో యామిని పెళ్లి ఏర్పాట్లు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. యామిని, కావ్య మధ్యలో వచ్చి రాజ్ నిలబడతాడు. యామిని పక్కనే రాజ్ నిల్చోగానే కావ్య చూస్తుంది. అది చూసి పక్కకు తప్పుకుంటాడు. కానీ, యామిని మాత్రం రాజ్‌ను దగ్గరికి లాక్కుంటుంది.
నవ ధాన్యాలు ముడుపు కట్టి రాట్నం కట్టండి అని పంతులు చెబుతాడు. రాట్నాన్ని వైదేహి పట్టుకుని బొట్టు పెడుతుంది. ఒక్కొక్కరుగా బొట్టు పెట్టి, అక్షింతలు వేస్తారు. రాట్నంను భూమిలో పెట్టి అక్షింతలు వేస్తాడు రాజ్. దానికి రాజ్, యామిని కలిసి ముడుపు కడతారు. అదంతా చూసిన కావ్య బాధగా ఫీల్ అవుతుంది. రాట్నంకు హారతి ఇవ్వమని, మీ ఫ్రెండ్ పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని అన్నారుగా అని కావ్యను అంటుంది యామిని.
కంగారెందుకు యామిని. నీ పెళ్లి నేనే జరిపిస్తాను. కానీ, హారతి పెద్దవాళ్లు ఇవ్వాలి. మీ అమ్మతో ఇప్పించు అని కావ్య అంటుంది. భలే చెప్పావ్ కళావతి. ఈ మాత్రం తెలియదా అమ్మాయి నీకు అని యామిని ఇందిరాదేవి అంటుంది. వైదేహి హారతి ఇస్తుంటే.. అప్పు సైగ చేస్తుంది. దాంతో ఒకతను రాట్నంను లాగుతాడు. దాంతో రాట్నం మధ్యలో నుంచి విరిగి కిందపడుతుంది.
శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇలా జరిగిందేంటీ. ముత్తయిదువులు మీరు మాట్లాడారేంటీ అని ఇందిరాదేవి అంటుంది. దాంతో కల్యాణ్ ఏర్పాటు చేసిన జూనియర్ ఆర్టిస్టులు అయ్యయ్యో.. పెళ్లిలో ఇలా జరగడం అరిష్టం. పెళ్లి ఆపేయండి అని అంటారు. దాంతో అంతా షాక్ అవుతారు. నా ఇన్నేళ్ల అనుభవంలో ఇలా జరగలేదు. ఇలా జరిగిందంటే ఈ పెళ్లిలో ఏదో దోషం ఉందని ఇందిరాదేవి అంటుంది.
రామ్‌కు యాక్సిడెండ్, ఇప్పుడు ఇలా జరగడం సరిగ్గా లేదని ధాన్యలక్ష్మీ, అపర్ణ అంటారు. వాళ్లు అలా అంటుంటే మాట్లాడరేంటండి పంతులు గారు అని యామిని అంటుంది. నేను ఒకసారి ముహుర్తం పెట్టాక తిరుగుండదు. కానీ, పెళ్లి ఆపేందుకు ఏవో దుష్ట శక్తులు చూస్తున్నాయని పంతులు అంటాడు. అది ఇన్‌డైరెక్ట్‌గా అపర్ణ, ఇందిరాదేవికి తగులుతుంది. దుష్ట శక్తులో లేకుంటే పెళ్లి జరగకూడదో. ఇది రెండు జీవితాలకు సంబంధించింది కదా. జాగ్రత్తగా చూడండి అని ప్రకాశం అంటాడు.
సరే ఎలాంటి దోషమైన పోవాలంటే దుర్గామాతను ఆరాధించి కుంకుమతో అభిషేకిస్తే సరిపోతుందని పంతులు చెబుతాడు. ఏ ఆటంకం కాకుండా చూసుకోండి అని యామిని, వైదేహి అంటారు. కానీ, పంతులు మాత్రం నేను ఉండగా పెళ్లి ఆగదు అని హామీ ఇస్తాడు. అంతా వెళ్లిపోతారు. అలా దుగ్గిరాల వారి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ముందు ఆ పంతులును ఆపాలి. వాన్ని ఎత్తి తొక్కాలి. వాడితోనే ఈ పెళ్లి ఆపించాలి. దానికి బుల్డోజర్ లాంటి మనిషి కావాలని అని ఇందిరాదేవి అంటుంది.
దాంతో ఆలోచించి.. ఇద్దరూ ఒకేసారి కనకం అని అంటారు. దీంతో కనకం ప్రత్యక్షమవుతుంది. నా కూతురు విషయం ఇంత లేట్ చేశారు. నాకు చెప్పకుండా ఏం చేస్తున్నారు. మీ పద్ధతి అస్సలు నచ్చలేదు. ఆ ముదనష్టపు యామిని ఎక్కడ. దాన్ని నా చేతులతో కొట్టి చంపేస్తాను. నరసింహా స్వామి లెక్క పేగులు బయటకు తీస్తాను అని కనకం ఆవేశంగా అంటుంది.
నీ సాయంతో పెళ్లి ఆపించాలని పిలిపించాం. సీక్రెట్‌గా పెళ్లి ఆగేలా చేస్తున్నాం. మేము చెప్పింది చేయు అని ఇందిరాదేవి అంటుంది. దానికి సరే అని కనకం అంటుంది. కావ్య గురించి అడిగి అది ఇంత వరకు ఎందుకు తెచ్చుకుందో నిలదీస్తాను అని కళావతి దగ్గరికి వెళ్తుంది కనకం. ఇదంతా ఏంటే ఇది అని నిలదీస్తుంది కనకం. పిచ్చి చేష్టలతో ఇక్కడ ఏం చేయకు అని కావ్య అంటుంది.
కట్టుకున్న వాన్ని ఒకతి లాక్కెళ్తుంటే చూస్తు ఉండటానికి సిగ్గు లేదా అని కనకం అంటుంది. మళ్లీ కావ్య బ్రహ్మముడి పురాణం చెబుతుంది. అది విన్న ఇందిరాదేవి, అపర్ణ పిచ్చిదానిలా ఇలాగే వాగుతుంది అని అంటారు. మీరు అమ్మను పిలిచారంటేనే అనుమానంగా ఉందని డౌట్ పడుతుంది కావ్య. ఏంటే నిలదీస్తున్నావ్. పెళ్లి అన్నాక రారా అని ఇందిరాదేవి అంటుంది.
కావ్య వెళ్తుంటే రాజ్ ఎదురుగా ఉంటాడు. మీతో ఓ విషయం మాట్లాడాలి అని చెబుతాడు. కావ్య వినకుండా వెళ్తుంటే.. రాజ్ చేయి పట్టుకుని ఆపుతాడు. మీ ఇష్టమొచ్చినట్లు చేతులు పట్టుకుంటున్నారు. నేనేమైనా మీ భార్యనా అని నిలదీస్తుంది కావ్య. ఇది నా లైఫ్‌కు సంబంధించిన విషయం. జీవితాంతం పశ్చాతాపంతో బతకాలి అని రాజ్ ప్రేమ గురించి చెప్పబోతుంటాడు.
నాకు అది ఈ పెళ్లి అని రాజ్ అంటుంటే.. అది చూసిన యామిని కంగారుపడుతూ వచ్చేస్తుంది. అపశకునాలు ఇలాగే వస్తాయని కావ్య అంటుంది. అమ్మ నీకు పెళ్లి బట్టలు పెట్టాలంటా అని రాజ్‌ను తీసుకెళ్తుంది యామిని. అమ్మవారి పూజకు పంతులు రెడీ చేస్తుంటాడు. శాస్త్రి పంతులు శిష్యుడుకు మంత్రాలు రాకపోవడంపై అరుస్తాడు. నాకు పేరు తీసుకురావడం కాదు పరువు తీసేలా ఉన్నావని తిడతాడు.
ఆ మాటలు విన్న ఇందిరాదేవి, అపర్ణ వీడిని వదిలించుకోవాలి. యామినికి పెళ్లి ముహుర్తం పెట్టింది ఈయనే. పెళ్లి ఆగకుండా జరిపిస్తానని ఓవరాక్షన్ చేస్తున్నాడు అని కనకం అంటుంది. అతని దగ్గర ఒక వీక్‌నెస్ ఉంది. దాంతో మనం చెప్పినట్లు చేస్తాడు. అలా యామిని పెళ్లి క్యాన్సిల్ అవుతుందని కూతురు కోసం కనకం రంగంలోకి దిగుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్