బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ పెళ్లికి రుద్రాణి, రాహుల్‌ను రాకుండా ఆపాలి అని ఇందిరాదేవి చెబితే.. వాళ్లను రాకుండా తాను చూసుకుంటానని స్వప్న అంటుంది. ఈ తల్లీకొడుకులలను ఆపేస్తాను అని చెబుతుంది. ఆఫీస్‌లో అర్జంట్ వర్క్ పడితే సుభాష్ వెళ్లిపోయినట్లు అపర్ణ చెబుతుంది. కావ్య అందంగా, గ్లామర్‌గా రెడీ అయి వస్తుంది.
మనమేమైనా షాపింగ్‌కు వెళ్తున్నామా, పక్కింటి పెళ్లికి వెళ్తున్నామా.. చాలా సంతోషంగా రెడీ అయ్యావు అని అపర్ణ అంటే.. చెప్పాను కదా మా బ్రహ్మముడి అని కావ్య అంటుంటే.. ఆ బ్రహ్మముడి పురాణం ఆపు అని ఇందిరాదేవి అంటుంది. అంతా పెళ్లికి వెళ్తారు. మరోవైపు రాహుల్‌ను రుద్రాణి పిలిస్తే.. అప్పుడే బాత్రూమ్‌లో నుంచి రాహుల్ వస్తాడు. ఈపాటికే రెడీ అవ్వాలని తెలియదా అని రాహుల్‌ను తిడుతుంది రుద్రాణి.
ఆ యామినికేమో ఈ పెళ్లి ఆగకుండా చూసుకుంటామని మాటిచ్చాం. వీళ్లేమో పెళ్లి ఆపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ పెళ్లి జరగకుంటే ఆ యామిని మన ఊపిరి కూడా ఆపేస్తుంది అని టెన్షన్ పడుతుంది రుద్రాణి. మమ్మీ కూల్ ఎందుకు కంగారుపడుతున్నావ్. వీళ్లెవరు ఇంకా వెళ్లలేదుగా పెళ్లి ఆపడానికి. రెండు నిమిషాల్లో డ్రెస్ వేసుకుంటా అని రాహుల్ అంటాడు.
అప్పుడే అటు వచ్చిన స్వప్న ఆ మాటలు వింటుంది. ఏంటీ ఈ పెళ్లి జరిగేలా చేస్తారా. అసలు మీరు బయటకు ఎలా వస్తారో నేను చూస్తాను అని డోర్ లాక్ వేస్తుంది స్వప్న. ఇప్పుడు వెళ్లండి అని స్వప్న లాక్ చేసి అక్కడే ఉంటుంది. రుద్రాణి డోర్ ఎంత ఓపెన్ చేసిన రాదు. రాహుల్ కూడా ట్రై చేస్తాడు. కానీ, రాదు. ఇది రాదు మామ్. బయటి నుంచి లాక్ వేశారు అని రాహుల్ అంటాడు.
యామిని అసలే సైకో. మనం వెళ్లకపోతే ఎలా అని రుద్రాణి భయపడుతుంది. రుద్రాణి కేకలు పెడుతూ అందరిని పిలుస్తుంది. అది రాదు బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు అని రాహుల్ అంటాడు. దాంతో రాహుల్ మొహంపై ఉమ్మేస్తుంది రుద్రాణి. స్వప్నకు కాల్ చేస్తే నెట్‌వర్క్ సరిగా లేదని చెబుతుంది. దాంతో రాహుల్ వ్లే ఇదంతా జరిగిందని నిందిస్తుంది రుద్రాణి.
మరోవైపు రాజ్, యామిని పెళ్లి పనులు జరుగుతుంటాయి. యామిని పట్టు చీర కట్టుకుని ఉంటుంది. దాంతో తండ్రి మురిసిపోతాడు. వీళ్లేమో పెళ్లి పనులు ఏర్పాట్లు చేస్తున్నారు. కళావతి గారు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వెంటనే వెళ్లి కళావతి గారికి నిజం చెప్పాలి. లేకుంటే నన్ను తప్పుగా అనుకుంటుంది అని రాజ్ బయలుదేరుతుంటే యామిని ఆపుతుంది.
ఇంతలో కారులో కావ్య వాళ్లు ఫ్యామిలీతో వస్తారు. అదంతా చూసి రాజ్ షాక్ అవుతాడు. ఎవరు పిలిచారని రాజ్ అంటే యామిని జరిగింది చెబుతుంది. అంటే కళావతి గారికి నిజం తెలుసు. అందుకే కోపంగా మాట్లాడింది అని రాజ్ అనుకుంటాడు. రాజ్‌ను అంతా అదోలా చూస్తారు. రాజ్ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. మా మీదప్రేమలు పెంచుకున్నాడు. కానీ, పెళ్లికి మాత్రం పిలవలేదు అని ఇందిరాదేవి, ఫ్యామిలీ సైటెర్లు వేస్తారు.
అమ్మో వీళ్లు నా మీద చంపేంత కోపం పెట్టుకున్నారు అని రాజ్ అనుకుంటాడు. ఎవరి మొహాల్లో పెళ్లి కళ లేదు, వాడిపోయిన పూలలా ఉన్నాయని పంతులు అంటాడు. శోభనానికి పెళ్లికొడుకులో మన్మథ కళ ఉండాలంటారు. ఇప్పుడు మా మొహాల్లో కూడా ఉండాలా అని కల్యాణ్ పంచ్ వేస్తాడు. తర్వాత రాజ్ తప్పించుకుంటే ఇందిరాదేవి, అపర్ణ అడ్డుపడి ఆపుతారు.
మా ఇంటిబిడ్డను కాదని నీకు సపోర్ట్ చేస్తే ఇంత మోసం చేస్తావా అని నిలదీస్తారు. యామిని సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇప్పుడు చెప్పండి. ఆ పరిస్థితుల్లో ఏం చేయమంటారు. చిన్నప్పటి నుంచి చూసుకున్న ఫ్యామిలీ ఇలా ఉంటే నేను నా ప్రేమ విషయం బయటపెట్టాలా. నా వల్ల ఒకరు ప్రాణం తీసుకుంటే కళావతిని పెళ్లి చేసుకుని గిల్టీగా ఎలా బతకగలను. ఇక జీవితాంతం కళావతిని తలుచుకుంటూ బాధపడుతూ బతికేస్తాను అని రాజ్ అంటాడు.
వీళ్లలో ఏ ఒక్కరికి పెళ్లి ఆపాలని లేదు అని అపర్ణ అంటుంది. అందుకే మనం వచ్చాం కదా అని పెళ్లి ఆపేందుకు ప్లాన్ చేసినట్లు కల్యాణ్, అప్పు చెబుతారు. ఆ పని ఎవరికి అప్పగించారని ఇందిరాదేవి అడిగితే.. మరోవైపు ముగ్గురు ఆడవాళ్లు పెళ్లి ఆగిపోయేలా ప్లాన్ చేస్తుంటారు. వాళ్లకు అప్పు ఏది ఎలా చేయాలో చెప్పింది ఇందిరాదేవికి చెబుతుంది. మనం అక్కడికి వెళ్లడం, ఆ పెళ్లి రాట్నం విరిగిపోవడం అని అప్పు తన మాస్టర్ స్కెచ్ చెబుతుంది.
సరే నేను అడిగిన ముత్తైదువులు ఎక్కడ అని ఇందిరాదేవి అడుగుతుంది. దాంతో ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులను పిలిచి వాళ్లతో పర్ఫామెన్స్ ఇప్పిస్తాడు కల్యాణ్. అది చూసి రామంచంద్ర ప్రభు ఈ పెళ్లి నువ్వే ఆపాలి అని కోరుకుంటుంది ఇందిరాదేవి. అక్కడితే నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్