కావ్యను బొట్టు పెట్టి తన పెళ్లికి పిలుస్తుంది యామిని. తప్పకుండా వస్తానని యామినికి మాటిస్తుంది కావ్య. తాను ఒక్కదానినే రాకుండా కుటుంబసభ్యులందరిని పెళ్లికి తీసుకొస్తానని చెబుతుంది. కావ్య మాటలతో వైదేహి షాకవుతుంది. పెళ్లి పనులు ఉన్నాయంటూ హడావిడిగా యామినిని అక్కడి నుంచి తీసుకెళుతుంది.
కావ్య ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత యామినికి క్లాస్ ఇస్తుంది వైదేహి. కావ్యతో పాటు కుటుంబమంతా వస్తే పెళ్లి ఆపే ప్రయత్నాలు చేస్తారని, రాజ్ మనసు మారుస్తారని భయపడుతుంది. మా పెళ్లిని ఆపటం ఎవరి వల్ల కాదని యామిని అంటుంది.
పెళ్లికి వస్తానని యామినికి ఎందుకు మాటిచ్చావని కావ్యను నిలదీస్తాడు సుభాష్. కావ్య అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడిందంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసిందని ఇందిరాదేవి సపోర్ట్ చేస్తుంది. పెళ్లి ఆపడానికి ఏ ప్లాన్ వేయలేదని షాకిస్తుంది కావ్య. కానీ ఆ పెళ్లి మాత్రం జరగదని అంటుంది.
నాకు దేవుడి మీద నమ్మకం ఉందని, నన్ను రాజ్‌ను కలిపిన ఆ దేవుడే మమ్మల్ని విడిపోకుండా కాపాడుతాడని అంటుంది. నన్ను రాజ్‌ను ఒక్కటి చేసిన బ్రహ్మముడి మమ్మల్ని ఒకటిగా ఉండేలా చేస్తుందని, యామిని లాంటి వాళ్లు లక్ష మంది వచ్చినా నన్ను, రాజ్ విడదీయలేరని అంటుంది. కావ్య మాటలు విన్న తర్వాత రాజ్, యామినిల పెళ్లి తప్పకుండా జరుగుతుందని అనిపిస్తుందని రుద్రాణి అంటుంది.
కావ్యను నమ్ముకోకుండా ఎలాగైనా రాజ్ పెళ్లి ఆపాలని అపర్ణ, ఇందిరాదేవి అనుకుంటారు. యామిని మనుషుల్లో ఒకరైన పేరిశాస్త్రిని వాడుకొని రాజ్ పెళ్లిని అడ్డుకోవాలని అనుకుంటారు. రాజ్, యామినిల పెళ్లికి పేరిశాస్త్రి ముహూర్తం ఫిక్స్ చేస్తాడు.
తానే దగ్గరుండి వారి పెళ్లి జరిపిస్తానని వైదేహికి మాటిస్తాడు. మా అమ్మాయి పెళ్లికి కొన్ని గండలు అడ్డొచ్చేలా ఉన్నాయని వైదేహి అంటుంది. ఎలాంటి గండాలు అడ్డొచ్చిన తాను చూసుకుంటానని యామిని, వైదేహికి మాటిస్తాడు పేరిశాస్త్రి.
యామినితో తన పెళ్లి జరుగనున్న విషయం కావ్యకు తెలియదని రాజ్ అనుకుంటాడు. ఆమెకు తన పెళ్లి గురించి చెప్పాలని ఫోన్ చేస్తాడు. యామిని పెళ్లి చేసుకోనున్న విషయం తనకు చెప్పడానికే రాజ్ ఫోన్ చేస్తున్నాడని కావ్య అనుకుంటుంది. రాజ్ నోటి నుంచి ఆ మాట వినడం తన వల్ల కాదని అనుకుంటుంది.
పెళ్లి గురించి రాజ్‌కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా రాత్రి పదకొండు గంటలకు ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఎలా ఫోన్ చేస్తారని దబాయించి ఫోన్ కట్ చేస్తుంది. పెళ్లి గురించి తెలిసి కోపంతోనే కావ్య అలా మాట్లాడుతుందని రాజ్ కంగారు పడతాడు. కావ్యను కలవడానికి బయలుదేరబోతాడు.
కానీ రాజ్‌ను యామిని ఆపేస్తుంది. నీకోసం ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశానని, నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీలులేదని ఆపేస్తుంది. నీకోసం ఎంత ఇంపార్టెంట్ పనిఉన్న నా కోసం పక్కనపెట్టమని అంటుంది. ఈ రెండు రోజులు నాతోనే ఉండాలని చెబుతుంది. రాజ్ కన్వీన్స్ అవుతాడు. పెళ్లి మండపం ఫొటోలు రాజ్‌కు చూపించి సర్‌ప్రైజ్ అని అంటుంది. ఇదేనా నువ్వు ఇచ్చే సర్‌ప్రైజ్ అని రాజ్ చిరాకు పడతాడు.రేపు ఇంతకంటే పెద్ద సర్‌ప్రైజ్ ఉందని యామిని అంటుంది.
రాజ్ పెళ్లిని ఎలా ఆపాలో అర్థం కావడం లేదని యామిని, ఇందిరాదేవి ఆలోచిస్తుంటారు. వారి బాధను చూసి సంబరపడుతుంది రుద్రాణి. యామిని, రాజ్ పెళ్లి కోసం టిప్‌టాప్‌గా రెడీ అవుతుంది. ఏంటి మీరు పెళ్లికి రావడం లేదా అని అపర్ణను అడుగుతుంది రుద్రాణి.
మేము ఎప్పుడో రెడీ అయిపోయాం అని అపర్ణ అంటుంది. ఏంటి ఇలా నార్మల్‌గానే వస్తారా? దుగ్గిరాల ఫ్యామిలీకి ఓ స్టేటస్ ఉంది..అలాంటిది ఇలా నార్మల్‌గా పెళ్లి వస్తే నలుగురు ఏమనుకుంటారు అని రుద్రాణి అంటుంది. నగలన్నీ బ్యాంకు లాకర్‌లో, చీరలన్నీ వాషింగ్ మిషన్‌లో ఉన్నాయని అనుకుంటారని తిక్కతిక్కగా రుద్రాణికి సమాధానమిస్తుంది అపర్ణ...
నువ్వేంటి కాస్ట్‌లీ చీరకట్టుకొని రెడీ అయ్యాయి...చూస్తుంటే ఈ పెళ్లి జరగడం నీకు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది అని రుద్రాణిని అడుగుతుంది ఇందిరాదేవి. కావ్య జీవితం నాశనమవుతుందని నాకు బాధగా ఉందని నాటకం ఆడుతుంది రుద్రాణి. ఇంటి దాకా వచ్చి బొట్టు పెట్టి యామిని పెళ్లికి పిలిచిందని ఫార్మాలిటీగా వెళుతున్నానని చెబుతుంది. రాజ్ పెళ్లిని ఆపడానికి అప్పు, కళ్యాణ్ ప్లాన్ చేస్తారు. రుద్రాణి, రాహుల్‌ను పెళ్లికి రాకుండా తాను చూసుకుంటానని స్వప్న చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం