రాజ్‌తో యామిని పెళ్లి జరుగుతుందని తెలిసి అపర్ణ, ఇందిరాదేవి కంగారు పడతారు. కానీ కావ్య మాత్రం ఏం పట్టనట్లుగా ఐస్‌క్రీమ్‌లు తింటూ రిలాక్స్ అవుతుంటుంది. నీ మొగుడు ఇంకో అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడని, నీ జీవితం నాశనం అవుతుంటే ఇలా సెలైంట్‌గా ఉంటే ఎలా అని కావ్యను నిలదీస్తుంది అపర్ణ.
జరగని పెళ్లి కోసం భయపడటం ఎందుకు అని కూల్‌గా బదులిచ్చి బయటకు వెళ్లబోతుంది. ఎక్కడికి అని కావ్యను అడుగతారు అపర్ణ, ఇందిరాదేవి. ఫ్రిజ్‌లో ఇంకో ఐస్‌క్రీమ్ ఉంది తినడానికి వెళుతున్నానని బదులిస్తుంది కావ్య.
తాను రాజ్‌ను పెళ్లిచేసుకోబోతున్న విషయం కావ్యకు తెలియాలని యామిని అనుకుంటుంది. వైదేహి వద్దని చెబుతున్న వినకుండా కావ్యకు కాల్ చేస్తుంది యామిని. నీకో షాకింగ్ న్యూస్ చెబుతున్నానని కావ్యతో అంటుంది యామిని. రామ్, నేను ఎల్లుండి పెళ్లిచేసుకోబోతున్నామని అంటుంది. యామిని మాటలతో కావ్య షాకవుతుంది.
రాజ్ ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకొని ఉండడు. నువ్వే ఏదో మాయ చేసి పెళ్లికి ఒప్పించి ఉంటావని యామినితో కావ్య అంటుంది. నువ్వు చెప్పింది కరక్టే...రాజ్‌ను పెళ్లికి ఒప్పించడానికి నేను నాటకం ఆడాల్సివచ్చిందని యామిని అంగీకరిస్తుంది. పెళ్లి కూడా దొంగతనంగా ఎవరికి తెలియకుండా గుడిలో చేసుకుంటావు అంతే కదా అని యామినిని అడుగుతుంది కావ్య. దొంగతనంగా పెళ్లి చేసుకోవాల్సిన ఖర్మనాకు పట్టలేదని యామిని బుకాయిస్తుంది.
అంత దర్జాగా చేసుకుంటే నన్ను ఎందుకు పెళ్లికి పిలవలేదని కావ్య అంటుంది. నేను ఎక్కడ పెళ్లిని ఆపేస్తానో అని భయపడుతున్నావు కదా యామినిపై రివర్స్ ఎటాక్ మొదలుపెడుతుంది కావ్య. రేపే నిన్ను బొట్టు పెట్టి పెళ్లికి పిలుస్తాను అని కావ్యతో ఛాలెంజ్ చేస్తుంది యామిని. నీ కళ్ల ముందే రాజ్ నా మెడలో తాళి కట్టేలా చేసుకుంటానని కావ్యతో యామిని అంటుంది.
తన నగలను బెడ్‌పై పెడుతుంది స్వప్న. ఆ సీన్ చూసి కంగారు పడతాడు రాహుల్. తన నగలను తదేకంగా రాహుల్ చూస్తుండటం స్వప్న కనిపెడుతుంది. ఈ ఒరిజినల్ నగలు కొట్టేసి...వాటి ప్లేస్‌లో గిల్ట్ నగలు పెట్టాలని అనుకుంటున్నట్లు కనిపిస్తున్నావు...ఆ పని చేస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. స్వప్న వార్నింగ్‌కు భయపడిపోతాడు రాహుల్.
అవి గిల్ట్ నగలు అని తెలిస్తే తనను ఏం చేస్తుందో అని వణికిపోతాడు. రేపే ఈ నగలను బ్యాంకుకు తీసుకెళ్లబోతున్నట్లు రాహుల్‌తో అంటుంది స్వప్న. ఆ నగలు బ్యాంకుకు తీసుకెళితే...అవన్నీ గిల్ట్ నగలు అనే నిజం బయటపడుతుంది, తన నాటకం బయటపడుతుందని రాహుల్ వణికిపోతాడు. స్వప్నను బ్యాంకు వెళ్లకుండా ఆపాలని ప్రయత్నిస్తాడు. ఈ మంత్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయని అబద్ధం చెప్పి స్వప్నను బ్యాంకు వెళ్లకుండా అడ్డుకుంటాడు.
దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అక్కడికి సడెన్‌గా యామిని ఎంట్రీ ఇస్తుంది. రాజ్‌తో తన పెళ్లి ఎల్లుండి జరగబోతుందని అందరికి చెబుతుంది. ఆఫీస్, ఇంటి పనుల్లో పడి కళావతి పెళ్లి డేట్ మర్చిపోతుందని పిలవడానికి వచ్చానని అంటుంది. కళావతి పెళ్లిలో కనిపించకపోతే రాజ్ హర్టవుతాడని వెటకారంగా అంటుంది. యామిని ఓవరాక్షన్‌ను భరించలేకపోతుంది అపర్ణ.
కావ్యకు బొట్టు పెట్టి....మీరు మా పెళ్లికి తప్పకుండా రావాలని అంటుంది యామిని. మా పెళ్లి పనులన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలని అంటుంది. మీ పెళ్లికి రమ్మని ఇంతలా అడుక్కోవాల్సిన అవసరం లేదు...తప్పకుండా వస్తానని కావ్య బదులిస్తుంది. ఆమె సమాధానం విని యామిని షాకవుతుంది. నేనే కాదు...మా ఇంటిల్లిపాది అందరిని తీసుకొస్తానని యామినికి బదులిస్తుంది కావ్య. కావ్య మాటలతో కంగారు పడిన వైదేహీ కూతురిని తీసుకొని అక్కడి నుంచి జారుకుంటుంది.
యామినిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదనే విషయం కావ్యకు చెప్పాలని రాజ్ అనుకుంటాడు. ఆమెను కలవడానికి బయలుదేరుతాడు. కానీ కావ్యనే పెళ్లి మండపానికి వస్తుంది. ఆమె చూసి షాకవుతాడు. తానే కావ్యను పెళ్లికి పిలిచినట్లు రాజ్‌తో యామిని చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.