బ్రహ్మముడి జూలై 5 ఎపిసోడ్: భర్తను కొట్టబోతుంటే అడ్డుకున్న స్వప్న- రాహుల్‌కు చీపురుతో భరితపూజ- భయపెట్టిన రాజ్!-brahmamudi serial today episode july 5th 2025 swapna beats rahul raj actions get tension star maa brahmamudi jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్రహ్మముడి జూలై 5 ఎపిసోడ్: భర్తను కొట్టబోతుంటే అడ్డుకున్న స్వప్న- రాహుల్‌కు చీపురుతో భరితపూజ- భయపెట్టిన రాజ్!

బ్రహ్మముడి జూలై 5 ఎపిసోడ్: భర్తను కొట్టబోతుంటే అడ్డుకున్న స్వప్న- రాహుల్‌కు చీపురుతో భరితపూజ- భయపెట్టిన రాజ్!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ జూలై 5 ఎపిసోడ్‌లో రాహుల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లడం చూసిన స్వప్న, అప్పు ఫాలో అవుతారు. తన గర్ల్‌ఫ్రెండ్‌కు రాహుల్ డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇవ్వగానే స్వప్న ఎంట్రీ ఇచ్చి షాక్ ఇస్తుంది. రాహుల్‌ను తన లవర్ కొట్టబోతుంటే స్వప్న అడ్డుకుంటుంది. మరోవైపు ఆఫీస్‌లో రాజ్ అందరిని భయపెడతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ జూలై 5 ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యకు తెలియకుండా ఆఫీస్‌కు రాజ్ వెళ్లి రచ్చ రచ్చ చేస్తాడు. రాజ్ ప్రవర్తన గురించి శ్రుతిని ఆఫీస్ ఉద్యోగులు అడుగుతారు. నోరుమూసుకుని వెళ్లి పని చేసుకోమ్మని చెబుతుంది శ్రుతి. ఇప్పుడు క్యాబిన్‌కు వెళ్తే ఏమంటారో.. పెళ్లి అయితే మొగుడికి కూడా ఇంత భయపడను. ఈయనకు భయపడాల్సి వస్తుందని శ్రుతి అంటుంది.

రుద్రాణిపై సెటైర్లు

మరోవైపు అంతా భోజనం చేస్తుంటే గుమ్మం వైపు రుద్రాణి చూస్తుంటే కావ్య అడుగుతుంది. అంతా రుద్రాణిపై సెటైర్లు వేస్తారు. ఇంటి వారసుడు కోసం చూస్తున్నాను అని రుద్రాణి అంటుంది. రాజ్‌కు ట్రైనింగ్ ఇవ్వడం రుద్రాణి తొంగి తొంగి చూసినదాని గురించి కావ్య అడుగుతుంది. ఇంతలో రాహుల్ బయటకు వెళ్తుంటే పూలరంగడులా వెళ్తున్నావేంటీ అని కల్యాణ్ అడుగుతాడు.

అర్జంట్ మీటింగ్ ఉందని రాహుల్ వెళ్తాడు. రాహుల్ పాకెట్‌లో డాక్యుమెంట్స్ చూసిన అప్పు, స్వప్న ఫాలో అవుతారు. ఇంతలో కావ్యకు శ్రుతి కాల్ చేసి ఇక్కడ కొంపలు అంటుకుంటున్నాయి. రాజ్ సర్ ఆఫీస్‌కు వచ్చారు. అంత వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఎవరి దగ్గర అయినా టంగ్ స్లిప్ అయితే అంతే పరిస్థితి. త్వరగా రండి అని శ్రుతి చెబుతుంది.

నాకే షాక్ ఇచ్చారు

రాజ్ ఆఫీస్‌కు వెళ్లిన విషయం ఇంట్లో వాళ్లకు చెబుతుంది కావ్య. నేనే ఆయన్ను రేపు ఆఫీస్‌కు తీసుకెళ్లి అందరిని సర్‌ప్రైజ్ చేద్దామనుకుంటే ఆయన నాకు తెలియకుండా వెళ్లి షాక్ ఇచ్చారు అని ఆఫీస్‌కు వెళ్తుంది కావ్య. ఇంకా కావ్య ప్లాన్ పూర్తిగా ఓవర్ అయిపోతుంది అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు తను బాస్‌లా ఉండటం బాగుందని సంతోషిస్తాడు రాజ్.

ఇంతలో మేనేజర్ వస్తాడు. మేనేజర్ డిజైన్స్ అప్రూవల్ గురించి అడిగితే రాజ్‌గా ఉన్న రామ్ సంతకం చేస్తాడు. రాజ్ రైట్ హ్యాండ్ కాకుండా లెఫ్ట్ హ్యాండ్‌తో పెడితే శ్రుతి వచ్చి కవర్ చేస్తుంది. స్టాఫ్ అందరిని పిలవమని శ్రుతికి చెబుతాడు రాజ్. శ్రుతి వద్దన్న రాజ్ వినడు. ఇవాళ మన విశ్వరూపం చూసి అందరా భయపడిపోవాలి. దాంతో కళావతి గారు ఇంప్రెస్ అవ్వాలని రాజ్ అనుకుంటాడు.

మరోవైపు తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇస్తాడు రాహుల్. దాంతో రాహుల్‌ను తను హగ్ చేసుకుంటుంది. ఇక పూర్తిగా నీదాన్ని అయిపోయాను. నువ్ ఏది అడక్కపోయినా ఇస్తాను అని రాహుల్ గర్ల్‌ఫ్రెండ్ అంటే నేనొచ్చు నీ ఒంటికి చిల్లులు పడేలా చేస్తాను అని స్వప్న ఎంట్రీ ఇస్తుంది. దాంతో రాహుల్, తన లవర్ ఇద్దరు షాక్ అవుతారు.

అడ్డుకున్న స్వప్న

అవి డూప్లికేట్ డాక్యుమెంట్స్ అని స్వప్న చెబుతుంది. దాంతో నన్నే చీట్ చేస్తావ అని రాహుల్‌ను లవర్ కొట్టబోతుంటే స్వప్న అడ్డుకుంటుంది. ఏంటే నా మొగుడుని నా ముందే కొడతావా. వాన్ని కొడితే గిడితే నేనే కొట్టాలి. ఇంకెవరైనా కొడితే చంపేస్తాను అని స్వప్న అంటుంది. నన్ను క్షమించు అని రాహుల్ అంటే చీపిరి తీసుకొచ్చి రాహుల్‌ను పిచ్చి పిచ్చి కొట్టుడుకొట్టి భరితపూజ చేస్తుంది స్వప్న.

రాహుల్ లవర్ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంటే అప్పు ఆపి ఏడు వారాల నగలు తీసుకురమ్మంటుంది. దాంతో భయపడి నగలు తీసుకొచ్చి ఇచ్చి పారిపోతుంది. వీన్ని వాళ్ల అమ్మ ముందుకే తీసుకు వెళ్దాం. ఏం నీతులు చెబుతుందో చూద్దాం అని స్వప్న అంటుంది. మరోవైపు స్టాఫ్ అందరిని పిలిచిన రాజ్ సీరియస్‌గా చూస్తుంటాడు. అదే విషయం దారిలో వస్తున్న కావ్యకు కాల్ చేసి చెబుతుంది శ్రుతి.

భయపెట్టిన రాజ్

అది చూసిన రాజ్ శ్రుతిపై ఫైర్ అవుతాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేయమనడంతో శ్రుతి అలాగే చేస్తుంది. ఒక్క ఫైల్, డిజైన్ కరెక్ట్‌గా లేదని అందరిమీద అరుస్తాడు రాజ్. అందరిని తిడతాడు. దాంతో అంతా భయపడిపోతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం