బ్రహ్మముడి జూలై 4 ఎపిసోడ్: కావ్యకు యామిని డబుల్ ధమాకా- బయటపడిన గిల్ట్ నగలు, స్వప్న ఇన్వెస్టిగేషన్- ఆఫీస్‌లో రాజ్ బీభత్సం-brahmamudi serial today episode july 4th 2025 yamini knew kavya plan swapna investigation star maa brahmamudi jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్రహ్మముడి జూలై 4 ఎపిసోడ్: కావ్యకు యామిని డబుల్ ధమాకా- బయటపడిన గిల్ట్ నగలు, స్వప్న ఇన్వెస్టిగేషన్- ఆఫీస్‌లో రాజ్ బీభత్సం

బ్రహ్మముడి జూలై 4 ఎపిసోడ్: కావ్యకు యామిని డబుల్ ధమాకా- బయటపడిన గిల్ట్ నగలు, స్వప్న ఇన్వెస్టిగేషన్- ఆఫీస్‌లో రాజ్ బీభత్సం

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ జూలై 4 ఎపిసోడ్‌లో రామ్‌కు ఎండీ రాజ్‌లా కావ్య ట్రైనింగ్ ఇవ్వడం చూసిన రుద్రాణి యామినికి కాల్ చేసి చెబుతుంది. ఎండీ ప్లాన్ తెలిసి కావ్యకు యామిని డబుల్ ధమాకా ఇస్తానంటుంది. స్వప్న ఇచ్చిన నగలు రోడ్ గోల్డ్ అని అప్పు కోప్పడుతుంది. దాంతో రాహుల్‌పై స్వప్న, అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తారు.

బ్రహ్మముడి సీరియల్‌ జూలై 4 ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రామ్‌కు రాజ్‌ల తినడం నేర్పుస్తుంది కావ్య. అది చూసి రుద్రాణి అనుమానిస్తుంది. ఇదేదో పెద్ద ప్లానింగ్‌లోనే ఉంది. తెలుసుకోవాలి అని రుద్రాణి అంటుంది. తిన్న తర్వాత రిలాక్స్ అవ్వడం గురించి కావ్య చెబితే రామ్ కోప్పడతాడు. మీరే కదా మా బాస్‌లా చేస్తాను అన్నారు. వద్దంటే వదిలేయండి అని కావ్య అంటుంది.

ఇంత కష్టంగా ఉంటుందని

రామ్ టైడ్ అయిపోయాను అంటే ఇంకా ఉంది. రేపు సిద్ధార్థ్‌తో జరిగే మీటింగ్‌లో పదేళ్ల ఆఫీస్ చరిత్ర, డీలింగ్స్ అన్ని మాట్లాడాలి అని కావ్య అంటుంది. కంపెనీ ఎండీ అంటే ఏదో వెళ్లి నాలుగు మాటలు మాట్లాడేసి వచ్చేయడమే అనుకున్నాను. ఇంత కష్టంగా ఉంటుందని అస్సలు అనుకోలేదని రాజ్‌గా చేస్తున్న రామ్ అంటాడు. మరి మా బాస్ ప్లేసులో నటించడం అంటే అంత ఈజీ అనుకున్నారా అని కావ్య అంటుంది.

ఆ మాటలు రుద్రాణి వింటుంది. హో ఇదా నీ ప్లాను. రాజ్‌కు తెలియకుండా వాడి ప్లేసులోకి పంపించాలనుకుంటున్నావా. చెబుతా నీ పని అని యామినికి కాల్ చేస్తుంది రుద్రాణి. రాజ్‌కు కంపెనీ ఎండీలా ట్రైనింగ్ ఇస్తుంది అని కావ్య ప్లాన్ గురించి రుద్రాణి చెబుతుంది. ఇంత పిచ్చిదానిలా ఆలోచిస్తుందని అనుకోలేదని యామిని అంటుంది. ఏదో ఒకటి చేసి రాజ్ ఆఫీస్‌కు రాకుండా చేయు అని రుద్రాణి అంటుంది.

నా ఇంటలిజెన్స్ ఉపయోగించి ఆ కావ్య తీసిని గోతిలో తానే పడేలా చేశానుగా. ఇది కూడా చూసుకుంటాను అని యామిని కాల్ కట్ చేస్తుంది. కావ్య రేపటి యుద్ధం కోసం సైనికుడిని సిద్ధం చేస్తున్నావా. చేసుకో చేసుకో. నీకు డబుల్ ధమాకా అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని యామిని అనుకుంటుంది. మరోవైపు స్వప్న దగ్గరికి వచ్చి తను ఇచ్చింది గిల్ట్ నగలు ఇచ్చావేంటీ అని కోప్పడుతుంది.

రోడ్ గోల్డ్ నగలు

తాతయ్య గారు ఇచ్చిన ఏడు వారాల నగలు ఇవి అని స్వప్న అంటే.. కంపెనీ వాళ్లు చెక్ చేసి రోడ్ గోల్డ్ అని అన్నారు. నా తల కొట్టేసినట్లు అయింది అని అప్పు అంటుంది. దాంతో రాహుల్ ఆరోజు దొంగతనం చేయలేదు. కొట్టేసిన ఒరిజినల్ నగల ప్లేసులో ఈ గిల్ట్ నగలు పెడుతూ దొరికిపోయాడు. అమ్మ నా మొగుడా. ఎంతకు తెగించావురా. ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఈ నగలు వాడు ఎందుకు దొంగతనం చేశాడు. ఎక్కడ అమ్మేశాడో తెలుసకోవాలి అని స్వప్న అంటుంది.

మా అత్త వాడికి డబ్బులు ఇస్తూనే ఉంటుంది. ఇవి ఎందుకు కొట్టేశాడో రాహుల్ మీద స్పై చేసి తెలుసుకోవాలని స్వప్న చెబుతుంది. అలాగే అని అప్పు అంటుంది. కావ్య పడుకుని ఇంటే రాజ్ కాల్ చేస్తాడు. ఎప్పుడు చూసిన పిశాచాలు తిరిగే టైమ్‌లో కాల్ చేస్తారేంటండి అని కావ్య అంటుంది. మీ పని మీద కాల్ చేశాను. మీ బాస్ గురించి ఇంకా చెబుతారేమో, రాత్రంతా ప్రాక్టీస్ చేద్దామని కాల్ చేశానని రామ్ అంటాడు.

కావ్య నమ్మదు. దాంతో హర్ట్ అయిన రామ్ కాల్ కట్ చేస్తాడు. ఇలా లాభం లేదు. కళావతికి ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయాలి. రేపు తనకంటే ముందే ఆఫీస్‌కు వెళ్లి బాస్‌లా యాక్టింగ్ చేస్తే దాంతో కావ్య ఇంప్రెస్ అవుతుంది, అప్పుడు ప్రపోజ్ చేస్తే లవ్ యాక్సెప్ట్ చేస్తుందని తనకు తానే సొంతగా ప్లాన్ వేసుకుంటాడు రాజ్. మరోవైపు రాహుల్‌కు కనిపించేలా కావాలనే కీస్ బెడ్ మీద పెట్టి అప్పు కాల్ చేసి రమ్మనట్లుగా వెళ్లిపోతుంది స్వప్న.

డూప్లికేట్స్ చేయించి

అప్పుకు పని ఉందట. అరగంట వరకు రాను, పాపను చూసుకో అని వెళ్లిపోతుంది స్వప్న. రాహుల్ లాకర్ కీస్ తీసుకుని ఆ డాక్యుమెంట్స్ ఎలా కొట్టేయాలని చూస్తుంటే తనే స్వయంగా కీస్ వదిలి వెళ్లిపోయింది. వెంటనే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసి డూప్లికేట్ చేయించి తనను నా సొంతం చేసుకోవాలి అని డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లిపోతాడు రాహుల్.

అదంతా చాటుగా ఉండి చూసిన స్వప్న అప్పుతో నా మొగుడే నాకు ఎలా వెన్నుపోటు పొడుస్తున్నాడో చూశావా అని అంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడికి తీసుకెళ్తాడో తెలిసాక అప్పుడు నా మొగుడుకి ముక్కుతాడు వేస్తానుగా అని స్వప్న అంటుంది. మరుసటి రోజు ఉదయం ఆఫీస్‌కు కావ్యకు చెప్పకుండా ఎండీ రాజ్‌ల రామ్ వెళ్తాడు. విష్ చేసినవాళ్లను చేసినందుకు, చేయనివాళ్లను చేయనందుకు తిడతాడు రాజ్.

ఆఫీస్‌లో రాజ్

శ్రుతి మీద కూడా అరుస్తాడు రాజ్. పెండింగ్ ఫైల్స్ తీసుకుని, మేనేజర్‌ను క్యాబిన్‌కు రమ్మను అని రాజ్ వెళ్లిపోతాడు. వచ్చిన ఐదు నిమిషాల్లోనే బీభత్సం చేశారు కావ్య మేడమ్ రాకుంటే కొంపలు అంటుకుంటాయని శ్రుతి అనుకుంటుంది. అదే విషయం కావ్యకు కాల్ చేసి శ్రుతి చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం