బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాహుల్ స్వప్న రూమ్ లాకర్ తెరిచేందుకు వెతికితే స్వప్న వచ్చి దానికి కీ కావాలనంటుంది. ఈ సారి ఏం కొట్టేయాలని ప్లాన్ చేశావ్, ఏం దొంగతనం చేయాలనుకుంటున్నావ్ అని స్వప్న తిడుతుంది. నేను వచ్చింది కొట్టేయడానికి కాదు చార్జర్ కోసం అని పక్కన ఉన్న చార్జర్ తీసుకుని వెళ్లిపోతాడు రాహుల్.
నా దొంగమొగుడు మళ్లీ ఏదో కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడని స్వప్న అనుకుంటుంది. రాహుల్ మాత్రం హమ్మయ్య తప్పించుకున్నాను. లేకుంటే స్వప్న చేతిలో చచ్చుండేవాన్ని అని అనుకుంటాడు. మరోవైపు రాజ్, కావ్య ఏం మాట్లాడుకున్నారో తెలీదు. వీళ్లిద్దరికి త్వరగా మూడు ముళ్లు వేస్తే అయిపోతుందని అపర్ణ అంటుంది. ఇంతలో రాజ్ ఫుల్ జోష్‌తో వస్తాడు.
ఇందిరాదేవి పిలిచి నిన్న ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. తినేసి పడుకున్నా. యామిని వండింది. అంతగా బాగాలేదు. కళావతి గారు వండినట్లు ఎవరు వండరు. మీరు చాలా లక్కీ అని కావ్య వంటను పొగుడుతాడు రాజ్. కావ్యతో బయటకు వెళ్లడం గురించి ఇందిరాదేవి అడిగితే రాజ్ సిగ్గుపడుతూ చాలా మాట్లాడుకున్నాం. కావ్య తన ప్రేమ ఒప్పుకున్నట్లుగా మాట్లాడుతాడు.
దాంతో త్వరగా పెళ్లి ఏర్పాట్లు చేయాలి. ముహుర్తం పెట్టించాలని, నా కొడుకు పెళ్లి హైదరాబాద్ మొత్తం మాట్లాడుకునేలా చేయాలి అని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. దాంతో మేము మాట్లాడుకుంది పెళ్లి గురించి కాదు. ఆఫీస్‌లో ఏదో సమస్య అట దాని గురించి అని రాజ్ చెబుతాడు. ఈ రెండు రోజులు నేను ఆఫీస్‌లో ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇస్తారట. ఆఫీస్ సమస్య అయిపోయాక తన లవ్ గురించి చెబుతుంది అని రాజ్ అంటాడు.
ఇంతలో కావ్య వచ్చి నన్ను వచ్చి కలవమన్నాను కదా వీళ్లతో ముచ్చట్లు ఏంటీ అని రాజ్‌ను దబాయించి పట్టుకెళ్తుంది. ఇద్దరు ఏడు అడుగులు వేసినట్లుగా చూపిస్తారు. అదేమో పూర్తిగా పని రాక్షసి పని పేరు చెప్పి వీన్ని పూర్తిగా నలిపేస్తుందేమో అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు అప్పుకు స్వప్న తన నగలు ఇచ్చి, మెరుగు పెట్టించి తీసుకురా, బ్యాంక్ లాకర్‌లో పెట్టాలనుకుంటున్నాను. అక్కడే సేఫ్‌గా ఉంటాయి అని స్వప్న చెబుతుంది.
రాహుల్ మీద డౌట్‌గా ఉందా అని అప్పు అంటుంది. నాకు అలాంటి మొగుడు దొరికాడు మరి. నువ్వెళ్లి నగలకు మెరుగు పెట్టించి తీసుకురా అని అప్పుకు నగలు ఇస్తుంది స్వప్న. దీంతో రాహుల్ నగలు దొంగతనం చేసింది బయటపడే అవకాశం ఉంది. రామ్‌కు సూట్ ఇచ్చి వేసుకోమంటుంది. రామ్ సూట్ వేసుకుని వస్తాడు. అచ్చం మీ బాస్‌లా ఉన్నా కదా అని రామ్ అంటాడు.
చూడటానికి ఒరిజినల్ ఫోన్, నకిలీ ఫోన్ రెండు ఒకేలా ఉంటాయి. వాడితేనే కదా తెలిసేది అని కావ్య అంటే ఏం వాడతారు అని రామ్ అంటాడు. మీ బాడీ లాంగ్వెజ్‌ను కావ్య అంటుంది. రామ్ నడిచింది కావ్యకు నచ్చకపోవడంతో ట్రైనింగ్ ఇస్తుంది. ఎలా నడవాలో చెబుతుంది. దాంతో అమ్మో నాకు భయమేస్తుందని రాజ్ అంటాడు. తర్వాత కావ్య నడిచి చూపిస్తుంది.
తర్వాత రాజ్ నడిచేదానికి వంకలు పెడుతుంది కావ్య. అసలు ఇలా ఎలా ఉంటారండి. ఇలాంటి వ్యక్తితో ఎలా వేగుతున్నారు అని రామ్ అంటే.. ఒక్కరోజే భరించలేకపోతున్నారు. ఇన్నాళ్లుగా నేను టార్చర్ ఎలా అనుభవిస్తున్నానో మీరే అర్థం చేసుకోకండి అని కావ్య అంటుంది. తర్వాత డిన్నర్ టేబుల్‌పై రాజ్ ఎలా తింటాడో రామ్‌కు చెబుతుంది కావ్య.
ముష్టోడు తిన్నట్లు చూపిస్తూ ఇలా తినాలా అని రామ్ వెటకారంగా అంటాడు. రాజ్‌కు కావ్య ట్రైనింగ్ ఇవ్వడం రుద్రాణి చూస్తుంది. రాజ్‌కు ఏదో పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఇస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తుంది. తెలుసుకోవాలి అని రుద్రాణి అనుకుంటుంది. ఆ తర్వాత కావ్యకు తెలియకుండానే రాజ్ ఆఫీస్‌కు ఎండీలా వెళ్లిపోతాడు. స్టాఫ్ అందరితో మాట్లాడాలని అంటాడు.
ఆ విషయాన్ని కావ్యకు కాల్ చేసి శ్రుతి చెబుతుంది. అయితే, కావ్య ప్లాన్ తెలిసిన యామిని రాజ్‌తోనే ఇలా తిప్పికొడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్