Brahmamudi January 27th Episode: ధాన్యలక్ష్మీకి లొంగిపోయిన భర్త- ఇంటికి ప్రకాశం కోర్టు నోటీసులు- తిరగబడిన రాహుల్ ప్లాన్
Brahmamudi Serial January 27th Episode: బ్రహ్మముడి జనవరి 27 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటిన వల్లకాడు చేస్తానని అనామిక అంటుంది. మరోవైపు ఆస్తి కోసం కోర్టు నోటీసులు పంపమని లేకుంటే తన మెడలో తాళి తెంచేయమని ప్రకాశంను బెదిరిస్తుంది ధాన్యలక్ష్మీ. దాంతో కోర్టు నోటీసులపై ప్రకాశం సంతకం చేస్తాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సామంత్, అనామిక ఒకరినొకరు చెస్ ఆడుతూ చెక్ పెట్టుకుంటారు. చెక్ అంటే ఇది. చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యాక నన్ను ఎవ్వరు ఆపలేరు. నాతో పెట్టుకుంటే పద్మవ్యూహంలోకి అడుగుపెట్టిన అభిమన్యుడులాగే. ఒక్కసారి ఎంట్రీ అయ్యాక తిరిగి వెళ్లలేరు. వాళ్ల కథ పద్మవ్యూహంలోనే ముగుస్తుంది. రాజ్, కావ్యతోపాటు దుగ్గిరాల కుటుంబం నేను వేసిన పద్మవ్యూహంలో ఇరుక్కుని చావాల్సిందే. బయటకు వెళ్లే దారి లేదు అని అనామిక అంటుంది.

ఇల్లంత వల్లకాడు కావాలి
ఇంకెక్కడి దారి అన్ని మూసుకుపోయాక. రాజ్ కావ్యకు ఇది పెద్ద షాక్ కదా అని సామంత్ అంటాడు. ఇకనుంచి అలాంటి షాక్‌లు చాలా ఉంటాయి అని అనామిక అంటుంది. వాళ్లకు ఆ బ్రీతింగ్ స్పేస్ కూడా లేకుండా చేయడమే మన టార్గెట్ కదా. నెక్ట్స్ ప్లాన్ ఏంటీ అని సామంత్ అంటాడు. ఏముంది నందా చచ్చాడు కాబట్టి, ఆ అప్పు వాళ్లే కట్టాలి అని అనామిక అంటుంది. వంద కోట్లు కట్టాలి అంటే వాళ్ల ఆస్తులు అమ్మినా సరిపోదు. దాంతో నువ్ అనుకున్నట్లు కొట్టుకుంటారు అని సామంత్ అంటాడు.
ఒక్కొక్కరు మాములుగా ఏడవకూడదు. వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తూ ఏడవాలి. ఆ ఇల్లంతా వల్లకాడు కావాలి. అప్పుడే నా పగ, ప్రతికారం తీరి నేను ప్రశాంతంగా ఉండగలను. అప్పులు కట్టలేక, ఆస్తులు సరిపోక ఆ ఎఫెక్ట్ బిజినెస్ కూడా పడుతుంది. ఆ బిజినెస్ జరగకుండా మనం ఆపేస్తాం. లాస్ట్ మినిట్‌లో ఆ బిజినెస్‌ను తక్కువ కోట్ చేసి మనం సొంతం చేసుకుంటాం. అప్పుడు రాజ్ కంపెనీ నీది అవుతుంది. కంపెనీ నాకు లెక్క కాదు అన్నందుకు నీకు నాపై చాలా కోపం వచ్చి ఉంటుంది కదా అని అనామిక డౌట్‌గా అడుగుతుంది.
అలాంటిదేం లేదు అని సామంత్ అంటాడు. నీతో ఉంటున్నాను. నాకు ఆమాత్రం తెలియదా అని అనామిక అంటే.. మొదట అనిపించింది. కానీ, నీ మీదున్న నమ్మకంతో బ్లైండ్‌గా వెళ్లిపోయాను అని సామంత్ అంటాడు. నన్ను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరగదు. నాకు అన్యాయం చేసిన వాళ్లకు జీవితమే ఉండదు. ఇప్పుడు రాజ్ ఫ్యామిలీకి అదే చేయబోతున్నాను అని అనామిక అంటుంది. మరోవైపు ప్రకాశంకు కోర్టు నోటీస్ తీసుకొస్తుంది ధాన్యలక్ష్మీ.
ఎంతకైనా దిగజారుతాను
దాంతో ప్రకాశం చిరాకు పడతాడు. మీ అమయకాన్ని ఆసరాగా చేసుకుని మనకు ఇంట్లో వాళ్లు అన్యాయం చేస్తున్నారు. ఆస్తి గురించి అడిగితే మాట దాటేస్తూ అంతా నాటకాలు ఆడుతున్నారు. ఇక కోర్ట్ నోటీసు ఇద్దామనుకుంటున్నాను. కోర్టు మాటను ఎవరు ధిక్కరించలేరు కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఈ ఇంట్లో తింటూ, ఉంటు ఇంట్లోవాళ్లపై కోర్టు కేసు పెట్టడం బుద్ధి ఉన్న వాళ్ల పని కాదు. కొవ్వుతో చేసే పని. నీలో మంచితనం చచ్చింది అని ప్రకాశం అంటాడు.
ఆ కావ్య నోటికొచ్చినట్టు వాగిన మీకు సిగ్గు రాలేదన్నమాట. వాళ్లు శాంతం నాకేసి మనల్ని రోడ్డున పడేస్తారు. మనిషిలా ఆలోచిస్తే కుదరదు. నా కొడుకు అనాథల బతుకుతున్నాడు. ఒక్కసారైనా వాడికి కన్నతండ్రిలా ఆలోచించరు. నేను తల్లిని కదా. మీలా నిదానంగా కుదురుగా ఉండలేను. అందుకే ఇదంతా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అందుకని, సొంత మనుషుల మీద కేసులు వేసేంత దిగజారిపోయావా అని ప్రకాశం అంటాడు.
నా కొడుకు కోసం ఎంతైనా దిగినా, దిగజారుతాను. ఇన్నాళ్లు మీరు మంచిగా ఉన్నారు. ఏమైనా ఒరిగిందా. రాజ్‌కు కల్యాణ్ ఎంతో గౌరవం ఇచ్చాడు. కానీ, వాడు వెళ్లిపోతుంటే రాజ్ ఏం చేశాడు. ఇప్పుడు కావ్యతో కలిసిపోయాడు. రేపు అంత అయిపోయాక ఏడవటం కంటే ఇప్పుడు తొందరపడటం మంచిది అని ధాన్యలక్ష్మీ అంటుంది. కానీ, మా అన్నయ్య నాకు అన్యాయం చేయడు అని ప్రకాశం అంటాడు. ఈ తమ్ముళ్లు అన్నలను ఎందుకు గుడ్డిగా నమ్మేస్తారో అర్థం కాదు అని ధాన్యలక్ష్మీ అంటుంది.
తాళి తెంచేయండి
మీరు ఇక్కడే బతుకుతాను అంటే.. మీ చేత్తోనే నా తాళీ తెంచేయండి. నేను, నా బిడ్డ ఏదోలా బతుకుతాం. మీ చేత్తోనే నా తాళి తెంచేయండి అని తీసి చూపిస్తుంది ధాన్యలక్ష్మీ. దాంతో ప్రకాశం షాక్ అవుతాడు. తిక్కా నీకు అని ప్రకాశం అంటే.. అన్యాయాన్ని ఎదిరించే చాతకానీ మీకు నా మీద అరిచే హక్కు లేదు. మీకు వాళ్లు కావాలా లేకపోతే నేను నా బిడ్డ కావాల. మీకు మూడు నిమిషాలు టైమ్ ఇస్తున్నాను. నాలుగో నిమిషం దీనిపై సంతకం పెడతారో లేదా నా మెడలో తాళి తెంచుతారో ఆలోచించుకోండి అని ధాన్యలక్ష్మీ అంటుంది.
దాంతో కోర్ట్ నోటీస్ పేపర్స్‌పై ప్రకాశం సంతకం పెడతాడు. అది చూసి ధాన్యలక్ష్మీ సంతోషిస్తుంది. భర్త తోడుంటే భార్య ఏం సాధించగలదో నేను నిరూపించి చూపిస్తాను అని వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. మరోవైపు వాషింగ్ మెషిన్ నుంచి కావ్య బట్టలు తీస్తుంటే రుద్రాణి చూస్తుంది. ఇంతలో వచ్చిన రాహుల్ నవ్వుతాడు. కరెంట్ బిల్ సేవ్ చేయడానికి వాషింగ్ మేషిన్ అమ్మేసి, నీతో, ధాన్యలక్ష్మీ అత్తతో బట్టలు ఉతికే దృశ్యం కనిపించింది అని రాహుల్ అంటాడు.
అంతలా దిగజార్చిన చేస్తుంది అని రుద్రాణి అంటుంది. కావ్య మీదకు తిరుగులేని ఆయుధాన్ని వదిలాను. ధాన్యలక్ష్మీతో కావ్యకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను అని రుద్రాణి అంటుంది. ధాన్యలక్ష్మీ ఆంటీ రెచ్చిపోతే కావ్య కూడా రెచ్చిపోతుంది. నువ్ పర్మిషన్ ఇస్తే కావ్యను లోకంలోనే లేకుండా చేస్తాను అని రాహుల్ అంటాడు. రేయ్ ప్రాణాలు తీస్తావా. నా కొడుకు ప్రాణాలు తీసి జైలుకెళ్లడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి ఆలోచన మానుకో రుద్రాణి అంటుంది.
కరెంట్ షాక్ కొట్టేలా
అయితే, ముష్టివాళ్లతో కూడి అడుక్కుందామా అని రాహుల్ అంటాడు. ఇది యాక్సిడెంటల్‌గా జరిగిన డెత్ అనిపించేలా చేస్తాను. మర్డర్‌లా అస్సలు అనుమానం రాదు అని రాహుల్ అంటాడు. రేయ్ నాకేంట్రా వెన్నులో వణుకుపుడుతుంది అని రుద్రాణి అంటుంది. నువ్ వణుకుతూనే ఉండు నేను మర్డర్ చేసేసి వస్తా అని వెళ్లిన రాహుల్ బట్టల ఆరేసే తీగకు వైర్స్ ఆనించి ప్లగ్‌లో పెడతాడు. దీంతో కావ్య బట్టలు ఆరేస్తుందంట.. కరెంట్ షాక్ కొట్టి చస్తుందట అని రాహుల్ అనుకుంటాడు.
గోడ చాటుకు ఉండి కావ్య రావడం కోసం చూస్తుంటాడు. అప్పుడు కావ్య తడి బట్టలు తీసుకొస్తుంది. అది చూసి రాహుల్ వెళ్లి స్విచ్ ఆన్ చేస్తాడు. మరోవైపు కావ్యను శాంత గురించి అడుగుతుంది స్వప్న. జ్వరం వచ్చిందని డుమ్మా కొట్టిందని కావ్య అంటుంది. అలాగని అందరి బట్టలు నువ్వే ఆరేస్తావా. ఎవరివి వాళ్లను ఆరేయమను అని స్వప్న అంటుంది. అత్తయ్య, అమ్మమ్మ గారికి కూడా చెప్పనా అని కావ్య అని వెళ్లిపోతుంటే స్వప్న ఆగమని అంటుంది.
మరోవైపు ఈ కావ్య రాకుండా ఇంకా ఏం చేస్తుంది. బట్టలు ఎప్పుడు ఆరేస్తుందో అని స్విచ్ బోర్డ్ దగ్గరే కూర్చున్న రాహుల్ అనుకుంటాడు. ఏమైంది అసలు అని చూస్తాడు రాహుల్. మా అత్తయ్యను రమ్మంటాను. మూడు పూటలు తిని వట్టిగా కూర్చుంటుంది అని స్వప్న అంటుంది. ఇదొక్కతి అన్ని చెడగొడుతుంది అని రాహుల్ అనుకుంటాడు. ఆరేస్తుందో పడేస్తుందో అని కావ్యే బట్టలు ఆరేయడానికి రెడీ అవుతుంది. దాంతో ఎస్ అనుకుంటూ మళ్లీ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్తాడు రాహుల్.
పనిమనిషిలా రుద్రాణి
కావ్య బట్టలు ఆరేయబోతుంటే.. కళావతి త్వరగా రా అని రాజ్ పిలుస్తాడు. దాంతో కావ్య వెళ్లిపోతుంది. ఇంతలో ఈ సుపుత్రుడు ఏం ప్లాన్ చేశాడో చెప్పనేలేదు అని ఫోన్ పట్టుకుని రుద్రాణి బయటకు వస్తుంది. స్వప్నను చూసి కాల్ కట్ చేస్తుంది. మీ కొడుకు లాగే గాలి తిరుగుళ్లు తిరుగుతున్నారా అని కౌంటర్ వేస్తుంది స్వప్న. సరేగానీ, ఆ బట్టలు ఆరేయమని స్వప్న చెబుతుంది. నేను ఆరేయడమేంటీ. నీకు ఎలా కనిపిస్తున్నాను అని రుద్రాణి అంటుంది.
నాకు ఫ్యూచర్ పనిమనిషిలా కనిపిస్తున్నావ్. భవిష్యత్తులో నీకు డబ్బు అవసరం రాదా. నాకు తాత ఇచ్చిన షాప్‌తో లక్షలు వస్తున్నాయి. రేపు మీకు ఎలాంటి డబ్బు లేకుంటే నేనే ఇవ్వాలి అని స్వప్న అంటుంది. నిజమే ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు అనుకున్న రుద్రాణి.. సరే ఆరేస్తాను. కానీ, నాకు 25 వేలు కావాలని రుద్రాణి అడుగుతుంది. సరే ఇస్తాను ముందు ఆరేయ్ అని స్వప్న అంటుంది. దాంతో బట్టలు ఆరేయడానికి రుద్రాణి వెళ్తుంది.
రుద్రాణి బట్టలు ఆరేయడంతో షాక్ కొడుతుంది. అరుపులతో ఊగిపోతుంది. అది విన్న రాహుల్.. ఇదే కదా నాకు కావాల్సింది. చావవే.. చావవే కావ్య అని రాహుల్ అనుకుంటాడు. కరెంట్ షాక్ కొడుతుంది ఎవరైనా రండి అని స్వప్న అరుస్తుంది. ఎవరు రారు. దాంతో కర్ర తీసుకుని రుద్రాణి తెగ కొడుతుంది. కొడుతున్నావేంటే అని రుద్రాణి అంటే.. తలమీద కొట్టాలా అని కొడుతుంది. అది చూసిన రాహుల్ షాక్ అయి వెళ్లి స్విచ్ ఆఫ్ చేస్తాడు.
కాపాడిన స్వప్న
దాంతో రుద్రాణి వెళ్లి కిటికిపై పడుతుంది. ఇంతలో రాహుల్ వచ్చి ఏమైందని అడుగుతాడు. కరెంట్ షాక్ కొట్టిందని స్వప్న అంటుంది. ఇంతలో రుద్రాణి స్పృహ తప్పిపోతుంది. దాంతో రాహుల్ మమ్మీ అంటూ అరుస్తూ మమ్మీ చచ్చిపోయిందా అని ఏడుస్తాడు. అయ్యో అత్తయ్య అని స్వప్న అంటుంది. తర్వాత రుద్రాణి చేయి పట్టుకుని చూసిన స్వప్న ఈ ప్రపంచానికి అంతా అదృష్టం లేదు. ఇంకా బతికే ఉంది అని స్వప్న అంటుంది.
రాహుల్, అత్త మీ మమ్మీని నేనే బతికించాను. జీవితాంతం మీరు నాకు రుణపడి ఉండాలని స్వప్న వెళ్లిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చిన కోర్టు నోటీసులను కావ్య చూస్తుంది. అది చూసి షాక్ అవుతుంది. మనకెవరు పంపించారని సుభాష్ అడిగితే.. మేమే పంపించాం అని ప్రకాశం అంటాడు. మా ఆస్తి మాకు కావాలని కోర్టుకు వెళ్తున్నాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్