Brahmamudi January 20th Episode: రుద్రాణికి బ్రహ్మాస్త్రం- ఇందిరాదేవి ప్లాన్ ఫెయిల్- కల్యాణ్‌కు అప్పు డబుల్ సర్‌ప్రైజ్-brahmamudi serial today episode january 20th anamika send documents like brahmastra to rudrani star maa brahma mudi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi January 20th Episode: రుద్రాణికి బ్రహ్మాస్త్రం- ఇందిరాదేవి ప్లాన్ ఫెయిల్- కల్యాణ్‌కు అప్పు డబుల్ సర్‌ప్రైజ్

Brahmamudi January 20th Episode: రుద్రాణికి బ్రహ్మాస్త్రం- ఇందిరాదేవి ప్లాన్ ఫెయిల్- కల్యాణ్‌కు అప్పు డబుల్ సర్‌ప్రైజ్

Sanjiv Kumar HT Telugu
Jan 20, 2025 07:54 AM IST

Brahmamudi Serial January 20th Episode: బ్రహ్మముడి జనవరి 20 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో కావ్య నగల తాకట్టు గొడవ అయిందని అనామిక, సామంత్ సంతోషపడుతారు. ఇంకా వాళ్లు కన్నీళ్లు పెట్టాలని అనామిక రుద్రాణికి కాల్ చేసి ఉదయం గుడ్ న్యూస్ వస్తుందని చెబుతుంది. అది మీకు బ్రహ్మాస్త్రం లాంటిది అని అనామిక అంటుంది.


బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 20వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 20వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో సీతారామయ్య వంద కోట్ల షూరిటీ నిజాన్ని మనమే దిగమింగాలి. ఆఫీస్‌లో పనిచేస్తూ కాంట్రాక్ట్ పూర్తి చేస్తాం. బోర్డ్ తిప్పేసిన ఆ ఎన్‌డీ గాడిని పట్టుకునేందుకు ట్రై చేద్దాం. వాడి దగ్గర ముక్కుపిండి మన డబ్బు వసూళు చేసి బ్యాంక్‌కు కట్టేసి మనం ప్రశాంతంగా ఉందాం అని కావ్య అంటుంది.

yearly horoscope entry point

ఐదు లక్షల కోసం

మరి వాడు దొరక్కపోతే అని రాజ్ అంటే.. కావ్య కోప్పడుతుంది. వాడు దొరికితేనే మన సమస్య తీరుతుంది. లేకుంటే రోజు రాత్రి పగలు ఆఫీస్‌లో పని చేస్తూ బ్యాంక్‌లో డబ్బులు కట్టాలి అని కావ్య అంటుంది. రేపు మీటింగ్‌లో నేను వేసిన డిజైన్స్ ఓకే చేయించాలి. ఓసారి మీరు చూడండి అని కావ్య అంటుంది. సరే అని రాజ్ అంటాడు. మరోవైపు ధాన్యలక్ష్మీతో రుద్రాణి, రాహుల్ మాట్లాడుతారు. ఐదు లక్షల కోసం నగలు తాకట్టు పెట్టారు అని రుద్రాణి అంటుంది.

ఇది దుగ్గిరాల కుటుంబమా, బిగ్ బాస్ షోనా అన్నట్లు రకరకాల రూల్స్ పెడుతూ ఖర్చులు తగ్గిస్తూ డబ్బు సేవ్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ, ఐదు లక్షలు అప్పు చేశారు అని రుద్రాణి అంటుంది. ఐదు లక్షలు ఇంట్లో లేకపోవడం ఏంటీ అని రాహుల్ ఇంకా ఎక్కిస్తాడు. డబ్బులు లేవనడం అనేది పచ్చి అబద్ధం. కావ్య రాజ్ ఏదో నడిపిస్తున్నారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. కాదు వాళ్ల వెనుక ఉండి నడిపిస్తున్నది సుభాష్ అన్నయ్య, అపర్ణ వదినా అని రుద్రాణి అంటుంది.

మనం ఆస్తి గురించి మొదలుపెట్టినప్పుడే ఇదంతా జరిగింది. అందరిని గ్రిప్పులో పెట్టుకుని డబ్బంతా సైడ్ ట్రాక్ చేస్తున్నారు. డబ్బు పిచ్చి పట్టాకా తన మన అని ఆలోచించరు అని రుద్రాణి అంటుంది. ధాన్యలక్ష్మీ ఆలోచిస్తుంటే.. మరింత రెచ్చగొడుతారు రుద్రాణి, రాహుల్. తర్వాత రాహుల్‌కు నిజంగా అకౌంట్స్‌లో డబ్బులు లేవా, లేకుంటే ఎవరికైనా డబ్బంతా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారో తెలుసుకో అని రుద్రాణి చెబుతుంది.

లైవ్ పెట్టి చూద్దాం

నువ్వేం కంగారుపడకు. అంతా నేను తెలుసుకుంటాను. అప్పుడు నాకు సపోర్ట్ చేయి. ఇద్దరం కలిసి సాధిద్దాం అని ధాన్యలక్ష్మీతో రుద్రాణి అంటుంది. మరోవైపు సామంత్, అనామిక మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఐదు లక్షల కోసం నగలు తాకట్టుపెట్టారంటే అంత పెద్ద గొడవ జరిగిందా. వింటుంటేనే చాలా సంతోషంగా ఉంది. కానీ, ఇది సరిపోదు. వాళ్లు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారని లైవ్ పెట్టేసి చూసి ఎంజాయ్ చెద్దాం అని అనామిక అంటుంది.

అలా వద్దని సామంత్ అంటాడు. అలా చెప్పేస్తే ముసలోడు వంద కోట్ల షూరిటీ ఇచ్చినట్లు అందరికి తెలిసిపోతుంది. వాళ్లంతా రాజ్‌కు అండగా ఉంటారు. మనకు కావాల్సింది అది కాదు కదా. ఇది ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా ఉండి అవన్నీ తాకట్టులోనే ఉండాలి. అప్పులు కట్టలేక రాజ్ హెల్ప్‌లెస్ అయి అప్పుడు ఆ కంపెనీని మనం హ్యాండోవర్ చేసుకోవాలి అని సామంత్ అంటాడు. దాంతో నాకేమొస్తుంది. కంపెనీ ఏముంది బోడి కంపెనీ. వాళ్ల కంట్లో కన్నీళ్ల కంటే కంపెనీ నాకు ఎక్కువ కాదు అని అనామిక అంటుంది.

ఒకప్పుడు వాళ్లు నన్ను అవమానించినందుకు వాళ్లు ఏడవాలి అని అనామిక అంటుంది. ఇదేంటీ ఆ కంపెనీ కోసమే నేను దీనికి దగ్గరయితే వాళ్ల ఏడుపులు కావాలంటుంది అని సామంత్ మనసులో అనుకుని అనామికకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ, అనామిక వినదు. రుద్రాణికి కాల్ చేసి ఐదు లక్షల మ్యాటర్ గురించి చెబుతుంది. శత్రువులు గెలిచే పొజిషన్‌లో ఉంటే మాటలో బేస్ ఎందుకుంటుంది. అప్పుడే అన్ని విషయాలు లాగేసావా అని రుద్రాణి అంటుంది.

బ్రహ్మాస్త్రం దొరికినట్లే

మీకు తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాను. ఆ ఇంటిని షేక్ చేసే బిగ్ న్యూస్ నీకు పంపిస్తాను. దాన్ని వెపన్‌లా వాడుకుని ఆ ఇంట్లో అల్లర్లు సృష్టిస్తారో, ఆస్తే దక్కించుకుంటారో ఇంకేం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ, ఆ ఇంట్లో ఒక్కరు కూడా హ్యాపీగా ఉండకూడదు. అది మీరు మాత్రమే హ్యాపీగా ఫీల్ అయ్యే గుడ్ న్యూస్. రేపు మీ ఇంటికి డాక్యుమెంట్స్ వస్తాయి. పూర్తిగా చదివి అర్థం చేసుకోండి. అది చదివి మీరు కావ్యను గెంటేసిన మిమ్మల్ని ఎవరు ఏం అనరు. మీకు ఒక బ్రహ్మాస్త్రం దొరికినట్లే అని అనామిక అంటుంది.

ఇన్నిరోజులు ఎందుకు ఇవ్వలేదు. వెంటనే పంపించు. ఆ గుడ్ న్యూస్ తెలుసుకోడానికి ఎదురుచూస్తుంటాను అని సంతోషంగా కాల్ కట్ చేసి వెనక్కి చూస్తుంది రుద్రాణి. అక్కడ అనుమానంగా చూస్తు స్వప్న ఉంటుంది. నువ్వెప్పుడు వచ్చావ్ అని రుద్రాణి అంటుంది. గుడ్ న్యూసా.. ఏంటది అని స్వప్న అంటుంది. నీకు మూడు నెలల్లో పుట్టబోయే బిడ్డ పుట్టబోతున్నాడని డాక్టర్ చెబితే సంతోషిస్తున్నాను అని కవర్ చేస్తుంది. అమాయకురిలా నటించకు అత్త. నేను నిన్ను అనుమానిస్తున్నాను అని స్వప్న అంటుంది.

నువ్వెప్పుడు అర్థం చేసుకున్నావ్ అని రుద్రాణి అంటుంది. నీ వంకర బుద్ధి బాగా అర్థం చేసుకున్నాను అని స్వప్న అంటుంది. తెలియదు. నీకోసం, రాహుల్ కోసం ఎంత ట్రై చేస్తున్నానో మీకు తెలియదు. తెలిసిన రోజు కచ్చితంగా పశ్చాత్తాప పడతావ్ చూడు అని రుద్రాణి వెళ్లిపోతుంది. ఇంత ఓవరాక్షన్ చేస్తుందంటే తప్పకుండా ఏదో పెద్ద ప్లానే చేసింది. కచ్చితంగా అదేంటో తెలుసుకోవాలి అని స్వప్న అనుకుంటుంది. మరోవైపు నగలతో కావ్య దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది.

నేను న్యాయంగానే ఉన్నా

ఏంటండి ఇవి. ఇప్పుడెందుకు ఇస్తున్నారు అని కావ్య అంటుంది. శివుడు గరళాన్ని కంఠంలో దాచుకుంటున్నట్లు. నువ్ పడుతున్న పాట్లు నాకు తెలుసమ్మా. ఇంకా నా దగ్గర నిజం దాచకు. అందరూ నీ తప్పులు ఎత్తు చూపుతున్నారని నేను మూర్ఖురాలిగా నిందంచలేనుగా. అమ్మమ్మగా నేను నీకు తోడుగా ఉంటాను. అవసరం పడతాయ్ అని ఇందిరాదేవి అంటుంది. నేను బయటకు చెప్పుకోలేని బాధలు ఏమున్నాయి. నాకు తెలిసినంతవరకు నేను న్యాయంగానే ఉన్నాను. నాకు మీ ఆశీస్సులు చాలు. ఈ నగలు వద్దు అని కావ్య అంటుంది.

నగలు తాకట్టు పెట్టి తాతయ్య బిల్ కట్టారు కదా. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. కొన్నిసార్లు సమస్యలు కూడా వస్తుంటాయి. మీరు చెప్పుకోలేరు. నేను అడగలేను అందుకే తెచ్చాను ఇందిరాదేవి అంటుంది. అయ్యో సమస్య ఉన్నట్లు మీకు కూడా అనిపించిందా. నిజంగానే మన కంపెనీ అకౌంట్స్ అన్ని హోల్డ్‌లో ఉన్నాయి. అంతే కానీ, అకౌంట్స్‌లో డబ్బు లేక కాదు అని కావ్య అంటుంది. నమ్మకం అంటేనే కావ్య. నీ నుంచి నిజం తెలుసుకునేందుకే నగలు తీసుకొచ్చి ఇస్తున్నట్లు మాట్లాడాను అని తన ప్లాన్ గురించి చెబుతుంది ఇందిరాదేవి.

ఒకవేళ నువ్ తీసుకుంటే నిజంగానే సమస్యల్లో ఉన్నట్లు అర్థం. దేవుడి దయ వల్ల అలాంటిదేం లేదు అని ఇందిరాదేవి అంటుంది. అమ్మో.. అమ్మమ్మ గారు కూడా నన్ను పరీక్షిస్తున్నారన్నమాట. పొరపాటున నేను నోరు జారిన, నగలు తీసుకున్నా అడ్డంగా దొరికిపోయిండేదాన్ని అని కావ్య మనసులో అనుకుంటుంది. నువ్ సమస్యను మన ఇంటి గుమ్మందాకా రానివ్వవు అని నాకు తెలుసు. కానీ, మీ అత్త కసురుకుందిగా. అందుకే వచ్చాను అని వెళ్లిపోతుంది ఇందిరాదేవి.

అంతా అప్పులానే

ఒక్కసారి అనుమానం వచ్చాకా అది బయటకు పోదు. వాళ్లకు నిజం తెలిసిలోపు సమస్య నుంచి మేము బయటపడాలి అని కావ్య అంటుంది. మరోవైపు సీతారామయ్యలో ఎలాంటి మార్పు లేదని డాక్టర్ చెబుతాడు. కల్యాణ్ డిసప్పాయింట్ అవుతాడు. తర్వాత పక్కకు చూస్తే అప్పు కనిపిస్తుంది. ఏంటీ అంతా అప్పులానే కనిపిస్తున్నారు అని కల్యాణ్ అనుకుంటాడు. అప్పు చేయి ఊపితే పట్టనట్లు పక్కకు వెళ్లిపోతాడు. ఇంతలో అప్పు వచ్చి హాయ్ కూచి అంటుంది.

నా పేరు నీకెలా తెలుసు అని కొత్త అమ్మాయితో మాట్లాడినట్లు మాట్లాడుతాడు కల్యాణ్. నీకేమైనా చిప్పు దొబ్బిందా. నేనే అప్పును. నేను ట్రైనింగ్‌ నుంచి వచ్చాను అని అప్పు అంటుంది. అప్పు నాకు చెప్పకుండా ఇలా రాదు. మళ్లీ మీరు అందంగా అమ్మాయిలా ఉన్నారు. నా అప్పు టామ్ బాయ్‌లా కొట్టాడనికి రెడీగా ఉన్నట్లు ఉంటుంది అని కల్యాణ్ అంటాడు. దాంతో కల్యాణ్‌ను గిచ్చి నోరు మూస్తుంది అప్పు. దాంతో నిజంగానే వచ్చావా. మరి ఈ గెటప్ ఏంటీ కల్యాణ్ అంటాడు.

నాకు డబుల్ సర్‌ప్రైజ్

పోలీస్ ట్రైనింగ్‌లో ఇష్టమొచ్చినట్లు ఉండకూడదట. డీసెంట్‌గా ఉండాలటా అందుకే ఇలా అని అప్పు అంటుంది. దాంతో ఇది నాకు డబుల్ సర్‌ప్రైజ్ అని అప్పును ఎత్తుకుని తిప్పుతాడు కల్యాణ్. అప్పుడు నర్స్ వచ్చి చివాట్లు పెట్టి వెళ్లిపోతుంది. తర్వాత మాకు 3 నెలలు కంటిన్యూగా ట్రైనింగ్ ఇచ్చేసరికి హోమ్ సిక్ అయ్యారు. దాంతో ఇంటికి పంపించారు. అందుకే వచ్చాను అని అప్పు అంటుంది. నేను ఇక్కడ అందరిలో నిన్నే ఊహించుకుంటున్నాను. బాగుంది నీ సర్‌ప్రైజ్ అని కల్యాణ్ అంటాడు.

తర్వాత తాతయ్య గురించి అడిగితే.. అలాగే ఉన్నారని కల్యాణ్ అంటాడు. తర్వాత సీతారామయ్యను చూసేందుకు వెళ్తుంది అప్పు. మరోవైపు కావ్య కాఫీ ఇస్తే అపర్ణ తీసుకోదు. కారణాలు చెప్పని వాళ్లు ఇస్తే తీసుకోను అని అపర్ణ గట్టిగా ఫైర్ అవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner