Brahmamudi January 17th Episode: కావ్య బండారం బయటపెట్టిన రుద్రాణి- నమ్మకం పోగొట్టుకున్న కళావతి- కోడలితో అపర్ణ తెగదెంపులు
Brahmamudi Serial January 17th Episode: బ్రహ్మముడి జనవరి 17 ఎపిసోడ్‌లో స్వప్న సీమంతంలో అడుగడుగునా అడ్డు పడుతుంది రుద్రాణి. కావ్య నగలు తాకట్టు పెట్టిన బిల్ రిసిప్ట్‌ను రాహుల్‌తో సంపాదిస్తుంది. దాన్ని అందరి ముందు చూపించి కావ్య గుట్టు రట్టు చేస్తుంది. నీ ఉద్దేశం ఏంటో బయటపడింది అత్త అని రాజ్ అంటాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య నగలు తాకట్టు పెట్టి సీతారామయ్య హాస్పిటల్ బిల్ కట్టినట్లు రుద్రాణికి చెబుతాడు రాహుల్. కానీ, ఈసారి మనం ఫూల్ కాకూడదు. ఆ నగలు తాకట్టు పెట్టిన బిల్ తీసుకో అని రుద్రాణి అంటుంది. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్‌కు చెప్పి పెట్టాను. ఆ నగల షాపు వాడిని అడిగి బిల్ తీసుకుంటానన్నాడు అని రాహుల్ అంటాడు.
పెద్ద కోడలు ఇలాగేనా ఉండేది
ఇన్నాళ్లు ఆ కావ్యను మా అమ్మ, వదినా వెనుకేసుకొచ్చారు. ఇప్పుడు అందరి నోళ్లు మూయించే సాక్ష్యాలతో వస్తున్నాను. నిన్ను ఎవరు కాపాడలేరు అని రుద్రాణి అంటుంది. తర్వాత సీమంతానికి స్వప్నను తీసువకెళ్తుంటే రుద్రాణి వచ్చి ఇదేం విడ్డూరం అని అంటుంది. అందరి మెడలో నగలు ధగధగ మెరిసిపోతుంటే కావ్య మెడలో ఒక్క నగ అయిన లేకపోతే ఎలా. దుగ్గిరాల పెద్ద కోడలు ఇలాగేనా ఉండేది. ఇంకా తెప్పించలేదా అని రుద్రాణి అంటుంది.
నా నగల మీద మీకు ఏం ఇంట్రెస్ట్. నాకు ఇలాగే ఇష్టం అని కావ్య అంటుంది. అదేంటీ వదినా ఇంకా కనకం కూతురిలా నీ కోడలు ఉంటే దుగ్గిరాల కుటుంబం దివాళ తీసిందని అందరూ అనుకోరా. నాకు తెలిసి నువ్ కావ్యకు బోలెడన్నీ నగలు ఇచ్చినట్లు గుర్తు అవునా అని రుద్రాణి అంటుంది. అవును, ఇచ్చాను. ఈ పిచ్చి మొహనికి ఇష్టం లేదు అని అపర్ణ అంటుంది. ఇష్టం లేదా. తేవడం కుదరదా. జాగ్రత్తగా ఉన్నాయా అని రుద్రాణి అంటుంది.
అంత ఇదిగా అడుగుతున్నారు. మీ కొడుకు ఏమైనా మాయం చేసి ఉంటాడని అనుకుంటున్నారా అని స్వప్న అంటుంది. ఛీ ఛీ నా కొడుకుకి అంత కర్మ ఏంటీ అని రుద్రాణి అంటుంది. మన ఇంటి నగలను ఎవరు దొంగతనం చేస్తారు అని అపర్ణ అంటుంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. అందరం ఇక్కడే ఉన్నాం. ఇంట్లో జరగరానిది జరిగితే అని రుద్రాణి అంటుంది. ఒక్క మంచి మాట రాదా అని ఇందిరాదేవి తిడుతుంది.
దర్జాగా కనిపించాలి
మమ్మల్ని ప్రశాంతంగా పేరంటం చేసుకోనివ్వండి అని కనకం అందరిని తీసుకెళ్తుంటే.. అపర్ణ ఆగమంటుంది. రుద్రాణి అడిగిందని కాదు కానీ, అసలు నీ నగలు ఏమయ్యాయి అని అపర్ణ అంటుంది. నగలు ఇంట్లోనే ఉన్నాయి అని కావ్య చెబుతుంది. ఇలాంటప్పుడు అయినా తీసి వేసుకుంటే ఏంటీ. నీకు బంగారం మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కానీ, నా కోడలు పదిమందిలో దర్జాగా కనిపించాలి అని తన మెడలోని హారం తీస్తుంది అపర్ణ.
దాంతో అయ్యో అత్తయ్య ఎందుకు ఇది అని కావ్య అంటుంది. ఇప్పుడు కాకపోతే ఆ రుద్రాణి నా కోడలిని పదిమందిలో అనడం ఇష్టం లేదు. నేను కోపంగా ఇస్తాను, ప్రేమగా ఇస్తాను, హక్కుతో ఇస్తాను, ఆర్డర్ వేసి ఇస్తాను. ఎలాగైనా తీసుకో అని కావ్య మెడలో తన హారం వేస్తుంది అపర్ణ. దానికి కావ్య చాలా ఎమోషనల్ అవుతుంది. కనకం కూడా ఎమోషనల్ అవుతుంది. అది చూసి నీ కళ్లలో కన్నీళ్లు ఏంటీ అని కావ్య కన్నీళ్లు తుడుస్తుంది అపర్ణ.
రుద్రాణి వైపు పొగరుగా చూస్తూ కావ్యను తీసుకెళ్తుంది అపర్ణ. హా వెళ్లండి.. కాసేపయ్యాక నగల బండారం బయట పడితే అప్పుడు తెలుస్తుంది అని తిప్పుకుంటూ పోతుంది రుద్రాణి. స్వప్నను కుర్చీలో కూర్చొబెట్టి సీమంతం జరిపిస్తారు. ఇందిరాదేవిని ఒడి నింపమంటుంది కనకం. మీకన్న పెద్ద ముత్తయిదువు ఎవరున్నారు అని చెబుతుంది. గాజులు వేసి ఇందిరాదేవి స్వప్న సీమంతం స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఒక్కొక్కరిగా సీమంతం జరిపిస్తారు.
కనకం ఎమోషనల్
రుద్రాణి కూడా బొట్టు పెట్టి గాజులు వేసి అక్షింతలు వేస్తుంది. అదంతా చూస్తూ కనకం ఎమోషనల్ అవుతుంది. అలా కన్నీళ్లు పెట్టుకోకూడదు అని ఇందిరాదేవి అంటుంది. ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు జరిగింది. పెద్ద కూతురు కడుపు పండింది. ఆనందం తట్టుకోలేక కన్నీళ్లు వస్తున్నాయి. ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మీ పెద్దరికమే అని కనకం అంటుంది. ముగ్గురు కూతుళ్లను మా ఇంటికే పంపించావ్. నీకన్న ఐశ్వర్యవంతురాలు ఎవరున్నారు అని ఇందిరాదేవి అంటుంది.
మనవడు పుడితే ఎవరెవరు ఏమవుతారో అనుకుంటారు. పాపం రుద్రాణి బ్యూటిపార్లర్‌కు వెళ్లి వయసు దాచుకోలేదు. వాడు నానమ్మ అంటే వయసు బయటపడిపోతుంది అని ప్రకాశం సెటైర్లు వేస్తాడు. తర్వాత ఇంటికి వచ్చిన వారు సీమంతం చేస్తారు. అంతా స్వప్నకు హారతి పడుతారు. ఇంతలో సీమంతం శీను వచ్చి ఆపండి అని గట్టిగా డైలాగ్ కొడతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఏమైందిరా అని కనకం అడిగితే.. నా వంటలన్నీ చల్లారిపోతున్నాయి. వచ్చి తింటారని అని శీను అంటాడు.
దానికి అరవాలేంట్రా అని వచ్చి ఒక్కటి కొడుతుంది. తర్వాత రాహుల్‌ను రుద్రాణి నగల తాకట్టు రిసిప్ట్ అడుగుతుంది. అది ఫోన్‌లో చూపిస్తాడు రాహుల్. నా కొడుకు అనిపించావ్. ఫ్రూఫ్స్ లేకుండానే వాళ్లతో ఎన్నోసార్లు ఆడుకున్నాను. ఇప్పుడు చూడు ఫుట్‌బాల్ ఆడుకుంటాను. కావ్య ఇప్పుడెలా తప్పించుకుంటుందో చూస్తాను అని వెళ్తుంది రుద్రాణి. అందరికి బంతి భోజనం వడ్డిస్తారు. కడుపులో బిడ్డ తంతున్నాడు. ఆకేలేస్తుందని స్వప్న అంటుంది.
ఐదు లక్షలు ఎలా కట్టారు
నువ్ పుట్టిన ఇన్నేళ్లకు నిన్ను తన్నేవాడు ఒకడు పుడుతున్నాడు అని కనకం అంటుంది. అందరికీ భోజనం వడ్డిస్తారు. ఇప్పుడు తినవే అని కనకం అంటుంది. అప్పుడే రుద్రాణి వచ్చి రాద్దాంతం స్టార్ట్ చేస్తుంది. నీ మనవరాలు ఇంటికే తలవంపులు తీసుకొచ్చేలా ఉంది. నాన్న హాస్పిటల్‌లో ఉన్నప్పుడు బిల్ కట్టలేదు. రాజ్ వచ్చి అకౌంట్స్ హోల్డ్‌లో ఉన్నాయన్నారు. ఆ తర్వాత ఐదు లక్షలు తీసుకొచ్చి కట్టారు. ఆ ఐదు లక్షల ఎలా తీసుకొచ్చారో నాకు తెలియాలి అని రుద్రాణి అంటుంది.
ఆడిటింగ్ అయ్యాక అకౌంట్ నుంచి పంపించారేమో అని సుభాష్ అంటాడు. అకౌంట్ నుంచి కాదు. కావ్య కట్టింది. నువ్ ఇచ్చిన బంగారు నగలు తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్ కట్టింది అని రుద్రాణి బెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఐదు లక్షల కోసం నగలు తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఏమొచ్చింది అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. అలా అయితే కావ్య, రాజ్ ఎందుకు సైలెంట్‌గా ఉంటారు. సరే నమ్మట్లేదు కదా అని రాహుల్ ఫోన్ తీసి నగలు తాకట్టు పెట్టిన రిసిప్ట్ చూపిస్తుంది రుద్రాణి.
ఒక్కొక్కరికి రిసిప్ట్ చూపిస్తుంది రుద్రాణి. ఏరా అది ఆ కంపు నోరు వేసుకుని అలా వాగుతుంటే నువ్వేం మాట్లాడవేరా అని ఇందిరాదేవి అంటుంది. ఏంటీ అత్తా. ఇందాక గోల్డ్ గురించి రచ్చ చేశావ్. ఇప్పుడు నీకు మరో అవకాశం దొరికిందా. ఏదో గొడవ చేసి అందరిని బాధపడి వెళ్లేలా చేస్తావ్. ఎందుకంత శాడిజం నీకు. నీ కొడుకు పుట్టబోయే బిడ్డను కడుపులో మోస్తుంది నీ కోడలు. సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నావా. దుగ్గిరాల ఇంటి సంతోషాన్ని కోరుకునేదానివే అయితే కళావతి నగలు తాకట్టు పెట్టిందన్న విషయం చెప్పేదానివే కాదు. పెట్టావంటేనే నీ ఉద్దేశం ఏంటో తెలుస్తోంది అని రాజ్ అంటాడు.
నమ్మకం పోగొట్టుకున్న కావ్య
తర్వాత నగలు ఎందుకు తాకట్టు పెట్టారు అని కావ్యను గట్టిగా నిలదీస్తుంది అపర్ణ. మీ నమ్మకాన్ని పోగొట్టుకునే పని నేనెప్పుడు చేయను అని కావ్య అంటుంది. ఈరోజుతో ఆ నమ్మకం పోయింది. ఇంట్లో ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది. అడగాల్సిన బాధ్యత నామీద ఉంది. నువ్ తప్పించుకుంటున్నావ్. ఇలాగే ఉండు. ఇంకెప్పుడు నాతో మాట్లాడే ప్రయత్నం చేయకు అని అపర్ణ అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్