Brahmamudi January 16th Episode: రుద్రాణికి కడుపు- స్వప్న సీమంతంలో రభస- కనకంకు సపోర్ట్ చేసిన ధాన్యం- ఇచ్చిపడేసిన రాజ్-brahmamudi serial today episode january 16th swapna says rudrani is pregnant when kavya gift to her star maa brahma mudi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi January 16th Episode: రుద్రాణికి కడుపు- స్వప్న సీమంతంలో రభస- కనకంకు సపోర్ట్ చేసిన ధాన్యం- ఇచ్చిపడేసిన రాజ్

Brahmamudi January 16th Episode: రుద్రాణికి కడుపు- స్వప్న సీమంతంలో రభస- కనకంకు సపోర్ట్ చేసిన ధాన్యం- ఇచ్చిపడేసిన రాజ్

Sanjiv Kumar HT Telugu
Jan 16, 2025 09:39 AM IST

Brahmamudi Serial January 16th Episode: బ్రహ్మముడి జనవరి 16 ఎపిసోడ్‌లో స్వప్న సీమంతానికి సర్‌ప్రైజ్‌గా తాను ఇదివరకు పది లక్షలు పెట్టి కొన్న నగలను రాజ్ తీసుకొచ్చి కావ్యకు ఇవ్వమని ఇస్తాడు. కావ్య ఇస్తుండగా చూసిన రుద్రాణి రభస చేస్తుంది. తర్వాత కావ్య నగలు తాకట్టు పెట్టిందని రాహుల్ నిజం చెబుతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 16వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 16వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యను గదిలోకి పిలిచిన రాజ్ ఓ బ్యాగ్ ఇస్తాడు. అది గిఫ్ట్ అనుకుని కావ్య సంబరపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకుండి. అసలే మన దగ్గర డబ్బులు లేవు. ఎందుకు అనవసరమైన ఖర్చులు అని బ్యాగ్ లోపల చూస్తుంది కావ్య. దాంతో షాక్ అయి గిఫ్ట్ అంటే జ్యూయలరీనే ఇవ్వాల్సిన అవసరం లేదు అని కావ్య అంటుంది.

అంటి అంటనట్లు

పూర్తిగా చూడమని రాజ్ అనగానే చూస్తుంది. అందులో స్వప్న కొన్న నగలు ఉంటాయి. దీనికోసమేనా ఇంత బిల్డప్ ఇచ్చారు అని కావ్య అంటే.. నేను కాదు ఇచ్చింది. నీకు నువ్వే తలుపులు వేసి సిగ్గు పడ్డావ్ అని రాజ్ అంటాడు. ఆరోజు ఈ నగలు కొన్నందుకు నువ్ స్వప్ను తిట్టావ్ కదా. ఇప్పుడు గిఫ్ట్‌గా ప్రజంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని రాజ్ అంటాడు. అవును, అందరిని అర్థం చేసుకుంటారు. నాతో మాత్రం అంటి అంటనట్లు సంసారం చేస్తారు అని సెటైర్లు వేస్తుంది కావ్య.

ఇన్నాళ్లు నన్ను దూరం పెట్టారు. ఇప్పుడు కంపెనీ మీకు దూరం అయిపోతుంది కాబట్టి, ఒంటరి అయిపోయారు కాబట్టి, నన్ను పిలిస్తే వస్తాను కాబట్టి నాతో ప్రేమగా ఉంటున్నారు అని కావ్య అంటుంది. అమ్మో.. మనసులో ఇన్ని పెట్టుకున్నావా కళావతి అని రాజ్ అంటాడు. మేము చాలా దాచుకుంటాం అన్న కావ్య వెళ్లనా అంటుంది. రాజ్ వెళ్లమంటాడు. నాకు ఓ ముద్దు ముచ్చట కూడా లేదు అని బయటకు వెళ్లిపోతుంది కావ్య.

మరోవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మీ సీమంతం ఏర్పాట్లు సరిగా లేవని అనుకుంటుంటారు. కనకం శాలువ కప్పిన కుర్చీ చాలా స్పెషల్‌గా ఉందని కూర్చోడానికి వెళ్తుంది రుద్రాణి. అది చూసిన సీమంతం శీను ఆగండి అని అరుస్తాడు. అది విన్న కనకం చెత్త వెధవ అంతా చెడగొట్టాడు అని అనుకుంటాడు. ఆ కుర్చీలో కూర్చోవనివ్వు అని శీను అంటాడు. వద్దంటున్నాడుగా కూర్చోకండి వదినా అని కనకం అంటుంది. మీరు వద్దంటున్నారు కాబట్టి ఇందులోనే కూర్చుంటాను అని రుద్రాణి అంటుంది.

కూలబడిపోయిన రుద్రాణి

మీరు వంద.. వంద సార్లు అన్న నేను కూర్చోనివ్వను అని శీను అంటాడు. మధ్యలో నువ్ కమాండ్ చేస్తావేంట్రా అని ఒక్కటి లాగిపెడుతుంది రుద్రాణి. అక్క అని శీను అంటే.. ఖాతాలో రాసుకోరా అని కనకం అంటుంది. మీరు ఇంకోటి పీకిన నేను కూర్చోనివ్వను అని శీను అంటాడు. మీరు కాదు నేను కూర్చుంటాను అని ధాన్యలక్ష్మీ వెళ్తుంది. శీను అడ్డుపడితే ధాన్యలక్ష్మీ కూడా ఒక్కటి కొడుతుంది. తర్వాత పంతానికి అయినా దేనికైనా నేనే కూర్చోవాలని అని రుద్రాణి కూర్చుంటుంది.

కుర్చీ కాలు విరిగి ఉండటంతో కిందకూలపడిపోతుంది రుద్రాణి. ఓరి నాయనో.. నడుం విరిగింది.. ఏయ్ కనకం కుర్చీ మీద క్లాత్ పెట్టి కిందపడేలా చేసి నన్ను అవమానిస్తావా అని రుద్రాణి అంటుంది. మేము కూర్చోవద్దనే చెప్పాం అని కనకం అంటుంది. అవును, కనకం, శీను కూర్చోవద్దనే చెప్పారు అని సపోర్ట్‌గా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మీ. తర్వాత రుద్రాణిని ధాన్యలక్ష్మీ, కనకం లేపుతారు. రుద్రాణి బాధతో ఉంటే ధాన్యలక్ష్మీ నడిపించుకుంటు తీసుకెళ్తుంది.

దొంగమొహంది. నడుం విరిగింటే బాగుండు అని మనసులో అనుకున్న కనకం.. ధాన్యలక్ష్మీ గారు జాగ్రత్తగా తీసుకెళ్లండి. మళ్లీ పడితే అన్ని మంచంలోనే అని కనకం సైటెర్లు వేస్తుంది. నాలుగు చెంపదెబ్బలు తిన్నాను నాలుగు వందలు ఇవ్వాలి అని శీను అంటే.. ఐదు వందలు ఇస్తాను. ఖాతాలో రాసుకో అని కనకం చెబుతుంది. మరోవైపు స్వప్నను రెడీ చేస్తుంటారు. కావ్య వెళ్లి స్వప్నతో సర్‌ప్రైజ్ అంటూ తాను కొనుకున్న నగనే ఇస్తుంది.

తోడు దొంగలని తెలుస్తోంది

అది చూసి సంబరపడిన స్వప్న ఇది ఇంకా అమ్మేయలేదా అని అంటుంది. లేదు. ఇది నీ సీమంతానికి దుగ్గిరాల తరఫున ఇచ్చే కానుక అని కావ్య అంటుంది. అది చూసిన రుద్రాణి వెళ్లి ధాన్యలక్ష్మీని పిలుచుకుని వస్తుంది. స్వప్నకు కావ్య నగలు వేస్తుంది. రుద్రాణి చప్పట్లు కొడుతు శభాష్ కావ్య అంటూ లోపలికి వెళ్తుంది. మీరిద్దరు ఎంత తోడు దొంగలో తెలుస్తుంది. కనకం కూతుళ్లు కదా అని రుద్రాణి అంటుంది.

మా అందరి తిండి మీద ఆంక్షలు పెట్టి అక్కకు లక్షల చెక్ ఇచ్చి. అది రివర్స్ అయ్యేసరికి కవర్ చేసి.. ఇప్పుడు మీ దుగ్గిరాల ఇగో చల్లార్చి గిఫ్ట్ అని చెప్పి తనకు కావాల్సింది ఇచ్చింది. దీన్ని ఏమంటారు అని రుద్రాణి అంటే.. చావు తెలివితేటలు అంటారు. మరి ఇదేం ఖర్చు పనికొచ్చే ఖర్చు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇప్పుడు దాని గురించి రభస అవసరమా. సంతోషంగా సీమంతం చేసి వెళ్లిపోదాం. జరిగేది నీ కోడలి సీమంతం. నువ్వే గొడవ పెడతావేంటీ అని సుభాష్ అంటాడు.

ఇలానే మా నోరులు మూస్తున్నారు. తనకు అంత ఖర్చు చేసి మాకు మాత్రం మరోలా చూస్తున్నారు అని ధాన్యలక్ష్మీ. ఇది పక్షపాతం కాదా అంటుంది ధాన్యలక్ష్మీ. ఏంటీ మా ఇద్దరి బ్లేమ్ చేస్తున్నారు. మేమిద్దరం కలిసిపోతే ఈపాటికి మీ ఇద్దరిని బయటకు గెంటేసేవాళ్లం. ఆరోజు నిజంగానే ఇంటి ఖర్చులకని చెక్ ఇచ్చింది. ఎవ్వరు అడగలేదని నేను ఈ బంగారం కొనుక్కున్నాను. అందుకేగా కావ్య తిట్టింది. నేను అలిగి వెళ్లిపోయాను. ఇంతే జరిగింది. నమ్మితే నమ్మండి. లేకుంటే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని స్వప్వ అంటుంది.

జంట పిశాచాల్లా

మా ఖర్చులకి ఆంక్షలు పెట్టి తనకు అంత భారీ నగలు కొంటే మాకు మండదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలో అనుకున్నాను అంటూ రాజ్ ఎంట్రీ ఇస్తాడు. నేను ఊహించిందే జరిగింది. మా అత్తింట్లో ఏదో ఒక గొడవ చేయాలి కదా. అది ఆనవాయితీ కదా అని రాజ్ అంటాడు. కరెక్ట్‌గా అన్నావురా. ఏదో గొడవ చేసి వీళ్లను బాధపెట్టకుండా ఉండరు ఈ జంట పిశాచాలు అని ఇందిరాదేవి అంటుంది. అయితే, రేపు నాకు ఒక డైమండ్ నెక్లెస్ చేయించండి అని రుద్రాణి అంటుంది.

నువ్వెప్పుడు కడుపుతో ఉన్నావ్ అత్త. ఈ పాపం ఎప్పుడు మూటగట్టుకున్నావ్. పైగా ఈ వయసులో నీకు సీమంతం చేసి పైగా నీకు డైమండ్ నెక్లెస్ కూడా గిఫ్ట్‌గా ఇవ్వాలా అని స్వప్న అంటుంది. నేను నీకు వారసుడిని ఇవ్వబోతున్నాను. అలాంటిది ఈవిడతో వచ్చి గొడవ చేస్తావేంటీ అని స్వప్న అంటుంది. నీ చెల్లెలు చూపించే పక్షపాతం గురించే అంటున్నా. మా మావయ్య నీకు ఆస్తి రాసిచ్చినప్పుడు మేము అడ్డు పడ్డామా అని ధాన్యలక్ష్మీ అంటుంది.

ఆ డైమండ్ నెక్లెస్ కళావతి ఇక్కడికి తేలేదు. నేను తీసుకొచ్చాను. ఆ రోజు కళావతి కోప్పడిందని స్వప్న చిన్నబుచ్చుకుంది. అది నేను చూసి కళావతిని మందలించాను. ఎందుకంత కఠినంగా మాట్లాడావని కోప్పడ్డాను. ఎప్పటికైనా స్వప్నకు ఇవ్వాల్సిందే అని దాచాను. ఇవాళ ఈ సందర్భంగా ఇవ్వాలనిపించింది. కళావతితో ఇప్పించాను. ఇందులో తను చేసిన తప్పు ఏముంది. తను అందరిని సమానంగానే చూస్తుంది. తన అక్కాచెల్లెల్లనను పట్టించుకోకుండా మనకోసమే పాటుపడుతుంది అని రాజ్ అంటాడు.

కావ్య నగలతోనే బిల్

దాంతో అంతా వెళ్తారు. ఏమత్తా రాత్రి వచ్చి ఏదోదో అన్నావ్. నాకు నా చెల్లికి దూరం పెంచాలని చూశావ్. ఇప్పుడు ఏమంటావ్. ఎప్పటికైనా మేమిద్దరం ఒక్కటే వెళ్లు అని స్వప్న అంటుంది. తర్వాత రుద్రాణిని పక్కకు పిలిచుకుని వెళ్తాడు రాహుల్. తాతయ్యకు కట్టాల్సిన హాస్పిటల్ బిల్ కట్టాడానికి నావల్ల లేట్ అయిందన్నాడుగా. అదంతా అబద్దం. తాతయ్య హాస్పిటల్ బిల్ కట్టింది కావ్యకు పెద్దత్తయ్య ఇచ్చిన నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి కట్టారు అని రాహుల్ చెబుతాడు.

అమ్మా కావ్య అసలు విషయం ఇదా. అయినా నగలు తాకట్టు పెట్టిన డబ్బులు కట్టాల్సిన అవసరం ఏముందిరా. అకౌంట్‌లో డబ్బులు బాగానే ఉంటాయిగా అని రుద్రాణి అంటుంది. ఏమో అన్ని పోయాయేమో. ఉన్నవాళ్లు డైవర్ట్ చేశారేమో. జరిగింది ఇదే అని రాహుల్ అంటాడు.

మంచి పాయింట్ పట్టావ్. ఇప్పుడే దీంతో ఇక్కడ హీట్ పుట్టించొచ్చు. ఇంట్లో కావ్య ఖర్చులకు కంట్రోల్ పెడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అది నిజమని ఇప్పుడు ప్రూవ్ అవబోతుంది అని రుద్రాణి అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner