Brahmamudi February 6th Episode: నానమ్మ అయిన రుద్రాణి-ఆస్తి గొడవ- రాసిస్తానన్న ఇందిరాదేవి- సొంతూరికే SIగా వచ్చిన అప్పు!-brahmamudi serial today episode february 6th appu surprise kanakam murthy as si and seetharamayya out of coma star maa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi February 6th Episode: నానమ్మ అయిన రుద్రాణి-ఆస్తి గొడవ- రాసిస్తానన్న ఇందిరాదేవి- సొంతూరికే Siగా వచ్చిన అప్పు!

Brahmamudi February 6th Episode: నానమ్మ అయిన రుద్రాణి-ఆస్తి గొడవ- రాసిస్తానన్న ఇందిరాదేవి- సొంతూరికే SIగా వచ్చిన అప్పు!

Sanjiv Kumar HT Telugu
Published Feb 06, 2025 07:50 AM IST

Brahmamudi Serial February 6th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 4 ఎపిసోడ్‌లో మూడు నెలల్లో కథ మారిపోయింది. స్వప్నకు పాప పుడుతుంది. అంతా సంతోషిస్తుంటే ఆడపిల్ల పుట్టిందని రుద్రాణి ఈసడించుకుంటుంది. మరోవైపు సీతారామయ్య కోమా నుంచి బయటకొస్తాడు. అలాగే, అప్పు ఎస్సైగా స్టైలిష్ ఎంట్రీ ఇస్తుంది.

బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 6వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 6వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మూడు నెలలు వెంటనే జరిగిపోతాయి. స్వప్నకు ఆడపిల్ల పుట్టిందని, కావ్య పిన్ని అయినట్లు అపర్ణ కాల్ చేసి చెబుతుంది. కట్ చేస్తే పాపతో స్వప్న ఇంటికి వస్తే కావ్య హారతి పట్టి, బొట్టి పెట్టి లోపలికి పిలుస్తుంది. పాపను చూసుకుంటూ అంతా మురిసిపోతుంటారు. ఈ తరం నుంచి ఈ ఇంటికి అడుగుపెట్టిన మొట్టమొదటి బిడ్డ. సాక్ష్యాత్తు మహాలక్ష్మి ఇంటికొచ్చినట్లుంది అని ఇందిరాదేవి అంటుంది.

నీ పెళ్లి కూడా ఇక్కడే జరగాలి

మహాలక్ష్మి వచ్చిన సందర్భంగా ఎవరి ఆస్తి వారికి ఇస్తే బాగుంటుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో ప్రకాశం వారిస్తాడు. ఆయుష్షు ఎంత అవసరమో.. ఆస్తి కూడా అవసరమే కదా అని రుద్రాణి అంటుంది. వాళ్ల గొడవను ఆపి ఇందిరాదేవి మునిమనవరాలితో ఆప్యాయంగా మాట్లాడుకుంటుంది. ఇదంతా మన ఆస్తే. నీ పెళ్లి కూడా ఇక్కడ జరగాలి అని ఇందిరాదేవి అంటుంది. దాని పెళ్లి వరకు ఎందుకులే. అప్పటివరకు ఎవరుంటారో.. ఎవరు పోతారో ఎవరికి తెలుసు అని రుద్రాణి అంటుంది.

రుద్రాణి ఏంటా మాటలు అని అపర్ణ అంటుంది. ప్రాక్టికల్‌గా, నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చదు అని రుద్రాణి, రాహుల్ అంటారు. నీకు మనవరాలు పుట్టిందన్న సంతోషం కూడా లేదా అని సుభాష్ అంటాడు. ఎలా సంతోషంగా ఉంటుంది. ఇది మగ పిల్లాన్ని కని ఇంటికి వారసుడు ఇస్తుందనుకుంటే ఆడపిల్లను తీసుకొచ్చి చేతిలో పెట్టింది. ఇంకెలా సంతోషంగా ఉండమంటావ్ అని రుద్రాణి అంటుంది. ఇంతలో రాజ్‌కు హాస్పిటల్‌ నుంచి ఫోన్ వస్తుంది. సీతారామయ్య కోమా నుంచి బయటకు వచ్చినట్లు డాక్టర్ చెబుతారు.

ఇదే నీకు తోడుగా ఉంటుంది

దాంతో తెగ సంబరపడిన రాజ్ అందరికి చెబుతాడు. అంతా సంతోషిస్తారు. రుద్రాణి మాత్రం చచ్చాడు అనుకుంటే మళ్లీ బతికొచ్చాడా అని మనసులో బాధపడుతుంది. పాప ఇంటికి వచ్చిన వేళావేశేషం తాతయ్య గారు కోమానుంచి బయటపడ్డారు. చూశారా అని కావ్య అంటుంది. మగపిల్లాడు అని అంటున్నావ్. నువ్, నేను ఆడదాన్ని కాదా అని ఇందిరాదేవి అంటుంది. ఇది అదృష్టజాతకురాలు. దీన్ని బాగా చూసుకో. ఇదే నీకు తోడు నీడుగా ఉంటుంది అని అపర్ణ అంటుంది.

గొడవ పడి సంతోషాన్ని ఎందుకు పాడు చేసుకోవడం. బావ చూస్తుంటారు. మనం వెళ్దాం పదా అని వెళ్తారు. హాస్పిటల్‌లో సీతారామయ్య కళ్లు తెరుస్తాడు. చిట్టీ అని పలకరిస్తాడు. అంతా సంతోషిస్తారు. నీ నుంచి నన్ను వేరు చేయకుండా ఉండటానికి ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. అందుకే తిరిగి నన్ను పంపించాడు అని సీతారామయ్య అంటాడు. మిమ్మల్ని వదిలి తాతయ్య ఎక్కడికి పోరు అని కావ్య అంటుంది. ఆయన ఒడిలో నేను సుమంగళిగా పోవాలనేదే నా కోరిక అని ఇందిరాదేవి అంటుంది.

తాతయ్యకు ఇప్పుడే మరో జన్మ వచ్చింది. ఇంతలో చావు గురించి బాధపెట్టాలా అని రాజ్ అంటాడు. ఏ ఆడదానికైనా సుమంగళిగా పోవాలనే ఉంటుంది. అదే చెప్పాను అని ఇందిరాదేవి అంటుంది. నువ్ లేకుంటే నేనేం చేస్తాను. ఇద్దరం కలిసే తనువు చాలిద్దాం అని సీతారామయ్య అంటాడు. ఇద్దరు నిండు నూరేళ్లు బతుకుతారు అని రాజ్ అంటాడు. కంపెనీ పరిస్థితి ఎలా ఉందని సీతారామయ్య అడుగుతాడు. రాజ్ చెప్పలేకపోయేసరికి.. ఆ విషయంలో మీరు కంగారుపడకండి. మీ మనవడు మరో సీతారామయ్యలా చూసుకుంటున్నారు అని కావ్య అంటుంది.

పోలీస్‌గా అప్పు ఎంట్రీ

డాక్టర్ వచ్చి ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. రెస్ట్ చాలా అవసరం. ఇప్పుడే కోమా నుంచి బయటకొచ్చారు కాబట్టి బాడీ చాలా వీక్‌గా ఉంటుంది. మెడికేషన్ ఇస్తూ ఒక నెల అబ్జర్వేషన్‌లో పెట్టాలి. ఇంటికి తీసుకెళ్లాక చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. తాతయ్య ఇంటికి వచ్చేలోపు అన్ని సమస్యలు సాల్వ్ చేయాలి అని రాజ్ అనుకుంటాడు. మరోవైపు అప్పు పోలీస్‌గా కనకం ఇంటికి ఎంట్రీ ఇస్తుంది. కనకంను హ్యాండ్సప్ అని గన్‌తో బెదిరిస్తుంది.

దాంతో కనకం భయపడిపోతుంది. మేడమ్ నన్ను ఏం చేయకండి. నేను ఏం చేయలేదు. అంతా పక్కింటి పంకజమే చేస్తుంది. దాన్ని అరెస్ట్ చేయండి అని కనకం అంటుంది. నాకు నీ గురించి అంతా తెలుసు అని జరిగినవన్నీ చెబుతుంది అప్పు. పాప పుట్టిందని నీ చిన్నకూతురుకు చెప్పావా. అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని అప్పు అంటుంది. దీనికి కూడా అరెస్ట్ చేస్తారా. ఉండండి ఇప్పుడే కాల్ చేస్తాను అని కాల్ చేస్తే పక్కనే రింగ్ అవుతుంది.

ఇంతలో కృష్ణమూర్తి వచ్చి కన్నకూతురునే గుర్తుపట్టలేదా. కళ్లు అంత మందగించాయా అని అంటాడు. ఏంటీ కన్నకూతురా అని కనకం షాక్ అవుతుంది. కల్యాణ్ వచ్చి అవును, అత్తయ్య మీ కూతురు అప్పు అని చెబుతాడు. దాంతో స్పష్టంగా చూసిన కనకం. ఏమే నన్నే బెదిరిస్తావా. నీ సంగతి చెబుతానంటూ చీపురు పట్టుకుని కొట్టేందుకు వస్తుంది. దాంతో భయపడుకుంటూ తండ్రి వెనుక దాక్కుంటుంది అప్పు. చూడు నాన్న కనీసం కూతురును కూడా గుర్తుపట్టలేని తల్లి, ఎలా కొడుతుందో చూడు అని అప్పు అంటుంది.

కనకం రౌడీయిజం

ఇంతకుముందు లేట్‌గా వస్తే చీపురు తిరగేసేది. కానీ, ఇప్పుడు నేను పోలీస్‌ను. డ్యూటీలో ఉన్న పోలీస్‌ మీద చేయి వసినందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని అప్పు అంటుంది. నువ్ పోలీస్ అయితే అదే నా కూతురువే. తప్పు చేస్తే ఇప్పుడు కూడా చీపురు తిరగేస్తా అని కనకం అంటుంది. చూశావా నాన్న నీ పెళ్లాం ఇంకా రౌడీయిజం మానలేదు అని అప్పు అంటుంది. కనకం ఇక్కడ తగ్గేదే లే అని కనకం అంటుంది. హా చూశానులే ఇందాక ఎంతల భయపడ్డావో అని కృష్ణమూర్తి అంటాడు.

దాంతో సైలెంట్ అయిపోతుంది కనకం. చాలా సంతోషంగా ఉందని కృష్ణమూర్తి పొంగిపోతాడు. కనకం కన్నీళ్లు పెట్టుకుని సంతోషిస్తుంది. పరీక్ష రాసి పోలీస్ అయి ఇదే ఊరికి ఎస్సైగా వచ్చిందని కల్యాణ్ చెబుతాడు. ఉండు నీ నోరు తీపి చేస్తాను అని చెక్కెర తెచ్చిపోస్తుంది. కృష్ణమూర్తికి షుగర్ వచ్చిందని పెట్టదు కనకం. మా అప్పుకు నువ్ భర్తగా దొరకడం అదెప్పుడో చేసుకున్న దాని అదృష్టం. భార్య ఇష్టాన్ని తెలిసుకుని తన గమ్యంవైపు నడిపించడం ఎవరు చేయరు అని కనకం అంటుంది.

తన కల కలలాగే అవుతుందనుకున్నాం. కానీ, మీరు అది నిజమయ్యేలా చేశారు అని ఎమోషనల్ అవుతుంది కనకం. పోలీస్ అంటేనే నీతిగా నిజాయితీగా ఉండాలి అని చెబుతుంది కనకం. మీ ఇంట్లో చెప్పారా అని కనకం అడుగుతుంది. కల్యాణ్ మౌనంగా ఉంటాడు. అయ్యో మాకంటే ముందు వాళ్లకే చెప్పాలి కదా బాబు. రేపు నువ్ గొప్ప పాటల రచయిత అయినా వారికే ముందు చెప్పాలి. మీ ఇబ్బందిని అర్థం చేసుకోగలం. కానీ, తల్లిదండ్రులను కాదనలేం కదా. వెళ్లి మీ పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకురండి అని కనకం చెబుతుంది.

ఆస్తి రాసివ్వు చాలు

దాంతో కల్యాణ్, అప్పు వెళ్తారు. నువ్ రాగానే మా బావను స్పృహలోకి తీసుకొచ్చావ్. నీకు ఏం కావాలన్న ఇస్తాను అని ఇందిరాదేవి మునిమనవరాలిని చూసి మురిసిపోతుంది. ఆలోచించి మాట ఇవ్వండి. అది నా కూతురు. ఏమైనా అడుగుతుంది అని స్వప్న అంటే.. నా బావ ప్రాణం కంటే నాకు ఏది ఎక్కువ కాదే. ఇది అడగాలే కానీ, నా ప్రాణం కూడా ఇస్తాను అని ఇందిరాదేవి అంటుంది. నీ ప్రాణాలు ఎందుకేలే అమ్మ. నువ్ నిండు నూరేళ్లు చల్లగా ఉండు. ఆస్తి మాత్రం మాకు రాసివ్వు అని రుద్రాణి అంటుంది.

సరే.. ఇది పెద్దయ్యాక ఆస్తి కావాలని అడిగితే రాసిస్తాలే అని ఇందిరాదేవి అంటుంది. ఏంటీ అప్పటివరకు ఇలాగే బతకాలా అని రుద్రాణి అంటుంది. అత్తయ్య సరదాగా అన్నారులే. రాజ్ చెప్పిన మూడు నెలల గడువు పూర్తికావొస్తుందిగా. దీంట్లో మనకు క్లారిటీ ఇస్తాడులే. ఏంటీ రాజ్, నేను చెప్పింది నిజమేగా అని ధాన్యలక్ష్మీ అంటుంది. తొందరెందుకు చిన్నత్తయ్య మీరు కోరుకున్నట్లుగానే మా సమాధానాలు ఉంటాయి అని కావ్య అంటుంది.

చాల్లే ఆపండి. కొన్ని రోజులు గొడవలన్ని పక్కన పెట్టేసి దీని గురించి ఆలోచిద్దాం. దీనికి బారసాల చేయాలనుకుంటున్నా. అది కూడా అందరిని పిలిచి చాలా గ్రాండ్‌గా. పంతులును ఆల్రెడీ అడిగాను. రేపే మంచి రోజు ఉందట అని ఇందిరాదేవి అంటుంది. ఇవాళ రాత్రిలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నమాట అని కావ్య అంటుంది. నువ్ రాజ్ ఉన్నారుగా. దగ్గరుండి నీ అక్క కూతురుకి బారసాల చేయండి అని సుభాష్ అంటాడు.

జోల పాడిన కావ్య

తర్వాత పాప ఏడుస్తుంటే.. కావ్య పాట పాడుతూ జోల పాడుతుంటుంది. అప్పు కూడా ఉంటుంది. దాంతో ఇందిరాదేవి, అపర్ణ సంతోషంగా చూస్తుంటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం