Brahmamudi February 1st Episode: కల్యాణ్ పాట రాసినట్లు కనిపెట్టిన సంగీత దర్శకుడు- రగిలిన కావ్య రాజ్ పాస్‌పోర్ట్ చిచ్చు
Brahmamudi Serial February 1st Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 1 ఎపిసోడ్‌లో రాజ్, కావ్య ఆస్తులు డాలర్స్‌లోకి మార్చి అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నట్లు రుద్రాణి ఇంట్లో చిచ్చు రగుల్చుతుంది. దాంతో ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. కల్యాణ్ పాట రాసినట్లు సంగీత దర్శకుడు కనిపెట్టి తనకే చెబుతాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో నాకు వీసా కావాలి, నా వైఫ్‌కి పాస్‌పోర్ట్ అండ్ వీసా రెండు కావాలి, పాస్ట్ పోర్ట్ సైజ్ ఫొటో కూడా కావాలి అని ఫోన్‌లో రాజ్ మాట్లాడుతుంటాడు. ఆ మాటలు రుద్రాణి చాటుగా వింటూ ఉంటుంది. ఇదేంటీ పాస్‌పోర్ట్, వీసా అంటున్నాడు. దేనికోసం అయింటుంది. హనీమూన్‌కు వెళ్తున్నారా. లేదు ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకుని వెళ్లరు. ఇంకేదే అయింటుందని రుద్రాణి డౌట్ పడుతుంది.
31 రోజుల్లో ఆంగ్లం
అవునండీ.. అమెరికా వెళ్లాలి. టైమ్ కూడా లేదు. ఒక్క నెలలో ప్రాసెస్ అంతా జరిగిపోవాలి అని రాజ్ అంటాడు. ఇదేదో ఇంట్లో వాళ్లందరిని ముంచేసే ప్లానే. డౌటే లేదు. ఇద్దరు తోడుదొంగల్లా ఉన్నదంతా దోచుకుని విదేశాల్లో సెటిల్ అయిపోదామనుకుంటున్నారు అని అనుమానించిన రుద్రాణి వెళ్తుంది. అక్కడ కావ్య 31 రోజుల్లో ఆంగ్లం ఎలా నేర్చుకోవాలో బుక్ చదువుతూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. అది చూసిన రుద్రాణి వెళ్లి మాట్లాడిస్తుంది.
కావ్య ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది. దానికి ఎందుకు అని రుద్రాణి అడుగుతుంది. మీటింగ్‌లో ఇంగ్లీష్‌లో దంచి కొట్టాలంటే ప్రాక్టీస్ చేయాలికదా అని కావ్య అంటుంది. నీ ఇంగ్లీష్ చూసి ఇంగ్లీషోడు పారిపోతాడు అని రుద్రాణి అంటుంది. నేను చాలా నేర్చుకోవాలి. డిస్టర్బ్ చేయకండి. ఎస్‌కిస్‌మీ అని కావ్య అంటుంది. ఏయ్.. అది ఎక్స్‌క్యూజ్ మీ.. కిస్ మీ అంటే ముద్దు పెట్టు అని రుద్రాణి అంటుంది. ఛీ.. ఛీ.. ఇంత బతుకు బతికి మీతో ముద్దు పెట్టించుకుంటానా. తప్పుకోండి. వెళ్లండి అని కావ్య అంటుంది.
కన్ఫర్మ్.. వీళ్లిద్దరు ఆస్తులు మొత్తం డాలర్స్‌లోకి మార్చేసి అమెరికా పారిపోడానికి స్కెచ్ వేస్తున్నారు. వీరి ప్లాన్ నాకు తెలిసినట్టు కాకుండా వేరేలా బయటపెట్టాలి. వీరి ఇంగ్లీష్ వ్యవహారం తీస్తా అని రుద్రాణి అనుకుని వెళ్తుంది. వెళ్లి రుద్రాణికి చెబితే ధాన్యలక్ష్మీ పంచ్‌లు వేస్తుంది. ఇంట్లో కుంపటి పెట్టినా.. నీతో వేరు కుంపటి పెట్టించినా నీకోసమే కదా అని రుద్రాణి అంటుంది. అమాయకురాలిలా మాట్లాడకు. నీ గురించి నాకు బాగా తెలుసు. నా ముందు నాటకాలు ఎందుకు అని ధాన్యలక్ష్మీ అంటుంది.
రుద్రాణిని అనుమానించిన ధాన్యం
నువ్ షాక్ అయ్యే వార్తను నా చెవులారా విని కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను. ఆస్తిని కరిగించి అమెరికా డాలర్స్ చేస్తున్నారు అని రాజ్, కావ్య మాట్లాడింది అంతా ధాన్యలక్ష్మీకి చెబుతుంది రుద్రాణి. వాళ్లు ఏం మాట్లాడారో.. కానీ నీకు కావాల్సింది అనుకుంటావ్. అది నాకు చెబితే అందరిముందు నేను వాగుతాను. దాంతో అందరిముందు నేను వెర్రిబాగులదాన్ని అవుతాను అని ధాన్యలక్ష్మీ అనుమానిస్తుంది. నా మాటలు నమ్మకపోయినా సరే కానీ వాళ్లు అమెరికా వెళ్లడం ఆపితే వాళ్లే బయటపడతారు అని రుద్రాణి అంటుంది.
నేను స్వార్థ పరురాలిగా బయటపడాలనుకోవట్లేదు. వాళ్లు 3 నెలలు టైమ్ అడిగారు కదా. అప్పుడు నిజాలు చెప్పకపోతే అప్పుడు చూద్దాం. నిన్ను నమ్ముకుంటే న్యాయం జరుగుతుందా. అందుకే 3 నెలలు ఆగాలని ఫిక్స్ అయ్యా. నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. దీన్ని అస్త్రంలా వాడాలనుకున్న ప్రతిసారీ నాకే గాయాలు అవుతున్నాయి. దీన్ని నమ్ముకుని లాభం లేదు. నేనే ఏదోటి చేసి బయటపెట్టాలి అని రుద్రాణి అనుకుంటుంది.
మరోవైపు రాజ్‌కు పాస్‌పోర్ట్ కోసం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకునేందుకు సతీష్ అనే వ్యక్తి కాల్ చేస్తాడు. దాంతో రాజ్ బయటకు వెళ్తున్నానని ఇంటి అడ్రస్ ఇచ్చి దగ్గర కలెక్ట్ చేసుకోమ్మని చెబుతాడు. ఆఫీస్‌లో కలెక్ట్ చేసుకోమ్మని చెబితే అయిపోయేది కదా అని కావ్య అంటే.. నిన్న వేళం పాటలో వచ్చిన డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడానికి క్లైంట్ వస్తున్నాడు. అతను మనీ సెండ్ చేయగానే బ్యాంక్‌కు వెళ్లి కట్టాలి అని రాజ్ అంటాడు. మరి పాస్‌పోర్ట్ అతనికి డౌట్స్ వస్తే అని కావ్య అడిగితే.. స్వప్న చెబుతుందిలే అని రాజ్ అంటాడు.
జీవితాలు తలకిందులు చేస్తావ్
ఇది మీ అక్కకు ఇచ్చేయ్ అని ఓ ఫైల్ ఇస్తాడు రాజ్. స్వప్నకు ఫైల్ ఇచ్చి అందులోని డాక్యుమెంట్స్ ఇచ్చేయ్ అని కావ్య చెబుతుంది. దేనికోసం అని స్వప్న అడిగితే.. తెలుసుకున్నా ఏం చేయలేవు. డాక్యుమెంట్స్ ఇచ్చేయ్ చాలు అని కావ్య చెప్పేసి వెళ్తుంది. ఇంతలో రుద్రాణి వచ్చి లాక్కుంటుంది. చూసి ఇస్తాను అని రుద్రాణి అంటే.. స్వప్న లాక్కుని నేను నీకు ఇవ్వను. చిన్న విషయం దొరికితేనే జీవితాలు తలకిందులు చేసే రకం నువ్వు. నీకు ఇవ్వను అని స్వప్న వెళ్లిపోతుంది.
కాసేపట్లో ఆ బ్రోకర్ వస్తాడుగా. వాడితోనే అన్ని విషయాలు బయటపెడతాను అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు రైటర్ లక్ష్మీకాంత్‌ను కల్యాణ్ కలుస్తాడు. తాను చెప్పిన పాట రాసి ఇస్తాడు. ప్రేమలో కన్న కలలు, ప్రేయసితో గడిపిన క్షణాలు అన్ని గుర్తు చేసుకుని రాసి ఉంటావ్ అని లక్ష్మీకాంత్ అంటాడు. అది చదివి మహా అద్భుతం అని మెచ్చుకుంటాడు. గొప్ప రచయితవి కావాలని కోరుకుంటున్నా అంటాడు. ఇంతలో కారులో నుంచి మ్యూజిక్ డైరెక్టర్ వస్తాడు.
మీకోసమే వేడిగా ఓ పాట రాశానని అతనికి చెబుతాడు రైటర్. మీరు ఈ మధ్య వేగంగా రాస్తున్నారు అని పొగుడుతాడు మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత ఆ పాట చూసి ఇదంతా మీరే రాశారా. ఈ పాటలో మీ శైలీ మారిపోయింది. యూత్‌ఫుల్‌గా ట్రెండీగా అనిపిస్తుంది. ప్రతి పదం చాలా ఫ్రెష్‌గా ఉంది అని సంగీత దర్శకుడు అంటాడు. దాంతో మంచి డైలాగ్స్‌తో లక్ష్మీకాంత్ కవర్ చేసుకుంటాడు. ఈ లైన్స్‌లో నాకో సందేహం ఉందని అడుగుతాడు.
వేరే పదం వాడొచ్చుగా
కొంతమంది పాట వినేటప్పుడు తప్పుగా తీసుకోవచ్చు. యద లోతుల్లో అనే పదానికి వేరే పదం వాడొచ్చుగా అని అతను అంటాడు. అలా ఎలా మారుస్తాం అని రైటర్ కవర్ చేసేందుకు ట్రై చేస్తే ప్రేమ అనేది మనసుకు సంబంధించి.. కానీ, శరీరానికి సంబంధించింది కాదు కదా అని అతను అంటాడు. దాంతో తటపటాయించిన రైటర్ అదే కన్ఫర్మ్ చేసుకోమంటాడు. సరే అని మ్యూజిక్ డైరెక్టర్ వెళ్లిపోతాడు. వెళ్లిరావయ్య అని కల్యాణ్‌కు చెప్పి ఇంట్లోకి వెళ్తాడు రైటర్ లక్ష్మీకాంత్.
తర్వాత కారు దగ్గర ఉన్న మ్యూజిక్ డైరెక్టర్‌కు వెళ్లి మీరు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. యదలోతుల్లో బదులు హృదయ స్పందనలో అని రాస్తే బాగుంటుంది అని కల్యాణ్ చెబుతాడు. ఈ పదం చాలా బాగుంది. నీలో చాలా విషయం ఉంది. ఈ పాట రాసింది నువ్వే అని నాకు తెలుసు. పదేళ్లుగా ఆయన్ను చూస్తున్నా. ఆయన ఎలా రాస్తాడో నాకు తెలియదా. నీ రచనా శైలీ చాలా బాగుంది. త్వరలోనే కలిసి పనిచేద్దాం. గొప్ప రచయిత అవుతావ్. ఆల్ ది బెస్ట్ అని కల్యాణ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతాడు మ్యూజిక్ డైరెక్టర్.
దాంతో కల్యాణ్ చాలా సంతోషిస్తాడు. మరోవైపు రాజ్ కావ్య కారులో వెళ్తుంటారు. కావ్య ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. తర్వాత నేను ఇంగ్లీష్‌లో సామెతలు చెబుతాను. మీరు తెలుగులో చెప్పండి అని కావ్య అంటే.. నాకే ఇంగ్లీష్ టెస్ట్ పెడతావా అని రాజ్ అంటాడు. కావ్య చెప్పే సామెతలు విని రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో ఎస్సై కాల్ చేస్తాడు. కాల్చి పారిపోయిన అతను బైక్ వెరీఫై చేస్తే ఫేక్ అని తెలిసింది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాడిని చెక్ చేసి పట్టుకోవాలి. కానీ, ఇది చాలా టైమ్ పడుతుంది అని ఎస్సై అంటాడు.
రుద్రాణి అతిథి మర్యాదలు
వాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. పట్టుకుంటేనే మా సమస్య తీరుతుందుని రాజ్ అంటాడు. ఎందుకండి టెన్షన్ పడతారు. కచ్చితంగా వాడు దొరుకుతాడు అని కావ్య అంటుంది. మరోవైపు ఇంటికి పాస్‌పోర్ట్ బ్రోకర్ సతీష్ వచ్చి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోమన్నారు అని చెబుతాడు. వీడిని మచ్చిక చేసుకుంటే మరిన్ని విషయాలు బయటపడతాయి అని రుద్రాణి అంటే.. స్వప్న కౌంటర్స్ వేస్తుంది. అతిథి మర్యాదలు చేయాలని రుద్రాణి అంటుంది.
అవేం డాక్యుమెంట్స్ అని రుద్రాణి అడిగితే.. అమెరికా వెళ్లడానికి పాస్ పోర్ట్, వీసా కోసం. రాజ్, కావ్య గారికి అని అతను చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అన్ని క్లియర్‌గా ఉన్నాయని వెళ్లిపోతాడు సతీష్. దాంతో ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది రుద్రాణి. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేసి రాజ్ కావ్య అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారని చెప్పాను అని రుద్రాణి చెబుతుంది. దాంతో సుభాష్ ఫైర్ అవుతాడు.
మీరు, మీ కొడుకు, కోడలు సెటిల్ అయితే చాలు అంతేగా అని రుద్రాణి అంటుంది. 24 గంటలు నీకు చిచ్చు పెట్టడమే కావాలా అని అపర్ణ అంటుంది. అన్యాయం జరుగుతున్నప్పుడు నాకు చెబితే మీకెందుకు తప్పుగా అనిపిస్తుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్