Brahmamudi February 10th Episode: రాజ్, కావ్యల రహస్యం బయటపెట్టిన అనామిక- రగిలిపోయిన అపర్ణ- క్షమించమని అడగమన్న ఇందిరాదేవి-brahmamudi serial today episode february 10th anamika shows bank notice to raj family aparna angry star maa brahma mudi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi February 10th Episode: రాజ్, కావ్యల రహస్యం బయటపెట్టిన అనామిక- రగిలిపోయిన అపర్ణ- క్షమించమని అడగమన్న ఇందిరాదేవి

Brahmamudi February 10th Episode: రాజ్, కావ్యల రహస్యం బయటపెట్టిన అనామిక- రగిలిపోయిన అపర్ణ- క్షమించమని అడగమన్న ఇందిరాదేవి

Sanjiv Kumar HT Telugu
Published Feb 10, 2025 07:20 AM IST

Brahmamudi Serial February 10th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 10 ఎపిసోడ్‌లో స్వప్న బిడ్డకు అంతా బారసాల చేస్తుంటారు. కనకం వస్తే రుద్రాణి పరువు తీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ, రివర్స్‌లో రుద్రాణి పరువే తీస్తుంది కనకం. అనామిక వచ్చి రాజ్, కావ్యల రహస్యం బయటపెడుతుంది. వంద కోట్లు అప్పు చేశారని చెబుతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 10వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 10వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నువ్ ఏం చేయలేకపోతున్నావ్ అని అనామికకు కాల్ చేసి రుద్రాణి అంటుంది. మృగాలు సైలెంట్‌గా ఉన్నాయంటే చావ చచ్చిపోయిందని కాదు, అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయని, నేను కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. రాజ్‌ను ఎక్కడ లాక్ చేయాలో అక్కడే లాక్ చేసుకుంటూ వచ్చాను. రాజ్, కావ్య వాళ్లకు తెలియకుండానే నా కంట్రోల్‌లో ఉన్నారు అని అనామిక అంటుంది.

ఏదో పెద్ద ప్లాన్ వేసింది

స్క్రీన్‌ప్లే అంతా నేను రాసినట్లే జరుగుతుంది. ఈసారి మనం దించబోయే బుల్లెట్ పాయింట్ బ్లాక్‌లో పెట్టినట్లు ఉంటుంది. ఈ రాత్రికి ఏసీ వేసుకుని హాయిగా పడుకోండి. రేపు మీ మనవరాలి బారసాల టైమ్‌లో నేను రాబోతున్నాను. బాంబ్ పేల్చబోతున్నాను. రేపు నేను కొట్టబోయే దెబ్బకి మీ దుగ్గిరాల కుటుంబం కుదేలు అయిపోతుంది. కళ్లప్పగించి చూడటానికి ఎదురుచూడండి అని కాల్ కట్ చేస్తుంది అనామిక. ఇంత కాన్ఫిడెంట్‌గా ఉందంటే ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటుంది. ఏదేమైనా మన ఆస్తి మనకు దక్కితే చాలు అని రుద్రాణి అనుకుంటుంది.

మరుసటి రోజు అంతా కావ్య, అప్పు బారసాల కోసం ఊయల రెడీ చేస్తుంటారు. ఇంతలో ఇందిరాదేవి వస్తూ నా గురించే మాట్లాడుకుంటున్నారా అని అంటుంది. మీ కోసమే ఊయల రెడీ చేస్తున్నాను. మీరు చిట్టినే ఆ పాప చిట్టీనే కదా అని కావ్య అంటుంది. దానికి షాక్ అయిన ఇందిరాదేవి కావ్య చెవి మెలిపెడుతుంది. నొప్పి పుడుతుంది అని కావ్య అంటే.. మర్యాదగా తప్పు అయిందని క్షమించమని అడుగుతావా లేదా అని ఇందిరాదేవి అంటుంది.

మన పురాణాల ప్రకారం నిజమే చెప్పాను. 60 ఏళ్లు దాటిన వారిని చిన్న పిల్లల్లానే చూసుకోవాలని మన పురణాలు చెప్పాయి కదా కావ్య అంటుంది. అదంతా పైనుంచి రుద్రాణి, ధాన్యలక్ష్మీ చూస్తారు. అక్క కూతురు అనేసరికి అంతా మర్చిపోయి ఎంత ఖర్చు చేస్తున్నారో చూస్తున్నావ్ కదా అని రుద్రాణి అంటుంది. చేయని, ప్రతి రూపాయికి నేను లెక్క అడగకుండా ఉండను. అవును, నీ మనవరాలి ఫంక్షనే కదా. నువ్వేం పట్టనట్టు ఉన్నావే అని ధాన్యలక్ష్మీ అంటుంది.

అంకుల్ అని గుర్తు చేయకండి

మనకు ఆ ఛాన్స్ ఎవరిస్తారు. ఆ అక్కాచెల్లెళ్లు, ఆ ముసల్ది వాళ్లే ఉంటారు. నేను దూరం నుంచి చూస్తూ లోపల సంతోషిస్తున్నాను అని రుద్రాణి అంటుంది. ఉమ్.. తెలుస్తుంది తెలుస్తుంది అని ధాన్యలక్ష్మీ వెటకారంగా అంటుంది. రాహుల్ దగ్గరికి రాజ్, కల్యాణ్ వెళ్లి నీ కూతురు బారసాల జరుగుతుంది. రెడీ అవకుండా ఇంకా పాచిమొహంతో ఉన్నావేంటీ అని అంటారు. అన్నిసార్లు కూతురు కూతురు అని అంకుల్ అని గుర్తు చేయకండి అని రాహుల్ అంటాడు.

నువ్వు లవర్ బాయ్‌లా ఫీల్ అవ్వకు. బిడ్డకు తండ్రివి. వెధవ వేశాలు వేస్తే కాళ్లు విరుగుతాయ్. ఇంటికి, వీల్ చైర్‌కు పరిమితం కావాలి. వెళ్లి వెంటనే రెడీ అవ్వు అని రాజ్, కావ్య అంటారు. మరోవైపు కనకం వస్తుంది. మీ గురించే అనుకుంటున్నాను. మీకు నూరేళ్లు అని రుద్రాణి అంటే.. అన్నేళ్లు ఎందుకులెండి. ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు పోవాలి. మీరు మాత్రం నిండు నూరేళ్లు ఈ ఇంట్లో గుండులా, పుండు మీద చల్లే కారంలా బాగా బతకండి అని కనకం సెటైర్ వేస్తుంది.

ఇది నాకే కౌంటర్స్ వేస్తుంది. దీని పరువు తీయాలి అని అనుకున్న రుద్రాణి బ్యాగ్ నిండా ఏమో తెచ్చారు అని చూస్తుంది. బంగారం అది తేకుండా పూలు, పళ్లు తెచ్చారు. అది మనవరాలు ఏం చేసుకుంటుంది అని రుద్రాణి పరువు తీయాలను చూస్తుంది. పెట్టే స్థోమత నాకు లేదని, మీకు పెట్టే స్థోమత ఉన్న పెట్టలేరని రెండు మీకు తెలుసు. బాగా చూస్తే మనిద్దరి పరిస్థితి ఇంచుమించు ఒకటే. మీరు బంగ్లాలో, నేను పెంకుటింట్లో ఉంటున్నాను. మిగతదంతా సేమ్ టు సేమ్ అని కనకం రివర్స్‌లో రుద్రాణి పరువు తీస్తుంది.

రెండో అత్తతో ఎలా చచ్చేది

దాంతో మమ్మీ దీన్నే అంటారు పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడం అంటే. ఆవిడ గురించి తెలుసు కదా అని రాహుల్ అంటాడు. మనవరాలిని చూసేందుకు పైకి వెళ్తుంది కనకం. మనవరాలిని ఎత్తకుంటుంది కనకం. దీనికి నాయనమ్మా పోలిక అస్సలు రాలేదు అని కనకం అంటే.. అలా వస్తే హాస్పిటల్‌లోనే వదిలేసి వచ్చేదాన్ని. ఒక అత్తతోనే వేగలేకపోతున్నా.. రెండో అత్తతో ఇంకెక్కడ చచ్చేది అని స్వప్న అంటుంది.

తర్వాత బారసాలకు టైమ్ అవుతుందని ఇందిరాదేవి పిలుచుకువస్తుంది. అప్పు డెకరేట్ చేస్తుంటే కల్యాణ్ వచ్చి బాగా చేయి, రేపు మన బిడ్డకు కూడా ఇలాగే చేయాలి అని అంటాడు. నాకు ఇప్పటివరకు కడుపులో తిప్పలేదు, వాంతులు కాలేదు. నువ్ మాత్రం డెలీవరి వరకు వెళ్లిపోయావ్ అని అప్పు అంటుంది. మొన్నటివరకు పోలీస్ కావాలని ఆగాం. ఇప్పుడు అయ్యావ్ కాబట్టి పగలంతా పోలీస్ డ్యూటి రాత్రి భార్య డ్యూటి అని కల్యాణ్ అంటాడు.

అప్పుకు పోలీస్ డ్యూటి తప్పా ఏం గుర్తుండదేమో అని అపర్ణ అంటుంది. నువ్ తండ్రివి కావాలంటే ఇప్పుడే ఛాన్స్ ఉంది. రేపు అది ఛార్జ్ తీసుకుని క్రిమినల్ వెంట పడితే కష్టం అవుతుంది అని అపర్ణ అంటే.. ఇందులో ఏదైనా సలహాలు కావాలంటే నన్ను అడగరా.. సీనియర్‌ను కదా అని సుభాష్ అంటాడు. దాంతో అప్పు ఏదోటి చెప్పి వెళ్తుంటే.. హెల్ప్ చేస్తానని కల్యాణ్ వెళ్తాడు. ఇలాగే అప్పుకు ఎప్పుడు హెల్ప్ చేయాలని సుభాష్ అంటాడు.

మంచి గడియలకు టైమ్ ఉంది

చాల్లేండి వాళ్లను ఏడిపించింది. బుద్ధిగా పని చేసేవాళ్లను చేయనివ్వకుండా మధ్యలో వదిలేసేలా చేశారు అని అపర్ణ అంటుంది. తర్వాత మీరు మునిమనవరాలిని చూశారు. మీలాగే నా మనవరాలు కూడా తరాలు చూడాలి. మీరే ఊయలలో వేయాలి అని ఇందిరాదేవితో కనకం అంటుంది. అంతా అదే అంటారు. ఇందిరాదేవి పాపను ఊయలలో వేస్తుంటే.. ప్రకాశం ఆగమంటాడు. మంచి గడియలకు ఇంకా ఆరు సెకన్స్ ఉన్నాయి. కౌంట్ డౌన్ మొదలు పెడతామని ప్రకాశం అంటాడు.

తర్వాత ఊయలలో పాపను ఇందిరాదేవి పడుకోబెడుతుంది. ఆడవాళ్లందరు కలిసి ఊయల ఊపమని చెబుతుంది. అలాగే, చేస్తారు. ఇందిరాదేవి ఆశీర్వదిస్తుంది. ఇంతలో కారు సౌండ్ రావడంతో అంతా చూస్తారు. అందులోనుంచి అనామిక పేపర్స్ పట్టుకుని ఎంట్రీ ఇస్తుంది. ఆహా ఇప్పుడు కదా నాకు కలహా భోజనం దొరికేది. సరైన సమయానికి వచ్చిందని రుద్రాణి అనుకుంటుంది. ఈ మహాతల్లి ఏంటీ ఇప్పుడు వచ్చింది, ఎవరు పిలిచారు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

మీరంతా ఇలా సంతోషంగా ఉండటం కళ్లకు మంటగా ఉందని అనామిక అంటుంది. పిలవని పేరంటానికి నీలాంటి వాళ్లు, వీధి కుక్కలు ఇలాగే వస్తాయి అని కనకం అంటుంది. అమాయుకులను మేల్కొనేందుకు వచ్చాను. ఇక్కడ అంతా అమాయికులే. ఇద్దరు తప్పా. రాజ్, కావ్య. దుగ్గిరాల కుటుంబానికి ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా మీకు అని అనామిక అంటుంది. మా సంతోషాన్ని పాడుచేసే ఏ విషయం చెప్పడానికి నేను ఒప్పుకోను. మర్యాదగా వెళ్లు అని ఇందిరాదేవి అంటుంది.

ఛీ కొడతారని భయపడుతున్నావా

వెళ్లిపోమ్మని రాజ్, కావ్య, అప్పు అంటారు. వెళ్తావా, గెంటించమంటావా అని అప్పు అంటుంది. ఆగండి, ఎందుకు వెళ్లమంటున్నారు. అసలు ఏం చెప్పాలని వచ్చిందో చెప్పాక పంపించేద్దాం అని రుద్రాణి అంటుంది. ఈ ఇంట్లో మీరు, కావ్య కలిసి ఎంతపెద్ద రహాస్యం దాచిపెట్టారో, అందరి కళ్లకు ఎలా గంతలు కట్టారో చెప్పనివ్వండి అని అనామిక అంటుంది. నోర్మూసుకుని వెళ్తావా లేదా అని కావ్య అంటుంది. ఏ మీ ఆయనతో కలిసి ఇంత మోసం చేశావని తెలిస్తే నిన్ను ఛీ కొడతారని భయపడుతున్నావా అని అనామిక అంటుంది.

దాంతో కనకం ఫైర్ అవుతుంది. నేను చెప్పబోయే విషయం విన్నాక ఎవరు ఎవరిని ఛీ కొడతారో తేల్చుకోండి అని అనామిక అంటుంది. సరే ఇంత దూరం వచ్చిందిగా చెప్పనివ్వండి అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఈ ఇంట్లో ఆంక్షలు పెట్టారు కదా. చేతికి ఒక్క రూపాయి ఇవ్వట్లేదు కదా. రాజ్, కావ్య, కలిసి వంద కోట్లు అప్పు చేశారు. రూ. 100 కోట్లు కట్టాలని బ్యాంక్ వాళ్లు ఇచ్చిన నోటీస్ ఇది అని అందరికి చూపిస్తుంది అనామిక.

ఇలా పథకం వేశారా

అది చూసిన సుభాష్ నిజంగానే బ్యాంక్‌కు వంద కోట్లు కట్టాలి అని అంటాడు. వంద కోట్లు అప్పు చేయడం ఏంటీ. ఎందుకు అంత అప్పు చేయాల్సి వచ్చింది. నేను ఆస్తిలో వాటాలు అడగటం మొదలుపెట్టగానే ఎక్కడ పంచాల్సి వస్తుందో అని ముందే ఇలా పథకం వేశారా. ఏంటీ కారణం అని ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. చెప్పమని అపర్ణ కూడా ఆగ్రహంతో రగిలిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner