బ్రహ్మముడి ఆగస్టు 19 ఎపిసోడ్: రుద్రాణి ప్లాన్ సక్సెస్.. కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పేసిన కనకం.. థ్యాంక్స్ చెప్పిన యామిని-brahmamudi serial today episode august 19th 2025 kanakam reveals kavya pregnancy star maa serial brahma mudi jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్రహ్మముడి ఆగస్టు 19 ఎపిసోడ్: రుద్రాణి ప్లాన్ సక్సెస్.. కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పేసిన కనకం.. థ్యాంక్స్ చెప్పిన యామిని

బ్రహ్మముడి ఆగస్టు 19 ఎపిసోడ్: రుద్రాణి ప్లాన్ సక్సెస్.. కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పేసిన కనకం.. థ్యాంక్స్ చెప్పిన యామిని

Hari Prasad S HT Telugu

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఆగస్టు 19) ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం దుగ్గిరాల కుటుంబానికి తెలిసిపోతుంది. రుద్రాణి ప్లాన్ సక్సెస్ అవుతుంది. అటు రాజ్ ఆమెకు శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితి నెలకొంటుంది.

బ్రహ్మముడి ఆగస్టు 19 ఎపిసోడ్: రుద్రాణి ప్లాన్ సక్సెస్.. కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పేసిన కనకం.. థ్యాంక్స్ చెప్పిన యామిని

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 804వ ఎపిసోడ్ ఈ సీరియల్ ను కీలక మలుపు తిప్పింది. రుద్రాణి ప్లాన్ పూర్తిగా కాకపోయినా సగం సక్సెస్ అవుతుంది. దీంతో కావ్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఆమె తల్లి కనకం బయటపెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.

రాజ్‌ను మళ్లీ రిజెక్ట్ చేసిన కావ్య

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఆగస్టు 19) ఎపిసోడ్ రాజ్ మరోసారి తనను పెళ్లి చేసుకోవాలని కావ్యను అడిగే సీన్ తో మొదలవుతుంది. అయితే కావ్య మాత్రం మళ్లీ అలాగే కఠినంగా మాట్లాడుతుంది. మీరంటే నాకు ఇష్టం లేదని తేల్చి చెబుతుంది. ఒకవేళ పెళ్లి గురించే అడగాలని అనుకుంటే మళ్లీ ఈ ఇంటికి రావద్దని స్పష్టం చేస్తుంది. దీంతో రాజ్ బాధగా అక్కడి నుంచి స్వరాజ్ ను తీసుకొని వెళ్లిపోతాడు.

కళ్లు తిరిగి పడిపోయిన అప్పు

అటు వరలక్ష్మి వ్రతం సక్సెస్ కావడం, రాజ్ ద్వారానే కావ్యపై అక్షింతలు వేయించడంతో కనకం, అపర్ణ, ఇందిరాదేవి చాలా సంతోషంగా ఉంటారు. అదే సమయంలో అప్పూ కళ్లు తిరిగి పడిపోతుంది. తాము ఇచ్చిన ట్యాబ్లెట్ పని చేసిందని రుద్రాణి, రాహుల్ సంతోషపడతారు. అప్పూకి అలా జరగడంతో అందరూ కంగారు పడుతూ ఉంటారు. అటు కావ్య కూడా వచ్చి అప్పూకి ఏమైందని అడుగుతుంది.

అసలు విషయం చెప్పిన డాక్టర్

ఆ తర్వాత డాక్టర్ వచ్చి అప్పూని చూస్తుంది. కాసేపటికి ఆమె కోలుకుంటుంది. తనకు ఏం జరిగిందని అడుగుతుంది. ఫుడ్ పాయిజన్ వల్ల ఇలా జరిగిందని, ఏం తిన్నావని డాక్టర్ ఆమెను అడుగుతుంది. పూజ ఉందని ఉదయం ఇడ్లీ తప్ప ఏమీ తినలేదంటుంది. ఆ తర్వాత ఎప్పుడూ వేసుకునే ట్యాబ్లెట్ వేసుకున్నానంటూ పక్కనే ఉన్న ట్యాబ్లెట్ చూయిస్తుంది. అది చూసిన డాక్టర్ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని గుర్తించి అదే విషయం చెబుతుంది. ఫుడ్ పాయిజన్ కాదు.. దీనివల్ల ఇలా జరిగిందని అంటుంది.

చిచ్చుపెట్టిన రుద్రాణి.. కావ్యను నిందించిన ధాన్యం

డాక్టర్ బయటకు వచ్చి అదే విషయం ఇంట్లో వాళ్లకు కూడా చెబుతుంది. మూడో నెలతో ఉన్న అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎలా అని మందలించి వెళ్లిపోతుంది. దీంతో రుద్రాణి రంగంలోకి దిగుతుంది. చూసుకోకపోతే ఎలా కావ్య అని అంటుంది. ఉదయం నువ్వే కదా అప్పూకి ట్యాబ్లెట్ ఇచ్చింది అని అనడంతో ఇక ధాన్యలక్ష్మి కోపం కట్టలు తెంచుకుంటుంది.

అందరి ముండే కావ్యను నానా మాటలు అంటుంది. నీకు దక్కని అదృష్టం నీ చెల్లెలికి దక్కిందని అసూయతో ఇలా చేశావా అని నిలదీస్తుంది. నీ కంటే ముందే స్వప్న, అప్పూ ప్రెగ్నెంట్ కావడం వల్లే కావాలనే చేశావని నిందిస్తుంది. నువ్వు గొడ్రాలుగా మిగిలిపోయావని, నీ చెల్లినీ అలాగే చేద్దామనుకున్నావా అని అంటుంది.

కావ్యకు అపర్ణ, కల్యాణ్ సపోర్ట్

తాను అలా ఎందుకు చేస్తానని కావ్య అంటున్నా.. ఆమెకు సపోర్ట్ గా ఇందిరా దేవి, అపర్ణ, కల్యాణ్ మాట్లాడినా ధాన్యలక్ష్మి మాత్రం ఎవరి మాటా వినదు. తన చెల్లిపై ఈర్శ్యతోనే ఇలా చేసిందని ధాన్యం నానా మాటలు అంటూనే ఉంటుంది. అపర్ణ జోక్యం చేసుకుంటూ అసలు విషయం చెప్పబోగా.. కావ్య అడ్డుకుంటుంది. దీంతో ఆమె ఏమీ చెప్పదు.

జాగ్రత్తగా ఉండటం తెలియదా.. మెడికల్ షాపు వాడు తప్పు ఇచ్చినా మనం చూసుకోవాలి కదా.. రాజ్ తో పిల్లల్ని కనలేక ఇప్పుడు అప్పూ ప్రెగ్నెంట్ అయితే చూస్తూ ఊరుకోలేకపోయింది.. ఆమెకు దక్కిన అదృష్టం తనకు దక్కలేదని తన తల్లితో చెప్పింది.. దీనికి అర్థమేంటి.. ఆమె అసూయతో రగిలిపోతుంది కదా అని ధాన్యం అనడంతో కావ్య కంటతడి పెడుతూ వెళ్లిపోతుంది. అయినా ఆమె మాత్రం నానా మాటలు అంటూనే ఉంటుంది.

కావ్యతో కడుపుతో ఉన్న విషయం చెప్పిన కనకం

ఇక తట్టుకోలేక కనకం రంగంలోకి దిగుతుంది. ఇక చాలు ఆపు అంటూ ధాన్యలక్ష్మిపై తీవ్రంగా మండిపడుతుంది. కావ్య మూడు నెలల కడుపుతో ఉన్న విషయం మొత్తం దుగ్గిరాల కుటుంబానికి చెప్పేస్తుంది. అప్పూ కంటే ముందే కావ్య నెల తప్పిందని, ఈ విషయం చెబితే రాజ్ కు గతం గురించి తెలుస్తుందని, అలా జరిగితే అతనికి ఏం జరుగుతుందో అన్న భయంతో అసలు విషయం దాచిందని కనకం అంటుంది.

కావాలంటే మీ అక్క, మీ అత్తయ్యలను అడుగమని ధాన్యానికి చెబుతుంది. ఈ ఇంటి కోసం, మీ కోసం ఇంత చేస్తున్న కావ్యను ఏమైనా అంటే ఊరుకునేది లేదని ధాన్యలక్ష్మికి గట్టి వార్నింగే ఇస్తుంది. ఇన్నాళ్లూ మీరు దాచి పెట్టిన విషయాన్ని చెప్పినందుకు క్షమించండి అని అపర్ణ, ఇందిరలకు చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తప్పు తెలుసుకున్న ధాన్యలక్ష్మి

దీంతో ప్రకాశ్ మండిపడుతూ ధాన్యలక్ష్మిపై మండిపడతాడు. ఇప్పటికైనా అసలు విషయం తెలుసుకున్నావు కదా.. చాలా పెద్ద తప్పు చేశావని అంటాడు. దీంతో ధాన్యలక్ష్మి కూడా తాను చాలా పెద్ద తప్పు చేశానని బాధపడుతుంది. ఈ విషయం తెలియక కావ్యను నానా మాటలు అన్నాను.. ఆమెతో మాట్లాడానంటూ వెళ్లిపోతుంది. తన ప్లాన్ సగమే సక్సెస్ అయిందని, రాజ్ ముందు ఈ గొడవ జరిగి ఉంటే బాగుండేదని రాహుల్ తో రుద్రాణి అంటుంది.

అసలు ఈ ధాన్యలక్ష్మి ఆ కావ్యతో ఏం మాట్లాడుతుందో విందామంటూ వెళ్తుంది. అక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ ప్రోమోలో అటు రాజ్ అమెరికా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న విషయాన్ని ఇంట్లో వాళ్లకు రుద్రాణి చెబుతుంది. అతన్ని నువ్వు మాత్రమే ఆపగలవని కావ్యతో అంటారు అపర్ణ, ఇందిరాదేవి. తన బావను తనకు నువ్వే దగ్గర చేశావని, థ్యాంక్స్ అంటూ కావ్యకు ఫోన్ చేస్తుంది యామని.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం