బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో వరలక్ష్మీ వ్రతానికి కావ్య ఎర్ర చీర కట్టుకుని రెడీ అయి వస్తుంది. కావ్యను చూసి రాజ్ ఫిదా అవుతాడు. మిమ్మల్ని చూస్తుంటే ఆ అమ్మవారికే పూజ చేయడానికి వచ్చిన దేవకన్యలా ఉన్నారు అని రాజ్ అంటాడు.
మా కళ్లముందే కావ్యకు పబ్లిక్‌గా సైట్ కొడుతున్నావ్ అని స్వప్న అంటుంది. వ్రతం అన్నారు మీకేం పని లేదా అని రాజ్ అంటాడు. దాంతో అర్థమైందని అంతా వెళ్లిపోతారు. మీరు చాలా అందంగా ఉన్నారని కావ్యకు రాజ్ చెబుతాడు. మీరెందుకు వచ్చారని కావ్య అంటే.. నాకోసం మావయ్య వచ్చాడని, కావాలంటే చెప్పండి ఇద్దరం వెళ్లిపోతామని స్వరాజ్ అంటాడు.
వెళ్లిపోమ్మని కావ్య అంటుంది. అయితే, ఆరోజు గుడిలో నువ్ నేను తప్పిపోయినట్లు నటించడానికి చాక్లెట్ ఇచ్చావుగా. అది నా ఫ్రెండ్‌తో చెబితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నా అని స్వరాజ్ అంటే.. వేలడంతా లేవు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని కావ్య అంటుంది. నిజాలు తెలిస్తే చాలుగా. మా ఇద్దరిని ఇక్కడే ఉండమని అడగండి అని స్వరాజ్ అంటాడు.
మహానుభావ ఇద్దరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి వెళ్లిపోతుంది కావ్య. ఆ మాటలు రుద్రాణి వింటుంది. రాజ్‌తో కావ్యకు అక్షింతలు వేసేలా మా అమ్మ భలే ప్లానే చేసింది. కావ్య కడుపుతో ఉందని ఇదే వ్రతంలో తెలిసేలా చేస్తాను, అందరూ కలిసి మోసం చేశారనుకునేలా చేసి కావ్యను ఛీ కొట్టి వెళ్లిపోయేలా చేస్తాను అని రుద్రాణి అంటుంది. కావ్య దగ్గరికి వెళ్లి తన దగ్గర ట్యాబ్లెట్స్ అయిపోయాయి. నీ దగ్గర ఉన్నాయా అని అడుగుతుంది.
అంత గట్టిగా అరుస్తావేంటీ. మెల్లిగా అడుగు. ఎవరికి కనిపించకుండా తీసుకెళ్లు అని కావ్య చెబుతుంది. ఇంతలో కనకం వస్తే ఏంటమ్మా అలా చూస్తున్నావ్ అని అడుగుతుంది. కనకం, కావ్య మాట్లాడుకునేది రుద్రాణి వింటుంది. వెంటనే ధాన్యలక్ష్మీని తీసుకురావాలి అని వెళ్తుంది. నీకో నిజం చూపించాలి అని ధాన్యంకు చెప్పి తీసుకొస్తుంది రుద్రాణి.
అప్పును చూస్తే సంతోషంగా ఉంది. నిన్ను చూస్తే బాధగా ఉందని కనకం అంటుంది. అప్పు చాలా అదృష్టవంతురాలు. నేనే దురదుష్టవంతురాలిని అని కావ్య అంటుంది. ఆ మాటలు ధాన్యలక్ష్మీ వింటుంది. చూశావా అప్పుకున్న అదృష్టం తనకు లేదని అసూయపడినట్లు లేదు. జాగ్రత్తగా ఉండు ధాన్యం అని ఫిట్టింగ్ పెట్టి వెళ్లిపోతుంది రుద్రాణి. దాంతో ధాన్యలక్ష్మీ ఆలోచనలో పడుతుంది.
స్వరాజ్, బావకు ఈ బట్టలు ఇచ్చి రెడీ అవ్వమని చెప్పు అని కల్యాణ్‌ను పంపిస్తుంది అప్పు. కల్యాణ్ వెళ్లి బట్టలు ఇస్తాడు. రాజ్ వేసుకునేందుకు వెళ్తాడు. మరోవైపు అప్పుకు కావ్య ఓ ట్లాబ్లెట్ ఇచ్చింది. దాని ప్లేసులో అచ్చం అలాంటిదే వేరేది పెట్టు. కావ్య ఈర్శ్యతోనే అప్పు కడుపు పోయేలా చేసిందని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో కావ్య తను కడుపుతో ఉన్నట్లు ఒప్పుకుంటుంది అని కన్నింగ్ స్కెచ్ వేస్తుంది రుద్రాణి.
మరోవైపు ఇందిరాదేవిని చాక్లెట్ కోసం బ్లాక్ మెయిల్ చేస్తాడు స్వరాజ్. దాంతో చాక్లెట్ కోసం ఇందిరాదేవి ఒక్కొక్కరిని అడిగి అవస్థలు పడుతుంది. ఇంతలో అపర్ణ ఇచ్చిన చాక్లెట్‌ను స్వరాజ్ తింటూ ఉంటాడు. అప్పును తినమంటుంది ధాన్యలక్ష్మీ. టాబ్లెట్స్ తీసుకురావడానికి ధాన్యలక్ష్మ వెళ్తుంది. ఇంతలోనే టాబ్లెట్స్ మార్చేయ్ అని రాహుల్‌ను పంపిస్తుంది రుద్రాణి.
ఒరిజినల్ టాబ్లెట్స్ పట్టుకుని రాహుల్ బయటకొచ్చేస్తాడు. ధాన్యలక్ష్మీ వెళ్తుంది. అక్కడ మూడు టాబ్లెట్ పాకెట్స్ ఉంటే ఒకటి తీసుకొచ్చి అప్పుకు ఇస్తుంది. అప్పు ఆ టాబ్లెట్ వేసుకుంటుంది. ప్లాన్ సక్సెస్ అని రుద్రాణి, రాహుల్ అనుకుంటారు. రాజ్‌ను పంచెకట్టులో చూసి కావ్య ఫిదా అవుతుంది. అలాగే చూస్తుండిపోతుంది. నాకు రోజు ఇంటికి ప్రతిసారి వెళ్లాలని లేదు. మీ పక్కనే రోజు ఇక్కడే ఉండిపోవాలని ఉందని రాజ్ అంటాడు.
ఉండిపోండి. మీరందరు ఫ్యామిలీతో కలిసి పోయారుగా. ఇంట్లోవాళ్లు మిమ్మల్ని దత్తత తీసుకుంటారుగా. అధికారికంగా దత్తత తీసుకున్నాకా అలాగే ఉండిపోండి అని కావ్య అంటుంది. కావ్య, అప్పు, స్వప్న ముగ్గురు పూలదండలు కుడుతుంటారు. వ్రతం జరుగుతుంది. కావ్యపై రాజ్ అక్షింతలు వేసి ఆశీర్వదించేలా కనకం చేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్