రాజ్ ఇంటికి రావడంతో కావ్య, అపర్ణతో పాటు అప్పు కంగారు పడతారు. రుద్రాణితో పాటు ఇతర కుటుంబసభ్యుల కంట రాజ్ పడకుండా ఉండటానికి నానా తంటాలు పడతారు. అపర్ణ కంగారు చూసి రుద్రాణి అనుమానపడుతుంది. అసలు మీరిద్దరు ఎందుకు కంగారు పడుతున్నారు అని ఇందిరాదేవి నిలదీస్తుంది. కంగారు ఎందుకు? ఎవరిని చూసి కంగారు పడాలి అని అపర్ణ తడబడుతూ అత్తయ్యకు సమాధానమిస్తుంది.
కావ్య, రాజ్...హాల్‌లో కనిపించకపోవడంతో వారిద్దరు ఎక్కడికి వెళ్లారని అప్పు, అపర్ణ టెన్షన్ పడుతుంటారు. అప్పును అపర్ణ ఫాలో కావడం చూసి ఏదో గూడుపుఠాణి చేస్తున్నారని రుద్రాణి డౌట్ పడుతుంది. ఎవరి కంట పడకుండా రాజ్‌ను తెలివిగా ఇంటి నుంచి పంపించేయాలని కావ్య అనుకుంటుంది. రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోతుండగా అతడికి ఎదురుగా సుభాష్ వస్తాడు. రాజ్‌ను చూసి సుభాష్ షాకవుతాడు.
రాజ్ ఇంటికి రాలేదని తెలిసి యామిని టెన్షన్ పడుతుంది. గతం మర్చిపోయిన మనిషి ఇంతసేపైనా ఇంటికి రాకపోతే కనీసం నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా... ఎక్కడున్నాడో ఏంటో అని తల్లిదండ్రులపై కోప్పడుతుంది యామిని. రాజ్ కారులో అమర్చిన జీపీఎస్ ద్వారా అతడు ఉన్న లోకేషన్‌ను చూసి షాకవుతుంది.
అంత అయిపోయిందని, నేను ఏదైతే జరగ్గకూడదని అనుకున్నానో అదే జరిగిందని అంటుంది. రాజ్ సొంత ఇంటికి వెళ్లాడని కంగారుగా చెబుతుంది. దుగ్గిరాల నిలయానికి వెళ్లాడని అంటుంది. రామ్‌కు రాజ్ అన్న విషయం తెలిసిందా? అని యామిని తల్లిదండ్రులు కంగారు పడతారు.
తన కొడుకును రాజ్ అని పిలవబోతాడు సుభాష్. అతడి మాటలను కావ్య అడ్డుకుంటుంది. నాకు ఈ మధ్య పరిచయమైన స్నేహితుడు రామ్ అని రాజ్‌ను సుభాష్‌కు పరిచయం చేస్తుంది. రామ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావని సుభాష్ అంటాడు. మీ మావయ్య గారి గురించి నాకు ఎప్పుడు చెప్పలేదని కావ్యను అడుగుతాడు రాజ్. తర్వాత చెబుతానని కావ్య అంటుంది. రాజ్‌ను అక్కడి నుంచి పంపించేస్తుంది
ఆ తర్వాత సుభాష్‌కు కావ్య, అప్పు, అపర్ణ కలిగి జరిగింది చెబుతారు. సుభాష్‌కు క్షమాపణలు చెబుతుంది కావ్య. నువ్వేం తప్పు చేయలేదని సుభాష్ అంటాడు. నా వెనుక ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట చెప్పాలని అనిపించలేదా అని ఎమోషనల్ అవుతాడు సుభాష్. ఇన్ని రోజులు రాజ్ బతికున్నాడో లేదో తెలియక నాలో నేనే నరకం అనుభవించానని, రాజ్ జ్ఞాపకాలతో నిద్రపట్టక రాత్రంతా ఏడుస్తూ నీ కళ్ల ముందేఉన్నానని, అప్పుడు కూడా నువ్వు నిజం చెప్పలేకపోయావా భార్యగా అడుగుతాడు అపర్ణ.
నీ కొడుకు విషయంలో నేను కూడా పరాయివాడినే అయిపోయానా అని నిలదీస్తాడు.
ఇందులో అత్తయ్య తప్పేం లేదని, రాజ్ బతికి ఉన్నాడనే విషయం ఎవరికి చెప్పొద్దని అత్తయ్య దగ్గర మాట తీసుకున్నానని కావ్య అంటుంది. చెప్పడం ఇష్టం లేకకాదు..చెప్పే ధైర్యం లేక చెప్పలేదని సుభాష్‌తో కావ్య అంటుంది.
రాజ్ కన్నతండ్రిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడని సుభాష్‌తో చెబుతుంది కావ్య. ఇలాంటి పరిస్థిత్లుల్లో రాజ్‌కు గతం గుర్తుచేయాలని ప్రయత్నిస్తే అతడి ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పిన సంగతి సుభాష్‌కు చెబుతుంది కావ్య. కన్న కొడుకు ప్రాణాలతో ఉన్నా ప్రేమగా మాట్లాడాలేని పరిస్థితి మనకు వచ్చిందని, ఇలాంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని అపర్ణ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
రాజ్ బతికే ఉన్నాడని చాలా సార్లు మీకు చెప్పానని కానీ మీరే నమ్మలేదని సుభాష్‌తో అంటుంది కావ్య.
ఎలా నమ్మమంటావు అని కావ్య నిలదీస్తాడు సుభాష్. యాక్సిడెంట్ అయ్యాక దొరికిన ప్రతి ఆధారం రాజ్ చనిపోయాడని చెప్పాయి...వాడి మీద ఉన్న ప్రేమ, బతికే ఉన్నాడన్న గుడ్డి నమ్మకంతో నువ్వు అలా ప్రవర్తించావని అనుకున్నామని, నీ మాటలు ఎలా నమ్మాలని కావ్యపై ఫైర్ అవుతాడు సుభాష్.
ఇన్ని రోజులు ఓపిక పట్టారు కదా...ఇంకా కొన్ని రోజులు ఓపిక పడితే రాజ్‌కు గతం గుర్తుకు వస్తుందని సుభాష్‌కు బదులిస్తుంది కావ్య. ఓ తండ్రిగా మీ ఆవేదనలో అర్థం ఉందని అంటుంది.
రాజ్‌కు గతం గుర్తుకురాకపోతే అని సుభాష్ అనుమానం వ్యక్తం చేస్తుంది. రాజ్‌కు గతం గుర్తొస్తుంది, తిరిగివస్తాడని అపర్ణ అంటుంది. గతం మర్చిపోయినా కావ్య కోసం తపనపడుతున్నాడని, కావ్య అడ్రెస్ తికమకగా చెప్పిన సరాసరి ఇంటికి వచ్చాడని అపర్ణ అంటుంది. కొద్ది రోజులు ఓపిక పడితే రాజ్ తిరిగి వస్తాడనే నమ్మకముందని కావ్యకు సపోర్ట్ చేస్తుంది అపర్ణ. రాజ్ నవ్వుతూ వచ్చి నన్ను నాన్న అని పిలిచే వరకు ఆశగా ఎదురుచూస్తుంటానని సుభాష్ అంటాడు.
నాకు రామ్ కావాలని తల్లిదండ్రులతో గొడవపడుతుంది యామిని. అప్పుడే రాజ్ ఇంటికొస్తాడు. సొంత ఇంటికి వెళ్లిన తిరిగి వచ్చాడంటే అతడికి గతం గుర్తుకురాలేదని వైదేహి అంటుంది. ఏం తెలియనట్లుగా రామ్ ముందు నటిస్తారు ముగ్గురు. చాలా లేటయినట్లుందని రాజ్‌ను అడుగుతుంది యామిని. ఓ ఫ్రెండ్‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లానని రాజ్ అబద్ధం ఆడుతాడు.
రామ్ తనకు అబద్ధం చెప్పాడని, వాళ్ల ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను కలిసి కలిసి వచ్చాడని తల్లిదండ్రులతో చెబుతుంది యామిని. కానీ అతడికి గతం గుర్తుకురాలేదని యామిని చెబుతుంది. కావ్య వల్లే ఇదంతా జరిగిందని, కావ్య, రాజ్ ఫ్రెండ్స్‌గా చాలా క్లోజ్ అయ్యారని యామిని అంటుంది.
వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేద్దామని యామిని అంటుంది. భార్యాభర్తలను విడదీయడం పాపమని యామిని ఆమె తండ్రి సర్ధిచెప్పబోతాడు. ఏది రాంగ్, ఏది రైట్ ఆలోచించే టైమ్ నాకు లేదని, నేను హ్యాపీగా ఉండటం మీకు ఇష్టమైతే ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడమని తల్లిదండ్రులకు ఆర్డర్ వేస్తుంది యామిని.
కావ్యను రాజ్ కలవకుండా కొత్త ప్లాన్ వేస్తుంది. పెళ్లి పనుల పేరుతో రాజ్‌ను తనతో పాటు ఉండేలా చూసుకుంటానని తల్లిదండ్రులతో యామిని చెబుతుంది. పెళ్లి పనులన్నీ రాజ్‌తోనే చేయిస్తానని అంటుంది. రాజ్ తెచ్చిన చీరను కట్టుకుంటుంది కావ్య. ఆ చీరను చూసి మురిసిపోతుంది. రాజ్ ఫొటో ఉండటంతో...మీరు తెచ్చిన చీరనే...ఎలా ఉంది బాగుంది కదా అని అడుగుతుంది.
గతం మర్చిపోయినా నాకు నచ్చిన కలర్ గుర్తుపెట్టుకున్నారని కావ్య సంబరపడుతుంది. నేను రాజ్ గురించి ఆలోచిస్తున్నట్లు...ఆయన కూడా నా గురించి ఆలోచిస్తుంటారా అని కావ్య అనుకుంటుంది.అప్పుడే రాజ్ నుంచి ఫోన్ వస్తుంది.
నిద్రపట్టడం లేదని, నా మనసు బాగాలేదని రాజ్ అంటాడు. మీ మనసుకు ఏమైందని కావ్య అడుగుతుంది. రాజ్, కావ్య సరదాగా మాట్లాడుకోవడం యామిని చూస్తుంది. ఎంత ధైర్యం ఉంటే నా బావను నాకు కాకుండా చేయాలని చూస్తావని కావ్యను వార్నింగ్ ఇస్తుంది యామిని.
బావ ఎలా అయ్యాడు అని రివర్స్ కౌంటర్ ఇస్తుంది కావ్య. నా భర్తను లాక్కుంది నువ్వు అని యామినిపై ఫైర్ అవుతుంది. రాజ్ మనసులో ఇంకా నేను ఉన్నానని యామినితో అంటుంది కావ్య. రాజ్‌కు పెళ్లాం ఎవరు అవుతారో త్వరలోనే చూసుకుందా అని యామిని అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం