రమ్మని పిలవకుండానే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా అని ఫోన్ చేసి కావ్యను అడుగుతాడు రాజ్. మా ఇంటికి వస్తానని, సర్‌ప్రైజ్ ఇస్తానని మీరే చెప్పారు కదా అని కావ్య బదులిస్తుంది. అందులో మీ పొరపాటు ఏం లేదని అంటుంది. నేను ఇంట్లో అడుగుపెట్టగానే మీరు కంగారు పడటం గమనించాడు. తడబడటం చూశానని రాజ్ అంటాడు. మీరు ఉన్నంత సేపు చాలా సంతోషంగా ఉన్నానని కావ్య అంటుంది. మనసులో మాత్రం మీరు ఇక్కడే ఉండిపోతే బాగుండునని అనిపించిందని కావ్య అనుకుంటుంది.
మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నేను రావడం, అంతసేపు ఉండటం కరెక్ట్ కాదని రాజ్ అంటాడు. మీ మావయ్య ఏమైనా అన్నాడా అని కావ్యను అడుగుతాడు రాజ్. మిమ్మల్ని చూడగానే మా మావయ్య చాలా సంతోషపడ్డాడని కావ్య పొరపాటుగా నోరుజారుతుంది. సంతోషపడటం ఏంటి అని రాజ్ అడుగుతాడు.
మిమ్మల్ని చూడగానే చాలా మంచి అభిప్రాయం కలిగిందట అని కావ్య తడబడుతూ బదులిస్తుంది. మంచితనం నా బ్లడ్‌లోనే ఉందని, నన్ను చూడగానే ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందేనని రాజ్ సమాధానమిస్తాడు. అందుకే కదా యామిని ఇంత దారుణానికి ఒడిగట్టిందని మనసులో కావ్య అనుకుంటుంది.
రాజ్‌తో మాట్లాడుతుండటా అతడు కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లు, తనకు ముద్దుపెట్టినట్లు కావ్య కల కంటుంది. రాజ్ తనకు లిప్‌లాప్ ఇవ్వడానికి వస్తున్నట్లు కావ్య కల కంటుంది. కళ్లు తెరిచి చూడగానే రాజ్ కనిపించడు. తనకు వచ్చిన కలను తల్చుకొని కావ్య సిగ్గుపడుతుంది.
కిచెన్‌లో కాఫీ పెడుతున్న కావ్యకు క్లాస్ ఇస్తుంది అపర్ణ. కాఫీలు, టీలు అందరికి ఇవ్వు...ఇళ్లంతా మాఫ్ కొట్టి, బట్టలు కూడా ఉతికేయ్...ఇంకా టైమ్ ఉంటే వాటిని మరతపెట్టు అని కావ్యను దులిపేస్తుంది అపర్ణ. నేను ఏమైనా తప్పు చేశానా అని అపర్ణను అడుగుతుంది కావ్య. నువ్వు చేయాల్సిన పనులు పక్కనపెట్టి పని మనుషులు చేయాల్సిన పనులు చేస్తున్నావని ఫైర్ అవుతుంది.
రాజ్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూ గతం గుర్తుచేకుండా....ఈ ఇంటి పనులు, వంట పనులు ఏంటి? కావ్యపై విరుచుకుపడుతుంది అపర్ణ. రాజ్‌ను వెంటనే మన ఇంటికి తీసుకొచ్చేయాలనుందని కావ్య అంటుంది. కానీ ఇప్పుడు ఆయన మీ కొడుకు రాజ్ కాదని, మరో ఇంటికి కాబోయే అల్లుడు అని అంటుంది. అంటే వాళ్ల పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపిస్తావా అని కావ్యను నిలదీస్తుంది అపర్ణ.
ఏ కారణం చెప్పి రాజ్‌తో మాట్లాడాలి. ఏం చెప్పి ఆయన్ని కలవాలో తెలియక ఇలా ఉన్నానని కావ్య అంటుంది. నన్ను ఏం చేయమంటారని అంటుంది. అంత నా ఖర్మ నా కొడుకుకు సైట్ కొట్టమని నేను చెప్పాల్సివస్తుందని అపర్ణ అంటుంది. నీ కొడుకుకు సైట్ కొట్టమని పరాయివాళ్లకు చెప్పడం లేదు కదా..కోడలికే చెబుతున్నారు కదా అని కావ్య అంటుంది.
నిన్ను నీకు చీర గిఫ్ట్‌గా ఇచ్చాడు కదా. ఆ చీర బాగుందని చెప్పడానికి నేరుగా రాజ్‌ను కలవమని సలహా ఇస్తుంది. వెంటనే ఫోన్ చేసి ఎక్కడున్నాడో తెలుసుకొని వెంటనే కలవమని అంటుంది. కట్టుకున్న భర్తను మామూలు మనిషిని చేయడం నీ బాధ్యతేనని కావ్యతో అంటుంది అపర్ణ.
కావ్యను రాజ్ కలవకుండా ప్లాన్ చేస్తుంది యామిని. రాజ్‌ను తనతో పాటుబయటకు తీసుకెళ్లాలని అనుకుంటుంది. రాజ్ కోసం ఉదయమే రెడీ అయ్యి ఎదురుచూస్తుంది.యామినితో కలిసి రాజ్ వెళ్లబోతాడు. అప్పుడే రాజ్‌కు కావ్య ఫోన్ చేస్తుంది. మిమ్మల్ని ఒకసారి ఇప్పుడే అర్జెంట్‌గా కలవాలని రాజ్‌ను అడుగుతుంది కావ్య. వస్తానని కావ్యకు మాటిస్తాడు రాజ్.
ఫ్రెండ్ కాల్ చేశాడు..అర్జెంట్ అంటున్నాడని, మనం ఇంకోసారి వెళదామని యామిని తో అంటాడు రాజ్. మనది ఇంపార్టెంట్ వర్క్ అని యామిని చెబుతున్నా రాజ్ వినిపించుకోడు. వెళ్లితీరాల్సిందే.. కాస్త అర్థం చేసుకోమని చెబుతాడు. నీ టెన్షన్ చూస్తుంటే ఎంతో ఇంపార్టెంట్ వర్క్‌లా ఉందని వెళ్లమని రాజ్‌తో అంటుంది యామిని.
రామ్‌ను రోజంతా నీతోనే ఉంచుకోవాలనుకునే ప్లాన్ ఫెయిలైందేంటి...రామ్ నిన్ను అలా వదిలేసి వెళ్లిపోయాడేంటి వైదేహి అంటుంది. రామ్ నన్ను వదిలేసినా...అతడి చిటికెన వేలు పట్టుకొని ఏడు అడుగులు వేసేవరకు వదిలిపెట్టనని యామిని అంటుంది.
కావ్యను కలుస్తాడు రాజ్. ఏంటి అర్జెంట్‌గా కలవాలని అన్నారు...మీ కోసం ఏది అడిగినా చేస్తానని అంటాడు. ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా నమ్మేది మిమ్మల్నే అని అంటాడు. ఒక వేళ నేను తప్పు చేస్తే అని కావ్య అంటుంది. సరిచేస్తానని రాజ్ బదులిస్తాడు. గొడవ చేస్తే అని కావ్య అనగా...సపోర్ట్ చేస్తానని అంటాడు. నేను మర్డర్ చేస్తే అని కావ్య అనగానే...సాయం చేస్తానని నోరు జారుతాడు రాజ్. వాట్ అని షాకయిపోతాడు. మాటల్లో పెట్టి మీరు మర్డర్ చేయించగలరని, ఒక్క సెకండ్ గుండె ఆగిపోయిందని రాజ్ అంటాడు.
నిన్ను మీరు ఇచ్చిన చీర బాగుందని రాజ్‌తో అంటుంది కావ్య. మీరు ఫోర్జరీ చేసిన సంతకం వల్ల సక్సెస్‌ఫుల్ కాంట్రాక్ట్ పూర్తిచేశానని, నాకు ప్రమోషన్ వచ్చిందని కావ్య అబద్ధం ఆడుతుంది. రాజ్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. కావ్య సిగ్గుపడుతూ థాంక్యూ అని తన చేయి ముందుకు చాస్తుంది.
ప్రమోషన్ పార్టీని కాఫీతోనే సరిపెట్టడం భావ్యం కాదని కావ్యతో అంటాడు రాజ్. పెద్ద పార్టీ కావాలని అంటాడు. అంగే మిమ్మల్ని పబ్బుకు తీసుకెళ్లి మీతో డ్యాన్స్ చేయాలా అని కావ్య అంటుంది. అడిగితే మాత్రం మీరు పబ్‌కు వస్తారా అని రాజ్ బదులిస్తాడు. అడిగిచూడండి వస్తాను లేదో తెలుస్తుందని కావ్య బదులిస్తుంది.
రాజ్, కావ్య మాట్లాడుకోవడం చాటు నుంచి చూస్తుంది యామిని. రాజ్ వెళ్లిపోగానే కావ్యకు వార్నింగ్ ఇవ్వడానికి ఆమెకు ఎదురుగా వస్తుంది యామిని. ఎంత ధైర్యం ఉంటే నా బావను నాకు కాకుండా చేయాలని చూస్తావని కావ్యకు వార్నింగ్ ఇస్తుంది యామింది బావ ఎలా అయ్యాడు.
నువ్వు నాటకాలు ఆడుతూ అదే నిజమని భ్రమపడుతున్నావని యామిని వార్నింగ్‌ను తేలిగ్గా తీసుకుంటుంది కావ్య. నాటకాలు ఆడుతుంది, మోసం చేస్తుంది నువ్వు. నా భర్తను లాక్కుంది నువ్వు అని యామినిపై ఫైర్ అవుతుంది.
నీ కంటే ముందే రాజ్ జీవితంలోకి నేను వచ్చానని, అతడితో కలిసి ఏడు అడుగులు వేయాలని అనుకున్నానని యామిని వాదిస్తుంది. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా రాజ్‌ను ప్రేమించి ఉంటే...నీ ప్రేమలో నిజాయితీ ఉంటే రాజ్ నీకే దక్కేవాడు. నీ మొండితనం, మూర్ఖత్వం వల్లే రాజ్ నీకు దూరమయ్యాడని యామినికి బదులిస్తుంది కావ్య.
ఇప్పుడు రాజ్ నావైపు ఉన్నాడని యామిని అంటుంది. నేను చెప్పే కట్టుకథల్లో కథానాయకుడిగా మారాడని యామిని అంటుంది. అదే నిజమైతే నీతో ఉండాల్సిన మనిషి నాతో ఎందుకు ఉన్నాడు...నిన్ను కాదని నాతో ఎందుకు తిరుగుతున్నాడు. కొద్ది రోజుల్లో నిన్ను పెళ్లిచేసుకోవాల్సిన మనిషి నాతో మాట్లాడటానికి ఎందుకు పరితపిస్తున్నాడని కావ్య అంటుంది. ఆమె మాటలతో యామిని షాకవుతుంది.
కావాలనే రాజ్‌కు నువ్వు దగ్గరయ్యావు. గతంలో నీకు తనకు పరిచయం ఉందని నమ్మించేలా చేశాడు. నీ ఇంటికి వచ్చేలా చేశావు. చీరను గిఫ్ట్‌గా ఇచ్చే స్థాయికి రాజ్‌ను మార్చేశావని కావ్యపై ఫైర్ అవుతుంది యామిని. జీవితంలో ప్రతిది ప్లాన్ చేసి, మోసం చేసి దక్కించుకోవాలని చూస్తావు. అందరూ అలాగే చేస్తారని భ్రమపడుతున్నావని యామిని క్లాస్ ఇస్తుంది కావ్య.
రాజ్ గతం మర్చిపోయినా, అతడిని మోసం చేసి నువ్వు దూరంగా తీసుకెళ్లినా... రోడ్డున పడి ఉన్న నన్ను రాజ్ స్వయంగా హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. నన్ను చూసిన ఆ క్షణం నుంచే నా గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. నన్ను కలవాలని తపించారు. నేను అడ్రెస్ చెప్పకపోయినా నా ఇంటికి వచ్చారు. సారీ...తన పుట్టింటికి వచ్చారని కావ్య అంటుంది.
రాజ్ బతికే ఉన్న సంగతి సీతారామయ్య, ఇందిరాదేవిలకు చెబుతాడు కళ్యాణ్. ఇప్పుడే రాజ్‌ను ఇంటికి తీసుకొద్దామని సీతారామయ్య అంటాడు. రాజ్ తాను తీసుకొస్తానని సీతారామయ్యకు మాటిస్తుంది కావ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం