బ్రహ్మముడి ఏప్రిల్ 28 ఎపిసోడ్: కావ్యకు రాజ్ ఎంగిలి- గొడవ పెట్టిన అపర్ణ- అత్తను లెక్కచేయని ధాన్యం- కావ్య, యామిని సవాల్!-brahmamudi serial today episode 28th april 2025 kavya yamini challenge for raj star maa brahma mudi disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్రహ్మముడి ఏప్రిల్ 28 ఎపిసోడ్: కావ్యకు రాజ్ ఎంగిలి- గొడవ పెట్టిన అపర్ణ- అత్తను లెక్కచేయని ధాన్యం- కావ్య, యామిని సవాల్!

బ్రహ్మముడి ఏప్రిల్ 28 ఎపిసోడ్: కావ్యకు రాజ్ ఎంగిలి- గొడవ పెట్టిన అపర్ణ- అత్తను లెక్కచేయని ధాన్యం- కావ్య, యామిని సవాల్!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి ఏప్రిల్ 28 ఎపిసోడ్‌లో రాజ్‌ ఇంట్లోవాళ్లకు ఎదురుపడకుండా ఉండేందుకు అపర్ణ, కావ్య, అప్పు తంటాలు పడుతుంటారు. కావ్యకు తాను ఎంగిలి చేసిన జ్యూస్ రాజ్ ఇస్తే కళావతి తాగుతుంది. ప్రకాశంతో గొడవ పడుతున్న ధాన్యలక్ష్మీ అత్త ఇందిరాదేవి మాటను లెక్కచేయదు. రాజ్‌తో కావ్యను చూసిన యామిని కోపంతో రగిలిపోతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ ఏప్రిల్ 28వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యతో తన ఇంటికి రావడం గురించి రాజ్ చెబుతాడు. ఈ ఇంటితో నాకు ఏదో బంధం ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకేనేమో నా సిక్త్ సెన్స్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అయినా ఇదేంటండి ఇంటికి వచ్చిన గెస్ట్‌ను గుమ్మం దగ్గరే నిలబెట్టి మాట్లాడుతున్నారు అని రాజ్ అంటాడు.

కాఫీ కూడా ఇవ్వరా

దాంతో ఇంట్లోకి పిలుస్తుంది కావ్య. ఇల్లు చాలా బాగుందని రాజ్ అంటే.. మా తాతయ్య గారు ఇష్టపడి కట్టుకున్నారని కావ్య అంటుంది. ఇది తీసుకోండి. ఒక చిన్న గిఫ్ట్ అని రాజ్ అంటాడు. హో ఇది ఇవ్వడానికి వచ్చారా. ఇచ్చేసి వెళ్లిపోతారా అని కావ్య అంటుంది. ఇంటికొచ్చిన గెస్ట్‌కు కాఫీ, టీ కూడా ఇవ్వరా అని రాజ్ అంటే.. పాలు అయిపోయాయని చెబుతుంది కావ్య.

రాజ్ నీళ్లు ఇవ్వమంటాడు. ఈయన నాతో టైమ్ స్పెండ్ చేయడానికే వచ్చారు. పంపించాలని లేదు. అలా అని ఇక్కడ ఉంచేంత అవకాశం లేదు అని కావ్య అనుకుంటుంది. తర్వాత జ్యూస్ కావాలంట అని కావ్య అరుస్తుంది. అది విన్న అపర్ణ అమ్మో జ్యూస్ కావాలా. జ్యూస్‌తో మొదలుపెట్టి భోజనం కూడా ఇక్కడ చేసేస్తానంటాడా ఏంటీ. వీళ్లను ఎలా మ్యానేజ్ చేయాలి అని కంగారుపడుతూ భయపడుతుంది.

జ్యూసా. కావ్య ఏంటీ జ్యూస్ అంటుంది అని ఇందిరాదేవి అంటే.. అది మనకోసం అడుగుతుంది అని అపర్ణ అంటుంది. మరోవైపు రాజ్ యాక్సిడెంట్ గురించి రుద్రాణి వాళ్లకు అప్పు చెబుతుంది. మాకు తెలిసింది కాదు తెలియంది చెప్పు. కొత్తగా ఉంటే ఏదైనా చెప్పు అని రుద్రాణి అంటుంది. మరోవైపు ఇందిరాదేవి వాళ్లు బయటకు వెళ్లకుండా అపర్ణ ఆపుతుంది.

అప్పు కథ

మరోవైపు రండి కిచెన్‌లోకి వెళ్దాం అని కావ్య అంటే.. అక్కడికి నేనెందుకు అండి అని రాజ్ అంటాడు. అంటే, నేను అక్కడికి వెళ్తే మీరు ఇక్కడ ఒంటరి అయిపోతారుగా. రండి మా కిచెన్‌ చూద్దాం అని కావ్య అంటుంది. ఇంటికొచ్చిన వాళ్లకు కిచెన్ చూపించడం కొత్తగా ఉందని కావ్య వెంట వెళ్తాడు రాజ్. మరోవైపు రుద్రాణి వాళ్లకు ఏదో ఒక కథ చెబుతుంది అప్పు.

రాహుల్ ఓ సలహా చెప్పేసరికి అవును కదా. బావ అక్క టూ ఇంటలిజెంట్ అని అప్పు అంటుంది. తర్వాత అప్పు ఏదోదో చెబుతుంది. రుద్రాణి, రాహుల్, స్వప్న చిరాకుగా వింటుంటారు. మరోవైపు కిచెన్‌లో కావ్య జ్యూస్ ప్రిపేర్ చేస్తుంటుంది. ఇంట్లో ఎవరు కనిపించట్లేదేంటీ అని రాజ్ అడిగితే.. గుడికి వెళ్లారు. రావడానికి గంట పడుతుందని కావ్య అంటుంది. అంటే మనకు గంట టైమ్ ఉంది మాట్లాడుకోడానికి అని రాజ్ అంటాడు.

తర్వాత రాజ్‌కు జ్యూస్ ఇస్తుంది కావ్య. కొంచెం తాగిన రాజ్ నేను ఒక్కడినే తాగడం కరెక్ట్ కాదు. మీరు కూడా షేర్ చేసుకోవాల్సిందే అని గ్లాస్‌లో సగం జ్యూస్ పోసి ఇస్తాడు రాజ్. అలా రాజ్ ఎంగిలిని కావ్య తాగుతుంది. ఇంతలో గుర్తు చేసుకున్న రాజ్.. మర్చిపోయానండి. నేను ఎంగిలి చేసిన జ్యూస్ మీకిచ్చాను అని రాజ్ అంటాడు. అందుకే నేను తాగాను అని మనసులో అనుకుంటుంది కావ్య.

ప్రకాశం, ధాన్యం గొడవ

పర్లేదండి అని కావ్య చెబుతుంది. జ్యూస్ చాలా బాగుందండి. ఇంకో గ్లాస్ కావాలని రాజ్ అంటే.. పోస్తుంది కావ్య. మరోవైపు క్యారమ్ బోర్డ్ పౌడర్ కోసం వెతుక్కుంటూ ప్రకాశం హాల్లోకి వస్తుంటాడు. అది చూసిన కావ్య కిచెన్‌లోని స్పూన్స్ కింద పడేస్తుంది. దాంతో రాజ్ వాటిని తీయడానికి కిందకి వంగుతాడు రాజ్. అటు ఇటు చూసిన ప్రకాశం అపర్ణ గదిలోకి వెళ్తాడు. ధాన్యం పౌడర్ ఏదే అని ప్రకాశం అంటాడు.

ఈ చీర చూడండి. 75 వేల చీర అట. నాకు ఒక్కసారైన మీరు కొనిచ్చారా అని నిలదీస్తుంది ధాన్యలక్ష్మీ. నీకు చాలా చీరలు ఉన్నాయి కదే. వదినా నువ్వు ఇలా షోకేసులో పెట్టినట్లు చీరలు చూపిస్తావేంటీ అని ప్రకాశం అంటాడు. భార్యకు ఎన్ని చీరలు ఉన్న కొనుక్కోవాలని ఉంటుంది. నువ్ కొనివ్వాలి కదా అని అపర్ణ అంటుంది. అలా చెప్పు అక్క అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏంటే నీకు చీరలు కొనివ్వలేదా అని ధాన్యలక్ష్మీతో ప్రకాశం గొడవ పడతాడు.

అలా భార్యభర్తలిద్దరికి అపర్ణ గొడవ పుట్టేలా చేస్తుంది. మరోవైపు స్పూన్స్ తీసి రాజ్ ఇస్తాడు. మీ ఫేస్ చూస్తుంటే నాకో ఫ్రూట్ గుర్తుకొస్తుంది. తప్పుగా అనుకోకూడదు. మామిడి పిందే. మామిడి పిందెలా భలే క్యూట్‌గా ఉంటుంది మీ ఫేస్ అని రాజ్ అంటాడు. రామ్ గారు అని కావ్య సిగ్గుపడుతుంది. తర్వాత ఇద్దరు హాల్లోకి వస్తారు. రాజ్ కడుపు పట్టుకుని ఇబ్బంది పడతాడు.

కావ్య బెడ్ రూమ్‌కు

ఇది బెడ్ రూమే కదా అని అపర్ణ గదివైపు వెళ్తే కావ్య ఆపుతుంది. అది నేను నెక్ట్స్ టైమ్ చూపిస్తా అంటుంది. అప్పటివరకు ఎలా ఆపుకోవాలి అని రాజ్ అంటాడు. ఏం ఆపుకోవాలండి అని కావ్య అంటే.. సుస్సు అని సిగ్గతో చెబుతాడు రాజ్. మా బెడ్ రూమ్‌కి తీసుకెళ్లడమే కరెక్ట్ అని రాజ్‌ను పైకి తీసుకెళ్తుంది కావ్య. మరోవైపు ప్రకాశం, ధాన్యలక్ష్మీ గొడవ పడుతూ ఉంటే ఇంకోవైపు అప్పు చెప్పే సోది చిరాకుగా వింటారు రుద్రాణి వాళ్లు.

రాజ్ తమ బెడ్ రూమ్‌కు వస్తాడు. కావ్య బాత్రూమ్ చూపిస్తే అందులోకి వెళ్తాడు. ఇదేదో చెబుతానని తీసుకొచ్చి ఇంకేదో చెబుతుందే.. బయటకు వెళ్లే ఛాన్స్ కూడా లేకుండా చేసిందే అని రుద్రాణి అప్పు గురించి అనుకుంటుంది. రాహుల్ నిల్చునే నిద్రపోతుంటాడు. కింద ఎవరైనా ఉన్నారో లేదో అని తొంగిచూస్తుంటుంది కావ్య. ఇంతలో రాజ్ వస్తాడు. నేను ఇచ్చిన బహుమతి ఎలా ఉందో కాస్తా చూసి చెప్పండి అని రాజ్ అంటాడు.

దాంతో చూడటానికి వెళ్తుంది కావ్య. మరోవైపు ప్రకాశం, ధాన్యలక్ష్మీ గొడవ పడుతూనే ఉంటారు. ధాన్యలక్ష్మీ అని ఇందిరాదేవి అరిస్తే.. మీరు ఉండండి అత్తయ్య అని అత్త మాట లెక్కచేయదు ధాన్యలక్ష్మీ. ఛీ పోవే అని ప్రకాశం వెళ్తుంటే.. అపర్ణ ఆపి రాముడు సీత ఆడుకొందామంటుంది. ఆడుదాం. చిన్నప్పుడు ఆడితే రుద్రాణికి ఎప్పుడు సూర్పణకే వచ్చేది. ఇప్పుడు ఇది సూర్పణక అని ధాన్యలక్ష్మీ అంటుంది.

గిఫ్టు‌గా చీర

దాంతో మళ్లీ ఇద్దరు గొడవ పడతారు. మరోవైపు రాజ్ ఇచ్చిన చీర చూసి మురిసిపోతుంది కావ్య. ఎలా ఉందో చెప్పలేదు అని రాజ్ అడిగితే.. చాలా బాగుందని కావ్య చెబుతుంది. నాకు నచ్చిన కలర్ సారీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చినందుకు మీకే థ్యాంక్స్ అని కావ్య అంటుంది. మీరు చెబితే నమ్మరు కానీ మనిద్దరి టేస్ట్‌లు ఒకేలా ఉంటాయండి అని రాజ్ అంటే.. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి అని కావ్య అంటుంది.

మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా.. నిజం చెప్పండి మనిద్దరికి ఇంతకుముందు ఎలాంటి పరిచయం లేదా. ఏ విధంగానూ కలవలేదా. మీరు చెప్పలేకపోతున్నారేమో గానీ నాకు అనిపిస్తుంది. మీకు నచ్చిన సారీ ఎలా తీసుకురాగలిగాను. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని పొడుపుకథ చెబితే నేను నేరుగా ఈ ఇంట్లోకి వచ్చాను. ఈ ఇంటికి వస్తే నా సొంతింటికి వచ్చిన ఫీలింగ్ కలిగింది అని రాజ్ అడుగుతాడు.

చాలా సేపటి నుంచి మీరు నన్ను పంపించాలని చూస్తున్న నాకు వెళ్లాలనిపించట్లేదండి. మీరు ఏదో దాస్తున్నారనిపిస్తుంది. అలా అని మీరు అబద్ధం చెప్పరని తెలుసు. అందుకే అడుగుతున్నా. చెప్పండి ప్లీజ్ అని రాజ్ రిక్వెస్టింగ్‌గా అడుగుతాడు. దాంతో అటువైపు తిరిగిన కావ్య మావాళ్లు వచ్చే టైమ్ అయింది. వాళ్లు వచ్చే సరికి మీరు ఉంటే నా గురించి తప్పుగా అనుకోవచ్చు అని ఎమోషనల్‌గా చెబుతుంది.

అపర్ణ, అప్పు సంతోషం

తర్వాత రాజ్, కావ్య హాల్లోకి వస్తారు. మరోవైపు మీరు వద్దు మీ గొడవ వద్దు అని రూమ్ నుంచి ఇందిరాదేవి బయటకు వస్తుంటుంది. అపర్ణ ఆపుదామని చూస్తుంటే.. తనను ప్రకాశం, ధాన్యలక్ష్మీ ఆపుతారు. కానీ, అపర్ణ బయటకు వస్తుంది. తనవెంటే ప్రకాశం, ధాన్యలక్ష్మీ వెళ్తారు. మరోవైపు అప్పును గద్దించిన రుద్రాణి నీ సోది వినే ఓపిక లేదని రాహుల్‌ను పట్టుకుని బయటకు వెళ్తారు.

రాజ్, కావ్య గుమ్మం దగ్గరికి వస్తారు. రాజ్ బై అని చెబుతాడు. హాల్లోకి అంతా వచ్చేస్తుంటారు. అది చూసిన కావ్య వాళ్లు రాజ్‌ను చూడకుండా డోర్ వేస్తుంది. హాల్లో ఈయన నన్ను సూర్పణక అంటారా అని రుద్రాణికి చెప్పి అవునా కాదా అని ప్రకాశం, ధాన్య అడుగుతుంటారు. హమ్మయ్య వెళ్లిపోయారా అని అపర్ణ, అప్పు ఇద్దరు సంతోషిస్తుంటారు. అది చూసిన రుద్రాణి ఎవరు వెళ్లిపోవాలి అని అడుగుతుంది.

ఇందాక అక్క ఇక్కడే ఉంది. వెళ్లిపోయిందా అని అడుగుతున్నాను అంతే అని అప్పు అంటుంది. దాంతో రుద్రాణి అనుమానంగా చూస్తుంది. మరోవైపు రాజ్, కావ్య కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉంటారు. వాళ్లను చూసిన యామిని కోపంతో రగిలిపోతుంది. రాజ్ వెళ్లిపోయాక కావ్యకు ఎదురుపడిన యామిని ఎంత ధైర్యం ఉంటే నా బావను నాకు కాకుండా చేస్తావ్ అని అంటుంది.

యామిని, కావ్య సవాల్

బావ ఎలా అయ్యాడు. నా భర్తను లాక్కుంది నువ్వు. ఆయన మనసులో ఇంకా నేను ఉన్నాను అని కావ్య యామినికి ఝలక్ ఇస్తుంది. దాంతో యామిని షాక్ అవుతుంది. రాజ్‌కు పెళ్లాం ఎవర అవుతారో త్వరలోనే నీకు తెలుస్తుంది అని యామిని అంటే.. చూద్దాం అని కావ్య అంటుంది. చూసుకుందాం అని యామిని అంటూ ఇద్దరు సవాల్ విసురుకుంటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం