్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య ఇచ్చిన అడ్రస్ పొడుపు కథ విప్పినట్లు రాజ్ చెబుతాడు. మణికొండ పైప్ లైన్ దగ్గర సూర్యుడి టెంపుల్ ఉంది. సూర్యుడి టెంపుల్ నీడ పడే చోటు దగ్గరేగా మీ ఇల్లు అని రాజ్ అంటే.. అదెక్కడ ఉందని మనసులో అనుకున్న కావ్య కరెక్ట్ అండి. భలే కనుక్కున్నారు అని కావ్య అంటుంది.
నేను రేపు నేరుగా మీ ఇంటికి వచ్చి సర్‌ప్రైజ్ అవుతారు అని రాజ్ అంటాడు. రేపు ఎవరి ఇంటికి వెళ్తారు. అక్కడ కుక్క ఉండకుండా చూడు స్వామి అని కావ్య మనసులో అనుకుంటుంది. కరెక్ట్‌గా వస్తారా అని కావ్య అడిగితే.. మ్యాప్ అయినా తప్పుతుందేమో గానీ నేను కాదు. రేపు నేను వచ్చాక సంబ్రమాశ్చర్యాలకు గురికాండి అని రాజ్ అంటాడు.
సరే సరే రండి అని కావ్య కాల్ కట్ చేస్తుంది. పాపం పిచ్చి మహరాజు అడ్రస్ తప్పుగా చెప్పి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. రేపు ఏ ఇంటికి వెళ్తారో, ఏ గిఫ్ట్ తీసుకెళ్తారో వాళ్లు ఏమంటారో ఈయన ఏం ఇబ్బందిపడతారో అని కావ్య అనుకుంటుంది. మరోవైపు యామిని వచ్చి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేశారా అని తల్లిదండ్రులను అడుగుతుంది. సెలెక్ట్ చేయాల్సింది మీరిద్దరు అని వైధేహి అంటుంది.
నాకు రామ్‌తో పెళ్లి జరిగితే చాలు. ఇదంతా మీకోసం. మీరే సెలెక్ట్ చేయండి అని యామిని అంటుంది. మనిషి మారినట్లు రామ్ మనసు మారితే ఎలా. గుడికి అని వెళ్లి తల్లిని కలిసొచ్చాడు. కావ్య మాటి మాటికి ఇంటికి వస్తుంది. దీంతో మీ పెళ్లి జరుగుతుందా అనే భయంగా ఉందని తండ్రి అంటాడు. ఆ కావ్య నన్ను రెచ్చగొడుతుంది. నేను ఆవేశంలో నిజం బయటపెట్టించడానికి చూస్తుంది అని యామిని అంటుంది.
కావ్యకు కావాల్సింది అది కాదు. తన భర్తకు ఎలాంటి ప్రమాదం కలగకుండా తన గతాన్ని గుర్తు చేయడం అని తండ్రి అంటాడు. అది జరగదు. డాక్టర్ చెప్పాడుగా. ఎంత గుర్తు చేసిన రామ్‌కు గుర్తు రాదని అని యామిని అంటుంది. భార్యాభర్తల బంధం ఎలా ఉంటుందో నీకు తెలియదు. తన గతమే తనకు గుర్తు లేదు. ఎవరో చెప్పే పరిస్థితులో లేడు. అలాంటిది తిరిగి తిరిగి కావ్యను కలవడానికి ఎందుకు వెళ్తున్నాడు అని యామిని తండ్రి అంటాడు.
మన జాగ్రత్తల్లో మనం ఉండటం మంచిది కదా. అల్లుడు గారు పట్టనట్లు దూరంగా ఉంటున్నారు. బయట తిరుగుతున్నారు. ఈ పనుల్లో బిజీగా ఉంటే బాగుంటుంది అని వైధేహి అంటుంది. అయితే, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించండి. నేను రామ్ కలిసి మన బంధువులకు కార్డ్స్ పంచుతాం. అప్పుడు తన మనసులో కూడా ఇంకా నాటుకుపోతుంది కదా అని యామిని అంటుంది.
ఆ కావ్య మీద కూడా ఓ కన్నేసి ఉంచు. తను ఈ పెళ్లి ఆపడానికి ఎంత దూరమైన వెళ్తుంది అని యామని అంటుంది. దాని సంగతి నేను చూసుకుంటాను. మీరు ముందు కార్డ్ సెలెక్ట్ చేయండి అని యామిని అంటుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో క్యారమ్ బోర్డ్ ఆడేందుకు రెడీ చేయిస్తుంది అపర్ణ. అందరిని పిలుస్తుంది. పాపం కావ్య దెబ్బకు వదిన ఉన్న మతి పూర్తిగా పోయినట్లుందని రుద్రాణి అంటుంది.
ఇవాళ క్యారమ్ బోర్డ్, రేపు అష్టాచమ్మా, ఎల్లుండి తొక్కుడుబిల్ల ఆడుదామంటుందేమో అని రుద్రాణి అంటుంది. అన్న అంటుంది. కంట్లో కనపడకుండా తప్పించుకుందాం పదా అని రాహుల్, రుద్రాణి వెళ్తుంటారు. రాహుల్ ఎక్కడికి వెళ్తున్నారు అని అపర్ణ పిలుస్తుంది. చచ్చాం మమ్మీ అని రాహుల్ అంటే.. దొరికిపోయాం అని రుద్రాణి అంటుంది. పని ఉంది వెళ్లి చూసుకొని వస్తాం అని రుద్రాణి అంటుంది.
అది తర్వాత చూసుకోమంటుంది అపర్ణ. స్వప్న సెటైర్లు వేస్తుంది. మనుషులతోనే గేమ్స్ ఆడటమే కాదు వీటితో కూడా ఆడొచ్చు అని స్వప్న అంటుంది. చాలా రోజులుగా ఇల్లు బోసిపోయిందిగా. కాస్తా సందడిగా మారుద్దామని అపర్ణ చెబుతుంది. మరోవైపు కారులో రాజ్ వస్తుంటాడు. కావ్య చెప్పిన సామెత ప్రకారం ఇటు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అని రాజ్ అనుకుంటాడు.
కానీ, రైట్‌కు వెళ్లినట్లు కొన్ని జ్ఞాపకాలు రాజ్‌కు గుర్తుకు వస్తాయి. వెళ్లాల్సింది లెఫ్ట్‌కు అయితే రైట్‌కు వెళ్లమని మనసు చెబుతోంది ఏంటి. సరే వెళ్దాం అని వెళ్తాడు రాజ్. ఈ దారిలో ఇదివరకు వెళ్లినట్లు అనిపిస్తోంది ఏంటీ అని రాజ్ అనుకుంటాడు. ధాన్యలక్ష్మీ, అపర్ణ ఒక జట్టుగా, ఇందిరాదేవి, ప్రకాషం మరో జట్టుగా ఆడతారు. ఇవాళ టాలెంట్ చూపిస్తానని ప్రకాశం అంటాడు.
వాళ్లంతా క్యారమ్ ఆడుతుంటే జ్యూస్ తీసుకొస్తుంది కావ్య. జ్యూస్ చాలా బాగుందని ధాన్యలక్ష్మీ పొగుడుతుంది. చాలా కాలం తర్వాత కావ్యను ధాన్యలక్ష్మీ పొగుడుతుంది. దాంతో ఇందిరాదేవి కూడా తాగుతానని తీసుకుంటుంది. అద్భుతంగా ఉందని మెచ్చుకుంటుంది. ఇంతలో దుగ్గిరాల ఇంటి ముందు రామ్‌గా మారిన రాజ్ కారు వచ్చి ఆగుతుంది.
ఏదో రోజు వచ్చిన ప్లేస్‌కు వచ్చి ఆగినట్లు ఇక్కడ ఆగానేంటీ అని కారు దిగి చూస్తాడు రాజు. ఈ ఇంటిని ఇంతకుముందు ఎప్పుడైనా చూశానా. ఎక్కడ చూశాను. ఈ ఇంటికి నాకు సంబంధం ఏంటీ. ఎక్కడో చూసిన ఫీలింగ్ ఎందుకు వస్తుంది. ఇంతకీ కళావతి గారు చెప్పిన అడ్రస్ ఇదేనా అని ఇంట్లోకి వెళ్తాడు రాజ్. రాజ్ గేట్ తీసుకుని రావడాన్ని కావ్య చూసి ఉలిక్కిపడుతుంది.
ఆయనలా ఉన్నారేంటీ. ఆయనలా ఏంటీ ఆయనే. ఓరి నాయనో.. అడ్రస్ తప్పుగా చెబితే ఎక్కడికో వెళ్లి ఇరుక్కుంటారు అనుకుంటే నేరుగా వచ్చి నన్ను ఇరికించారు ఏంటీ అని కావ్య కంగారుపడుతుంది. అప్పుకు సైగ చేసి రాజ్‌ను చూపిస్తుంది కావ్య. ఏంటీ అక్కా చెల్లెళ్లు సైగలతో సరసాలు ఆడుతున్నారు. ఈసారి అప్పును పిచ్చిదాన్ని చేయబోతుందేమో. మనకెందుకులే కావ్యకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని రుద్రాణి అంటుంది.
తర్వాత అత్తయ్య అని అపర్ణ చెవిలో పిలుస్తుంది. అబ్బా, ఏంటా గోకడం. నాకు దురదపెడితే గోక్కుంటానులే అని అపర్ణ అంటుంది. అత్తయ్య అటు చూడండి. తమరి పుత్రరత్నం. నేరుగా వచ్చారు. ఇంట్లోకి రాకుండా నన్ను కలవకుండా వెళ్లరు. కాబట్టి, మీరే ఈ సెటప్ అంతా మార్చేయాలి అని కావ్య అంటుంది. పౌడర్ తీసుకొస్తా అని ప్రకాశం వెళ్తాడు.
అత్తా కోడళ్లు ఏం మాట్లాడుకుంటున్నారే పక్కవాళ్లకు వినిపించకుండా అని ఇందిరాదేవి అంటుంది. ఏదో గూడుపుఠాని జరుగుతుందమ్మా అని రుద్రాణి అంటుంది. త్వరగా తీసుకెళ్లండి అత్తయ్య అని కావ్య అంటుంది. సరే సరే అని అత్తయ్య నాకు ఈ గేమ్ బాగా అనిపించడంలేదు. మన రూమ్‌లో ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. అక్కడ ఆడుదామని అందరిని లేపుతుంది అపర్ణ.
గేమ్ మధ్యలో వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు అని రుద్రాణి అంటుంది. అది పట్టించుకోకుండా ఇందిరాదేవి, ధాన్యలక్ష్మీని తన గదిలోకి తీసుకెళ్తుంది అపర్ణ. చీరలు తీసుకొచ్చి చూపిస్తుంది అపర్ణ. అలా వాళ్లను ఏమారుస్తుంది అపర్ణ. మరోవైపు అప్పు వీళ్లను కూడా తీసుకెళ్లే అని కావ్య అంటుంది. మనం కూడా వెళ్దాం అని అప్పు అంటే.. ఎందుకు మాకు పని ఉంది అని బయటకు వెళ్లిపోతుంటారు రుద్రాణి, రాహుల్.
ఆగండి.. మీకు ఓ కేస్ గురించి చెప్పాలి. రాజ్ బావ యాక్సిడెంట్ కేసు గురించి మీ అందరికి చెప్పాలి. సీక్రెట్‌గా చెప్పాలి. ఇష్టమైతే చెప్పాలి. లేకుంటే మీ ఇష్టం అని అప్పు అంటుంది. యాక్సిడెంట్ అట తెలుసుకుందాం పద అని రాహుల్ అంటాడు. దాంతో స్వప్న, రుద్రాణి, రాహుల్‌ను అప్పు తీసుకెళ్తుంది. రాజ్ ఇంట్లోకి వస్తుంటాడు. హాల్లో ఉన్న రాజ్ ఫొటోలు తీసి ఓ పక్కకు పెడుతుంది కావ్య.
తర్వాత వెళ్లి రామ్‌ను పలకరిస్తుంది కావ్య. మీకు ఈ రూట్ ఎలా తెలిసింది అని కావ్య అడుగుతుంది. చేతులు స్టీరింగ్ తిప్పుతున్నాయి. దారి ముందే గుర్తొస్తుంది. అలా గుర్తు చేసుకుంటా డ్రైవ్ చేసుకుంటూ మీ ఇంటి ముందు వచ్చి ఆగాను అని రాజ్ అంటాడు. అది ఎలా సాధ్యం అని కావ్య అడుగుతుంది.
మీకు ముందే చెప్పానుకదండి మిమ్మల్ని ఇంతకుముందు చూసినట్లుందని. ఈ ఇంటిని చూశాక కూడా సేమ్ ఫీలింగ్ కలిగిందని రాజ్ అంటాడు. తర్వాత కావ్యకు చీర గిఫ్ట్‌గా ఇస్తాడు రాజ్. రాజ్ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు చాలా సంతోషిస్తుంది కావ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం