Brahmamudi Serial: రేపటి నుంచి మారిపోనున్న బ్రహ్మముడి సీరియల్ టైమ్.. కొత్త టైమ్ ఇదే
Brahmamudi Serial: స్టార్ మా టాప్ టీఆర్పీ రేటింగ్ సీరియల్ బ్రహ్మముడి టైమ్ రేపటి నుంచి మారిపోనుంది. ఇన్నాళ్లూ రాత్రి 7.30 గంటలకు టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్ ఇక నుంచి మధ్యాహ్నం రానుంది.
Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ టైమ్ మారిపోయింది. స్టార్ మాలో చాలా రోజులుగా సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు టెలికాస్ట్ అవుతూ వస్తున్న ఈ సీరియల్.. మంగళవారం (నవంబర్ 12) నుంచి కొత్త టైమ్ లో ప్రసారం కానుంది. ఈ సీరియల్ స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సరికొత్త సీరియల్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.
బ్రహ్మముడి సీరియల్ కొత్త టైమ్
స్టార్ మా ఛానెల్లో కొన్నాళ్లుగా టాప్ లో కొనసాగుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ మంగళవారం (నవంబర్ 12) నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు టెలికాస్ట్ కానుంది. ఈ కొత్త టైమ్ ను గత వారం ఆ ఛానెల్ అనౌన్స్ చేసింది. ఇక ఇన్నాళ్లూ బ్రహ్మముడి టెలికాస్ట్ అయ్యే రాత్రి 7.30 గంటల సమయంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే కొత్త సీరియల్ రాబోతోంది.
అయితే స్టార్ మా తీసుకున్న ఈ నిర్ణయంపై బ్రహ్మముడి సీరియల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి రేటింగ్ ఇస్తున్న సీరియల్ ను ప్రైమ్ టైమ్ నుంచి తప్పించి మధ్యాహ్నం టెలికాస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక కారణమేంటన్నది మాత్రం స్టార్ మా చెప్పలేదు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి కొన్నాళ్లుగా స్టార్ మా ప్రమోషన్లు బాగానే నిర్వహిస్తోంది. ఒకరినొకరు అర్ధం చేసుకునే భార్యాభర్తలు, బంగారం లాంటి పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఆనందాలకు కొదవే ఉండదు. ఇలాంటి ఆప్యాయతలు అల్లుకున్న ఓ అందమైన కుటుంబం కథ ఇది అని స్టార్ మా తెలిపింది.
స్టార్ మాలో ప్రసారమైన ప్రోమోలు ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. రెండు కుటుంబాల్లో ప్రేమ రగిల్చిన కక్షలు.. ప్రేమాభిమానాల్ని ఎలా సమాధి చేస్తాయో చూపించడమే కాదు.. ఆ జంట పోగొట్టుకున్న ప్రేమాభిమానాల్ని పొందడానికి ఎంత కష్టపడ్డారో చెబుతుంది.
ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కట్టిపడేసే స్టార్ మా కొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు నవంబర్ 12 నుంచి రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇదే సమయంలో సోమవారం నుంతి శనివారం వరకు నాన్ స్టాప్‌గా ఈ సీరియల్‌ను ప్రసారం చేయనున్నారు. ఈ సీరియల్‌లోని పాత్రలు మనకెంతో పరిచయమైనట్టుగా మీ ముందుకు రానున్నాయి. నిస్సహాయంగా నిలిచిపోయిన అనుబంధాలు, మమకారాల్ని మసిచేసిన ఆనాటి ప్రేమ మంటల మధ్య సంఘర్షణే ఈ కథ అంటూ స్టార్ మా తెలిపింది.