Brahmamudi Promo: కావ్యతో రాజ్ రొమాన్స్ - రుద్రాణి కడుపుమంట - రంగా ట్విస్ట్‌కు వసు మైండ్‌బ్లాక్
Brahmamudi Promo: బ్రహ్మముడి ప్రోమోలో కావ్యతో రాజ్ ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గర కావాలని ప్రయత్నిస్తాడు. కానీ అతడి ప్లాన్ ఫెయిలవుతుంది. గుప్పెడంత మనసు ప్రోమోలో రంగానే రిషి అని నిరూపించే అవకాశం వసుధారకు దొరుకుతుంది.
Brahmamudi Promo: రాజ్‌తో కలిసి రౌడీల బారి నుంచి అసలైన మాయను కాపాడుతుంది కావ్య. ఆమెను తీసుకొచ్చి దుగ్గిరాల కుటుంబసభ్యుల ముందు నిలబెడుతుంది. కానీ ఆమె అసలు మాయ కాదని, సుభాష్‌పై పడ్డ నిందను చెరిపివేయడానికి రాజ్, కావ్య కలిసి ఆడుతోన్న నాటకం ఇదని రుద్రాణి వాదిస్తుంది. మాయ నిజాలు బయటపెట్టకుండా రుద్రాణి అడ్డుపడుతుండటంతో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ ఆమెపై ఫైర్ అవుతారు.
అపర్ణకు క్షమాపణలు...
ఆ బిడ్డకు సుభాష్ తండ్రి కాదని, తాను తల్లిని కాదని అసలు నిజం చెప్పేస్తుంది మాయ. మీ నుంచి డబ్బు లాగేయడంతో పాటు ఇంటి పరువు తీయడానికి కొంతమంది కలిసి తనతో ఈ నాటకం ఆడించారని అంటుంది. నా ప్రాణాలు తీస్తామని బెదిరించడంతో ఈ తప్పు చేశానని మాయ అంటుంది.
అపర్ణ కాళ్లపై పడి క్షమాపణలు కోరుతుంది. జరిగిన దాంట్లో మాయ తప్పేమీ లేకపోవడంతో ఆమెను శిక్షించకుండా వదిలేస్తారు. సుభాష్ కొడుకుగా ఇంట్లో పెరుగుతోన్న అనాథ చిన్నారిని కావ్య దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అందుకు రాజ్ కూడా ఒప్పుకుంటాడు. దాంతో కావ్య గొప్పతనం చూసి ఇందిరాదేవి మురిసిపోతుంది. మా ఇంటి మహాలక్ష్మి అంటూ కావ్యపై పొగడ్తలు కురిపిస్తుంది.
కావ్యను భయపెట్టిన రాజ్
కావ్య తీసుకున్న నిర్ణయం చూసి రాజ్ కూడా ఆనందం పడతాడు. కావ్యపై అతడికి ఉన్న ప్రేమ మరింత పెరుగుతుంది. కావ్య బెడ్‌షీట్ సర్ధుతూ పరధ్యానంలో ఉంటుంది. ఆమెను వెనుకనుంచి వచ్చి రాజ్ భయపెడతాడు. రాజ్ అరుపుతో కావ్య ఎగిరి బెడ్‌పై గంతేస్తుంది. మీరేనా అని అంటుంది. మరి ఎవరనుకున్నావు అంటూ కావ్యపై సెటైర్‌వేస్తాడు రాజ్.
రాజ్ కోసం ఎదురుచూపులు...
మీకోసమే ఎదురుచూస్తున్నానని రాజ్‌తో చెబుతుంది కావ్య. ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నానని భర్తతో అంటుంది. ఆమె మాట వినగానే రాజ్ సంబరపడిపోతాడు. మొదటుపెట్టండి అని కావ్య అంటుంది. ఇంతా ఫాస్టా అని రాజ్ బదులిస్తాడు.కానీ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలా అని ఆలోచిస్తున్నానని బదులిస్తాడు. రాజ్ రొమాంటిక్ మూడ్‌ను కావ్య చెడగొట్టేస్తుంది. కావ్య ఒకటి అంటే రాజ్ మరోలా ఊహించుకొని దెబ్బతింటాడు.
రుద్రాణి కొత్త కుట్ర...
మరోవైపు కావ్య ఇచ్చిన షాక్‌ను రుద్రాణి సహించలేకపోతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కలిసి పోవడం చూసి విలవిలలాడుతుంది. ఆ సంతోషాన్ని దూరం చేసేందుకు మరో కుట్ర పన్నుతుంది. అదేమిటన్నది రేపటి బ్రహ్మముడి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.
రంగానే రిషి...
రంగానే రిషి అని వసుధార ఫిక్సవుతుంది. కానీ ఆ నిజం ఎలా బయటపెట్టాలో తెలియక మదనపడుతుంది. రంగా తనపై చూపుతోన్న ప్రేమ, ఆదరణ అచ్చం రిషిలానే ఉండటంతో కన్ఫ్యూజ్ అవుతుంది. అలాంటి తరుణంలోనే రంగా గురించి షాకింగ్ నిజం వసుధార తెలుసుకుంటుంది. తమకు ఎండీగా మను కావాలని స్టూడెంట్స్ కోరుకోవడం చూసి శైలేంద్ర కోపంతో రగిలిపోతాడు.
రిషి, వసుధార మాదరిగానే మనును కాలేజీ నుంచి పంపించేయాలని ఫిక్సవుతాడు. మను తండ్రి మహేంద్ర అంటూ వసుధార రాసిన ఉత్తరాన్ని అడ్డుపెట్టుకొని మనును దెబ్బతీయాలని ప్లాన్ వేస్తాడు. అతడి ప్లాన్‌ను మను తిప్పికొట్టాడా? రంగానే రిషి అనే నిజాన్ని వసుధార బయటపెట్టిందా లేదా అన్నది గుప్పెడంత మనసు నెక్స్ట్ ఎపిసోడ్‌లో తేలనుంది.