రాజ్‌తో కలిసి దుగ్గిరాల ఇంటికొస్తుంది యామిని. ఆమెను చూసి దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాకవుతారు. నేను కళావతి ఫ్రెండ్‌ను అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది యామిని. నా కంటే నాకు కాబోయే భర్త రామ్...కళావతికి మంచి ఫ్రెండ్ అని అంటుంది. త్వరలోనే రామ్ తాను పెళ్లిచేసుకోబోతున్నామని, మొదటి శుభలేఖ రామ్ క్లోజ్‌ఫ్రెండ్ అయిన కళావతికి ఇవ్వడానికే వచ్చానని అంటుంది.
కానీ కళావతి కంటే పెద్దవాళ్లుగా మీరందరూ ఉన్నప్పుడు మీకే ఇవ్వడం మంచిదని అనిపిస్తుందని పెద్ద ఇందిరాదేవికి తమ పెళ్లి మొదటి శుభలేఖ అందిస్తుంది యామిని. తమను ఆశీర్వదించాలని పట్టుపడుతుంది. దీర్షాయుష్మాన్‌భవ అని యామిని, రాజ్‌లను ఆశీర్వదిస్తారు ఇందిరాదేవి, సీతారామయ్య. శ్రీఘమేవ కళ్యాణప్రాప్తిరస్తు అని కదా దీవించాలి యామిని లాజిక్‌లు మాట్లాడుతుంది.
రుద్రాణిని పెళ్లికి పిలుస్తుంది యామిని. ఇంటికొచ్చి పిలిచావ్ కదా...మేమందరం తప్పకుండావస్తామని రుద్రాణి సెటైర్లు వేస్తుంది. మా బావ కళావతికి క్లోజ్‌ఫ్రెండ్ కదా...ఆమెనే అందరిని దగ్గరుండి తీసుకొస్తుందని యామిని బదులిస్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి అపర్ణ వస్తుంది. ఆమెను చూసి రాజ్ షాకవుతాడు. మీరు అంటూ ఆగిపోతాడు.
గుడిలో నువ్వు బర్త్‌డే సెలబ్రేట్ చేసిన ఆంటీ కదా...మీకు కళావతికి ఏం సంబంధం అని అపర్ణను యామిని అడుగుతుంది. . మీరు ఈ ఇంట్లో ఎందుకు ఉన్నారని అడుగుతుంది. యామిని ప్రశ్నలతో కావ్య, అపర్ణ కంగారు పడతారు. మా వదిన ఈ ఇంటి పెద్ద కోడలు అని రుద్రాణి సమాధానం చెప్పి ఇద్దరిని ఇరికిస్తుంది రుద్రాణి.
మరి కళావతికి అపర్ణకు ఏం సంబంధం అని యామిని అడుగుతుంది. వాళ్లిద్దరూ అత్తాకోడళ్లు కాబట్టే కలిసి ఉన్నారని రుద్రాణి చెప్పిన సమాధానం విని రాజ్ షాకవుతాడు.
ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకరికొకరు బాగా తెలిసిన ఏం తెలియనట్లు నాటకం ఆడారని రాజ్‌తో అంటుంది యామిని. నిన్ను మోసం చేశారని నిందలు వేస్తుంది. మోసం చేయాల్సిన అవసరం నా కోడలికి లేదని ఇందిరాదేవి అంటుంది. ఇది మోసం కాకపోతే ఏంటి? నిజాలు బయటపడతాయని భయపడుతున్నారా? మోసం చేసిన మనుషులను ఎలా సపోర్ట్ చేస్తారని ఇందిరాదేవిని నిలదీస్తుంది యామిని.
తప్పు చేసింది నేను మా అమ్మమ్మను ఇంకో మాట అంటే ఊరుకునేది లేదని యామినికి వార్నింగ్ ఇస్తుంది కావ్య. తన నోటితో తానే తప్పు చేసినట్లు కావ్య ఒప్పుకుందని, వీళ్ల నిజ స్వరూపం బయటపెట్టడానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానని రాజ్‌తో చెబుతుంది యామిని. కావాలనే నిన్ను రిసార్ట్‌కు తీసుకొచ్చి వాళ్లవైపుకు తిప్పుకున్నారని అంటుంది. కానీ నువ్వు కళ్లు తిరిగి పడిపోగానే పారిపోయారని అంటుంది. నేను కష్టపడి నిన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లానని చెబుతుంది.యామిని మాటలు నిజమని రామ్ నమ్ముతాడు.
యామిని పర్ఫార్మెన్స్ చూసి రుద్రాణి ఫిదా అవుతంది. యాక్టింగ్‌లో నా కంటే ఇరగదీస్తుందని అంటుంది. నీ ట్రైనింగ్ కదా అని రాహుల్ అంటాడు. యామిని చెప్పేది ఏది నిజం కాదని రాజ్‌తో అంటుంది కావ్య. అపర్ణకు మీకు ఇంతకుముందే పరిచయం ఉందా? ఆవిడ మీకు తెలుసా అని కావ్యను అడుగుతాడు రాజ్. తెలుసు అని కావ్య బదులిస్తుంది. జరిగింది ఏమిటో రాజ్‌కు చెప్పబోతుంది కావ్య. కానీ ఆమె మాటలను రాజ్ ఆపేస్తాడు. నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశారని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
రాజ్ వెళ్లిపోగానే ఉన్న నీ దారులన్నీ మూసుకుపోయాయి...ఇప్పుడు ఏం చేస్తావని కావ్యతో అంటుంది యామిని. నా ప్రేమ నిజమైంది కాబట్టి ఆ దేవుడు కూడా నాకే సపోర్ట్ చేశాడని అంటుంది. మీ మధ్య ఉన్న ఈ కాస్త సంబధాన్నితెంచేలా నాతో చేయించాడని అంటుంది. రాజ్ దృష్టిలో ఇప్పుడు నువ్వు ఒక మోసగత్తేవి, అతడి మనసును విరిచేశానని అంటుంది. మీ ఇద్దరి బ్రహ్మముడిని చిక్కుముడిగా మార్చేశానని యామిని డైలాగ్స్ కొడుతుంది. ఈ సుడిగుండం నుంచి నువ్వు బయటకు వచ్చి రాజ్‌ను కలవలేవని చెప్పి వెళ్లిపోతుంది యామిని.
యామిని వెళ్లిపోగానే కావ్య కుప్పకూలిపోతుంది. ఇక రాజ్ నేను కలవలేను. ఇక ఎప్పటికి ఆయన నన్ను కన్నెత్తిచూడడు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తమ ప్లాన్ సక్సెస్ కావడంతో రుద్రాణి, రాహుల్ సంబరపడతారు. ఇక రాజ్ ఎప్పటికీ ఈ ఇంటి గడప తొక్కడు..కాబట్టి నువ్వే ఈ ఇంటికి వారసుడికి కాబోతున్నావని రాహుల్‌తో అంటుంది రుద్రాణి.
రాజ్, కావ్యలను ఎలాగైనా కలపాలని రుద్రాణి ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటారు. యామిని ఇంటికొస్తుందని ఊహించలేదని అపర్ణ అంటుంది. నిజం అన్నది ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని కళ్యాణ్ బదులిస్తాడు. నిజం దాచినందుకు రాజ్ హర్టయ్యాడని, కానీ కావ్య మీద అతడికి ఎలాంటి కోపం లేదని కళ్యాణ్ అంటాడు. కావ్య మనసులో రాజ్ పట్ల ఉన్న ప్రేమను బయటపెట్టి మళ్లీ ఇద్దరిని కలపాలని అనుకుంటారు.
కావ్య తనను ప్రేమిస్తుందనే విషయం రాజ్‌కు తెలిస్తే తప్పకుండా అతడు దారిలోకి వస్తాడని సలహా ఇస్తాడు కళ్యాణ్. అదే జరిగితే రాజ్ అల్లుడిగా ఇంట్లో అడుగుపెడతాడని స్వప్న అంటుంది. రాజ్ దృష్టిలో ఇది రాజ్‌కు అత్తారిల్లు కదా అని చెబుతుంది. కావ్య వెంటపడేలా రాజ్‌ను చేయాలి.. ప్రేమను గెలిపించుకునే క్రమంలో రాజ్‌కు గతం గుర్తుకువచ్చేలా చేయాలని ప్లాన్ వేస్తారు.
రాజ్‌కు కావ్య ప్రేమిస్తున్న విషయం ఎవరో ఒకరు రాజ్‌తో చెప్పాలని అపర్ణ అంటుంది. అందరూ కలిసి కళ్యాణ్‌ను బుక్‌చేస్తారు. సలహా ఇచ్చిన వాడిని బలిపశువును చేస్తున్నారని కళ్యాణ్ అంటాడు. చివరకు రాజ్‌కు ఫోన్ చేస్తాడు కళ్యాణ్. అన్నయ్య అని పిలుస్తాడు.
నువ్వు అన్నయ్య అని పిలవగానే గుర్తుపట్టడానికి నేనేం మెగాస్టార్‌ను కాదు...నువ్వేం పవన్ కళ్యాణ్ కోపంగా రాజ్ అంటాడు. నేను కళ్యాణ్‌ను అని, మా వదిన గురించి నీకు ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని అంటాడు. కళావతి గురించా...ఎక్కడికి రావాలని రాజ్ ఆత్రుతగా అడుగుతాడు. వెంటనే వస్తానని కళ్యాణ్‌తో చెబుతాడు రాజ్. ఎలాగైనా రాజ్‌ను కన్వీన్స్ చేసి...కావ్య వెంట పడేలా చేయాలని కళ్యాణ్‌తో అంటుంది అపర్ణ.
తన నాటకం మొత్తం బయటపడి రాజ్ దూరమవ్వడంతో కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెకు యామిని ఫోన్ చేస్తుంది. గొంతులో నుంచి బాధ తన్నుకుంటూ వస్తున్నట్లు వస్తున్నట్లు ఉంది కళావతికి అని వెటకారంగా అంటుంది యామిని. జరగబోయేది చెప్పడానికి నీకు ఫోన్ చేశానని అంటుంది యామిని.
నువ్వు రాజ్‌కు ఎంత దగ్గరైనా చివరకు దూరం కావాల్సిందేనని కావ్యతో అంటుంది యామిని. తల్లి కొడుకులను కలిపాలని నువ్వు అనుకున్నావు...కానీ చివరకు మోసగత్తెగా మిగిలిపోయావని సెటైర్లు వేస్తుంది.
తమ ఇంటికి వచ్చిన రాజ్‌కు పోటీపడి భోజనం వడ్డిస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్. మా ఇంటికి రావొద్దని చెప్పానుగా ఎందుకు వచ్చారని రాజ్‌ను అడుగుతుంది కావ్య. ఇక నుంచి నా కేరాఫ్ అడ్రస్ మీ ఇళ్లే అని రాజ్ అంటాడు. నేను తిరిగేది మీ వెనుకే అని రాజ్ బదులిస్తాడు. రేపటి నుంచి అసలు కథ మొదలవుతుందని అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం