Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో హాస్పిటల్‌లో రాజ్‌ను యామిని హగ్ చేసుకోవడం, పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవడం చూసి కావ్య, అప్పు షాక్ అవుతారు. తనమీద ఇష్టం లేకుండా పెళ్లికి ఒప్పుకుంటే డాడీతో మాట్లాడి క్యాన్సిల్ చేయిస్తానని వెళ్తుంటే రాజ్ చేయి పట్టుకుని ఆపుతాడు. అంకుల్‌ని ఇబ్బంది పెట్టొద్దు అంటాడు.
నిజంగా నా మీద ఇష్టంకొద్ది పెళ్లి చేసుకుంటున్నావో నాకు తెలియట్లేదు అని యామిని అంటుంది. ఇష్టమే.. నీ మీద ఇష్టంతోనే పెళ్లికి ఒప్పుకున్నా అని రాజ్ అంటాడు. దాంతో ప్రామిస్ చేయమంటుంది యామిని. దానికి రాజ్ ప్రామిస్ చేస్తాడు. థ్యాంక్స్ బావ.. ఇప్పుడు నేను నీ భార్యగా ఫీల్ అవుతున్నాను. దీనికోసమే కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను అని యామిని అంటుంది. అదంతా చూసి కావ్య, అప్పు అవాక్కవుతారు.
కావ్య కుమిలిపోతూ ఏడుస్తుంది. దేవుడుని చూస్తూ ఏంటీ స్వామి ఇది.. ఆయన ప్రాణాలు కాపాడి దగ్గర చేస్తావు అనుకునేలోపలే అందనంత దూరం చేస్తున్నావా. ఎందుకు ఇలా అని కావ్య ఏడుస్తూ అంటుంది. తర్వాత ఇంట్లో కావ్యను వాళ్లంతా ఎవరు అని అప్పు అడుగుతుంది. అక్కడున్నది మన బావే అని నమ్ముతున్నావా అని అప్పు అంటే.. నా మనసు అదే చెబుతుంది అని కావ్య అంటుంది. ఇంకా ఎందుకు ఆలస్యం వాళ్లమీద పోలీస్ కేసు పెట్టి సెల్‌లో పడేసి నాలుగు తగిలిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. కోర్టులో నిజాలు పెట్టి మన బావను తీసుకొచ్చుకుందాం అని అప్పు అంటుంది.
అలా చేస్తే మనకే నష్టం. గతాన్ని మర్చిపోయిన ఆయనకు ఎలాంటి ప్రెజర్ పడిన అది ఆయన ప్రమాదానికే ప్రమాదం. బాగా ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం పద్ధతిగా వెళ్తేనే మనం అనుకుంది సాధించగలం. బావగారిని తిరిగి కాపాడుకోగలం అని కావ్య అంటుంది. అసలు నీ ఆలోచన ఏంటీ, ఏం చేద్దామనుకుంటున్నావ్ అని అప్పు అంటుంది. అసలు ఆ యామిని ఎవరు, ఆయనకు యామినికి సంబంధం ఏంటీ. మేము కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ బావను తన దగ్గరికి ఎలా తీసుకెళ్లగలిగింది, ఎంత పకడ్బందీగా ఎలా ప్లాన్ చేయగలిగింది, మీ బావను ఎలా నమ్మించగలిగింది అని కావ్య అంటుంది.
వాళ్లంతా ఎవరు. మీ బావకు ఏదైనా ప్రమాదం తలపెట్టడానికి చేస్తున్నారా, మన నుంచి దూరం చేయడానికి చూస్తున్నారా. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు కావాలి. అప్పుడే మనం వాళ్లు వేసిన ప్లాన్ తిప్పికొట్టి మీ బావను వెనక్కి తెచ్చుకోగలం అని కావ్య అంటుంది. అయితే, యామిని సంగతి నేను చూసుకుంటా.. బావకు గతం గుర్తుకు వచ్చేలా నువ్వు చూడు అని అప్పు అంటుంది. అలా ట్రై చేస్తే ఆ ఒత్తిడికి ఆయన కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని కావ్య అంటుంది.
మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడగలం అని అప్పు అంటుంది. ఆయన మనసులో నేనున్నానుగా. మా బంధమే ఆయన గతాన్ని గుర్తు చేయాలి. తనంతట తానే నన్ను ఆయన గుర్తుపట్టాలి. అలా జరగాలంటే పదే పదే ఆయన్ను నేను కలవాలి. మళ్లీ ఆయనతో కొత్తగా పరిచయం చేసుకుంటాను. మళ్లీ ఆయన మనసులోతుల్లో దాగి ఉన్న నా జ్ఞాపకాలను బయటకు తీసుకొస్తాను. నేను నోరు తెరిచి నిజం చెప్పనంతవరకు యామిని ఆయన ముందు అది కూడా నిజం చెప్పదు. దాన్ని మనం వాడుకోవాలి అని కావ్య అంటుంది.
ఆ యామిని గురించి పూర్తిగా తెలుసుకుంటాను అని అప్పు అంటుంది. మీ బావకు జరిగింది, ఇంటి అడ్రస్ గురించి ఇంట్లో చెప్పకు. తెలిస్తే ఒక్క నిమిషం కూడా ఆగరు. కలవాలంటారు. రుద్రాణి అక్కడికి వెళ్లి కూడా గొడవలు చేస్తుంది. మీ బావగారు మనం చెప్పేది నమ్మలేక, యామిని మాటలు నమ్మలేక ప్రాణంమీదకు తెచ్చుకుంటారు అని కావ్య చెబుతుంది. అపర్ణ అత్తయ్య ఎలా బాధపడుతున్నారో చూస్తున్నావుగా అని అప్పు అంటుంది.
దాంతో అప్పు చేయిని తన మీద వేసుకుని పొరపాటున మీ బావ గురించి చెబితే నా మీద ఒట్టు అని వేయించుకుంటుంది కావ్య. దాంతో అప్పు షాక్ అవుతుంది. యామిని గురించి నువ్ చూసుకో, మీ బావ గురించి నేను ఆలోచిస్తాను అని కావ్య అంటుంది. మరోవైపు యామిని తండ్రి దగ్గరికి రాజ్ వెళ్లి ఆరోగ్యం గురించి అడుగుతాడు. నన్ను చిన్నప్పటినుంచి మీరే ఒక తండ్రిలా చూసుకున్నారని యామిని చెప్పింది. అలాంటి మీకు ఏదైనా జరిగితే తీసుకోడానికి కష్టంగా ఉంటుంది అని రాజ్ అంటాడు.
మన అనుకునేవాళ్లకోసం రూపాయి ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్న రోజులివి. అలాంటి మీరు ఇన్నేళ్లుగా నన్ను చూసుకుంటున్నారు అంటే చాలా గ్రేట్ అని రాజ్ అంటాడు. పాపం రాజ్ యామిని చెప్పింది విని నన్ను మంచివాడిలా చూస్తున్నాడు. నేనేమో మోసం చేస్తున్నాను అని మనసులో అనుకుంటాడు యామిని తండ్రి. యామినిలాగా నన్ను ఇంకెవరైనా ఇష్టడటం, నేను ఎవరినైనా ఇష్టపడటం జరిగిందా అని రాజ్ అడుగుతాడు.
నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి నన్ను మర్చిపోయావా అని అలిగి కాల్ కట్ చేసింది. తను అంత చనువుగా మాట్లాడేసరికి నేను ఎవరినైనా మర్చిపోయానా. నా లైఫ్‌లో ఇంకెవరైనా ఉన్నారా అని డౌట్ వచ్చిందని రాజ్ అంటాడు. అబద్ధం చెప్పలేక, నిజం చెప్పలేక సతమతం అవుతాడు యామిని తండ్రి. నిజం చెబితే కూతురు ఒంటరి అయిపోతుందనుకుంటాడు. ఎవరైనా గుర్తుకు వచ్చారా చెప్పండి. నేను ఎలాగు యామినిని పెళ్లి చేసుకోబోతున్నాను. కనీసం వారికి సారీ చెబితే గిల్టీ ఫీలింగ్ పోతుందని రాజ్ అంటాడు.
ఆ మాటలు వింటున్న వైధేహి రాజ్ మాటలకు కరిగిపోయి నిజం చెప్పేసేలా ఉన్నాడు అని అనుకుంటుంది. వాళ్లదగ్గరికి వెళ్లి అలాంటివి లేనిపోని ఆలోచనలు పెట్టుకుని ఇంకా బాధపడుతారు. ఎంతమంది వెంటపడిన మీరు యామినినే మీ భార్య అని కుండబద్ధలు కొట్టి చెప్పారు. మీ కాలేజీలో మిమ్మల్ని భార్యాభర్తలుగా చూశారు అని కవర్ చేస్తుంది వైధేహి. దాంతో రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు కృష్ణుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటుంది కావ్య.
మంచి జరిగిన వెంటనే చెడు జరగాల. ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఎందుకు ఆడుకుంటున్నావ్. యామినితో ఆయన పెళ్లి ఏర్పాట్లు జరిపించాలా. నువ్వే సొల్యూషన్ చూపించాలి. ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు అని కావ్య అంటుండగా.. రాజ్ మెసేజ్ చేస్తాడు. అది చూసి మురిసిపోతుంది కావ్య. అవతల యామినితో పెళ్లికి ఒప్పుకుని కూడా నాకు మెసేజ్ పెట్టారంటే దాని అర్థం ఆయనకు ఆ పెళ్లి అంటే ఇష్టంలేదనేగా అని కావ్య సంతోషిస్తుంది.
మీరింతకుముందు రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేశారా అని రాజ్ మెసేజ్ పెడితే అర్థం కావట్లేదని కావ్య అంటుంది. మీరు పంపించిన వంట తినగానే గతంలో ఇదివరకు అదే టేస్ట్‌తో తిన్న ఫీలింగ్ కలిగింది. అందుకే అడిగాను అని రాజ్ అంటాడు. మళ్లీ కావ్య వంట చేసి పెట్టడం గురించి మాట్లాడుకుంటారు. ఇంట్లో మీ యామిని సరిగా వండిపెట్టదా అని కావ్య అంటే.. ఆడదానికి ఆడదే శత్రువు అని భలే ఫ్రూవ్ చేసుకుంది. తనగురించి అడిగితే.. జెలసీగా ఫీల్ అవుతుందా అని రాజ్ అనుకుంటాడు.
నాకు జెలసీ ఏం లేదు అని కావ్య రిప్లై ఇస్తే.. తెలివైందే. నా మనసులో మాట ఎలా తెలుసుకుంది అని రాజ్ ఆశ్చర్యపోతాడు. టాపిక్ డైవర్ట్ చేస్తాను అని మళ్లీ వంట గురించి అడుగుతాడు రాజ్. నేను వండినప్పుడు తప్పకుండా పంపిస్తాను అని కావ్య చెబుతుంది. ఒకసారి కలవమని అడగనా అని రాజ్ ఆలోచించి అడుగుతాడు. దాంతో రెస్టారెంట్‌లో కావ్య రాజ్ ఇద్దరు కలుస్తారు. కావ్యను రుద్రాణి, రాహుల్ ఫాలో అవుతారు.
రెస్టారెంట్‌లో కావ్య మాట్లాడేది మొబైల్‌లో రాహుల్ వీడియో తీస్తాడు. అయితే, అక్కడ ఎవరు ఉండరు. రాజ్‌తో ఎలా మాట్లాడాలో కావ్య ప్రాక్టీస్ చేసుకుంటుంది. మన చేతిలో ఉన్న ఈ బ్రహ్మాస్త్రంతో ఇంట్లో ఉన్న వాళ్లందరి కళ్లను ఎలా తెరిపిస్తానో నువ్ చూడు అని రుద్రాణి అంటుంది. రాహుల్, రుద్రాణి వెళ్తుండగా.. రాజ్ లోపలికి వస్తుంటాడు. ముగ్గురు ఎదురెదురుగా వస్తుంటారు. రాజ్‌ను రుద్రాణి చూసి షాక్ అవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం