Brahmamudi March 28th Episode యామిని తండ్రికి గుండెపోటు- రాజ్ పెళ్లి- మామకు మాటిచ్చిన రామ్- కావ్యకు నిజం చెప్పిన డాక్టర్-brahmamudi serial march 28th episode raj promise marry yamini to father star maa brahma mudi today disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 28th Episode యామిని తండ్రికి గుండెపోటు- రాజ్ పెళ్లి- మామకు మాటిచ్చిన రామ్- కావ్యకు నిజం చెప్పిన డాక్టర్

Brahmamudi March 28th Episode యామిని తండ్రికి గుండెపోటు- రాజ్ పెళ్లి- మామకు మాటిచ్చిన రామ్- కావ్యకు నిజం చెప్పిన డాక్టర్

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Serial March 28th Episode: బ్రహ్మముడి మార్చి 28 ఎపిసోడ్‌లో కావ్య నెంబర్ కనిపెట్టి మేసేజ్ చేస్తాడు రాజ్. దాంతో కావ్య తెగ సంబరపడిపోతుంది. యామిని తన తండ్రికి గుండెపోటు వచ్చినట్లు నాటకం ఆడిస్తుంది. ఆస్పత్రిలో తండ్రి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో యామినిని పెళ్లి చేసుకుంటానని రాజ్ మాటిస్తాడు.

బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 28వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య భోజనం క్యారేజ్ కట్టి రాజ్‌కు పంపించిందని రుద్రాణి చెబుతుంది. కానీ, ఆయన పేరు మీద అనాథ ఆశ్రమానికి పంపించినట్లు కావ్య అబద్ధం చెబుతుంది. దాంతో కావ్యను ఇరికిద్దామనుకున్న రుద్రాణి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అంతా రుద్రాణిని తిడతారు.

రాజ్ పొగడ్తలు

స్వప్న కౌంటర్ల మీద కౌంటర్ల వేస్తుంది. తినకుండా రుద్రాణి లేస్తుంటే.. చేసిన ఘనకార్యం చాలు గానీ తిను అని సుభాష్ ఆపుతాడు. దాంతో ఆగిపోతుంది. హమ్మయ్య ఆయన విషయం అయితే బయట పడలేదు అని ఊపిరి పీల్చుకుంటుంది కావ్య. కృష్ణయ్య మావారిని దాచిపెట్టడానికి చిన్న అబద్ధం చెప్పాను. క్షమించు. ఇంతకీ నేను చేసిన వంట ఆయన తిన్నారోలేదో అని కావ్య అనుకుంటుంది. మరోవైపు కావ్య వంట చాలా బాగుందని రాజ్ పొగుడ్తూ ఉంటాడు.

కావ్య పద్ధతిగా ఉండటమే కాదు వంట కూడా బాగా వండింది. అలా ఎవరు చేయలేరు అని రాజ్ అంటాడు. దాంతో యామిని షటప్ అని కోప్పడుతుంది. ఇంత ఆయిల్ వేసి, ఇంత కారం వేస్తే రామ్ ఆరోగ్యం ఏమవుతుంది. డాక్టర్ చెప్పినందుకే కదా నేను లైట్ ఫుడ్ వండుతున్నాను. రామ్ ఇలాంటి ఫుడ్ ఇంకోసారి తినకు. ఇంత ఆయిల్ ఫుడ్ తింటే ఎలర్జీ వస్తుంది. వేసుకునే ట్యాబ్లెట్స్ కూడా పనిచేయవు. రేపటి నుంచి స్ట్రిక్ట్‌గా డైట్ ఫాలో అవ్వు అని యామిని అంటుంది.

ఓకే యామిని. ఈరోజుకు అయితే తింటాను అని రామ్ అనడంతో యామిని లేచి వెళ్లిపోతుంది. అంకుల్ మీ అమ్మాయి చెప్పింది రేపటి నుంచి అని. మళ్లీ ఇంత టేస్టీ ఫుడ్ దొరకదు అని రాజ్ అంటాడు. సరే అని యామిని తండ్రి అనడంతో వైధేహి కోప్పడుతుంది. తర్వాత చేసిన హెల్ప్‌కి ఇలా థ్యాంక్స్ చెప్పాలా. తను వండిన వంటకు థ్యాంక్స్ చెప్పాలి కదా. తన ఫోన్ నెంబర్ లేదు కదా అని రాజ్ ఆలోచిస్తుంటే.. ఆయన తినేసి ఉంటారు. ఇంకా కాల్ రాలేదేంటీ. కొంపదీసి నా వంట నచ్చలేదా అని కావ్య ఆలోచిస్తుంది.

నెంబర్ చూడకపోతే

ఒకవేళ నేను పంపించిన కార్డ్ చూడకపోతే నా నెంబర్ చూడలేరు కదా. అయ్యో కృష్ణయ్య ఏదో ఒక మాయ చేయవయ్యా అని కావ్య అంటుంది. మరోవైపు కార్డ్ మీద నెంబర్ ఉందని గుర్తు చేసుకున్న రాజ్ యామిని చింపేసింది కదా అని ఫీల్ అవుతాడు. వెంటనే చెత్తబుట్ట దగ్గరికి వెళ్లి అందులో ఉన్న ముక్కలను ఒక్కొక్కటిగా పేర్చి ఫోన్ నెంబర్ తీసుకుంటాడు రాజ్. కాల్ చేద్దామని చేస్తూ ఇంతరాత్రిపూట చేస్తే బాగుండదు. మేసేజ్ చేస్తాడు. కానీ, ఆ పేర్చిన ముక్కలను అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు రాజ్.

మీ ఫుడ్‌కు చాలా థ్యాంక్స్ అని రాజ్ కావ్యకు మేసేజ్ చేస్తాడు. అది చదివిన ఆయన మేసేజ్ చేశారు అని గట్టిగా అరుస్తుంది. అటు నుంచి వెళ్లిన రుద్రాణి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. చాటు నుండి చూస్తుంది. ఆయన తిన్నారు. నేను పంపించిన ఫుడ్ తిన్నారు. అందుకే మేసేజ్ చేశారు అని కావ్య అంటుంది. ఇదేంటీ చచ్చినోడికి క్యారేజ్ పంపించింది. ఇప్పుడేమో తిన్నాడు అంటుంది. దీనికి ఏదో దెయ్యం పట్టినట్లుంది. నిజంగానే రాజ్ గాడే దెయ్యంలా వచ్చి దీని ఒంట్లో దూరలేదుగా. ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిది. అసలే వాడికి నాకు పాత కక్షలు చాలా ఉన్నాయి అని పారిపోతుంది రుద్రాణి.

థ్యాంక్యూ అని కావ్య చెబుతుంది. ఇద్దరూ అలా ఫోన్‌లో చాటింగ్ చేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటారు. రాజ్ సంతోషంగా చాటింగ్ చేయడం యామిని చూస్తుంది. నేను వీడికోసం వాడి ఫ్యామిలీని దూరం చేసి గతం మార్చేసి ప్రేమగా చూసుకుంటే తిరిగి తిరిగి దానివైపే పడుతున్నాడు. ఒక్కరోజు భోజనానికే భార్య చుట్టూనే తిరుగుతున్నాడు. నేను అనుకున్నదానికంటే కూడా కావ్య చాలా డేంజర్. దానికే కాదు రామ్‌కు కూడా టైమ్ ఇవ్వడం అస్సలు మంచిది కాదు. ఇకనుంచి రేపు నాలో రెండో కోణం చూడబోతున్నావ్ అని యామిని అంటాడు.

యామిని నాటకం చెప్పిన కావ్య

ఒకరు మనకు నో చెప్పలేని సిచ్యువేషన్‌లో నిలబెట్టాలి. నీతో కూడా నో చెప్పకుండా చేయిస్తా అని యామిని వెళ్లిపోతుంది. మరోవైపు అప్పు కోపంగా కావ్య దగ్గరికి వచ్చి ఫోన్ చూస్తూ మురిసిపోతున్నావ్. అసలేమైంది నీకు. అన్నదానం ఏంటీ, బావ గారి కోసం అని చెప్పడం ఏంటీ. అసలు ఆ క్యారేజ్ ఎవరికోసం పంపించావ్ అని కోప్పడతుంది అప్పు. మీ బావగారి కోసం పంపించాను. నువ్ ఇచ్చిన అడ్రస్‌కు వెళ్లాను. యామినితో పాటు ఆయన ఉన్నారు. నిజంగానే గతాన్ని మర్చిపోయారు. కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్లు మాట్లాడారు అని కావ్య చెబుతుంది.

తర్వాత యామిని గురించి, తాను చూసిన విషయాలు అన్ని యామినికి చెబుతుంది కావ్య. యామిని నిలదీస్తే జాగ్రత్తపడుతుంది. మీ బావను దూరం చేసే పరిస్థితి రావొచ్చు. ఇదంతా హాస్పిటల్‌లో ప్రారంభమైంది. ఆ డాక్టర్ చెప్పిన మాటలు కూడా జాగ్రత్తపెడుతున్నట్లు కాదు భయపెడుతున్నట్లు ఉన్నాయి అని కావ్య అంటుంది. ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను పంపి వాడి నుంచి నిజం రాబడతానని అప్పు అంటుంది. ఒకవేళ మనం అనుకుంది తప్పు అయి డాక్టర్ మంచివాడు అయి యామిని నిజం చెబితే జాగ్రత్తపడుతుందని కావ్య అంటుంది.

రేపు నేరుగా హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్ ఎలాంటివాడో తెలుసుకుని మన దారికి ఎలా తెలుసుకోవాలో చూద్దాం అని కావ్య అంటుంది. నాకు అంత ఓపిక లేదు. నువ్ వాడిని చూసి ఎలాంటివాడో తెలుసుకో. నేను ఈ రాత్రికే తెలుసుకుంటాను. ఎవరికి అనుమానం రాదులే అని అప్పు వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం రాజ్, యామిని తండ్రి జాగింగ్ గురించి మాట్లాడుకుంటారు. యామిని తండ్రి వైధేహి ఇద్దరు ఏజ్ గురించి సరదాగా మాట్లాడుకుంటారు.

యామిని తండ్రికి హార్ట్ స్ట్రోక్

ఏది తిన్న ఏదో సమస్య అని వైధేహి అంటే.. అయినా పదికిలోమీటర్లు పరుగెత్తాను కదా అని అతను అంటాడు. ఆయాస పడుతూ పరిగెత్తడం అవసరమా అని వైధేహి అంటే.. వచ్చింది ఆయాసమే కదా. ఏదో హార్ట్ ఎటాక్ వచ్చినట్లు భయపడతావేంటోయ్ అన్న యామిని తండ్రి గుండె పట్టుకుని పడిపోతాడు. ఇంతలో యామిని వచ్చి ఏమైందని అంటుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుంది, అంబులెన్స్‌కు కాల్ చేస్తాను అని రాజ్ అంటాడు. కట్ చేస్తే అంతా హాస్పిటల్‌లో ఉంటారు.

వైధేహి, యామిని బాధపడుతుంటారు. డాక్టర్ వచ్చి పేషంట్‌కు మైల్డ్‌గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. భయపడాల్సిన అవసరం లేదు. కండీషన్ నార్మల్‌గా ఉంది. కానీ, మళ్లీ ఆయన కంగారుపడటం, హెవీగా టెన్షన్ తీసుకోవడం చేస్తే మాసీవ్ అటాక్ వస్తుంది. అది ఆయన ప్రాణానికే ప్రమాదం. ఆయనకు ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా చూసుకోండి అని డాక్టర్ చెబుతాడు. ఆయన సంతోషంగా ఉండేలా చూసుకుంటాం అని యామిని, వైధేహి అంటారు.

తర్వాత రాజ్, యామిని, వైధేహి వెళ్లి చూస్తారు. ఈ వయసులో జాగింగ్ అవసరమా. ఇప్పుడు ఇలా తెచ్చుకున్నారు అని వైధేహి కోప్పడుతుంది. యామిని అడ్డుకుంటుంది. వైధేహి ఎమోషనల్ డ్రామా చేస్తుంది. అంకుల్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. కాసేపటికి తర్వాత డిశ్చార్జ్ అవ్వొచ్చు అని రాజ్ అంటాడు. డాడ్ ఎందుకు బాధపడుతున్నారు అని యామిని అంటుంది. నేను బాధపడుతుంది నా గురించి కాదు నీ గురించి. ఇది రేపు పెద్ద హార్ట్ స్ట్రోక్ కావొచ్చు. నేను ఎక్కువ కాలం బతికి ఉంటానని నమ్మకం ఏంటీ అని యామిని తండ్రి అంటాడు.

మీ చేతుల్లోనే ఉంది

ఏ ఆడపిల్ల తండ్రికి అయినా తప్పకుండా తీర్చాల్సిన బాధ్యత ఒక్కటే ఉంటుంది. అది ఆ కూతురికి పెళ్లి చేయడం. నిన్ను చేసుకోడానికి రామ్ ఉన్నాడు కదా అని నేను ఎక్కువ కాలం ఆలస్యం చేయలేను. నాకు మళ్లీ ఏదైనా అయి శాశ్వతంగా దూరమయ్యే లోపు మీ ఇద్దరికి పెళ్లి చేసి కొద్దిరోజులు అయిన నా మనవరాలు, మనవడితో ఆడుకోవాలని ఆశగా ఉంది. బాబు రామ్ అది మీ చేతుల్లోనే ఉంది అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడు యామిని తండ్రి.

యామిని నీ మీద ప్రాణాలు పెట్టుకుంది. వీలైనంత త్వరగా యామినిని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వు అని యామిని తండ్రి చేయి చాపుతాడు. మీ కోరిక ప్రకారం యామినిని పెళ్లి చేసుకుంటాను రాజ్ ప్రామిస్ చేస్తాడు. దాంతో యామిని సంతోషిస్తుంది. తండ్రితో ఆడించిన గుండెపోటు నాటకం సక్సెస్ అవుతుంది. మరోవైపు డాక్టర్‌ను రాజ్ గురించి అడిగితే.. ఆరు రోజుల క్రితమే హాస్పిటల్‌కు వచ్చారు. ఇదంతా యామిని ఆడిస్తున్న నాటకం అని డాక్టర్ చెబుతాడు.

తర్వాత రాజ్‌ను హగ్ చేసుకుని నువ్ ఇంత త్వరగా పెళ్లికి ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు తెలుసా అని యామిని అంటుంది. ఆ మాటలు కావ్య విని షాక్ అవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం