Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య కళావతిగా యామిని ఇంట్లో అందరికి పరిచయం అయి వెళ్లిపోతుంది. కళావతిని వైధేహి మెచ్చుకుంటుంది. ఏంటీ మమ్మీ ఏం చేస్తున్నారో మీకేమోనా అర్థమవుతుందో. ఎవరు వచ్చారో ఏం తెలుసుకోకుండా ఏదో పెళ్లి చూపులకు కూర్చుండబెట్టినట్లు రామ్‌తో మాట్లాడిస్తారా. దాన్ని అసలు ఇంట్లోకి రానివ్వకుండా ఉండాల్సింది అని యామిని అంటుంది.
ఏదో థ్యాంక్స్ అని చెప్పడానికి వెతుక్కుంటూ వచ్చింది. మంచి అమ్మాయి అనిపించింది అని వైధేహి అంటుంది. ఇంకేం వాళ్లిద్దరికి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయు అని యామిని అంటుంది. ఎందుకు అలా అంటున్నావ్. తనను చూస్తే మంచి అమ్మాయిలా ఉందని యామిని తండ్రి అంటాడు. మంచి అమ్మాయి కాదు ముంచే అమ్మాయి. తను రామ్ భార్య. తనే కావ్య అంటే.. అని యామిని అంటుంది. దాంతో ఇద్దరు షాక్ అవుతారు.
మరి భర్త దగ్గరికి వచ్చి ఏదో తెలియని మనిషితో మాట్లాడినట్లు వెళ్లిపోయిందేంటీ అని వైధేహి అంటుంది. గతం మర్చిపోయింది రాజ్ కదా. తను కాదు కదా అని తండ్రి అంటాడు. చాలా తెలివిగా మాట్లాడి వెళ్లిపోయింది. వెళ్తూ రాజ్ అని తర్వాత సరిచేస్తూ రామ్ అంది. రాజ్ గతాన్ని గుర్తు చేసేందుకు ట్రై చేసింది అని యామిని అంటే.. మేము అంత గమనించలేదని వాళ్లు అంటారు. తన మొగుడికి మాత్రమే హింట్ ఇచ్చేలా అంది యామిని అంటుంది.
తను గడప దాటి లోపలికి వచ్చినప్పుడు ఏం మాట్లాడలేను. ఏం మాట్లాడిన రాజ్ గతం గురించి మాట్లాడాలి. ఆ గతంలో కావ్య ఉందన్న విషయం బయటపడుతుంది. రాజ్‌కు నిజం తెలిసిపోతుంది. అందుకే నోర్మూసుకుని ఉన్నా. అది సైలెంట్‌గా ఉన్నంతవరకు ఏం సమస్య లేదు. కానీ ఆ దొంగమొహంది ఏదో ప్లాన్ వేసుకుని వచ్చింది. దాన్ని మనం తిప్పికొట్టాలి. తన ఊపిరి తగిలిన గతం గుర్తు చేయగలదు. అంత తెలివైనది. అందుకే రాజ్‌తో నా పెళ్లి జరగాలి. తన భవిష్యత్తు కూడా నేనే రాయబోతున్నాను. ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేసైనా సరే పెళ్లికి ఒప్పిస్తాను అని యామిని అంటుంది.
మరోవైపు కావ్య వంట చేస్తుంటే రుద్రాణి, రాహుల్ ఆశ్చర్యపోతారు. ఇదేంట్రా అంత అవమానించినా గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చి అంత సంతోషంగా ఉందని రుద్రాణి అంటే.. కావ్య కూడా మనలాగే మమ్మీ. మనం ఎవరు ఏమన్నా దులిపేసుకుని పోతాం. కావ్యమో ఎవరెన్నీ మాటలు అన్న ధైర్యంగా నిలబడుతుంది అని రాహుల్ అంటాడు. చాల్లే నోర్మూయ్ అని రుద్రాణి కోప్పడుతుంది. అసలు అది ఎందుకంత ఆనందంగా ఉంటుందో తెలుసుకోవాలి అని రుద్రాణి అంటే.. రాహుల్ ఆపుతాడు.
నేను ఇన్ని ప్రయత్నాలు చేసిన ఓడిపోవడానికి కారణం ఎవరో తెలుసా అని రుద్రాణి అంటే.. ఎవరు మమ్మీ ఆ దుర్మార్గుడు అని రాహుల్ అడుగుతాడు. నువ్వేరా. నీ పేరు రాబందో గుడ్లగూబో అని పెట్టాల్సింది అని కావ్య దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. చాలా వంటలు వండేసావ్ ఎవరికోసమో అని రుద్రాణి అంటే.. మా వారికోసం అని కావ్య అంటుంది. మా వారు ఎక్కడున్నారో నాకు బాగా తెలుసు. అందుకే క్యారేజ్ కట్టి పంపిస్తున్నా. మీ పని మీరు చూసుకోండి అని కావ్య అంటుంది.
దీనికి నిజంగా చిప్పు దొబ్బింది. నా మొగుడు గురించి మాట్లాడుతావా. అందరి ముందు నీ గురించి మాట్లాడి ఎలా ఇరికిస్తానో చూడు అని రుద్రాణి మనసులో అనుకుని వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్ దగ్గరికి యామినితో పెళ్లి గురించి మాట్లాడేందుకు తల్లిదండ్రులు వెళ్తారు. మీ పెళ్లి గురించి పురోహితుడితో మాట్లాడాం. ఈ నెలలో మంచి ముహుర్తాలు ఉన్నాయట. మీ పెళ్లి జరిపిస్తే మా బాధ్యత తీరుతుంది అని తండ్రి అంటాడు. మీరు భార్యాభర్తలుగా మారి ఏ పిల్లాడో పాపనో ఇస్తే సంతోషంగా ఉంటాం అని వైధేహి అంటుంది.
అప్పుడే వచ్చిన యామిని అది అంత మొహమాటంగా అంటావేంటీ మామ్. ఎంగేజ్‌మెంట్ అప్పుడే మళ్లీ మరోసారి తాళి ఎందుకు ఇప్పుడే కడతాను అన్నాడు. ఇప్పుడు పెళ్లికి ఏం అభ్యంతరం ఉంటుంది. యాక్సిడెంట్ కాకపోతే ఎప్పుడో పెళ్లి జరిగిపోయేది. ఇప్పుడు అన్ని సెట్ అయ్యాయి కాబట్టి పెళ్లి చేసుకోడానికి ఏం ఇబ్బంది ఉండదు అంటుంది. సారీ యామిని పెళ్లికి నాకింకా టైమ్ కావాలి. పెళ్లంటే నా మనసెందుకో అంగీకరించట్లేదు అని రామ్ అంటాడు.
మా యామిని నచ్చలేదా, కట్నం గురించి ఆశిస్తున్నావా అని తల్లిదండ్రులు అంటే.. రాజ్ కాదని అంటాడు. నేనింకా డిస్టర్బ్‌గానే ఉన్నా. ఇప్పటికీ నాకోసం చాలా కష్టపడుతున్నావ్. నన్ను పెళ్లి చేసుకుంటే మరింత కష్టపడతావ్. నీకే అర్థం కావట్లేదు. నా కండిషన్ అర్థం చేసుకో. నన్ను ఇబ్బంది పెట్టకు అని రాజ్ వెళ్లిపోతాడు. ఏంటీ మామ్ వీడు. నాకే చిరాకు తెప్పిస్తున్నాడు. ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. కావ్య ఇంటికి వచ్చాక కూడా ఆగితే ఎలా అని యామిని అంటుంది.
అలా అని రాజ్‌ను ఇబ్బందిపెడితే మొదటికే మోసం వస్తుందని తండ్రి అంటాడు. రాజ్‌ను ఇబ్బంది పెట్టి నీ మీద ఇరిటేషన్ తెప్పించుకోకు. నిదానంగా నీవైపు తిప్పుకో అని తల్లి చెబుతుంది. రాజ్ కోసం కావ్య కెరియర్ ప్యాక్ చేస్తుంది. అందులో నా నెంబర్ రాస్తే బాగుంటుంది కదా అని చెప్పి పేపర్‌పై హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతతో కళావతి అని రాస్తుంది కావ్య. కట్ చేస్తే యామిని ఇంటికి డెలివరీ బాయ్ వెళ్లి క్యారేజ్ ఇస్తాడు. రామ్ సర్‌కి కళావతి మేడమ్ ఫుడ్ పంపించారు అని చెబుతాడు.
ఇంతలో వచ్చిన రాజ్ ఏంటీ కళావతి పంపించిందా అని ఇటివ్వు అని తీసుకుంటాడు. తెలియనివాళ్లు పంపించింది తినడం ఎందుకు అని యామిని అంటుంది. కృతజ్ఞతతో పంపించింది కాదనకూడదు. పైగా ఆకలి వేసే టైమ్‌లో పంపించారు అంటే వారిలో ఎంత అభిమానం ఉండి ఉంటుంది అని తీసుకుంటాడు. తర్వాత యామిని క్యారేజ్ ఓపెన్ చేస్తుంది. దానిపై కావ్య రాసి ఉన్న పైపర్ చూసి చదువుతాడు. భలే క్యూట్‌గా రాసింది కదా. ఇన్నిరకాల ఐటమ్స్‌తో థ్యాంక్స్ చెప్పాల అని రాజ్ అంటాడు.
తర్వాత కావ్య నెంబర్ రాజ్ చూస్తుంటే.. లాక్కున్న యామిని దాన్ని నిలిపేసి కింద పడేస్తుంది. అదేమైనా గ్రీటింగ్ కార్డా.. దాచుకోడానికి అని యామిని అంటుంది. దాంతో సరేనని అంటాడు రాజ్. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో చికెన్, ఫిష్, ఎగ్ కర్రీ వండేసరికి ఏమైనా పండుగ అని ప్రకాశం అడుగుతాడు. మరోవైపు కావ్య వంటను విపరీతంగా పొగుడుతాడు రాజ్. అల్లుడు గారు గతం మర్చిపోయినా భార్య చేతి వంట రుచి మర్చిపోలేదు అని తండ్రి అంటాడు.
దాంతో వైధేహీ నోరుమూసుకోమంటుంది. ఇంతలో రాజ్ ఏంటీ సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు అని అడిగితే.. మా మధ్య సీక్రెట్స్ ఏముంటాయి. మీరు ఇలా తినడం హ్యాపీగా ఉందని వైధేహి అంటుంది. మరోవైపు ఉప్పు, కారం సరిగ్గా సరిపోయాయా అని అడిగితే అంతా పిచ్చిదానిలా చూస్తారు. ఏదో వంటల పోగ్రామ్ జరుగుతున్నట్లు అంత టెన్షన్ పడుతున్నావేంటీ అని కల్యాణ్ అంటుంది. అన్ని సరిగ్గా సరిపోతేనే కదా ఆయన బాగా తినేది అని కావ్య అంటుంది.
ఆయనెవరు అని సుభాష్ అంటాడు. ఇంకెవరు ఆవిడా గారి శ్రీవారు అని రుద్రాణి అంటుంది. ఈవిడ ముందునుంచి క్యారేజ్ పంపించాను. ఆమె గురించి తెలిసి కూడా జాగ్రత్తపడలేదు. ఆయన గురించి చెబితే ఎక్కడున్నారో అడుగుతారు. అది చెప్పలేని పరిస్థితి నాది అని కావ్య అనుకుంటుంది. చెప్పు కావ్య. ఇందాక రాజ్ కోసమే క్యారేజ్ పంపించావ్ కదా. ఆ విషయమే చెప్పు. ఇందాక పంపించింది రాజ్ కోసం కాదా. ఎప్పుడులేనిది ఇన్ని వంటలు ఎందుకు చేశావ్ మరి అని రుద్రాణి అంటుంది.
ఎవరికి పంపిచావ్ కావ్య. ఎవరికోసం చేశావ్ అని సుభాష్ అడుగుతాడు. నిజం చెబితే తన పిచ్చితనం బయటపడుతుంది కదా అని రుద్రాణి అంటుంది. క్యారేజ్ పంపించిన మాట నిజమే. ఆయన త్వరగా ఇంటికి రావాలని అనాథ ఆశ్రమంలోని పిల్లలకు అన్నదానంచేయాలని పంపించాను మావయ్య అని కావ్య అబద్ధం చెబుతుంది. దాంతో ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. పచ్చి అబద్ధం. ఇందాక నేను అడిగితే రాజ్ కోసం అంది. ఇప్పుడు మాట మార్చింది అని రుద్రాణి అంటుంది.
మాట మార్చడం, మోసం చేయడం నీకు అలవాటు. మీరు ఎప్పుడు అయినా పట్టెడు అన్నం పెట్టారా. మా చెల్లి అన్నదానం చేస్తే దాన్నికూడా తప్పుబట్టడాన్ని మీకు సిగ్గు అనిపించట్లేదా అని స్వప్న అంటుంది. ఇందిరాదేవి కూడా తిడుతుంది. మీరు నమ్మిన నమ్మకున్న నేను చెప్పేది నిజం అని రుద్రాణి అంటుంది. నిన్ను, నీ కొడుకును ఈ ఇల్లు నమ్మడం ఎప్పుడే మానేసింది అత్త అని స్వప్న అంటుంది. మరోవైపు కావ్య రాసిన పేపర్ కోసం చెత్తబుట్టలో రాజ్ వెతుకుతాడు.
యామిని ముక్కలు చేసిన ఆ పేపర్‌ను ఒకటిగా పేర్చుతాడు. ఆ ముక్కల నుంచి కావ్య నెంబర్ తీసుకుని మేసేజ్ చేస్తాడు. కావ్యకు ఫుడ్‌కి చాలా థ్యాంక్స్ అని మేసేజ్ పంపిస్తాడు రాజ్. కావ్యతో రాజ్ సంతోషంగా నవ్వుతూ చాటింగ్ చేస్తాడు. అది యామిని చూస్తుంది. నేను అనుకున్నదానికన్నా కావ్య చాలా డేంజర్. వీళ్లకు టైమ్ ఇవ్వడం అస్సలు మంచిది కాదు. ఇప్పటివరకు బతిమిలాడిన యామినిని చూశావ్. రేపు నా రెండో కోణం చూడబోతున్నావ్ అని యామిని అనుకుంటుంది. ఇక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం