Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రిన్సిపాల్ ఫొటో ఇస్తే వాళ్లెవరు గుర్తు రావట్లేదని రాజ్ అంటాడు. దాంతో అందులో ఎవరెవరేంటో యామిని చెబుతుంది. అది చూసిన కావ్య ఆయనకు గతం గుర్తులేదని నీకు నచ్చిన గతాన్ని చూపిస్తూ బొమ్మల ఆడుకుంటున్నావ్ యామిని. నిన్ను వదిలిపెట్టను అని అనుకుంటుంది.
సారీ యామిని నిజంగా నాకెవరు గుర్తుకు రావట్లేదు అని రాజ్ అనడంతో.. వీళ్లు నీకు గుర్తుకురావాలని చూపించట్లేదు. నీకు గతం గుర్తుకు రావట్లేదని ఫీల్ అవుతున్నావ్ కదా. నీకు ఓల్డ్ మెమోరీస్ చూపించాలని తీసుకొచ్చాను. ఎక్కువగా ఆలోచించకు అని యామిని అంటుంది. ఇంతలో ప్రిన్సిపాల్ సక్సెస్ అన్నట్లుగా చేయి వేలు చూపిస్తుంది. యామిని కూడా అలాగే అంటుంది. తర్వాత రాజ్, యామిని వెళ్తారు. అది చూసి కావ్య కూడా వెళ్తుంది.
ఏంటీ ప్రిన్సిపాల్ నీకు చూపించింది ఏది గుర్తుకు రావడం లేదా. ఎలా గుర్తుకు వస్తుంది. ఇది నేను సృష్టించింది కదా. ఇంకా ఉంది అని మనసులో అనుకున్న యామిని రాజ్‌తో బావ నీకు ఇంకో సర్‌ప్రైజ్ ఉందని అంటుంది. దాంతో కొంతమందిని కలుస్తారు. హాయ్ రామ్ అని వాళ్లు అంటే, రాజ్ తెలియకుండా చూస్తాడు. వాళ్లు మన కాలేజ్ ఫ్రెండ్స్ అని యామిని చెబుతుంది. వాళ్లు బాగా తెలిసినట్లుగా, అడ్వెంచర్స్ చేసినట్లు మాట్లాడుతారు.
రాజ్ అర్థం కానట్లు చెప్పడంతో మన మెమోరీస్ ఎలా మర్చిపోతావ్ అని ఫోన్‌లో చూపిస్తాడు ఒకతను. ఇవి చూశాక కూడా నీకు గుర్తు రావట్లేదా అని అతను అంటాడు. అంత ప్రెజర్ పెట్టకండి. కండిషన్ చెప్పాగా అని యామిని అంటే.. నువ్వే ప్రెజర్ పెడుతూ నువ్వే గతాన్ని చూపిస్తున్నావా అని కావ్య అనుకుంటుంది. ఎక్కడైనా లంచ్‌కు వెళ్దామా అని అతను అంటే.. లేదు మాకు అర్జంట్ మీటింగ్ ఉంది. వీకెండ్ రండి పార్టీ చేసుకుందామని వాళ్లను పంపిస్తుంది యామిని.
బావ నీకు ఇంకో పెద్ద సర్‌ప్రైజ్ ఉంది అని యామిని అంటే.. ఇంకానా అని రాజ్ అంటాడు. మీ మామ్, డాడ్ గురించి అడిగావ్ కదా. వాళ్లనే చూపించబోతున్నాను అని యామిని అంటుంది. అమ్మనాన్నలా ఏంటిది. తన మాటలు వింటుంటే నాకే అనుమానం కలుగుతుంది. కచ్చితంగా వీళ్లను ఫాలో చేయాల్సిందే అని కావ్య అనుకుంటుంది. బావ ఇది మన ఫామ్ హౌజ్ అని చెప్పి రాజ్‌ను లోపలికి తీసుకెళ్తుంది యామిని. అక్కడ రెండు సమాధులు చూపిస్తుంది.
క్రీ.శ. కైలాష్, భానుమతి అని సమాధాలు ఉంటాయి. మీ మామ్ డాడ్‌ను పరిచయం చేస్తానన్నాను కదా. వీళ్లే అని యామిని చెబుతుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. మా అత్తయ్య మావయ్యలను నీ స్వార్థానికి చంపేశావా అని కావ్య అనుకుంటుంది. మన చిన్నప్పుడే మీ మామ్ డాడ్ చనిపోయారు. నువ్ ఒక్కడివే ఏడుస్తుంటే చూళ్లేకపోయాను. మా అమ్మ మీ నాన్నగారి సొంత చెల్లెలు. అందుకే నిన్ను ఒంటరిగా వదిలేయడం ఇష్టంలేక సొంత కొడుకులా పెంచుకుంది అని యామిని అంటుంది.
మా అమ్మ నాన్న చనిపోయిన జ్ఞాపకాలు ఏం గుర్తుకు రావట్లేదు అని రాజ్ అంటే.. ఇన్నేళ్లు నీతో ఉన్న నేనే గుర్తుకు రాలేదు. ఎప్పుడో జరిగిపోయింది ఎందుకు గుర్తుకు ఉంటుంది అని యామిని అంటుంది. ఇలా రాజ్‌కు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఇస్తుంది యామిని. తర్వాత మనిద్దరికి ఒకరిమీద ఒకరికి ఇష్టం పెరిగింది. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆరు నెలలకు ముందు జరిగిన యాక్సిడెంట్‌తో అన్నీ కొత్తగా పరిచయం చేయాల్సి వస్తుందని యామిని అంటుంది.
6 నెలల కిందట యాక్సిడెంట్, తల్లిదండ్రులు చనిపోయారు. ఆయన్ను ఏం చేద్దామనుకుంటున్నావే అని కావ్య కోప్పడుతుంది. రాజ్ తలనొప్పిగా ఉందని చెబుతాడు. నువ్ ఇలా ప్రెజర్ తీసుకుంటే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ చెప్పాడు కదా అని చెప్పిన యామిని పూలదండలు ఇస్తుంది. నాకు దొరికిన ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోను. ప్రతి విషయంలోనూ నిన్ను నమ్మించి నావాన్ని చేసుకుంటాను అని యామిని మనసులో అనుకుంటుంది.
పూలదండలను యామిని వేయమంటుంది. కానీ, రాజ్ ఆగి నా వల్ల కావట్లేదు. నాకు గుర్తు రావట్లేదు. ప్లీజ్ వెళ్లిపోదాం పదా అని రాజ్ అంటాడు. ఆయన్ను నీ సొంతం చేసుకోడానికి నువ్ ఆడుతున్న నాటకం ఆయన తెలుసుకోలేకపోవచ్చు. కానీ, నీ నుండి ఆయన్ను నేను ఎలా కాపాడుకోవాలో, ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు అని కావ్య అంటుంది. రాజ్ పూలదండలు సమాధులపై పడేసి వెళ్లిపోతాడు. యామిని చెప్పినట్లు చేయకుండా ఉంటాడు.
తర్వాత కావ్యకు అప్పు కాల్ చేసి ఏమైందని అడుగుతుంది. చాలా తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ పెద్ద డ్రామానే నడుస్తుంది. ఇంటికి వచ్చాక చెబుతాను అని కావ్య అంటుంది. మరోవైపు దుగ్గిరాల ఇంటికి మానసిక రోగుల చికిత్స కేంద్రం అనే వ్యాన్ వస్తుంది. అందులోనుంచి డాక్టర్ వచ్చి పేషంట్ ఎక్కడ, ప్రాబ్లమ్ చేస్తుంది అన్నారు, త్వరగా రావాలని ఫోన్ చేశారని డాక్టర్ అంటాడు.
ఇంతలో రుద్రాణి వచ్చి నేనే కాల్ చేశాను అని చెబుతుంది. ఇంటి పరువు తీయాలని అనుకుంటున్నావా అని సుభాష్ కోప్పడితే.. పరువు తీస్తుంది నేను కాదు. అదిగో వస్తుందిగా ఈ ఇంటి ముద్దుల కోడలు. ఆవిడ తీస్తుంది అని రుద్రాణి అంటుంది. ఏంటీ కావ్య అలా చూస్తున్నావ్. రాజ్‌ను తీసుకొస్తా. మా కళ్లకు కనువిప్పు కలిగిస్తా అన్నావ్. ఎక్కడ రాజ్ కనిపించడే. కారులో అలిగి కూర్చున్నాడా. కనీసం నువ్వైనా చూశావా అని రుద్రాణి సెటైర్లు వేస్తుంది.
చూశాను అని కావ్య అంటే.. వావ్ మళ్లీ చూశావా. నీ కళ్లకే కనిపిస్తున్నాడు. మాకు కనిపించట్లేదు. ఇంతకు నువ్ చూసిన రాజ్ ఎక్కడ అని రుద్రాణి అడిగితే.. కావ్య చెప్పబోయి ఆగిపోతుంది. ఇంట్లోవాళ్లకు తెలియదనుకుంటుంది. దాంతో రుద్రాణి మరింత రెచ్చిపోయి వెటకారంగా మాట్లాడుతుంది. రాజ్ ఎక్కడన్నాడో చెప్పు అని రుద్రాణి అంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పలేను అని కావ్య అంటుంది. ఇంకా చూస్తే మనల్ని పిచ్చోళ్లను చేస్తుంది. డాక్టర్ గారు నేను చెప్పిన పేషంట్ తనే. తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇవ్వండి అని రుద్రాణి అంటుంది.
రుద్రాణి ఆపు. సారీ డాక్టర్ ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అని సుభాష్ చెప్పడంతో.. మీకు మీకు ఉంటే మీరే చూసుకోవాలి గానీ మా టైమ్ ఎందుకు వేస్ట్ చేస్తారు అని డాక్టర్ వెళ్లిపోతాడు. ఎందుకు పంపించావ్ అన్నయ్య. కావ్యను హాస్పిటల్‌లో నాలుగు రోజులు ఉంచితే.. దెబ్బకు రోగం నయం అయి నిజాలు తెలుసుకుంటుంది అని రుద్రాణి అంటే.. ఇందిరాదేవి అరుస్తుంది. నీకు హక్కు లేదు. మేము తనకున్నాం అని అంటుంది.
అపర్ణను చూపించి రుద్రాణి డ్రామా చేస్తుంది. కొడుకు పోయాడన్న చేదు జ్ఞాపకాల నుంచి బయటకు తీసుకురాడం మానేసి బతికే ఉన్నాడంటూ నరకం చూపిస్తున్నారు. మళ్లీ వస్తాడంటూ తనలో ఆశలు కలిగిస్తున్నారు. తనను మోసం చేయడం మీకు తప్పుగా అనిపించడంలేదా. చావు లేని ఇల్లంటూ ఉంటుందా. రాజ్ కొంచెం ముందు వెళ్లిపోయాడు. దాని నుంచి బయటపడి ముందుకు వెళ్లాలి. రోజుకో కొత్త నాటకంతో ఇంట్లోవాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈరోజే అన్ని నిజాలు బయటకు రావాలి అని రుద్రాణి అంటుంది.
ఎందుకు అబద్ధం చెప్పి మోసం చేయాలని అనుకుంటున్నావ్ అని రుద్రాణి అంటే.. మోసం చేయట్లేదు అని కావ్య అంటుంది. ఆయన తప్పకుండా ఒకరోజు మీ ముందుకు వస్తారు అని కావ్య అంటే.. ఎప్పుడొస్తాడు. వారం రోజులకా, సంవత్సరానికి, నాకు టైమ్ కావాలి. నీలా పిచ్చిదానిలా సంవత్సరాల తరబడి ఎదురుచూడాలేం అని రుద్రాణి అంటుంది. సరే, చెబుతాను వినండి. సరిగ్గా ఈరోజు నుండి 30 రోజుల్లో అంటే నెల తిరిగే లోపు ఆయన్ను మీ అందరి ముందు నిలబెడతాను అని కావ్య అంటుంది.
ఒకవేళ తీసుకురాకపోతే అని రుద్రాణి అంటే.. మీరు ప్లాన్ చేసిన విధంగా ఆయన ఫొటోకు దండం, దీపం పెట్టి నన్ను హాస్పిటల్‌కు పంపించి మీరే ఈ రాజ్యం ఏలండి అని కావ్య వెళ్లిపోతుంది. తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వెళ్తుంది. కావ్యను చూడగానే షాక్ అయిన రాజ్ తర్వాత సంతోషిస్తూ హాయ్.. మీరా అని అడుగుతాడు. అక్కడే ఆగిపోయారేంటీ రండి లోపలికి అని రాజ్ పిలుస్తాడు. రాజ్, కావ్య చాలా సరదాగా మాట్లాడుకుంటారు.
అది చూసిన యామిని ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందని యామిని అంటే.. నాక్కూడా చూసినట్లు బాగా తెలిసినట్లు అనిపిస్తుందని రాజ్ అంటాడు. దాంతో కావ్య ప్రేమగా చూస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం