Brahmamudi March 21st Episode: రాజ్ గతం మర్చిపోయినట్లు తెలుసుకున్న కావ్య- యామిని నాటకం చూసిన కళావతి- మరదలిపై రామ్ చిరాకు-brahmamudi serial march 21st episode kavya knows raj forgot his past star maa brahma mudi today disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 21st Episode: రాజ్ గతం మర్చిపోయినట్లు తెలుసుకున్న కావ్య- యామిని నాటకం చూసిన కళావతి- మరదలిపై రామ్ చిరాకు

Brahmamudi March 21st Episode: రాజ్ గతం మర్చిపోయినట్లు తెలుసుకున్న కావ్య- యామిని నాటకం చూసిన కళావతి- మరదలిపై రామ్ చిరాకు

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Serial March 21st Episode: బ్రహ్మముడి మార్చి 21 ఎపిసోడ్‌లో హాస్పిటల్‌కు రాజ్, యామిని వెళ్తారు. ఇద్దరు కావ్య గురించి తెలుసుకోవాలని ఒకరినొకరు దూరం వెళ్లిపోతే బాగుండు అని ఒకేలా ఆలోచిస్తారు. డాక్టర్ రాజ్‌కు జాగ్రత్తలు చెబుతుంటే.. వచ్చి విన్న కావ్య భర్త గతం మర్చిపోయినట్లు తెలుసుకుంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 21వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌కు దీపం వెలిగించబోయిన రుద్రాణి గొంతు పట్టుకుని గోడకు పెట్టి నులిమేస్తుంటుంది కావ్య. ఇంట్లోవాళ్లు ఎవరు ఆపిన ఆగదు. ఊపిరాడక విలవిల్లాడుతుంది రుద్రాణి. తర్వాత కావ్యను వెనక్కి లాగుతారు ఇంట్లోవాళ్లు.

ఇదే చివరి వార్నింగ్

ఊపిరి అందడం లేదు కదా. చచ్చిపోతామని భయం వేసింది కదా. బతికున్న నా భర్త ఫొటోకు దీపం పెడుతున్న నాకు అదే అనిపిస్తుంది. నీకు ఇదే చివరి వార్నింగ్. లేకుంటే ఊరుకోను అని కావ్య అంటుంది. లేకపోతే ఏం చేస్తావ్. ఇలాగే పీక పిసికి చంపేస్తావా అని రుద్రాణి అంటుంది. నా భర్త కోసం ఎంత దూరమైన వెళ్తాను అని కావ్య అంటుంది. సరే రాజ్ బతికే ఉన్నాడంటున్నావ్ కదా. ఎక్కడున్నాడు. ఏం చేస్తున్నాడు. ఎవరో అమ్మాయితో ఎక్కడికో ఎందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రావాలిగా. ఎందుకు రాలేదు అని రుద్రాణి అంటుంది.

అదే ప్రశ్న మిమ్మల్ని నేను తిరిగి అడిగితే అని కావ్య అంటుంది. మా ఆయన చనిపోవడం నిజమైతే ఆయన బాడీ ఎక్కడ అని కావ్య అడుగుతుంది. నీ చెల్లెలే కన్ఫర్మ్ చేసిందిగా, రాజ్ బట్టలకు రక్తం అంటుకుంది. ఏ పులో, సింహమో తిని ఉంటుందని రుద్రాణి అంటుంది. అలా జరగడం మీరు చూశారా అని కావ్య అడుగుతుంది. అలా చెప్పే కదా పోలీసులు కేస్ క్లోజ్ చేశారు అని రుద్రాణి అంటుంది. ఆయన చనిపోవడం మీరు చూశారా. మీలో ఎవరైనా చూశారా. చూల్లేదు కదా. కానీ, ఆయన బతికి ఉండటం నేను చూశాను అని కావ్య అంటుంది.

కాబట్టి ఇలాంటివన్ని వద్దు అంటున్నాను. ఎవరు నమ్మిన నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. ఆయన బతికే ఉన్నారు. త్వరలోనే ఆయన్ను మీ అందరిముందుకు నేను తీసుకొస్తాను అని గట్టిగా అరిచిన కావ్య ఫొటో తీసుకుని వెళ్తుంది. రా అప్పు హాస్పిటల్‌కు టైమ్ అవుతుందనుకుంటూ వెళ్తుంది. మరోవైపు కారులో రాజ్, యామిని వెళ్తుంటారు. రాజ్ కాపాడిన అమ్మాయి గురించి యామిని ఆలోచిస్తుంటుంది. తనను మా మధ్యకు రాకుండా చేయాలి. రాజ్ గతాన్ని నాకు నచ్చినట్లుగా సృష్టించికుని నావాడిగా చేసుకోవాలి అని యామిని అంటుంది.

ఫోన్ నెంబర్ దొరికినా సరే

మరోవైపు రాజ్ కూడా కావ్య గురించి ఆలోచిస్తుంటాడు. పదే పదే ఎందుకు గుర్తొస్తుంది. ఎలాగైనా తనను కలిసి నా గతం గురించి ఏమైనా తెలుసో అడగాలి అని రాజ్ అనుకుంటాడు. మరోవైపు మీ బావ నన్ను జాయిన్ చేసిన హాస్పిటల్‌కి వెళ్తున్నాం. అక్కడ ఏదైనా క్లూ దొరకొచ్చు అని కావ్య అంటుంది. అవును అడ్మిట్ చేసినవాళ్ల డీటేల్స్ తీసుకుంటారు. ఫోన్ నెంబర్ దొరికినా సరే అని అప్పు అంటుంది. డాక్టర్ కోసం యామిని, రాజ్ ఎదురుచూస్తుంటారు.

ఒకరినొకరు డైవర్ట్ చేసి అమ్మాయి గురించి తెలుసుకోవాలని రాజ్, యామిని అనుకుంటారు. ఇద్దరు ఒకేలా ఆలోచిస్తుంటారు. మరోవైపు పోలీస్ స్టేషన్‌లో ఇంపార్టెంట్ కేసు అని అప్పుకు కాల్ వస్తే వెళ్లిపోతుంది. అడుగు దూరంలో రిసెప్షన్ అమ్మాయి గురించి అడిగితే తెలుస్తుంది. రాజ్ ఉండగా ఎలా తెలుసుకోవాలి అని యామిని అనుకుంటే యామిని ఎక్కడికి వెళ్లట్లేదు. ఎలా తెలుసుకోవాలి అని రాజ్ అనుకుంటాడు. ఇంతలో రాజ్ వాష్ రూమ్‌కి వెళ్లాలని వెళ్తాడు.

తర్వాత రిసెప్షన్ దగ్గరికి ఎలా వెళ్లాలి. ఏదోటి ప్లాన్ చేసి వెళ్లాలి అని రాజ్ అనుకుంటాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్లి యామిని వెళ్లి కావ్య గురించి అడుగుతుంది. సర్వర్ కొంచెం స్లోగా ఉందని రిసెప్షన్ అతను చెబుతాడు. యామిని దగ్గర అక్కడే మాట్లాడుతుంది ఎలా అబ్బా అని డాక్టర్‌ను అడిగితే తెలుస్తుంది కదా అని లేడి డాక్టర్‌ దగ్గరికి వెళ్తాడు రాజ్. నర్స్ వచ్చి డాక్టర్ వెళ్లిపోతారు అని చెప్పగానే సరే అని డీటేల్స్ తీసి ఉంచండి వచ్చి తీసుకుంటాను అని యామిని చెప్పి వెళ్లిపోతుంది.

తెలుసుకునే టైమ్ ఇవ్వలేదు

ఇంతలో వచ్చిన కావ్య నన్ను జాయిన్ చేసింది ఎవరు అని అడుగుతుంది. ఇప్పుడే మీ గురించి అడిగారు అని చెప్పగానే యామిని వెళ్లినవైపు వెళ్తుంది కావ్య. ఇంతలో డాక్టర్‌ను కలిసి రాజ్ ఆ అమ్మాయి గురించి అడుగుతాడు. బిల్ అడ్వాన్స్‌గా పే చేసి మీరు వెళ్లారు. తను కూడా కంగారుగా వెళ్లారు. ఎవరో ఏంటో తెలుసుకునే టైమ్ ఇవ్వలేదు అని డాక్టర్ చెబుతుంది. ఇంతలో రాజ్ దగ్గరికి యామిని వచ్చి ఎక్కడికి వెళ్లిపోయావ్ అని అడుగుతుంది.

ఎందుకంత కంగారు. నేనే వచ్చివాడిని కదా అని చిరాకు పడతాడు రాజ్. డాక్టర్ వెళ్లిపోతాడని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది యామిని. రామ్ మధ్య ఇలా తిరుగుతున్నందుకే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని డాక్టర్ అంటుంటాడు. కావ్య వెతుక్కుంటూ వచ్చి రాజ్‌ను చూస్తుంది. చూసి పిలవబోతూ ఆగిపోతుంది. బావకు నేనే స్పెషల్ కేర్ తీసుకుని టైమ్‌కు ట్యాబ్లెట్స్ ఇస్తున్నాను అని యామిని అంటే.. అవును అని రాజ్ అంటాడు.

అది విన్న కావ్య బావ.. మా ఆయన్ను బావ అంటుందేంటీ అని కావ్య అంటుంది. మీరు 6 నెలలు కోమాలో ఉండటంతో మీ డైజెస్టివ్ సిస్టమ్ కంట్రోల్‌లో ఉండదు. జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్ అంటాడు. కోమాలో ఉన్నారా. మొన్నేకదా యాక్సిడెంట్ అయింది. అంటే ఈయన్ను వీళ్లు మాయ చేయాలని చూస్తున్నారా అని డౌట్ పడుతుంది కావ్య. రామ్ మీరు అసలు స్టెస్ తీసుకోవద్దు. ఆరు నెలలు క్రితం మీకు యాక్సిడెంట్ అయి తల వెనుక భాగం దెబ్బ తగిలింది. దానివల్ల మీరు గతం మర్చిపోయారు అని డాక్టర్ అంటాడు.

గతం గుర్తుకు రావాలి

అది విన్న కావ్య షాక్ అవుతుంది. మళ్లీ మీ నెర్వ్ సిస్టమ్ నార్మల్ కావడానికి టైమ్ పడుతుంది. అప్పటివరకు టైమ్ పడుతుంది అని డాక్టర్ అంటే.. నాకు గతం తెలుసుకోవాలి. నాకు క్లారిటీ కావాలి. ఎంత ఆలోచించినా గుర్తురావట్లేదు. ఆలోచిస్తే హెడెక్ వస్తుంది. నాకు గతం గుర్తుకురావాలి అని రాజ్ అంటాడు. మీరు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఇదే. దానికి మీరు స్ట్రెస్ తీసుకోవద్దని ఇదివరకే మీకు చెప్పారు కదా అని డాక్టర్ అంటాడు.

మీరు ప్రాణాలతో బయటపడటమే లక్కీ. మళ్లీ మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇది నా సిన్సియర్ వార్నింగ్. అలా చేస్తే నేను ఇచ్చే మెడిసిన్ కూడా పనిచేయదు. మీరు ఏ రకమైన ప్రెజర్ మీ మైండ్‌కు ఇవ్వకూడదు. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పుడే పుట్టిన బాబులా మీ బ్రెయిన్‌ను సున్నితంగా చూసుకోవాలి. మీరు కూడా మీ బావకు గతం గుర్తుకు తేవడానికి ట్రై చేయకండి. లేదంటే మళ్లీ కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది అని డాక్టర్ చెబుతాడు.

అది విని కావ్య షాక్ అవుతుంది. రాజ్ గతం వేరే అన్నట్లుగా తనకు నచ్చినట్లుగా బయటకెళ్లి చూపిస్తుంది యామిని. తన మామ్ డాడ్ కూడా చనిపోయిట్లు సమాధులు చూపిస్తుంది యామిని. యామిని ఆడే నాటకం అంతా కావ్య కళ్లారా చూస్తుంది. చూసి షాక్ అవుతుంది. ఏంటండి మీకు ఈ పరిస్థితి. మీ కళ్ల ముందుకు వచ్చిన ఎవరో తెలియని వ్యక్తినా నేను. మీ ముందుకు వచ్చిన గుర్తు పట్టని పరిస్థితిలో మీరున్నారు అని కావ్య బాధపడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం