Brahmamudi March 20th Episode: రుద్రాణి గొంతుపట్టుకున్న కావ్య- ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి- కావ్య గురించి యామిని ఎంక్వైరీ!-brahmamudi serial march 20th episode kavya holding rudrani throat for raj star maa brahma mudi today disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 20th Episode: రుద్రాణి గొంతుపట్టుకున్న కావ్య- ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి- కావ్య గురించి యామిని ఎంక్వైరీ!

Brahmamudi March 20th Episode: రుద్రాణి గొంతుపట్టుకున్న కావ్య- ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి- కావ్య గురించి యామిని ఎంక్వైరీ!

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Serial March 17th Episode: బ్రహ్మముడి మార్చి 20 ఎపిసోడ్‌లో రాజ్ గతం తాను క్రియేట్ చేసినట్లు ఉంటుందని యామిని అంటుంది. హాస్పిటల్‌కు వెళ్తే కావ్య గురించి తెలుసుకోవచ్చని రాజ్ అనుకుంటాడు. మరోవైపు హాల్‌లో రాజ్ ఫొటోకు దీపం పెట్టబోయిన రుద్రాణి గొంతుపట్టుకుని ఊపిరాడకుండా చేస్తుంది కావ్య.

బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 20వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ తీసుకెళ్లిన అమ్మాయి దుగ్గిరాల ఇంటి ఆమె అయిండొచ్చు, రామ్‌తో మాట్లాడే సిచ్యువేషన్ ఆమెకు దొరకలేదేమో, రామ్ విషయంలో ఛాన్స్ తీసుకోలేం, ఎలాగైనా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. రామ్‌ను ఎలాగో రెగ్యులర్ చెకప్ కోసం అదే హాస్పిటల్‌కు తీసుకోవాలి. రామ్‌కు తెలియకుండా అడ్మిట్ చేసిన అమ్మాయో ఎవరో తెలుసుకుంటా అని యామిని అంటుంది.

కొత్తగా పరిచయం చేయబోతున్నాను

ఇంతలో రాజ్ గది నుంచి బయటకు వస్తుంటాడు. అసలు రామ్ బాగానే ఉన్నాడుగా, మెడిసిన్ వాడితో సరిపోతుందన్నారుగా. మళ్లీ హాస్పిటల్‌కు ఎందుకు అని యామిని తండ్రి అంటాడు. రామ్ గతాన్ని పరిచయం చేయబోతున్నాను. నేను పరిచయం చేసేది నేను సృష్టించిన రాజ్ గతాన్ని, నేను చెప్పబోయే కట్టుకథను రేపటి నుంచి రామ్ నమ్ముతాడు. అన్నీ కొత్తగా పరిచయం చేయబోతున్నాను. నేను సృష్టించిన జ్ఞాపకాలు తన జీవితంలో జరిగిన సంఘటనలు అవుతాయి అని యామిని అంటుంది.

మేము కలిసి పెరిగాం, తిరిగాం అని రామ్ ఎప్పుడయితే నమ్మడం మొదలుపెడతాడో అప్పుడే నన్ను తనమనిషిగా ఫీల్ అవడం స్టార్ట్ చేస్తాడు అని యామినీ అని పక్కకు చూసేసరికి రాజ్ ఉంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. కంగారుపడుతారు. ఏంటీ డిస్కషన్ అని రాజ్ అడుగుతాడు. నీ గురించే మాట్లాడుకుంటున్నాం, హాస్పిటల్‌కు తీసుకెళ్లడం గురించి అని కవర్ చేస్తారు. సరే అన్న రాజ్ నేను ఆరోజు ఆ అమ్మాయిని అదే హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి ఎవరో తెలుస్తుంది అని రాజ్ ఆలోచిస్తుంటాడు.

రేపు నీకు ఒక సర్‌ప్రైజ్ కూడా ఉందని యామినీ చెప్పి వెళ్లిపోతుంది. పదేపదే ఆ అమ్మాయే ఎందుకు గుర్తుకు వస్తుందో నేను తెలుసుకుంటాను అని రాజ్ అనుకుంటాడు. మరోవైపు కావ్య చేసింది ఇంట్లోవాళ్లు గుర్తుకు తెచ్చుకుని బాధపడుతుంటారు. కావ్య ప్రవర్తన ఇంకా బాధపెడుతుందని అపర్ణ అంటుంది. చిన్న వయసులోనే మొగుడు దూరమయ్యేసరికి బతికి ఉన్నాడనే భ్రమపడుతుందిరా. ఇంటికి వచ్చినప్పటినుంచి తనకు ఏం ఆనందం దొరికిందో చెప్పు అని కావ్య పడిన బాధలు, అవమానాల గురించి ఇందిరాదేవి అంటుంది.

బాధ దిగమింగుకుని

మొగుడే ప్రపంచం అని బతికింది. ఇప్పుడు ఆ మొగుడే లేడనేసరికి చీకటి తప్ప ఇంకేముంటుంది చెప్పు. ఇప్పుడు ఒంటరి అయ్యేసరికి అంతా కలలా భావిస్తుంది. రాజ్ వస్తాడని నమ్ముతుంది. తన మాటలకు నాకే అనుమానం వచ్చింది. నా మనవడు బతికి ఉన్నాడని. కానీ సాక్ష్యాలు మాత్రం నిజం చెబుతున్నాయి. పెద్దవాళ్లగా బాధను దిగమింగుకుని తనకున్నామన్న భరోసా ఇవ్వాలి. రాజ్ లేడన్న విషయం మెల్లిమెల్లిగా కలగజేయాలి అని ఇందిరాదేవి అంటుంది.

జీవితాంతం అలాగే బతికేస్తుందేమో అని భయమేస్తుందని అపర్ణ అంటుంది. తనకు అర్థమయ్యేలా చెబితే ఆ గుండె తట్టుకుంటుందా. ఆ క్షణమే ఆగిపోతే అని భయపడుతుంది అపర్ణ. ఒక అత్తగా కావ్య ముందు ఓడిపోయాను అని అపర్ణ ఏడుస్తుంది. మరోవైపు కావ్య దగ్గరికి స్వప్న, అప్పు వెళ్తారు. ఇంట్లో నీ గురించి అంతా అలా మాట్లాడుకుంటుంటే ఏం పట్టనట్లు ఉంటావేంటే అని స్వప్న అంటుంది. ఏమనుకుంటారు. అంతా పిచ్చిదాన్ని అనుకుంటారు అని కావ్య అంటుంది.

ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్లు రాలగొడతాను అని స్వప్న అంటుంది. చూశావా నువ్ కూడా పిచ్చి అంటున్నావ్. వాళ్లు ఏమనుకున్న సరే నేను చూసిందే నమ్ముతాను. ఆయన తిరిగి వచ్చినప్పుడు వాళ్లకే తెలుస్తుంది. సాక్ష్యాలు, ఇన్వెస్టిగేషన్ కాదు నా మనసాక్షిని ఫాలో అవుతాను అని కావ్య అంటుంది. ఎంత చెప్పిన వినవేంటీ అని కావ్యను కొట్టబోతుంది స్వప్న. దాంతో అప్పు ఆపి కావ్య అక్క చెప్పేది నిజమయి ఉండొచ్చు కదా అని అంటుంది.

కావ్య నమ్మాలి

ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ 99 శాతం మాత్రమే కరెక్ట్ ఉంటుంది. ఇంకో 1 పర్సంట్ ఉందిగా. అక్క చెబుతున్నట్లు రాజ్ బావ బతికే ఉంటే. అంతకన్న కావాల్సింది ఏంటీ. హయ్యర్స్ అఫీషియల్స్‌ను అడిగి ఆ కేసు రీ ఇన్వెస్టిగేట్ చేస్తా. జీరో నుంచి మొదలుపెడుతా. ఒక్క క్లూ దొరికిన మనకు చాలా ఉపయోగపడుతుంది అని అప్పు అంటుంది. సరే నేను ఒప్పుకుంటాను. నాది ఓ కండిషన్. నువ్వు ఏ ఇన్వెస్టిగేషన్ చేసి బయటపెడతావో దాన్ని కావ్య నమ్మాలి అని స్వప్న అంటుంది.

ఈ కండిషన్‌కు ఒప్పుకుంటావా అని స్వప్న అంటే.. అప్పు ఇన్వెస్టిగేషన్ చేసేలోపు ఆయన్ను అందరిముందు నిలబెడతాను అని కావ్య అంటుంది. మరోవైపు కావ్య చెప్పే మాటలు వింటుంటే నాకు కూడా రాజ్ బతికి ఉన్నాడని అనిపిస్తుంది అని రాహుల్ అంటాడు. ఆ పిచ్చిదాని మాటలు నమ్ముతున్నావా. వాడు చచ్చాడు. వాడి మీద పిచ్చి ప్రేమ వల్ల అలా వాగుతుంది. రాజ్ దూరమై రాజ్యం బోసిపోయింది. సింహాసనం మీద కూర్చునే యువరాజు అని ఎదురుచూస్తుంది అని రుద్రాణి అంటుంది.

నీకు కంపెనీకి మధ్యలో కావ్య అడ్డుగా ఉంది. నువ్ కంపెనీకి యువరాజ్ కావాలన్న, దాన్ని నువ్ సొంత చేసుకోవాలన్న కావ్య అడ్డు తొలగించుకోవాలి అని రుద్రాణి అంటే.. ఏంటీ మమ్మీ కావ్యను చంపేస్తావా అని రాహుల్ అంటాడు. కత్తితో పొడిస్తే ఒక్కరిని మాత్రమే చంపగలం, కానీ, ఒక ఐడియా ఒక సామ్రాజ్యాన్నే కూలుస్తుంది. కావ్య ఆలోచనే మనకు ఆయుధంగా మారింది. అంతా రాజ్ చనిపోయాడని నమ్ముతుంది. అది మాత్రమే బతికున్నాడని నమ్ముతుంది అని రుద్రాణి అంటుంది.

పూర్తిగా పిచ్చిదాన్ని చేసి

వంద మంది ఒక్కలా ఆలోచిస్తే కావ్య ఒక్కరే వేరేలా ఆలోచిస్తుంది. వారినే టార్చ్ బేరర్ అంటారు అని రుద్రాణి అంటుంది. కావ్య టార్చ్ బేరర్ కాబట్టి తనకు దారి చూపించే దేవతవు కాబోతున్నావా అని రాహుల్ అంటాడు. ఇలాంటి వాళ్లు వీలైతే ప్రపంచాన్ని మారుస్తారు. లేదా పిచ్చివాళ్లుగా మిగిలిపోతారు. ఇంట్లోవాళ్లు కావ్యకు సగం పిచ్చి పట్టిందని నమ్ముతున్నారు. దాన్ని పూర్తిగా పిచ్చిదాన్ని చేసి మూలకు కూర్చోబెడితే నువ్వే రాజ్యానికి రాజువి అవుతావ్ అని రుద్రాణి అంటుంది.

రేపు చూడు దాని పిచ్చి పరాకాష్టకు చేరుకునేలా చేస్తాను అని రుద్రాణి అంటుంది. మరుసటి రోజు ఉదయం హాల్లో రాజ్ ఫొటో పెట్టి దీపం వెలిగిస్తుంటుంది రుద్రాణి. అది అందరూ చూస్తారు. ఇందిరాదేవి వచ్చి ఆపుతుంది. నిన్న జరిగిన గొడవ చాలదా. ఇలాంటివి వద్దని కావ్య చెప్పింది మళ్లీ ఎందుకు చేస్తున్నావ్ అని ఇందిరాదేవి అంటుంది. కావ్య మాటలు నమ్మి మన బిడ్డకు చేయాల్సింది చేయకుండా ఉంటామా అని రుద్రాణి ఏడుస్తూ నాటకం ఆడుతుంది.

తన ఆత్మకు శాంతి కలిగేలా కనీస కర్మలు జరిపించకపోతే మనముండి ఏం లాభం అమ్మా అని రుద్రాణి ఏడుస్తుంది. ఉన్నపలంగా మేనల్లుడి మీద ప్రేమ ఎలా వచ్చిందో అని స్వప్న అంటుంది. దాంతో కవర్ చేస్తుంది రుద్రాణి. చనిపోయాక వాళ్లు దేవుళ్లతో సమానం అని మొక్కుతుంది రుద్రాణి. అలా అని వదినను బాధపెట్టడం కరెక్టా అని కల్యాణ్ అంటాడు. నువ్ నమ్ముతున్నావా రాజ్ బతికి ఉన్నాడని, ఒక్కరైనా నమ్ముతున్నారా అని రుద్రాణి అంటే ఎవరు చెప్పరు.

విలవిల్లాడిన రుద్రాణి

చూశారుగా ఎవరు నమ్మట్లేదు. ఎవరేం చేసిన నేను రాజ్‌కు చేయాల్సిన కర్మలు చేస్తాను అని రుద్రాణి అగ్గిపుల్ల వెలిగిస్తుంది. దీపకుండీకి వెలిగించబోతుంటే కావ్య వచ్చి రుద్రాణి చేయి పట్టుకుని ఆపుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. రుద్రాణి చేయిని బలంగా పట్టుకుంటుంది కావ్య. దాంతో రుద్రాణి నొప్పితో విలవిల్లాడుతుంది. అంతా చూస్తూ షాక్ అవుతారు. తర్వాత రుద్రాణి కావ్య చేయి విదిలించకుని ఏం చేస్తున్నావ్ అంటుంది.

మా ఆయన బతికి ఉన్నాడంటే అర్థం కావట్లేదా. ఎంత ధైర్యముంటే మా ఆయన ముందు దీపం వెలిగిస్తున్నావ్ అని రుద్రాణి గొంతు పట్టుకుంటుంది కావ్య. గోడకు రుద్రాణి అదిమిపెట్టి గొంతుపట్టుకుంటుంది. రుద్రాణి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇంట్లోవాళ్లు ఎంత ఆపిన కావ్య ఆగదు. తర్వాత హాస్పిటల్‌లో కావ్య గురించి యామిని ఎంక్వైరీ చేస్తుంది. కాసేపటికి కావ్య వచ్చి తనను అడ్మిట్ చేసినవాళ్ల గురించి అడుగుతుంది.

ఇప్పుడే మీ గురించి అడిగి ఇటు వెళ్లారు అని అతను చెప్పడంతో కావ్య అక్కడికి వెళ్తుంది. అక్కడ డాక్టర్ క్యాబిన్‌లో రాజ్‌ను చూస్తుంది కావ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం