Brahmamudi Promo: అత్త వంటలపై కావ్య సెటైర్లు - భార్యను అపార్థం చేసుకున్న రాజ్ - రుద్రాణి కన్నింగ్ ప్లాన్ సక్సెస్
Brahmamudi Promo: బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో వంట పనుల్లో కావ్యకు చేయడానికి కిచెన్‌లోకి వస్తుంది అపర్ణ. అత్తయ్య వంట చేస్తానని అనగానే కావ్య షాకవుతుంది. . కోడలి ఎక్స్‌ప్రెషన్ చూసి అపర్ణ అలుగుతుంది. ప్రపంచంలో నీకు ఒక్కదానికే వంట వచ్చని ఫీలవుతున్నావా అంటూ కోడలికి క్లాస్ ఇస్తుంది.
Brahmamudi Promo: కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుడిలో అన్నదానం చేయడానికి దుగ్గిరాల కుటుంబసభ్యులందరూ వెళతారు. అక్కడికి అనుకోకుండా కళ్యాణ్ వస్తాడు. అన్నదానం అనగానే ఫ్రీగా తినొచ్చని వచ్చారా అంటూ అప్పు, కళ్యాణ్‌లను ధాన్యలక్ష్మి అవమానిస్తుంది. తల్లి మాటలకు బాధపడి కళ్యాణ్ వెళ్లబోతాడు. కానీ రాజ్ పట్టుపట్టి కళ్యాణ్, అప్పులను భోజనానికి కూర్చునేలా చేస్తాడు. స్వయంగా ధాన్యలక్ష్మి చేత వారికి వడ్డించేలా చేస్తాడు.
అత్తుకు తోడుగా కావ్య...
మరోవైపు అపర్ణ ఆరోగ్యం బాగాలేకపోవడంతో గుడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. అత్తకు తోడుగా కావ్య ఉండిపోతుంది. అపర్ణ కాలు కిందపెట్టకుండా ఆమెకు సేవలు చేస్తుంటుంది కావ్య. కోడలు చేస్తోన్న సేవలు చూసి అపర్ణ మురిసిపోతుంది.
అపర్ణ వంటలు...
కావ్య వంట పనుల్లో బిజీగా ఉండటంతో ఆమెకు సాయం చేయడానికి కిచెన్‌లోకి వస్తుంది అపర్ణ. ఏం చేస్తున్నావని కావ్యను అడుగుతుంది అపర్ణ. మన ఇద్దరికి వంట చేస్తున్నానంటూ కావ్య బదులిస్తుంది. నువ్వు కూరగాయలు కట్ చేసి ఇస్తే నేను వంట చేస్తానని కోడలితో అంటుంది అపర్ణ. అతయ్య వంట చేస్తానని అనగానే కావ్య షాకవుతుంది. ఆమె ఎక్స్‌ప్రెషన్ చూసి అపర్ణ హర్ట్ అవుతుంది. వెటకారంగా ఉందా అంటూ కోడలికి వార్నింగ్ ఇస్తుంది. ప్రపంచంలో నీ ఒక్కదానికే వంట చేతనవుతుందని అనుకుంటున్నావా అంటూ కావ్యకు క్లాస్ ఇస్తుంది అపర్ణ. మాక్కుడా వచ్చు అని అపర్ణ అలుగుతుంది.
అతయ్యకు కావ్య క్షమాపణలు...
దాంతో అత్తయ్యకు సారీ చెబుతుంది కావ్య. మీకు ఆరోగ్యం బాగాలేదని అలా అన్నానని అపర్ణకు సర్ధిచెబుతుంది కావ్య. మీరు వంట చేయాల్సిన పనిలేదని, వెళ్లి రెస్ట్ తీసుకొమ్మని కిచెన్ నుంచి అత్తయ్యను కావ్య పంపించేయబోతుంది. రెస్ట్ తీసుకొని బోర్ కొడుతుందని కోడలితో అంటుంది అపర్ణ. వంట చేయల్సిందేనని అంటుంది. చివరకు అపర్ణ బెట్టులో గెలుస్తుంది.
రాహుల్ ప్లాన్...
రాహుల్ తెలివిగా ప్లాన్ చేసి కావ్యను ఇంట్లో నుంచి బయటకు వెళ్లేలా చేస్తాడు. స్వరాజ్ గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసేలా రాహుల్ ప్లాన్ చేస్తున్నాడని ఓ ఎంప్లాయ్ కావ్యకు ఫోన్ చేస్తాడు. అది రాహుల్ వేసిన ట్రాప్ అని తెలియక తొందరపడి అపర్ణను ఒంటరిగా వ ఇంట్లోనే వదిలేసి ఆఫీస్‌కు వెళుతుంది కావ్య.
రిస్క్‌లో పడ్డ అపర్ణ...
అపర్ణ వేసుకొనే ట్యాబ్లెట్స్ మార్చేస్తాడు రాహుల్. ఆ నిజం తెలియక ట్యాబ్లెట్స్ వేసుకున్న అపర్ణ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. కావ్య నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి ప్రమాదంలో పడిందని రాజ్ అపార్థం చేసుకుంటాడు. ఆఫీస్ వ్యవహారాలతో పాటు రాహుల్‌కు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని తాను చెప్పిన మాటల్ని లెక్కచేయకుండా కావ్య ఆఫీస్‌కు వెళ్లడంపై కావ్యను రాజ్ తప్పు పడతాడు. రాహుల్, రుద్రాణి వేసిన ప్లాన్ అని తెలియక కావ్యను అపార్థం చేసుకున్న రాజ్ ఆమెను దూరం పెడతాడు. భర్త నిర్ణయంతో కావ్య షాకవుతుంది. ఆమెపై నిందలు వేసినట్లుగా బ్రహ్మముడి ప్రోమోలో చూపించారు.
రాహుల్ ప్లాన్ కారణంగా హాస్పిటల్‌లో చేరిన అత్తయ్య కావ్య కాపాడుకుంటుందా? భర్త రాజ్‌కు కావ్య దూరమైందా అన్నది సోమవారం నాటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.