Brahmamudi Promo: గతిలేక వచ్చావంటూ కావ్యకు అవమానం - ఆస్తి కోసం ధాన్యలక్ష్మి పంచాయితీ - రుద్రాణికి వాటా!
Brahmamudi Promo బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో సీతారామయ్య అనారోగ్యం గురించి పట్టించుకోకుండా ఆస్తి పంపకాలు చేయాలంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మి గొడవలు చేస్తారు. మీ లాంటి వాళ్లతో కలిసి ఉండటం కంటే విడిపోయి దరిద్రాన్ని వదిలించుకోవడమే మంచిదని సుభాష్ అంటాడు. ఆస్తిని వాటాలు చేస్తానని చెబుతాడు.
Brahmamudi Promo ఆస్తి కోసం ధాన్యలక్ష్మి చేసిన గొడవ వల్ల సీతారామయ్య హాస్పిటల్ పాలవుతాడు. సీతారామయ్య కోమాలోకి వెళ్లాడని, అతడు కోలుకోవడానికి నెలలు, సంవత్సరాలు పట్టొచ్చని డాక్టర్ అనడంతో షాక్‌తో ఇందిరాదేవి కుప్పకూలిపోతుంది. ఇందిరాదేవి బాధ చూడలేక కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.
కావ్య ఓదార్పు...
ఇందిరాదేవి హాస్పిటల్‌లోనే ఉంటే ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని దుగ్గిరాల ఫ్యామిలీ కంగారుపడతారు. ఇంటికి రమ్మని బతిమిలాడుతారు. ఎవరు చెప్పిన ఇందిరాదేవి హాస్పిటల్ నుంచి వెళ్లనని పట్టుపడుతుంది. సీతారామయ్య కోలుకునేవరకు ఇక్కడే ఉంటానని అంటుంది. చివరకు కావ్య మాట విని ఆమెతో పాటు ఇంటికి బయలుదేరుతుంది ఇందిరాదేవి.
ఆస్తి పంపకాలు...
భర్త ఆరోగ్యం గురించి ఇందిరాదేవి టెన్షన్ పడుతుంటుంటే...రుద్రాణి, ధాన్యలక్ష్మి మాత్రం ఆస్తి వాటాలకు సంబంధించిన పంపకాలు ఎక్కడ ఆగిపోతాయోనని కంగారు పడతారు. నాన్నకు ఏదైనా జరిగితే..ఆస్తి పంపకాలు ఆగిపోతాయని, ఇప్పుడే దానిపై ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాల్సిందేనని పట్టుపడుతుంది. ధాన్యలక్ష్మి ఆస్తి కోసం ఉరి వేసుకోవడానికి సిద్ధపడిందని, ఆమెపై జాలి, దయతోనైనా ఆస్తి పంపకాలు చేయమని అంటుంది.
రుద్రాణి పర్సంటేజ్...
ధాన్యలక్ష్మికి ఆస్తి దక్కేలా చేయడానికి ఎంత పర్సెంటేజ్ మాట్లాడుకున్నారని రుద్రాణిపై సెటర్లు వేస్తుంది కావ్య. ప్రకాశం, స్వప్న కూడా ధాన్యలక్ష్మి, రుద్రాణికి క్లాస్ ఇస్తారు. కావ్య జోక్యాన్ని ధాన్యలక్ష్మి సహించలేకపోతుంది. నీకు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నావని కావ్యపై ధాన్యలక్ష్మి రివర్స్ ఎటాక్ మొదలుపెడుతుంది. నేను ఎలా ఈ ఇంటి పెద్ద కోడలిగా వచ్చానో కావ్య అలాగే వచ్చిందని ధాన్యలక్ష్మికి అపర్ణ బదులిస్తుంది.
ఏ దిక్కులేని లేకుండ మావయ్య వంచన చేరిన వాళ్లతో ఇలా డ్రామాలు ఆడించడం కరెక్ట్ కాదని ధాన్యలక్ష్మికి క్లాస్ ఇస్తుంది.తనను అపర్ణ అవమానించడం రుద్రాణి సహించలేకపోతుంది.
మాటలు మర్యాదగా రానీయ్ అంటూ అపర్ణతో గొడవ పెట్టుకోవాలని చూస్తుంది రుద్రాణి. నీకు మర్యాద ఇచ్చేదేంటి..అన్నం పెట్టిన మనిషి చావు బతుకుల్లో ఉంటే పట్టించుకోకుండా ఆస్తి పంపకాలు కోసం డ్రామాలు ఆడుతున్నావని రుద్రాణికి ఇచ్చిపడేస్తుంది అపర్ణ.
పుట్టింట్లో గతిలేక...
ఇంటి పెద్ద కోడలు అని నువ్వు అంటే సరిపోదు...నీ కొడుకు కూడా అనాలి. పుట్టింట్లో గతిలేక పడి ఉంటే మావయ్య దయతలిచి కావ్యను దుగ్గిరాల ఇంటికి తీసుకొచ్చాడని అపర్ణతో ధాన్యలక్ష్మి వాదనకు దిగుతుంది.
మీరు ఎప్పుడు పుట్టింటికి వెళ్లలేదంటేనే తెలుస్తుంది గతిలేనిది మీ వాళ్లకే.. మాకు కాదని స్వప్న పంచ్‌లు వేస్తుంది. ఆస్తి కోసం కుటుంబ సభ్యులు కొట్టుకోవడం చూసి ఇందిరాదేవి హర్ట్ అవుతుంది. గొడవలు ఆపేయమని చెప్పి భోజనం చేయకుండానే వెళ్లిపోతుంది.
ఆస్తుల కోసం కొట్టుకు చస్తున్నారు...
సీతారామయ్య గురించి ఆలోచిస్తుంటారు సుభాష్, ప్రకాశం, రాజ్. తాతయ్య కోలుకోవడానికి ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తండ్రికి చెబుతుంటాడు రాజ్. అప్పుడే అక్కడికి ధాన్యలక్ష్మి, రుద్రాణి వస్తారు. ఆస్తిలో మీ అందరికి హక్కు ఉన్నట్లే నాకు హక్కు ఉందని అంటుంది. నా వాటా నాకు పంచండి గొడవ చేస్తుంది. ఆస్తి పంచాల్సిందేనని, ఎవరికి వాటా వాళ్లకు ఇవ్వాల్సిందే రుద్రాణి కూడా వాదిస్తుంది.
మా నాన్న చావుబతుకుల మధ్య ఉంటే...అమ్మకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఆస్తుల కోసం కొట్టుకుచస్తున్నారని రుద్రాణి, ధాన్యలక్ష్మిపై సుభాష్ ఫైర్ అవుతాడు.
దరిద్రం వదిలించుకోవడమే మేలు...
మీలాంటి వాళ్లతో కలిసి ఉండటం కంటే విడిపోయి దరిద్రాన్ని వదిలించుకోవడమే మంచిదని సుభాష్ అంటాడు. రేపే లాయర్‌ను పిలిపించి మొత్తం ఆస్తి వాటాలు చేసేస్తానని అంటాడు. సుభాష్ నిర్ణయంతో రాజ్, అపర్ణతోపాటు కావ్య షాకవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది బ్రహ్మముడి సోమవారం నాటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.