Brahmamudi Promo: కళ్యాణ్‌ను జైలుకు పంపించిన అనామిక - కావ్యపై నింద - కాలేజీ ఎండీగా మను?
Brahmamudi Promo: బ్రహ్మముడి ప్రోమోలో విడాకుల కోసం కళ్యాణ్ తనను టార్చర్ పెడుతున్నాడని భర్తపై అనామిక కేసు పెడుతుంది. పోలీసులు కళ్యాణ్‌ను అరెస్ట్‌చేసినట్లుగా చూపించారు. గుప్పెడంత మనసు ప్రోమోలో రంగా గురించి వసుధార ఓ భయంకరమైన నిజం తెలుసుకున్నట్లుగా చూపించారు.
Brahmamudi Promo: రుద్రాణి మాటలు నమ్మిన అనామిక తన తల్లిదండ్రులను దుగ్గిరాల ఇంటికి పిలిపించి కళ్యాణ్‌తో పాటు అత్తామామలను వారి చేత నిలదీస్తుంది. దుగ్గిరాల కుటుంబమంతా కలిసి తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని అబద్ధాలు ఆడుతుంది. అనామిక తల్లిదండ్రులు కూడా కూతురికే వంత పాడుతారు. కళ్యాణ్‌నే తప్పుపడతారు.
మాటలు జారిన అనామిక...
కళ్యాణ్ తండ్రిని బుర్రతక్కువాడు అంటూ అవమానిస్తుంది అనామిక. రాజ్, కావ్య కలిసి అనామికకు సర్ధిచెప్పాలని చూస్తారు. అప్పుపై మోజుతోనే కళ్యాణ్ తనకు విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని, నీ మాటల వల్లే కళ్యాణ్ తనను దూరం పెడుతున్నాడని కావ్యపై ఫైర్ అవుతుంది అనామిక. కళ్యాణ్‌ను చేతకాని వాడిలా చేసింది నువ్వే అంటూ రాజ్‌ను నానా మాటలు అంటుంది. సుభాష్‌తో పాటు అపర్ణ కించపరిచేలా అనామిక మాట్లాడటంతో కళ్యాణ్ కోపం పట్టలేకపోతాడు.
ఇంట్లోని వెళ్లగొట్టిన కళ్యాణ్...
అనామికతో పాటు ఆమె తల్లిదండ్రులను తన ఇంట్లో నుంచి వెళ్లగొడతాడు కళ్యాణ్. అత్తింటి నుంచి వెళ్లిపోతూ నువ్వే నా కాళ్లు పట్టుకొని బతిమిలాడేలా చేస్తానని కళ్యాణ్‌తో ఛాలెంజ్ చేస్తుంది అనామిక. తన వల్ల ఇంట్లో గొడవలు జరగడం చూసి కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ధాన్యలక్ష్మి అపోహ...
కొడుకు కాపురం తన కళ్లముందే కూలిపోవడం చూసి ధాన్యలక్ష్మి బాధపడుతుంది.ధాన్యలక్ష్మిని ఓదార్చేందుకు కావ్య ప్రయత్నిస్తుంది. కానీ ధాన్యలక్ష్మి కూడా కావ్యనే తప్పుపడుతుంది. కళ్యాణ్ కాపురం కూలిపోవడానికి నువ్వే కారణం అని కావ్యను నిందిస్తుంది. కావ్యకు అపర్ట సపోర్ట్‌గా నిలుస్తుంది.
మీడియా ముందుకు అనామిక...
తనకు దుగ్గిరాల ఫ్యామిలీ అన్యాయం చేశారని మీడియా ముందుకు వెళుతుంది. కళ్యాణ్... అప్పు మోజులో పడ్డాడని, తనకు విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని అంటుంది. తమ కుటుంబ పరువును అనామిక బజారుకు ఎక్కించడంతో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ తట్టుకోలేకపోతారు.
రాజ్ నిర్ణయం...
అనామిక కారణంగా కళ్యాణ్ పడుతున్న బాధ, ఆవేదనను రాజ్ చూడలేకపోతాడు. కళ్యాణ్ కోరుకున్నట్లుగానే అనామికతో అతడికి విడాకులు ఇప్పించాలని అనుకుంటాడు. తన నిర్ణయాన్ని కుటుంబసభ్యులకు చెబుతాడు. రాజ్ మాటలు విని అందరూ షాకవుతారు. రాజ్ నిర్ణయాన్ని ధాన్యలక్ష్మి వ్యతిరేకిస్తుంది.
పోలీసుల ఎంట్రీ...
ఇంతలోనే దుగ్గిరాల ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. కళ్యాణ్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చామని అంటారు. తన తమ్ముడు ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేస్తారని పోలీసులతో రాజ్ వాదిస్తాడు. విడాకుల కోసం తనను కళ్యాణ్ రోజు టార్చర్ పెడుతాడని అతడిపై అనామికనే స్వయంగా కేసు పెట్టిందని రాజ్‌తో చెబుతాడు పోలీస్ ఆఫీసర్. కళ్యాణ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లుగా బ్రహ్మముడి ప్రోమోలో చూపించారు.
కళ్యాణ్‌ను రాజ్, కావ్య ఎలా సేవ్ చేశారు? అనామిక ఆరోపణలను ఎలా తిప్పికొట్టారన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.
శైలేంద్ర ప్లాన్ ఫెయిల్
కాలేజీ ఎండీ సీట్ తనకు దక్కకుండా అడ్డుగా ఉన్న మనును కూడా లేపేయాలని శైలేంద్ర ప్లాన్ వేస్తాడు. మనును చంపేందుకు రౌడీలను నియమిస్తాడు. మనుపై ఎటాక్ చేసేందుకు రౌడీలు వేసిన ప్లాన్ ఫెయిలవుతుంది. శైలేంద్ర మనుషులను మను చితక్కొడతాడు. తనను లేపేయడానికి శైలేంద్ర వేసిన ప్లాన్ ఇదని రౌడీల ద్వారా తెలుసుకుంటాడు మను. డైరెక్ట్‌గా శైలేంద్ర ఇంటికి వెళ్లి అతడికి షాకిస్తాడు. ఈ ఎటాక్‌కు తనకు ఏ సంబంధం లేదని శైలేంద్ర బుకాయించబోతాడు. కానీ ఆధారాలతో అతడి కుట్రలను మను బయటపెడతాడు. ఇంకోసారి తన జోలికి వస్తే నేను నిన్ను లేపేస్తానని రివర్స్ వార్నింగ్ ఇస్తాడు. కాలేజీ ఎండీగా పదవిలో తానే కూర్చుంటానని శైలేంద్రతో చెబుతాడు మను.
రంగా గురించిన నిజం
రంగానే రిషి అనే నిజాన్ని బయటపెట్టేందుకు వసుధార ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కానీ వసు ఎంత చెప్పిన రంగా మాత్రం తాను రిషి కాదని చెబుతూనే ఉంటాడు. రంగా జీవితం గురించి అతడి నాయనమ్మ ఓ షాకింగ్ నిజం చెబుతుంది. అదేమిటన్నది గుప్పెడంత మనసు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.