Brahmamudi Promo: అనామిక ట్రాప్‌లో పడ్డ కావ్య - కోడలిని ఇంటికిరప్పించేందుకు అపర్ణ ప్లాన్ - రాజ్‌కు కొత్త కష్టాలు
Brahmamudi Promo:బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో దుగ్గిరాల ఫ్యామిలీపై రివేంజ్ తీర్చుకోవడానికి అనామిక కొత్త ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం కావ్యను పావుగా వాడుకోవాలని ఫిక్సవుతుంది. అనామిక కుట్రలను కావ్య కనిపెట్టిందా లేదా అన్నది బ్రహ్మముడి నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.
Brahmamudi Promo: కళ్యాణ్, అప్పులపై రివేంజ్ తీర్చుకోవడానికి అనామిక కొత్త ప్లాన్ వేస్తుంది. దుగ్గిరాల కుటుంబానికి బిజినెస్ పరంగా శత్రువు అయినా సామంత్‌తో చేతులు కలుపుతుంది. రాజ్‌కు కావ్య దూరమైన సంగతి అనామికకు తెలిసిపోతుంది. కావ్య జాబ్ కోసం వెతుకుతుందని, ఆమెకు మన కంపెనీలో డిజైనర్‌గా ఆఫర్ ఇస్తే దుగ్గిరాల కుటుంబానికి చెందిన స్వరాజ్ గ్రూప్‌ను దెబ్బకొట్టినట్లు అవుతుందని సామంత్‌తో అంటుంది అనామిక.
సందీప్ అనే వ్యక్తి ద్వారా తమ ప్లాన్‌ను అమలుచేయడం మొదలుపెడతారు. అనామిక తెలివితేటలు చూసి సామంత్ మురిసిపోతాడు. కళ్యాణ్‌కు విడాకులు ఇచ్చి మంచిపనిచేశావంటూ పొగుడుతాడు.
కావ్యలేని లోటు...
కావ్యలేని లోటు ఇంట్లో కనిపించకుండా జాగ్రత్తపడుతుంటాడు రాజ్. పనిమనిషి శాంతకు వంట బాధ్యతలు అప్పగిస్తాడు. ఆమె చేతి వంట తినడానికి అందరూ కంగారు పడతారు. శాంత చేసిన కర్రీలో కారం ఎక్కువగా ఉండటంతో తినలేక రాజ్ కూడా అవస్థలు పడతాడు. అపర్ణ, ఇందిరాదేవి కావ్య వంటలను గుర్తుచేస్తూ ఆమెను పొగుడుతారు. ఇలాగైనా రాజ్‌లో మార్పు వచ్చి కావ్యను తీసుకొస్తాడని అనుకుంటారు.
కానీ కావ్యను ఇంటికి తీసుకొచ్చేది లేదని రాజ్ ఖరాఖండిగా వారితో చెబుతాడు. మరోవైపు అత్తింట్లో మహారాణిలా ఉండాలని తన కూతురు పుట్టింట్లో మట్టితో బొమ్మలు చేస్తుండటం కనకం తట్టుకోలేకపోతుంది. ఈ విషయంలో భర్తదే తప్పంటూ వాదిస్తుంది. తన కాపురం విషయంలో తండ్రిని తప్పుపట్టాల్సిన అవసరం లేదంటూ తల్లి కనకానికి కావ్య సమాధానమిస్తుంది.
ఇందిరాదేవి క్లాస్...
పొరపాట్లు చేసేవాళ్లు, అపార్థాలతో కాపురాల్ని కూల్చుకునేవాళ్లు మనుషులు చెబితే మారేటట్లు లేరని రాజ్‌కు ఇందిరాదేవి క్లాస్ ఇస్తుంది. ఈ సారి వినాయకుడి పూజకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని నువ్వే చేయాలంటూ రాజ్‌కు ఆర్డర్ వేస్తుంది ఇందిరాదేవి. పూజకు మంచి విగ్రహం తీసుకురావాలని రాజ్‌కు చెబుతుంది.
విగ్రహం కోసం కారులో బయలుదేరిన రాజ్..స్పీడుగా వచ్చి సైకిల్‌పై వెళుతోన్న కావ్యను ఢీకొడతాడు. కారు దిగగానే కావ్య కనిపించడంతో షాకవుతాడు. కారుతో తనను ఢీకొట్టిన వ్యక్తిని తిట్టబోయి రాజ్‌ను చూసి ఆగిపోయినట్లుగా బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో కనిపిస్తోంది.
అనామిక ట్రాప్‌లో కావ్య...
కావ్యకు ఫోన్ చేసిన సందీప్...ఓ కంపెనీ నగలు డిజైనింగ్ వేసే ఆఫర్ వచ్చిందని చెబుతాడు. ఆ జాబ్ ఆఫర్ చేసింది అనామిక అన్న సంగతి దాచిపెడతాడు. ఆ జాబ్‌లో చేరడానికి కావ్య ఒప్పుకుందా? అనామిక ట్రాప్‌లో కావ్య పడిందా అన్నది సోమవారం నాటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.
వినాయకుడి విగ్రహం...
మరోవైపు కావ్య స్పెషల్‌గా తయారు చేసిన వినాయకుడి విగ్రహం రాజ్ కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చినట్లుగా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వినాయకుడి విగ్రహాన్ని కావ్య చేత ఆమెకు తెలియకుండాస్పెషల్‌గా ఇందిరాదేవి, అపర్ణ తయారుచేయించారని చూపించబోతున్నట్లు సమాచారం. కావ్యను తిరిగి ఇంటికిరప్పించడానికే వారు ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
ఈ విగ్రహం కావ్య తయారు చేసిందని రాజ్ తెలిసిందా? అపర్ణ, ఇందిరాదేవి ప్రయత్నం సక్సెస్ అయ్యిందా? కావ్యను తీసుకురానన్న రాజ్‌కు అపర్ణ ఎలాంటి పనిష్‌మెంట్ ఇచ్చిందన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తేలనుంది.