Brahmamudi Serial: బ్రహ్మముడి- కావ్య అడుక్కుతినడానికి కూడా పనికిరాదని నిరూపిస్తానన్న రుద్రాణి.. ఇంటి కార్లన్ని అవుట్-brahmamudi serial latest episode promo rudrani decided to show kavya is worthless star maa brahma mmudi news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Serial: బ్రహ్మముడి- కావ్య అడుక్కుతినడానికి కూడా పనికిరాదని నిరూపిస్తానన్న రుద్రాణి.. ఇంటి కార్లన్ని అవుట్

Brahmamudi Serial: బ్రహ్మముడి- కావ్య అడుక్కుతినడానికి కూడా పనికిరాదని నిరూపిస్తానన్న రుద్రాణి.. ఇంటి కార్లన్ని అవుట్

Sanjiv Kumar HT Telugu
Dec 29, 2024 07:27 AM IST

Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో దుగ్గిరాల ఇంటి నుంచి కార్లన్నింటిని డ్రైవర్‌తో చెప్పి కావ్య పంపిచేస్తుంది. అది చూసిన రుద్రాణి కావ్య అడుక్కు తినడానికి కూడా పనికిరాదని నిరూపిస్తానని అంటుంది. దాంతో ఇంట్లో పంచాయితీ పెడుతుంది రుద్రాణి.

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్

Brahma Mudi Serial Latest Episode: బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌లో సీతారామయ్య హాస్పిటల్ బిల్ చెక్ ఎందుకు క్లియర్ అవ్వలేదని కావ్యను సుభాష్ అడుగుతాడు. దాంతో అందరూ కావ్యపై రెచ్చిపోతారు. ముఖ్యంగా రుద్రాణి, ధాన్యలక్ష్మీ కావ్యను నానా మాటలు అంటారు. అదంతా పైనుంచి విన్న రాజ్ వచ్చి కవర్ చేస్తాడు.

yearly horoscope entry point

కావాలనే డైవర్ట్ చేశాడు

రాహుల్ సీఈఓ అవ్వడం వల్ల ఆడిటింగ్ చేయిస్తున్నట్లు, అందుకే ట్రాన్జాక్షన్స్ అన్ని ఆపేసినట్లు రాజ్ చెబుతాడు. దాంతో ధాన్యలక్ష్మీతో రుద్రాణి మంతనాలు జరుపుతుంది. ధాన్యలక్ష్మీ బెడ్ రూమ్‌లో రాజ్ అన్న మాటల గురించి మాట్లాడుతుంది. రాజ్ కావాలనే టాపిక్ డైవర్ట్ చేశాడని, కావ్యకు బాగా సపోర్ట్ చేస్తున్నాడని రుద్రాణి అంటుంది.

నా దారిలోకి తెచ్చుకున్నాను

ఏదో జరుగుతుందని, కానీ, రాజ్ కావ్య బయట పడట్లేదని రుద్రాణి అంటుంది. ఇక కావ్యపై కోపంగా రగిలిపోతుంది ధాన్యలక్ష్మీ. తను చెప్పినట్లే ఇంట్లో ఆడాలా అని అంటుంది. నా భర్తను నా దారిలోకి తీసుకొచ్చుకున్నాను అని, కావ్య గురించి బావగారితో ఆయన మాట్లాడే సమయానికే ఈ ఫోన్ కాల్ వచ్చిందని, లేకుంటే బావగారు ఏం చెప్పెవారో అని ధాన్యలక్ష్మీ అంటుంది.

తాతయ్య బిల్ కట్టాలి

మరోవైపు తాతయ్య బిల్ ఎలా క్లియర్ చేయాలి, ఆఫీస్‌లో వర్క్ ఎలా పెంచాలి, నెలలో మరో 20 కోట్లు ఎలా కట్టాలి అని రాజ్, కావ్య ఆలోచిస్తుంటారు. ఇవాళ తాతయ్య బిల్ క్లియర్ చేసి ఎలాగైనా వర్క్ స్పీడప్ చేయాలని రాజ్ అంటాడు. ఇంతలో కావ్యకు అవసరానికి మించి కారులు వాడుతున్నామనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో కారులో వెళ్తే వాటికి అయ్యే పెట్రోల్, లేదా డీజిల్ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా అని లెక్కలు మాట్లాడుతుంది కావ్య.

కారులన్నీ పంపిచేయాలని

కావ్య మాటలు విన్న రాజ్ అవును అంటాడు. దాంతో దుగ్గిరాల ఇంట్లోంచి కారులన్నింటిని పంపించాలని అనుకుంటుంది. కారుల ఓనర్‌తో కావ్య మాట్లాడి తన కారులను తీసుకువెళ్లమని, మళ్లీ అవసరమైనప్పుడు రమ్మని చెబుతామని కావ్య అంటుంది. దాంతో అతను ఓకే అంటాడు. అనంతరం ఒక కారు డ్రైవర్‌తో ఇదే విషయం చెబుతుంది కావ్య.

కావ్య చేసిన పని చూసిన రుద్రాణి

ఆఫీస్‌కు వెళ్తుండగా.. నేను మీ ఓనర్‌తో మాట్లాడాను. ఉన్న నాలుగు కారులు తీసుకువెళ్లిపోండి. మళ్లీ మాకు కావాల్సినప్పుడు మీకు కాల్ చేస్తాం అని డ్రైవర్‌తో కావ్య చెబుతుంది. పక్కనే రాజ్ కూడా ఉంటాడు. దాంతో అలాగే మేడమ్ అని డ్రైవర్ అంటాడు. అదంతా పైనుంచి కాఫీ తాగుతూ రుద్రాణి చూస్తుంది. ఇంటి నుంచి కారులు వెళ్లిపోవడం, రాజ్, కావ్య ఒకే కారులో ఆఫీస్‌కు వెళ్లడం రుద్రాణి, రాహుల్ చూస్తారు.

అడుక్కు తినడానికి కూడా

ఇన్ని రోజులు ఇంట్లో ఖర్చులు తగ్గిస్తుంది సర్దుకుపోయాం. కారులు కూడా వెనక్కి పంపిచేసింది. ఇప్పుడు ఈ కార్ల వ్యవహారం అందరికీ చెప్పి.. కావ్య ఇంట్లో అధికారం చెలాయించడానికి కాదు కదా అడుక్కుతినడానికి కూడా పనికిరాదని ప్రూవ్ చేస్తాను అని రాహుల్‌తో రుద్రాణి అంటుంది.

అపర్ణకు డౌట్

ఇంట్లోకి వెళ్లి అందరిని పిలుస్తుంది రుద్రాణి. మళ్లీ ఏమైంది, మళ్లీ కావ్యమీదకు ఏమైనా తీసుకొచ్చావా అని అంతా అంటారు. మీ కోడలు ఏం చేసిందో తెలుసా. ఇన్నాళ్లు అన్ని ఖర్చులు తగ్గిస్తే కరెక్టే అని వత్తాసు పలికారు కదా. మరి ఇప్పుడు ఇంట్లో ఉన్న కార్లన్నీ పంపించివేయడంలో ఉన్న పరమార్థం ఏంటో అని రుద్రాణి అంటుంది. 

దాంతో అంతా షాక్ అవుతారు. ఏంటీ కార్లన్ని పంపిచేసిందా అని సుభాష్ అంటాడు. అసలు ఏం జరుగుతుంది అని అపర్ణ డౌట్ పడుతుంటుంది.

Whats_app_banner