Brahmamudi Serial: కావ్యపై దుగ్గిరాల ఫ్యామిలీ కక్ష- భార్యనే తప్పుపట్టిన రాజ్- దొంగ దెబ్బ తీసిన అనామిక
Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో కావ్య, రాజ్‌లను దెబ్బకొట్టడానికి అనామిక మరో కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. గుడి కాంట్రాక్ట్‌కు సంబంధించి కావ్య తయారు చేయించిన బంగారు కిరీటాన్ని దొంగతనం చేయిస్తుంది.
Brahmamudi Serial: ఇంట్లోని కార్లను తీసేయడంపై కావ్యను నిలదీస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. ఎవరిని అడిగి కార్లను తిప్పి పంపించేశావని గొడవకు దిగుతారు. వారికి ధీటుగా కావ్య బదులిస్తుంది. కార్లను తీసేయడానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని అంటుంది.
దుగ్గిరాల ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయమైన తీసుకునే హక్కు తనకు తాతయ్య ఇచ్చాడని కావ్య అంటుంది. మీరు ఇష్టం వచ్చినట్లు లక్షలు ఖర్చు చేస్తే ఇక నుంచి ఇచ్చేది లేదని వార్నింగ్ ఇస్తుంది.
ఇష్టం ఉన్నా లేకపోయినా...
మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నచ్చిన నచ్చకపోయినా నేను చెప్పినట్లు నడుచుకొని తీరాల్సిందేనని ఖరాఖండిగా కుటుంబసభ్యులందరికి కావ్య చెప్పేస్తుంది. కావ్య మాటలకు ప్రకాశం షాకవుతాడు. కావ్య మాట్లాడిన పద్దతి తనకు నచ్చలేదని అంటాడు. అంత కఠినంగా మాట్లాడి ఉండకూడదని రాజ్ కూడా కావ్యదే తప్పు అన్నట్లుగా మాట్లాడుతాడు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికి నచ్చేలా ఉండటం వీలు కాదని భర్తకు బదులిస్తుంది కావ్య. అందరి కోరికలు తీర్చడానికి తాను లక్షలు తేలేనని చెబుతుంది. ఇలా కఠినంగా ఉంటేనైనా లక్షలు తగిలేయడం తగ్గించేస్తారని చెబుతుంది.
కుటుంబానికి దూరం...
ఇలాగే కఠినంగా ఉంటే నువ్వు కుటుంబానికి మళ్లీ దూరమయ్యే ప్రమాదం ఉందని కావ్యతో అంటాడు రాజ్. వంద కోట్ల అప్పు చెల్లించే వరకు లేదా నందగోపాల్ దొరికే వరకు ఈ కష్టాలు తప్పవని రాజ్‌కు సర్ధిచెబుతుంది కావ్య.
ఇందిరాదేవి తప్పు...
కావ్య నిర్ణయాల్ని ఇందిరాదేవి కూడా తప్పుపడుతుంది. తిండి, కార్ల విషయంలో కావ్య కండీషన్స్ పెట్టడం సరైంది కాదని సుభాష్ అంటాడు. కావ్య వ్యవహారం ఇలాగే కొనసాగితే ప్రకాశం కూడా మనకు దూరమయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తాడు. కావ్య ప్రవర్తనలో మార్పు రావాలని, కఠినంగా వ్యవహరించవద్దని ఆమెకు నచ్చ చెప్పాలని సుభాష్, అపర్ణ నిర్ణయించుకుంటారు.
నందగోపాల్‌కు క్లాస్...
రాజ్‌కు దొరికినట్లే దొరికి తప్పించుకున్న నందగోపాల్‌కు క్లాస్ పీకుతుంది అనామిక. తాను కష్టపడి ఆరు నెలల వేసిన ప్లాన్ మొత్తం కొద్దిలో చెడిపోయేదని నందగోపాల్ చెంపపై గట్టిగా ఒక్కటి కొడుతుంది అనామిక. మేము చెప్పింది చేయకపోతే నిన్ను పోలీసులకు నేనే పట్టిస్తానని హెచ్చరిస్తుంది.
అవసరమైతే నీ ప్రాణాలు తీసేస్తామని బెదరించడంతో నందగోపాల్ కాళ్ల బేరానికి వస్తాడు. కావ్యను దెబ్బ కొట్టడానికి ఆమె వేసిన డిజైన్స్‌ను దొంగతనం చేయాలని అనామిక నిర్ణయించుకుంటుంది. ఈ సారి తాను వేసే ఎత్తుకు కావ్య కంపెనీ పరువు మొత్తం గంగలో కలిసిపోవడం ఖాయమని అనామిక అనుకుంటుంది.
కావ్య బిజీ...
రూల్స్ విషయంలో కావ్యతో మాట్లాడాలని అపర్ణ అనుకుంటుంది. కానీ తాను బిజీగా ఉన్నానని , తర్వాత మాట్లాడుతానని చెప్పి వెళ్లిపోతుంది. రాజ్‌తో సుభాస్ మాట్లాడాలని ప్రయత్నించిన కుదరదు. కావ్య ప్రవర్తన చూసి ఎగతాళి చేస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మి.
అనామిక ప్లాన్...
గుడి నగల తాలూకు కాంట్రాక్ట్ పూర్తవుతుంది. తయారైన నగలను జాగ్రత్తగా చూసుకొని భద్రపరుస్తారు కావ్య, రాజ్. తర్వాత రోజు వాటిని జగదీష్ ప్రసాద్‌కకు అందజేయాలని అనుకుంటారు. వారిని దెబ్బకొట్టేందుకు సెక్యూరిటీ గార్డ్ సహాయంతో కొత్త ప్లాన్ వేస్తుంది అనామిక. గుడి కోసం రాజ్, కావ్య తయారు చేసిన ఒరిజినల్ కిరీటం స్థానంలో డూప్లికేట్ పెట్టేలా ప్లాన్ వేస్తుంది. సెక్యూరిటీ గార్డ్‌కు యాభై లక్షలు ఇస్తానని ఆశచూపిస్తుంది. డబ్బు కోసం ఆశపడిన సెక్యూరిటీ గార్డ్ అనామిక ప్లాన్‌కు ఒప్పుకుంటాడు. కిరీటాన్ని మార్చేస్తాడు.
అనామిక ప్లాన్ వల్ల కావ్య, రాజ్ ఎలా చిక్కుల్లో పడ్డారు? కావ్యకు ఫ్యామిలీ మొత్తం శత్రువులుగా మారిపోయారా? వంద కోట్ల అప్పు నిజం బయటపడిందా? లేదా? అన్నది సోమవారం నాటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.