Brahmamudi January 4th Episode: సుభాష్, ప్రకాశంకు నచ్చని కావ్య పనులు- ఇంట్లో మొదలైన వ్యతిరేకత- అనామిక కన్నింగ్ స్కెచ్
Brahmamudi Serial January 4th Episode: బ్రహ్మముడి జనవరి 4 ఎపిసోడ్‌లో రాజ్ కావ్య ఇంటికి వస్తారు. ఎవరిని అడగకుండా కారులను పంపించడం ఏంటీ అని ధాన్యలక్ష్మీ నిలదీస్తే ఎవరిని అడగాలి అని కావ్య కఠినంగా మాట్లాడుతుంది. అది ప్రకాశం, సుభాష్‌కు నచ్చదు. ప్రకాశం తమకు దూరమయ్యే ప్రమాదం ఉందని సుభాష్ అంటాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నందగోపాల్ తప్పించుకున్న తర్వాత కారు ఆగిపోవడంతో మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకుంటారు రాజ్, కావ్య. రాత్రంతా శికారు చేసి ఉదయం వచ్చారా అని రుద్రాణి అంటుంది. వెళ్లింది నిజమే కానీ శికారుకు కాదని రాజ్ అంటాడు. వెళ్లింది భార్యాభర్తలమే కదా. ఎందుకుంత వెటకారం మీకు అని కావ్య అంటుంది.
ఎవరిని అడగాలి
మీరు ఎక్కడికైనా ఊరేగండి. మీరు ఏసీ కారులో వెళ్తారు. ఇంట్లో వాళ్లు వెళ్లడానికి ఒక్క కారు కూడా వద్దా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అదేంటీ ఇంటి దగ్గర కూడా ఒక కారు ఉంచే వెళ్లాం కదా అని కావ్య అంటుంది. ఉన్న నాలుగు కార్లని ఎవరిని అడగకుండా తిప్పి పంపించేశావ్ అని రుద్రాణి అంటుంది. ఎవరిని అడగాలి అని కావ్య అనడంతో అంతా షాక్ అవుతారు. నిజంగానే అడుగుతున్నా. ఎవరిని అడగాలి. మా ఇద్దరికి కలిపి ఒక కారు ఉంచుకుని, ఇంటికి ఒక కారు ఉంచినప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నా భర్త ఉండగానే చేశాను అని కావ్య అంటుంది.
ఎంత పొగరు. ఎవరికి చెప్పాలని అంటావా. నీకు కారులు పంపించే హక్కు ఎవరిచ్చారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. అన్ని సర్వహక్కులు నాకు తాతయ్యగారు ఇచ్చారు అని కావ్య అంటుంది. మీరు అనవసరంగా లక్షలు వేస్ట్ చేస్తుంటే ఎందుకు ఇవ్వాలి. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కోట్లు ఉన్నంతమాత్రానా లక్షలు లెక్కచేయకుండా ఖర్చు పెడితే.. ఆ కోట్లు కూడా లక్షలు అవుతాయి. అప్పుడు నన్నే కదా అంటారు. ఆస్తినంతా పుట్టింటికి దోచిచ్చాను అంటారు. మీరు విచ్చలవిడిగా ఖర్చు పెడతానంటే నేను ఇవ్వను అని కావ్య అంటుంది.
నీ రూల్స్, పెట్టే పద్ధతుల వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరు ఇబ్బందిపడుతున్నారు. దానికి ఏం సమాధానం చెబుతావ్ అని రుద్రాణి అంటుంది. ఇప్పటిదాకా చెప్పిందే నా సమాధానం. మీకు నచ్చిన నచ్చకున్నా ఏమైనా నేను చెప్పినట్లు నడుచుకోవాల్సిందే అని కావ్య వెళ్లిపోతుంది. కావ్య అంత కచ్చితంగా మాట్లాడుతుంటే ఏమనవేంట్రా అని రాజ్‌ను ప్రకాశం అంటాడు. నా పాకెట్ మనీకి కూడా కళావతినే అడుగుతున్నాను. నేను ఎవరికి చెప్పుకోవాలి అని రాజ్ వెళ్లిపోతాడు.
ముక్కలు చేయడానికి
అన్నయ్య.. ఇప్పటివరకు ఏంటో అనుకున్నాను. ఇప్పుడు కావ్య మాట్లాడిన పద్ధతి మాత్రం నాకు నచ్చలేదు అని ప్రకాశం వెళ్లిపోతాడు. మరోవైపు రూమ్‌లో రాజ్ దిగాలుగా కూర్చుంటాడు. అందరిని ఒక్కటిగా ఉంచాలన్న తాతయ్య సంకల్పం రాను రాను అదృశ్యం అయిపోతుందేమో. తాతయ్య చేసిన ప్రయత్నం ఇప్పుడు ముక్కలు చేయడానికి ఉపయోగపడుతున్నట్లుంది అని రాజ్ అంటాడు. నా ప్రవర్తన మీకు బాధ కలిగించిందా అని కావ్య అంటుంది.
అవును, అంత కఠినంగా మాట్లాడి ఉండకూడదని అనిపించిందని రాజ్ అంటాడు. జబ్బు చేసిన రోగికి ఇంజక్షన్ చేసే డాక్టర్ చెడ్డవాడా. ఈ ఇంటికి జబ్బు చేసింది. ఈ ఆస్తికి ఒక మహమ్మారి సోకింది. ఇది వైద్యం. అటు ఇటు నడిచే వాళ్లను ఒకవైపు నడిపించే ప్రయత్నం అని కావ్య అంటుంది. ప్రయత్నం ఓకే పద్ధతి సరిగ్గా లేదు అని రాజ్ అంటాడు. ఇప్పుడు వాళ్లకు నచ్చినట్లు ఉండలేను. వాళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చలేను. తాతయ్య బిల్ కోసమే మీరు ఎంత కష్టపడ్డారో చూశాను అని కావ్య అంటుంది.
ఇలా అవడం మంచిదే డబ్బు విలువ తెలుస్తుంది అని కావ్య అంటుంది. కానీ, నువ్ కుటుంబానికి దూరమయ్యే ప్రమాదం ఉందని రాజ్ అంటాడు. మీకు నిజం తెలిసు కదా. మీరు నమ్మితే అది చాలు. వాళ్ల అపార్థం తొలగించాలంటే నిజం చెప్పాలి. ఆస్తులు పోతున్నాయంటే తట్టుకోలేరు. ఇదంతా ఆ ఎన్‌డీ దొరికేవరకు, లేదా వంద కోట్ల అప్పు తీర్చేవరకు. ఇంట్లో వాళ్లకు నేను ఇంకా పెద్ద శత్రువును అవుతాను కావచ్చు. మంచి చేసినప్పుడే అయ్యాను. దీనికి అయినా పర్వాలేదు అని కావ్య అంటుంది.
కావ్య కరెక్ట్ కాదు
మరోవైపు బావ ఆరోగ్యం పాడయ్యాక ఇంట్లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. కావ్య తీసుకునే నిర్ణయాల వల్ల రుద్రాణి, ధాన్యలక్ష్మీకి మరింత కోపం తెప్పిస్తుంది. కావ్య సక్రమంగా నిర్వహిస్తుందని సంతోషపడాలో వాళ్ల పట్ల కఠినంగా ఉంటుందని బాధపడాలో తెలియట్లేదు అని ఇందిరాదేవి అంటుంది. కావ్య సక్రమంగానే నిర్వహిస్తుంది. తను తీసుకున్న నిర్ణయాలు అందరికి నచ్చేలా ఉండాలి. కానీ, తాను చెప్పినట్లే వినాలి అని తినే తిండి నుంచి తాగే టీ కాఫీలు, తిరిగే కార్ల వరకు ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదని సుభాష్ అంటాడు.
ఇప్పుడు ప్రకాశంకు కూడా కావ్య పద్ధతులు నచ్చడం లేదు. కావ్య తీసుకున్న నిర్ణయాలు మన ప్రకాశంకు కూడా నచ్చట్లేదు. నాతో చెప్పలేక చెబుతున్నాడు. అందరి ముందు కావ్యను అడగలేక ఆగిపోతున్నాడు అని సుభాష్ అంటాడు. అంటే, ధాన్యలక్ష్మీకి రుద్రాణి నూరిపోసినట్లు ప్రకాశంకు ధాన్యలక్ష్మీ నూరిపోస్తుందా అని ఇందిరాదేవి అంటుంది. అది కూడా అయిండొచ్చు. కావ్యను ఎప్పుడు నిలదీద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో కావ్య వ్యవహారంలో ప్రకాశం కూడా వాళ్ల మాటలు విని మనకు దూరమయ్యే ప్రమాదం ఉందని సుభాష్ అంటాడు.
ప్రకాశం వాళ్లల మూర్ఖంగా ఆలోచించడు. ప్రకాశం ఎప్పుడు తప్పు చేయడు అని అపర్ణ అంటుంది. లేదు ఎంత మంచివాడైనా వాళ్ల మనసు గాయపడేలా ప్రవర్తిస్తే వాళ్లలో కూడా మార్పు వస్తుంది. అది ప్రకాశం విషయంలోనూ జరగొచ్చు. ఒకవేళ అదే జరిగితే మన కుటుంబ పతనం మొదలైనట్లే అని ఇందిరాదేవి అంటుంది. దీనికి పరిష్కారం ఏంటని అపర్ణ అడిగితే.. అందరిలో మార్పు వచ్చేలోపు కావ్య ప్రవర్తనలో మార్పు రావాలి. తను మరింత కఠినంగా వ్యవహరించడం తగ్గించాలని సుభాష్ అంటాడు.
పీక పిసికేయాలి
మనమే కట్టాబెట్టాం. ఇప్పుడెళ్లి మార్చుకో అని ఎలా చెబుతాం. తను అడిగే ప్రశ్నలకు మనదగ్గర సమాధానం లేదు అని అపర్ణ అంటుంది. నువ్ కావ్యతో మాట్లాడమని అపర్ణను, రాజ్‌తో మాట్లాడమని సుభాష్‌కు చెబుతుంది ఇందిరాదేవి. మరోవైపు నందగోపాల్‌ను అనామిక ఒక్కటి లాగిపెట్టి కొడుతుంది. 6 నెలల నుంచి ప్లాన్ చేస్తే పెంటా పెంటా చేశావ్. మూడు నెలలు అజ్ఞాతంలో ఉండమంటే అక్కడ కూడా గర్ల్‌ఫ్రెండ్ కావాల. ఇప్పుడు నీ పీక పిసికేయాలని ఉందని అనామిక కోప్పడుతుంది.
సామంత్ కూల్ చేసేందుకు ట్రై చేస్తాడు. నేను చెప్పినట్లు చేసినట్లు చేస్తే సరి. లేకపోతే నేనే పోలీస్‌లకు ఇన్ఫార్మ్ చేసి జైల్లో పెట్టిస్తాను అని అనామిక అంటుంది. దాంతో భయపడిపోతాడు నందగోపాల్. మీరు చెప్పినట్లే చేస్తాను అని వేడుకుంటాడు. ఆ రాజ్ ఇప్పుడు మరింత అలర్ట్ అవుతాడు. వీడిని పట్టుకునేందుకు మరింత ట్రై చేస్తాడు అని సామంత్ అంటాడు. ఆ కావ్య వేసే డిజైన్స్ నాకు కావాలి. వాళ్లను దెబ్బకొట్టడానికి, చెక్ పెట్టడానికి ఈ చదరగంలో పావులు కదుపుతూనే ఉంటాను. ఏం చేస్తావో తెలియదు. నాకు డిజైన్స్ కావాలి అని అనామిక అంటుంది.
దాంతో సామంత్ వెళ్లిపోతాడు. ఈసారి నేను కొట్టబోయే దెబ్బకు వాళ్ల కంపెనీ పరువు ప్రతిష్టలన్నీ పేకమేడల్లా కూలిపోతాయి అని అనామిక అనుకుంటుంది. మరోవైపు తాము అనుకున్న డిజైన్స్ ప్రకారం అవుట్ పుట్ రాలేదు అని రాజ్, కావ్య అనుకుంటారు. దాంతో అవుట్ పుట్ వాళ్లకు కాల్ చేసి డిజైన్స్ రీసైకిల్ చేయమని రాజ్ చెబుతాడు. ఇప్పుడు చేస్తే రేపటిలోగా అవుతాయా. ముందు కిరీటం చేయడం బెటర్ కదా అని కావ్య అంటుంది. ఒక వారం నగలు ముందే ఇద్దామనుకున్నాం కదా అని రాజ్ అంటాడు.
గంట తర్వాత వస్తాను
సరే అని కావ్య అంటుంది. ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు. కావ్యకు రాజ్ కాఫీ తీసుకొచ్చి ఇస్తే కావ్య ఆశ్చర్యపోతుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ మురిసిపోతారు. కావ్య మాట్లాడుతుంటే రాజ్ నిద్రపోతాడు. కావ్య భుజాలపై వాలిపోతాడు రాజ్. కాసేపటికి కావ్య కూడా రాజ్ తలపై తల వాల్చి నిద్రపోతుంది. మరుసటి రోజు ఒక మెయిల్ అర్జంట్‌గా చేయాలని, గంట తర్వాత ఆఫీస్‌కు వస్తానని, నువ్ వెళ్లిపోమ్మని రాజ్ అంటాడు.
దాంతో కావ్య వెళ్లిపోతుంటే అపర్ణ పిలిచి మాట్లాడాలని అంటుంది. కానీ, టైమ్ లేదు. అర్జంట్‌గా వెళ్లాలి అని కంగారుగా వెళ్తుంది కావ్య. అది చూసి అంతా షాక్ అవుతారు. తర్వాత రాజ్‌తో సుభాష్ మాట్లాడాలి అంటే.. లేదు డాడ్. ఇవాళ మ్యాన్యుఫాక్చర్ నుంచి ఆర్నమెంట్స్ వస్తాయి. చూసి వాటిని ఫైనల్ చేయాలి అని రాజ్ కూడా వెళ్లిపోతాడు. మరోవైపు నగలను రాజ్, కావ్య చెక్ చేస్తుంటారు. మధ్యలో ఎస్సైకి కాల్ చేసి నందగోపాల్ దొరికాడా అని, స్పెషల్ కేర్ తీసుకుని పట్టుకోమ్మని చెబుతాడు రాజ్.
అనామిక కన్నింగ్ స్కెచ్
దాంతో సెక్యూరిటీకి కాల్ చేసి 50 లక్షలు ఇస్తానని ఒరిజినల్ కిరీటం ప్లేస్‌లో తానిచ్చే డూప్లికేట్ కిరీటంపెట్టమని చెబుతుంది. దానికి ఆ సెక్యూరిటీ గార్డ్ ఒప్పుకుంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.