Brahmamudi January 3rd Episode: మరో బూత్ బంగ్లాల గెస్ట్ హౌజ్- నందగోపాల్‌ను బాదిన రాజ్- పేదరికంలో బతుకులు, కారుకై కష్టాలు
Brahmamudi Serial January 3rd Episode: బ్రహ్మముడి జనవరి 3 ఎపిసోడ్‌లో సావిత్రితో కిడ్నాపర్స్ అని భయపెట్టి పారిపోయేలా చేసిన రాజ్ కావ్య.. నందగోపాల్ గెస్ట్ హౌజ్‌కు వెళ్తారు. అది చూసి ఇది మనకు సెకండ్ నైటా, రెండోసారి శోభనం ప్లాన్ చేసారా, ఇది ఆ బూత్ బంగ్లాలాంటి ప్లానే కదా అని కావ్య అంటుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లిఫ్ట్ అడిగిన సాఫ్ట్‌వేర్ సావిత్రితో తాము ఇద్దరం కిడ్నాపర్స్ అని, నేను కిడ్నాప్ చేస్తే మేడమ్ వాళ్లకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతుందని రాజ్ అంటాడు. వామ్మో మీరు కిడ్నాపర్సా. కారు ఆపండి నేను దిగిపోతాను అని భయపడిపోతాడు సావిత్రి.
గెస్ట్ హౌజ్‌కు రాజ్ కావ్య
దాంతో అరేయ్ వెధవ, సన్నాసి, యాప్పాసి.. నిన్ను కిడ్నాప్ చేసి రెండు గంటలు అయింది. ఆ విషయం నీకు ఇంకా అర్థం కాలేదా అని రాజ్ మరింత భయపెడతాడు. అప్సరస మేడమ్ కారు ఆపమని చెప్పండి. దిగిపోతాను అని సావిత్రి వేడుకుంటాడు. ఆపకపోతే కారులోనుంచి దూకుతాను అని అంటాడు. దాంతో కారు ఆపుతాడు రాజ్. కారు ఆపడంతో సావిత్రి పారిపోతాడు. తర్వాత నందగోపాల్ గెస్ట్ హౌజ్‌కు చేరుకుంటారు రాజ్, కావ్య.
ఎక్కడికీ వెళ్లిన ఈ పాత బంగ్లా గోలేంటీ నాకు. ఈ బంగ్లా చూస్తుంటే నాకు ఏదేదో గుర్తుకు వస్తుంది అని కావ్య అంటుంది. ఇద్దరు గొడవ పడతారు. అక్కడ ఫస్ట్ నైట్ ప్లాన్ చేసినట్లు.. ఇక్కడ సెకండ్ నైట్ ప్లాన్ చేశారా అని కావ్య అంటుంది. ఇక ఆపు. వెళ్దాం పదా. తెలిసినవాళ్లలా వెళ్దాం అని రాజ్ అంటాడు. రాజ్ వాళ్లు వెళ్తుంటే వాచ్‌మెన్ ఆపుతాడు. నన్ను గుర్తు పట్టలేదా. చాలాసార్లు వచ్చాను అని రాజ్ అంటాడు. అంటే, ఇక్కడికి చాలా సార్లు వచ్చారన్నమాట, ఈ బంగ్లాలను చూస్తే మీకు ఏవేవో ఆలోచనలు వస్తాయి కదా. అందుకే అడిగాను అని కావ్య అంటుంది.
కళావతి నీ కాళ్లు మొక్కుతానే. నేను అంతా గొప్ప కళాకారుడిని నేను కాదు. వాడికి డౌట్ వచ్చేలా చేయకు. నేను వాడిని డీల్ చేస్తాను అని రాజ్ అంటాడు. నువ్ నన్ను గుర్తుకుపట్టకపోతే పోయాడు. మీ సార్ చెప్పలేదా. ఇద్దరు వస్తారని, డబ్బులు ఇస్తారని చెప్పలేదా. ఇందాకే ఇక్కడికి వచ్చాడు కదా. మాకు కాల్ కూడా చేశాడు. అసలే మీ సార్‌కు డబ్బులు చాలా అవసరం అని రాజ్ అంటాడు. వీళ్లు చెప్పేది నిజంలానే ఉందని, ఇందాకే వచ్చారు. గంట తర్వాత వస్తానని బయటకు వెళ్లారని వాచ్‌మెన్ చెబుతాడు.
నిధి నిక్షేపాల కోసం
వెళ్లని. మేము లోపల వెయిట్ చేస్తాం. అసలే మీ సార్‌కు డబ్బుల అవసరం చాలా ఉంది. కానీ, మేము వచ్చినట్లు మీ సర్‌కు చెప్పకు. సర్‌ప్రైజ్ చేద్దామని రాజ్ అంటాడు. దాంతో వాచ్‌మెన్ సరే అంటాడు. రాజ్ కావ్య లోపలికి వెళ్తారు. మరోవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మీ మాట్లాడుకుంటుంటే ప్రకాశం సెటైర్లు వేస్తాడు. మీరిద్దరు ఎక్కడికో బయలుదేరినట్లున్నారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో నిధి నిక్షేపాల కోసం అపర్ణ సెటైర్లు వేస్తుంది.
తర్వాత హాస్పిటల్‌కి వెళ్తున్నాం అని ఇందిరాదేవి అంటుంది. ఒక కారు రాజు రాణి తీసుకెళ్లారు. ఇంకో కారు అన్నయ్య తీసుకెళ్లాడు. ఎలా వెళ్తారు అని రుద్రాణి అంటుంది. సుభాష్‌కు కాల్ చేశాను. వస్తుంటాడు అని ఇందిరాదేవి అంటుంది. ఇంతలో వచ్చిన సుభాష్ కారు బ్రేక్ డౌన్ అయిందని, మెకానిక్‌కు అప్పజెప్పి క్యాబ్‌లో వచ్చానని చెబుతాడు. బాగున్న కారు కొడుకు కోడలు తీసుకెళ్లారు. ఇప్పుడు బావగారి కారు బాగోలేదు. ఇప్పుడు మీరిద్దరు హాస్పిటల్‌కు ఎలా వెళ్తారు అని ధాన్యలక్ష్మీ అంటుంది.
మీ కోడలు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో చూశావో అక్క అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇప్పుడు మీ ఆయన్ను చూడటానికి ఆటోలో వెళ్తావా. ఇలా అయిందేంటీ ఇల్లు అని రుద్రాణి అంటుంది. నువ్ అంత జాలి పడాల్సిన అవసరం లేదు. నా బావను చూడటానికి ఆటోలో వెళ్తాం అని ఇందిరాదేవి అని వెళ్లిపోతారు. తర్వాతస సుభాష్‌తో యావత్ ప్రజానీకాన్ని పేదరికంలోకి నెట్టేసి మనమెప్పుడు చూడని వీధుల బ్రతుకులను పరిచయం చేస్తుంది. టిఫిన్స్ పాయే.. రిచ్ ఫుడ్ పాయే.. క్రెడిట్ కార్డ్స్ పాయే.. ఆ నాలుగు కార్లు పాయే అని రుద్రాణి అంటుంది.
వంచించి బూత్ బంగ్లాకు
దానికి మా అత్త పాయే.. మా ఆయన పాయే అని స్వప్న సెటైర్లు వేసి వెళ్లిపోతుంది. సుభాష్ కూడా ఏం అనకుండానే వెళ్లిపోతాడు. మరోవైపు నందగోపాల్ గౌస్ట్ హౌజ్‌లోకి రాజ్, కావ్య వెళ్తారు. ఇది ఇంకో బూత్ బంగ్లా ప్లాన్ కాదు కదా. మర్యాదగా నిజం చెప్పండి. ఊకే బూత్ బంగ్లా అంటున్నా అని ఇలా గెస్ట్ హౌజ్‌లో ప్లాన్ చేయలేదు కదా. ఇలాగే మోసం చేసి నమ్మించి వంచించి బూత్ బంగ్లాకు తీసుకెళ్లి నా జీవితంలో నిప్పులు పోశారు. మళ్లీ ఇంతకాలాని నిప్పులు పోయాలనే కదా ఇలా ప్లాన్ చేశారు. ఎక్కడ బెడ్, ఎక్కడ డెకరేషన్ అని కావ్య అంటుంది.
మన రెండో శోభనాన్ని ఏ గదిలో ప్లాన్ చేశారు అని కావ్య అంటే రాజ్ కోప్పడుతాడు. ముందు నందగాన్ని నాలుగు బాది వంద కోట్ల సంగతి తేల్చుకుని వెళ్లాలి అని రాజ్ అంటాడు. కానీ, కావ్య నమ్మదు. రెండో శోభనానికే తీసుకొచ్చారు అని కావ్య అంటుంది. లేదు వాడు వచ్చేలోపు ఏదైనా డాక్యుమెంట్స్ దొరుకుతాయో వెతుకుదాం పదా అని రాజ్ అంటాడు. అలా చూస్తుండగా.. ఓ గదిలో ఫస్ట్ నైట్‌కు ఏర్పాటు చేసినట్లు డెకరేట్ చేసి ఉంటుంది. అది చూసి ఇద్దరు షాక్ అవుతారు.
సేమ్ అదే సిచ్యువేషన్. మీ ప్లాన్ మొత్తం అర్థమైంది అని కావ్య అంటుంది. నేనేం ప్లాన్ చేయలేదని రాజ్ అంటాడు. అబ్బో ఏం నటిస్తున్నారండి. ఇది వాడి గెస్ట్ హౌజ్ కాదు. ప్రపంచంలో మీకున్న బ్యాడ్ టేస్ట్ ఎవరికీ ఉండదు. ఉండండి మిమ్మల్ని అంటూ కాలు జారి రాజ్‌పై పడుతుంది కావ్య. ఇద్దరు బెడ్‌పై పడతారు. రొమాంటిక్‌గా చూసుకుంటూ అలాగే ఉండిపోతారు. ఇంతలో కారు సౌండ్ రావడంతో వాడు వచ్చినట్లున్నాడు అని తేరుకుంటారు.
ఆస్తులన్నీ బయట పెట్టి
మరోవైపు తన గర్ల్‌ఫ్రెండ్‌తో నందగోపాల్ వస్తాడు. మీకోసం లోపల సర్‌ప్రైజ్ ఉందని వాచ్‌మెన్ అంటాడు. గెస్ట్ హౌజ్‌లో రాజ్, కావ్యను చూసి షాక్ అవుతాడు నందగోపాల్. మా తాతయ్య నమ్మి వంద కోట్లకు షూరిటీ పెడితే మోసం చేసి తప్పించుకు తిరుగుతావా. నీ నుంచి వంద కోట్లు రాబట్టడమే కాదు నీ ఆస్తులన్నీ బయటపెట్టి నువ్ మోసం చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను అని రాజ్ అంటాడు. నేను మోసం చేయలేదు. కంపెనీ లాస్ అయింది. అందుకే మూసేశాను అని నందగోపాల్ అంటాడు.
ఎవరికీ చెబుతున్నావురా కథలు అని కోపంగా కాలర్ పట్టుకుంటాడు రాజ్. నందగోపాల్‌ను ఎడాపెడా వాయిస్తాడు రాజ్. మోసం చేసిన డబ్బు ఎక్కడ పెట్టావని అడుగుతాడు. రాజ్‌ను పక్కకు నెట్టేసి పారిపోతాడు. రాజ్ వచ్చేలోపు అని కారులో వెళ్లిపోతాడు నందగోపాల్. దాంతో రాజ్ కారును స్టార్ట్ చేయగానే ఆగిపోతుంది. పెట్రోల్ అయిపోయిందని రాజ్ అంటాడు. దాంతో దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు అని రాజ్ అంటాడు. ఇంతలో తన గర్ల్‌ఫ్రెండ్ వస్తే ఆపి వాడు ఎక్కడ ఉంటాడని అడుగుతారు.
ఏంటీ చెప్పేది వాడు పిలిచాడు.. నేను వచ్చాను. ఇప్పుడు పారిపోతాను అని పారిపోతుంది నందగోపాల్ గర్ల్‌ఫ్రెండ్. దాంతో వాచ్‌మెన్‌ను రాజ్ అడిగితే.. తెలియదంటాడు. వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ, మమ్మల్ని ఆపడం తెలుసా అని ఒక్కటి పీకుతాడు రాజ్. ఇప్పుడు కారు ఆగిపోతుంది ఏం చేద్దామని రాజ్ అంటే.. మరో కారు డ్రైవర్ యాదగిరికి కాల్ చేయండని కావ్య అంటుంది. దాంతో రాజ్ కాల్ చేస్తాడు.
సర్వ హక్కులు నాకే
మరోవైపు కారులు పంపించడంపై ధాన్యలక్ష్మీ గొడవ పడుతుంది ధాన్యలక్ష్మీ. నీకు హక్కులు ఎవరిచ్చారు అని అంటుంది. నాకు సర్వ హక్కులు తాతయ్య గారు ఇచ్చారు. మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నచ్చకున్నా నేను చెప్పినట్లు నడుచుకోవాల్సిందే అని కావ్య హుకుం జారీ చేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్