Brahmamudi February 18th Episode: ఇంటికి కల్యాణ్ అప్పు- ధాన్యలక్ష్మీ కన్నింగ్ ప్లాన్- రుద్రాణిని భరణంతో ఎలివేసిన కుటుంబం-brahmamudi serial february 18th appu kalyan return home dhanyalakshmi cunning plan star maa brahma mudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi February 18th Episode: ఇంటికి కల్యాణ్ అప్పు- ధాన్యలక్ష్మీ కన్నింగ్ ప్లాన్- రుద్రాణిని భరణంతో ఎలివేసిన కుటుంబం

Brahmamudi February 18th Episode: ఇంటికి కల్యాణ్ అప్పు- ధాన్యలక్ష్మీ కన్నింగ్ ప్లాన్- రుద్రాణిని భరణంతో ఎలివేసిన కుటుంబం

Sanjiv Kumar HT Telugu
Published Feb 18, 2025 07:36 AM IST

Brahmamudi Serial February 18th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 18 ఎపిసోడ్‌లో అప్పు కల్యాణ్‌ను దుగ్గిరాల ఇంటికి తీసుకొస్తారు ప్రకాశం, ధాన్యలక్ష్మీ. కొడుకును దారిలోకి తెచ్చుకుని అప్పును దూరం చేయాలని ధాన్యలక్ష్మీ ప్లాన్ వేస్తుంది. రుద్రాణిని ఎలివేద్దామని కుటుంబం అంతా అంటుంది. సీతారామయ్య ఒప్పుకుంటాడు.

బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 18వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 18వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆస్తి సమస్య తీరలదేని, ఆస్తి ముక్కలు చేసి ఎవరి వాటా వాళ్లకు పంచాలని అనుకుంటున్నట్లు సీతారామయ్య చెబుతాడు. దాంతో ప్రకాశం తండ్రి కాళ్లమీద పడి క్షమించమని అడుగుతాడు. తమ్ముడు అమాయకంగా ఉంటాడు, ఆస్తి నిలుపోకోలేకపోతే మళ్లీ కష్టాలు పడాలని సుభాష్ అంటాడు.

చీలికలు రావొద్దంటే

ఇదేంటీ అందరూ కలిసి ఆస్తి పంపకాలు జరగనిచ్చేలా లేరు. ముసలోడు ఆస్తి పంచడా ఏంటీ అని రుద్రాణి భయపడుతుంది. తప్పులు అందరూ చేస్తారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు అందరూ మనతో ఉంటేనే ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే బాధపడతాం అని ఇందిరాదేవి అంటుంది. సరే. ఇదే వీళ్లకు నేనిచ్చే చివరి అవకాశం. మళ్లీ ఆస్తి గురించి చీలికలు రావొద్దు అని సీతారామయ్య ఫైనల్ వార్నింగ్ ఇస్తాడు. రావు, రావు నాన్న అని ప్రకాశం అంటాడు.

కలిసి ఉండటం అంటే మనమే కాదు. అప్పును కోడలిగా ఒప్పుకుని మన ఇంటికి తీసుకురావాలి. వాడు కష్టపడటం నాకు ఇష్టం లేదు. ధాన్యలక్ష్మీ కూడా చెప్పాలి అని సీతారామయ్య అంటాడు. దానికి సరే మావయ్య గారు. రేపే వెళ్లి కొడుకును, కోడలిని ఇంటికి తీసుకొస్తాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. ధాన్యలక్ష్మీ కూడా మారిపోయినట్లు తెలుస్తోంది. అంతా సంతోషిస్తుంటే.. రుద్రాణి, రాహుల్ మాత్రం చిరాకు పడతారు.

తర్వాత ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టేందుకు రుద్రాణి ప్రయత్నిస్తుంది. ఆస్తి నీకు దక్కాలని నీకోసం ఎంతో కష్టపడ్డాను. పోరాట యోధురాలిలా పాటుపడ్డాను. కానీ, నువ్ చలనం లేకుండా ఇంట్లో ఏం జరిగినా నాకు ఏం సంబంధం లేనట్లు ఉన్నావ్. మా నాన్న ఆస్తి పంచుతానంటే హ్యాపీగా తీసుకొవచ్చు కదా. మీ ఆయన తప్పైందని కాళ్లమీద పడుతుంటే నువ్ ఆపి ఆస్తి కావాలని అడగొద్దా అని రుద్రాణి అంటుంది. ఏ నువ్వు అడగొచ్చు కదా. నీకు నోరు లేదా. ఈ ఆస్తిలో వాటా అడిగే హక్కు లేదా. ఆశ లేదా అని రివర్స్‌లో నిలదీస్తుంది ధాన్యలక్ష్మీ.

ధాన్యలక్ష్మీ కన్నింగ్ ప్లాన్

నా కొడుకు గురించి లాగే నువ్ ఆలోచించావ్ కదా. మరి ఎందుకు అడగలేదు. నేను అడిగి గయ్యాలి అనిపించుకోవాలి. నువ్వేమో మంచిదానిలా ఉందామనుకున్నావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. నేను అడిగేదానికి నువ్వు అడిగేదానికి తేడా ఉంది. మేము సొంత కూతురుని కాదు. ప్రకాశం అన్నయ్య అలా కాదుగా. ఇప్పుడేమో కోడలిని అంగీకరించి తీసుకొస్తాను అంటున్నావ్ అని రుద్రాణి అంటుంది.

కోడలిగా ఒప్పుకున్నానని ఎవరన్నారు. ముందు నా కొడుకు సంతోషం ముఖ్యం. వాడు ఇంటికి వచ్చాకా వాడిని నా దారిలోకి తెచ్చుకోవాలి. వాన్ని దూరం పెట్టి చాలా తప్పు చేశాను. ముందు నా కొడుకు ఇంటికి రాని. ఆ తర్వాత నా కొడుకును దూరం చేయాలనుకున్న అప్పును ఏం చేయాలో అది చేస్తాను అని ధాన్యలక్ష్మీ చెప్పి వెళ్లిపోతుంది. అంటే, ఈ రుద్రాణికే అంతుచిక్కని ప్లాన్ ఏదే వేసేశావన్నమాట అని ఆశ్చర్యపడుతుంది రుద్రాణి.

మరుసటి రోజు ఉదయం కల్యాణ్, అప్పు బట్టలు ఆరేస్తుంటారు. ఇంతలో ప్రకాశం, ధాన్యలక్ష్మీ వస్తారు. మాతోపాటు ఇంటికి రమ్మని ప్రకాశం అంటాడు. తర్వాత మనం మన ఇంటికి వెళ్తున్నాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో కల్యాణ్, అప్పు షాక్ అవుతారు. ఇన్నాళ్లు మిమ్మల్ని దూరం పెట్టి తప్పు చేశాను. క్షమించు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో అయ్యో అమ్మా అవేం మాటలు అని కల్యాణ్ అంటాడు. తర్వాత అప్పు వచ్చి దేవతలా కాపాడిందని ప్రకాశం కోడలిని పొగుడుతుంటాడు.

దుగ్గిరాల ఇంటికి కల్యాణ్, అప్పు

ఇంకా ఎక్కువ సేపు ఉంటే దీని కాళ్లు కడిగి నెత్తిన పోసుకునేలా ఉన్నాడు అని అనుకున్న ధాన్యలక్ష్మీ ఆ విషయాలు ఎందుకండి. వచ్చిన పని చూద్దాం అని అంటుంది. అప్పు పోలీస్ అయింది. నేనింకా పూర్తి రైటర్‌గా పేరు తెచ్చుకోలేదు అని కల్యాణ్ అంటాడు. అది ఇంట్లో ఉండే ట్రై చేయి. ఎవరు ఆపరు అని ధాన్యలక్ష్మీ అంటుంది. అప్పు సరే అని ఒప్పుకోమనడంతో కల్యాణ్ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు స్వప్నతో రుద్రాణి మాట్లాడుతుంది.

మీరు ఏడ్చే టైమ్ వచ్చిందని స్వప్న అంటుంది. నేను ఏడ్చే టైమ్ రాదు. నేను ఏడిపించే టైప్, ఏడ్చే టైప్ కాదు. అందుకు నువ్వు ఓ జన్మ ఎత్తాలి అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు జరగబోయేదానికి లోలోపలే ఏడుస్తారు. కల్యాణ్, అప్పును తీసుకురాడానికి వెళ్లారు. నలుగురు పచ్చగా ఉంటే మీకు నచ్చదుగా, ఏడుస్తుంటారు అని స్వప్న అంటుంది. ఇంతలో కల్యాణ్, అప్పు వస్తారు. కావ్యకు దిష్టి తీయమని చెబుతుంది స్వప్న.

కావ్య హారతి తీసుకొచ్చి ఇస్తుంది. కల్యాణ్, అప్పు వస్తుంటే.. ఆగమని మా ముచ్చట్లేవి తీరకుండానే మీ పెళ్లి జరిగింది. పేర్లు అయినా చెప్పి రండి అని కావ్య అంటుంది. దాంతో అప్పు సిగ్గుపడుతుంది. అరే అప్పు కూడా సిగ్గు పడుతుందా అని ఇందిరాదేవి అంటుంది. తర్వాత పొట్టి, కూచి అని పేర్లు చెప్పి కల్యాణ్, అప్పు వస్తారు. తర్వాత ధాన్యలక్ష్మీ, ప్రకాశం పెళ్లి చూడలేదు కాబట్టి పేర్లు చెప్పి లోపలికి రమ్మని కావ్య చెబుతుంది.

రుద్రాణిని బయటకు పంపించేద్దాం

దాంతో ధాన్యలక్ష్మీ చిరాకుపడుతుంది. ఇందిరాదేవి అనడంతో నేను మా గంపగయ్యాళి వచ్చాం అని ప్రకాశం అంటాడు. నేను నా మతిమరుపు మొగుడు వచ్చామని ధాన్యలక్ష్మీ అంటుంది. కల్యాణ్ అప్పు సీతారామయ్య ఆశీర్వాదం తీసుకుంటారు. ఇప్పుడు నాకు తృప్తిగా ఉందని సీతారామయ్య అంటే.. నాకు లేదని ఇందిరాదేవి అంటుంది. ఇది పాల కుండ వంటి ఉమ్మడి కుటుంబం. దాంట్లో ఉప్పు రాయి పడితే విరిగిపోతాయ్. అలాంటి ఉప్పు రాయిని బయటకు పంపాలని అనుకుంటున్నాను అని ఇందిరాదేవి అంటుంది.

నువ్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఇంట్లో అందరి మనసుల్లో విషం నింపాలని రుద్రాణి చూసింది. ధాన్యలక్ష్మీనే కాదు ప్రకాశంను కూడా మార్చింది. ఇంటిని ముక్కలు చేయడానికి ఎన్నో చేసింది. ఇలాంటి కలుపు మొక్కను పీకి పడేద్దాం బావా. అందుకే, రుద్రాణి, రాహుల్‌ను బయటకు పంపిద్దాం అని ఇందిరాదేవి అంటుంది. దాంతో రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. ఇన్నాళ్లకు అమ్మ ధైర్యం చేసి మంచి పని చేసింది. మీరు నిర్ణయం తీసుకోవాలి నాన్న అని సుభాష్ అంటాడు.

నా సపోర్ట్ మీకే అని ప్రకాశం, స్వప్న అంటారు. ఒకరికోసం ఒకరు ఉండాలంటే అందరిని విడదీసే అత్తను బయటకు పంపించడమే మంచిది అని రాజ్ అలాగే అంటాడు. ఆహా నేను ఇంట్లోకి రాగానే శుభగడియలు మొదలయ్యాయి. దుష్టశక్తిని బయటకు పంపిస్తున్నారు అని కల్యాణ్ అంటాడు. రాహుల్ పుట్టినప్పటినుంచి రుద్రాణి స్వార్థంతో ప్రతిదాంట్లో గొడవ చేసింది. కావాలంటే బయటకు పంపి ఖర్చుల కింద ప్రతి నెల భరణం పంపిద్దాం అని అపర్ణ అంటుంది.

నన్ను ఎలివేస్తున్నారా

దాంతో చాలు ఆపండి అని రుద్రాణి అరుస్తుంది. మీరంతా ఒక్కటైపోయి నన్ను నా కొడుకును ఎలివేస్తున్నారా. నేను ఇంటి ఆడపడుచుననే హోదాలోనే బతికాను. నన్ను పొమ్మనే హక్కు మీకెవరికి లేదు అని రుద్రాణి అంటుంది. మాకుంది. నీలాంటిది ఉండటం వల్ల చీలికలు మొదలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి నిన్ను ఇంట్లో ఉంచే ప్రసక్తే లేదు అని ఇందిరాదేవి గట్టిగా చెబుతుంది. దాంతో సీతారామయ్యను వేడుకుంటుంది రుద్రాణి.

అందరూ సంతోషంగా ఉండాలంటే రుద్రాణి మన ఇంట్లో ఉండకూడదు. నువ్ ఆస్తి కావ్య మీద రాసినట్టుందుకు చాలా మాట్లాడింది. నువ్ ప్రాణాలతో లేకుంటే తన పరిస్థితి ఏంటని మాట్లాడింది అని ఇందిరాదేవి చెబుతుంది. మంచిదమ్మా మీరే కలిసి ఉండండి. ఇన్నాళ్లు కలిసి ఉన్నందుకు నాకు నా కొడుకు ఆస్తిలో భాగం పంచివ్వండి. నేను నా కొడుకు వెళ్లిపోతాం అని రుద్రాణి అంటుంది. ఇంతసేపు నువ్ ఆ మాట అంటావా లేదా అని చూశాను. వేరు అవుతున్నందుకు బాధ ఉంటుందేమో అనుకున్నా. కానీ, ఆస్తిలో వాటా అడగ్గానే మీ అమ్మ మంచి నిర్ణయమే తీసుకుందనిపించింది. ఇక బయలుదేరండి అని సీతారామయ్య అంటాడు.

నాన్నా అని రుద్రాణి అంటే.. నాన్నకు విలువ ఎక్కడుంది. ఆస్తి పంచితే నాన్న అని కూడా పిలవకుండా వెళ్లిపోతావ్. నిన్ను పెంచాను. నీ కొడుకును చదివించాను. ఇప్పుడు అపాత్రదానం చేసే పెద్దమనసు నాకు లేదు అని సీతారామయ్య అంటాడు. ఇప్పుడు నేను ఇగోకి వెళ్తే అడుక్కుతినాలి అని సీతారామయ్య కాళ్లు పట్టుకుంటుంది రుద్రాణి. దాంతో అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం