Brahmamudi February 15th Episode: ఎస్ఐ, నందాను పట్టుకున్న అప్పు- దుగ్గిరాల కుటుంబం సేఫ్- బయటపడిన అనామిక, సామంత్ బాగోతం-brahmamudi serial february 15th appu caught si nanda and seetharamayya thanks kavya star maa brahma mudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi February 15th Episode: ఎస్ఐ, నందాను పట్టుకున్న అప్పు- దుగ్గిరాల కుటుంబం సేఫ్- బయటపడిన అనామిక, సామంత్ బాగోతం

Brahmamudi February 15th Episode: ఎస్ఐ, నందాను పట్టుకున్న అప్పు- దుగ్గిరాల కుటుంబం సేఫ్- బయటపడిన అనామిక, సామంత్ బాగోతం

Sanjiv Kumar HT Telugu
Published Feb 15, 2025 07:35 AM IST

Brahmamudi Serial February 15th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 15 ఎపిసోడ్‌లో నందా దగ్గరికి ఎస్ఐ విశ్వ డబ్బుల కోసం వెళ్తాడు. అక్కడ ఎస్ఐకు నందా డబ్బులి ఇస్తాడు. అదంతా వీడియో రికార్డ్ చేసి ఇద్దరని పట్టుకుని సీతారామయ్య కాళ్ల మీద పడేస్తుంది అప్పు. దాంతో బ్యాంక్ వాళ్లు ఇల్లు జప్తు చేయకుండా వెళ్లిపోతారు.

బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 15వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 15వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఎస్ఐని ఫాలో అవుతూ అప్పు వెళ్తుంది. ఇక్కడ పరిస్థితి బాగోలేదు అని కావ్యకు అప్పు చెబుతుంది. ఎలాగోలా వాళ్లను టైమ్ ఇవ్వమని అడుగు, నందగాడు బతికి ఉన్నాడని టైమ్ తీసుకోండి అని అప్పు అంటుంది. ఇదివరకు ఓసారి ఇలాగే చేసి ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు వాడిని చూస్తేగానీ నమ్మరు అని కావ్య అంటుంది.

తాతయ్య బాధపడుతున్నాడు

అర్థమైంది అక్క. నేను చూసుకుంటాను. ఆ నందగాడితోనే వస్తుంది అని అప్పు అంటుంది. ఇంతలో వచ్చిన రాజ్ ఏమంటుంది అని అడుగుతాడు. నందగాడు కచ్చితంగా దొరుకుతాడని చెబుతుంది అని కావ్య అంటుంది. దొరకాలి, లేకుంటే మనం కుటుంబం రోడ్డునపడుతుంది. నందగాడు కనిపిస్తే మాత్రం చంపేస్తాను. పాపం తాతయ్య మంచి మనసుతో సంతకం పెడితే ఇలా జరిగిందని బాధపడుతున్నాడు అని రాజ్ అంటాడు. కూల్‌గా ఉండండి, ఏమైనా చేస్తే మనకే ప్రాబ్లమ్ అవుతుందని కావ్య అంటుంది.

మరోవైపు ఇందిరాదేవి కన్నీళ్లు పెట్టుకుంటే బాధపడుతున్నావా చిట్టీ అని అడుగుతాడు సీతారామయ్య. లేదు బావ ఇచ్చిన మాటకు సర్వస్వం వదులుకుంటున్నా నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను, అక్కడే బతుకుతాను అని ఇందిరాదేవి అంటుంది. చాలామంది దాంపత్యం అంటే ఏంటో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని అపర్ణ అంటుంది. రాహుల్ మన నగలు జాగ్రత్తగా దాచిపెట్టావా అని రుద్రాణి అంటుంది.

అన్ని లాకర్ రూమ్ నుంచి బెడ్ కింద పెట్టాను. వీళ్లేం ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కాదు రైడ్ చేయడానికి అని రాహుల్ అంటాడు. ఆ మాటలు విన్న స్వప్న అనుమానంగా చూస్తుంది. ఇదేంటి మనల్నీ దొంగలా చూస్తుంది. నగల విషయం కనిపెట్టిందా అని రాహుల్ అంటాడు. ఇంతలో అత్త అంతా నగలు తీసుకొచ్చారు. నువ్ తీసుకురాలేదు ఏంటీ అని అడుగుతుంది. వెళ్లి తీసుకురండి అని బ్యాంక్ వాళ్లు అడుగుతారు. నా మొహానికి నగలు ఎక్కడ ఉండి చచ్చాయి అని రుద్రాణి అంటుంది.

నాకు సంబంధమే లేదు

నీ పెళ్లికి తాతయ్య పెట్టారు కదా అని స్వప్న అంటుంది. నీకు మావయ్య గారు బాగానే పెట్టారు. నా నగలు బయటపెట్టావ్ కదా. ఇప్పుడు నీ నగలు చెప్పాను. చెల్లుకు చెల్లు. వెళ్లి తీసుకురా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అసలు ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధమే లేదు. నేను దుగ్గిరాల వారి ఇంటి ఆడపడుచుకునే కాదు. మా వంశం వేరు. ఇంటిపేరు వేరు అని రుద్రాణి అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. కానీ, చిన్నప్పటినుంచి నువ్ ఈ ఇంట్లోనే ఉన్నావ్ కదా. ఆస్తి పంపకాలు వచ్చేసరికి ఆడపడుచునని పోట్లాడావ్. నగలు అడిగేసరికి కాదంటావా అని అపర్ణ అంటుంది.

మర్యాదగా అడిగితే వీళ్లెక్కడ ఇస్తారు. బెడ్ కింద పెట్టి ఉంటారుగా వెళ్లి తీసుకొస్తా అని స్వప్న అంటుంది. భలే గుర్తుచేశావ్ స్వప్న. మనం నగలు లేకుండా ఉంటే తను నగలు దిగేసుకుని ఉంటుందా అని ధాన్యలక్ష్మీ అంటుంది. స్వప్న వెళ్లి రుద్రాణి నగలు అన్ని తీసుకొచ్చి ఇస్తుంది. వంద కోట్లకు ఏమాత్రం తగ్గిన తాతయ్యకు మాట వస్తుందని స్వప్న అంటే.. మంచి పని చేశావ్ అని ప్రకాశం అంటాడు. మమ్మీ నా పెళ్లాం మనల్నీ రోడ్డు మీద పడేసింది అని రాహుల్ అంటాడు.

మరోవైపు ఎస్సైని ఫాలో అవుతూ అప్పు వెళ్తుంది. ఎస్సై నందా ఉన్న ఇంటికి వెళ్తాడు. నంద తాగుతూ ఉంటాడు. అది చూసి ఎస్సై చప్పట్లు కొడుతూ సూపర్ నందా అంటూ పొగుడుతాడు. నందా, ఎస్సై మాట్లాడుకునేది ఫోన్‌లో రికార్డ్ చేయిస్తుంది. ఇద్దరు డబ్బు కొట్టేయడం, కమిషన్స్ గురించి మాట్లాడుకుంటారు. త్వరగా డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అని డబ్బు ఇస్తాడు నందా. త్వరగా వెళ్లు స్వామి ఎవరికైనా అనుమానం వస్తే అడ్డంగా దొరికిపోతాం అని నందా అంటాడు.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అప్పు

ఆల్రెడీ దొరికిపోయారు అని అప్పు వచ్చి హ్యాండ్సప్ అని గన్ తీస్తుంది. కానిస్టేబుల్స్ వచ్చి నందాను పట్టుకుంటారు. తప్పించుకోడానికి ట్రై చేయకు, బాడీలో బుల్లెట్స్ దిగిపోతాయ్ అని నందాను, లెక్కలు తేలట్లేదా. వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఇద్దరం తీరిగ్గా లెక్కపెడదాం పదా, డబ్బుకోసం ఆశపడి స్నేహానికే మచ్చ తెస్తావా అని ఎస్సైని అంటుంది. నిన్ను నమ్మి వందకోట్లకు షూరిటీ ఇచ్చిన ఒక గొప్ప ఫ్యామిలీని ఇలా చేస్తావా అని నందాను కొడుతుంది అప్పు. అది చూసి ఎస్సై భయపడిపోతాడు.

మరోవైపు అన్నింటికి లెక్క సరిపోయిందా అని సీతారామయ్య అంటాడు. ఆల్రెడీ రాజ్ గారు 25 కోట్లు కట్టారు, 75 కోట్లకు సరిపోయింది. చెప్పడానికి మాకు, వినడానికి మీకు బాలేకున్నా మీరు ఇవాళ ఇంటి నుంచి ఖాళీ చేయాలి సర్. అందరూ ఈ పత్రాలపై సంతకాలు చేయండి అని బ్యాంక్ వాళ్లు అంటారు. సీతారామయ్య సంతకం చేయడానికి పెన్ తీసుకుంటాడు. సీతారామయ్య చెయి వణుకుతుంటే ఇందిరాదేవి పట్టుకుంటుంది.

ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తిగా ఈ సంతకం చెబుతుంది. మళ్లీ ఆస్తులు సంపాదించుకోవచ్చు. సంతకం చేయి అని ఇందిరాదేవి అంటుంది. ఇంతలో నందా, ఎస్సైను లాక్కొచ్చి సీతారామయ్య కాళ్ల ముందు పడేస్తుంది అప్పు. తాతయ్య గారు మీరు ఇక ఆస్తులు బ్యాంక్‌కు కట్టాల్సిన అవసరం లేదు అని అప్పు అంటే.. బ్యాంక్ వాళ్లు అయోమయంగా చూస్తుంటారు. వీడే దివాళ తీసిన నందా. ఇన్నాళ్లు చనిపోయినట్లు నాటకం ఆడాడు. తండ్రి చనిపోగానే బోర్డ్ తిప్పేసాడు. వీడి ఆస్తులు ఎక్కడికి పోలేదు. కాబట్టి మా ఆస్తులు మాకిచ్చి వెళ్లిపోండి అని అప్పు అంటుంది.

వీడి నుంచి ఆస్తులు తీసుకుంటాం

హమ్మయ్యా నగలు పోలేదు, ఆస్తులు దక్కాయి అని రుద్రాణి, ధాన్యలక్ష్మీ అనుకుంటారు. మాకు చాలా గిల్టీగా ఉంది. ఒక్క షూరిటీ సంతకం కోసం ఇంత ఆస్తిని వదులుకోడవం చూసి మీకు చేతులెత్తి దండం పెట్టాలి. మీరు వీడిని తీసుకొచ్చి చాలా హెల్ప్ చేశారు. మీరు పోలీస్ స్టేషన్‌కు వచ్చి కేసు పెట్టండి. మేము వీడి నుంచి ఆస్తులు తీసుకుంటాం అని బ్యాంక్ వాళ్లు వెళ్లిపోతారు. బావా నీతో ఉంటు నందాకు హెల్ప్ చేశాడు ఈ విశ్వ అని అప్పు అంటుంది.

నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉందిరా. డబ్బు అడిగితే నేనే ఎంతైనా ఇచ్చేవాన్ని కదరా అని రాజ్ అంటాడు. ఇద్దరిని సెల్‌లో పడేయండి అని కానిస్టేబుల్స్‌కు చెబుతుంది అప్పు. అమ్మా అప్పు చిన్నదానివి అయ్యావ్ కానీ, చేతులెత్తి దండం పెట్టాలని ఉంది. కోడలిగానే కాదు పోలీస్‌గా కూడా బాధ్యత నిర్వర్తించావ్ అని సీతారామయ్య అంటాడు. నేను చేసిందేం లేదు. వాడు బతికి ఉన్నాడన్న విషయం చెప్పింది అక్కా బావా అని అప్పు అంటుంది.

వాడు బతికి ఉన్న విషయం ముందే తెలిసి ఉంటే ఇక్కడిదాకా ఎందుకు రానిచ్చారు అని సుభాష్ అడుగుతాడు. అలా చెబితే ఎవరు నమ్ముతారు. డబ్బులు ఎగ్గొట్టడానికి నాటకం ఆడుతున్నామంటారు. అందుకే వాడిని తీసుకురమ్మని అప్పుకు చెప్పాం. సరైన సమయానికి అప్పు తీసుకొచ్చి కాపాడింది అని రాజ్, కావ్య చెబుతారు. ఎప్పుడు కోడలిగా అడుగుపెట్టావో కానీ ప్రతిసారి ఇంటిని కాపాడుతూనే వస్తున్నావ్. ఇచ్చిన మాటకు ఇంట్లోవాళ్లను ఇబ్బందిపెడుతున్నావా అని ఎక్కడో గిల్టీ ఉండేది. ఇంటి దేవతవు అయిపోయావమ్మా అని సీతారామయ్య అంటాడు.

నేనే కదా కారణం

అవును బావ, తను దేవత, తను ధైర్య లక్ష్మీ. ఇద్దరు కలిసే కదా కేసును సాల్వ్ చేశారు అని ఇందిరాదేవి అంటుంది. అసలు వీళ్లిద్దరు ఇంట్లోకి రావడానికి నేనే కదా కారణం అని స్వప్న అంటుంది. ఒప్పుకుంటున్నాను. మీ ముగ్గురు కోడళ్లవళ్లే ఇవాళ మేము ఇలా సంతోషంగా ఉంటున్నాం. హ్యాపీనా అని ఇందిరాదేవి అంటుంది. బావ గారు మీరు ఇంకో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇదంతా చేసింది విశ్వ నందా కాదు. వీళ్లను వెనుక నుండి నడిపించింది అనామిక సామంత్ అని అప్పు చెబుతుంది.

దాంతో రాజ్, కావ్య అంతా షాక్ అవుతారు. ఇంకా దాని కోపం చల్లారలేదా. పగబట్టిన పాములా చూస్తుందిగా అని అపర్ణ అంటుంది. ఎన్నిసార్లు చెప్పిన మన ఫ్యామిలీకి ఏదో ఒక ప్రాబ్లమ్ తీసుకొస్తూనే ఉన్నారు. ఈసారి మాత్రం వాళ్లను వదిలిపెట్టను కోపంగా వెళ్తాడు రాజ్. అయ్యయ్యో ఆవేశంలో ఏం చేస్తాడో అని కావ్య వెళ్తుంది. నగలు పోలేదు, ఆస్తులు దక్కాయి అని రుద్రాణి అంటుంది. నువ్ జీవితంలో మారవే అని చీదరించుకుంటుంది ఇందిరాదేవి.

తర్వాత ధాన్యలక్ష్మీ తన నగలు తీసుకుంటుంది. తర్వాత ఇంట్లో ఖర్చులు తగ్గి అందరి దృష్టిలో చెడ్డవాళ్లు అయ్యారు. ఇక ఏ సమస్య లేదుగా అని అపర్ణ అంటుంది. లేదమ్మా అసలు సమస్య అలాగే ఉంది. ఆస్తి.. ఆస్తి మొత్తం ముక్కలు చేసి ఎవరి వాట వాళ్లకు పంచాలని అనుకుంటున్నాను అని సీతారామయ్య అంటాడు. అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం