Brahmamudi December 9th Episode: బ్రహ్మముడి.. తల్లికి షాక్ ఇచ్చిన కావ్య.. బతికొచ్చిన మొక్క.. కాలిపోయిన లగ్న పత్రిక-brahmamudi serial december 9th episode kalyan anamika wedding card burned ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi December 9th Episode: బ్రహ్మముడి.. తల్లికి షాక్ ఇచ్చిన కావ్య.. బతికొచ్చిన మొక్క.. కాలిపోయిన లగ్న పత్రిక

Brahmamudi December 9th Episode: బ్రహ్మముడి.. తల్లికి షాక్ ఇచ్చిన కావ్య.. బతికొచ్చిన మొక్క.. కాలిపోయిన లగ్న పత్రిక

Sanjiv Kumar HT Telugu
Dec 09, 2023 07:18 AM IST

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 9వ తేది ఎపిసోడ్‌‌లో కల్యాణ్‌కి కాల్ చేసిన అనామిక తనను పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని బెదిరిస్తుంది. మరోవైపు ఇవాళ మొక్కను నేను హత్య చేయబోతున్నాను అని కనకం అంటుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 9వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 9వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌లో కల్యాణ్, అనామిక పెళ్లి, నిమ్మ మొక్క గురించి ధాన్యలక్ష్మీ, అపర్ణ, రుద్రాణి, ఇందిరాదేవి మాట్లాడుకుంటారు. ఆ మాటలను మెట్లపై ఉన్న కావ్య వింటూ ఉంటుంది. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి విషయం ఇలా అయిందని ధాన్యలక్ష్మీ అంటే.. అందరికీ ఒక్కగానొక్క కొడుకులే ఉన్నారు. ఇప్పుడు ఆ మొక్క చనిపోయి ఉంటే పెళ్లి ఆపేస్తారా అని రుద్రాణి అంటుంది.

ఓర్పుగా ఉంటే

అలా ఎందుకు జరుగుతుంది. మొక్క బతికే ఉంటుంది అనుకోవచ్చు కదా అని అపర్ణ అంటుంది. పక్కనే కూరగాయాలు కట్ చేస్తున్న కనకం లేదు ఆ మొక్క చనిపోతుంది. నేను మొక్కను హత్య చేయబోతున్నాను అంటుంది. నువే కదా నా పెళ్లికి ముహుర్తాలు, లగ్నం బాగున్నాయని చేశావ్. మేం ఎక్కడ సంతోషంగా ఉన్నామని రుద్రాణి అంటుంది. నువ్ ఓర్పుగా ఉంటే బాగుండేదని అపర్ణ అంటే.. అప్పుడు ఈ లగ్నాలు ఏం చేస్తున్నాయి, స్వప్న రాహుల్ ఎలా ఉంటున్నారో చూస్తున్నాం కదా అని రుద్రాణి అంటుంది.

రాజ్, స్వప్న కూడా ఏం బాగున్నారు. ఎప్పుడూ ఏదో ఒక రభస అని అపర్ణ అంటే.. ఇక ఈ విషయం ఆపండి. తెల్లారితే తెలిసిపోతుంది కదా అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు ఈ పెళ్లి జరిగితే.. కల్యాణ్‌ను అడ్డు పెట్టుకుని అప్పు అంతా తీర్చొచ్చు అనుకున్నాం. కానీ ఇలా జరిగింది. ఇప్పుడు మనం కాదు చేయాల్సింది. అనామికనే చేస్తుంది అని భార్య శైలుతో అన్న సుబ్రహ్మణ్యం కూతురు దగ్గరికీ వెళ్తాడు. నువ్ చాలానే ప్రేమిస్తున్నావ్. కానీ, నీలా కల్యాణ్ ప్రేమించట్లేదేమో బేబీ అని సుబ్రహ్మణ్యం అంటాడు.

మొక్క బతికే ఉంటే

లేదు డాడ్. సిన్సియర్‌గా లవ్ చేస్తున్నాడని అనామిక అంటే.. మొక్క బతికితే పెళ్లి చేసుకుంటాడు. మొక్క చనిపోతే ఎలా అని ఇంట్లో వాళ్లు అన్నప్పుడు.. ఏం మాట్లాడలేదు. ఏం జరిగినా నిన్ను పెళ్లి చేసుకుంటాని చెప్పాలి కదా. నీ మంచికే చెబుతన్నాం అని అనామిక తల్లిదండ్రులు చెప్పేసి వెళ్లిపోతారు. దాంతో కల్యాణ్‌కు కాల్ చేసిన అనామిక.. మొక్క బతికి ఉంటే మన పెళ్లి జరుగుతుంది. లేదంటే అని అడుగుతుంది. దానికి కల్యాణ్ సైలెంట్‌గా ఉంటాడు.

నీ మౌనమే సమాధానం చెబుతుంది. నాకు కావాల్సిన ఆన్సర్ దొరికింది. నేను నిన్ను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోలేను. ఈ పెళ్లి జరగకుంటే నువ్ నా చావును చూస్తావ్ అన్ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది అనామిక. దాంతో షాక్ అవుతాడు కల్యాణ్. మరోవైపు ఇలా సైలెంట్‌గా ఎలా అండి. ఏదో ఒకటి చేయండి. పెళ్లి జరగకపోతే కవి గారు ఎలా ఉంటారు అని కావ్య అంటుంది. అవును, వాడు చాలా సెన్సిటివ్. కానీ, మనం వాళ్లకు సపోర్ట్ చేసి పెళ్లి అయ్యాక ఏదైనా గొడవలు జరిగితే మనల్నే అంటారు అని రాజ్ అంటాడు.

తప్పంతా నాదా

నువ్ ఏదో ఒకటి చేస్తావ్. అది ఇంట్లో గొడవ జరిగేలా చేస్తుంది. నేను ఎవరో ఒకరివైపు నిలబడాలి. అదంతా నాకే కదా తంటా అని రాజ్ అంటాడు. మీరు అన్నింటికి కారణాలు చూపించగలరు. ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమిస్తే కదా. మీకు ఆ బాధ తెలిసేది. ప్రేమించిన వాళ్ల బాధ మీకు పట్టదు అని కోపంగా వెళ్లిపోతుంది కావ్య. ఇదేంటి తప్పంతా నాదన్నట్లు మాట్లాడింది. నా తమ్ముడికి మంచి జరగాలని అనుకోనా. నేను గిల్టీ ఫీల్ అయ్యేలా చేసిందేంటి అని రాజ్ అనుకుంటాడు.

అనంతరం రాత్రిపూట పచ్చగున్న మొక్కను తీసి వాడిపోయిన మొక్కను పెడుతుంది కనకం. ఇంతలో మొక్క దగ్గరికి కల్యాణ్ వస్తాడు. డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ రావడంతో కనకం జాగ్రత్తపడుతుంది. కల్యాణ్ డోర్ తీసి చూసి సరికి కనకం పక్కకు వెళ్లి దాక్కుంటుంది. కల్యాణ్ వచ్చి మొక్క వాడిపోవడం చూసి షాక్ అవుతాడు. పెళ్లి జరగదా అనుకుని అప్పు తెచ్చిన ఇంకో మొక్కను నాటాలని అనుకుంటాడు. కానీ, పెద్దవాళ్లకు ఆరోగ్యం బాగుండకపోవచ్చు అని పంతులు చెప్పిన మాటలు తల్చుకుని ఆగిపోతాడు.

అప్పు పరిస్థితి ఏంటీ

నా ప్రేమ కోసం ఇంట్లో వాళ్ల ఆరోగ్యాన్ని పనంగా పెట్టలేనని వెళ్లిపోతాడు కల్యాణ్. మరుసటి రోజు ఉదయం లేచిన కనకం వచ్చి మొక్క దగ్గరకు వస్తుంది. ఇంతలోపే అక్కడ అంతా ఉంటారు. మొక్క వాడిపోయిందని షాక్ అయినట్లు ఉన్నారు. నేనే ఓదార్చాలని అనుకుంటుంది కనకం. కానీ, వచ్చి చూసేసరికి మొక్క బతికే ఉంటుంది. అది చూసి షాక్ అయిన కనకం నా అప్పు పరిస్థితి ఏంటీ అని అనుకుంటుంది.

మొక్క బతికి ఉండటంతో అంతా కల్యాణ్‌కు కంగ్రాట్స్ చెబుతూ సంతోషం వ్యక్తం చేస్తారు. తర్వాత అనామికకు కాల్ చేసి మొక్క బతికే ఉందని కల్యాణ్ చెబుతాడు. దాంతో అనామిక సంబరపడిపోతుంది. అదే విషయం తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోతుంది. అనామిక పెళ్లి జరుగుతుంది. కానీ, మీరు అన్నట్లుగా అనామిక మాట విని కల్యాణ్ మన సమస్యలు తీరుస్తాడా అని శైలజ అడుగుతుంది. కచ్చితంగా చేస్తాడు. పెళ్లి అయ్యాక.. ఏదో ఒకటి చేసి కల్యాణ్‌ను మన ఇంటికి తీసుకొస్తాం. అప్పుడు కల్యాణ్‌కు వచ్చే వాటాతో మన అప్పు తీరుస్తాం అని సుబ్రహణ్యం కన్నింగ్ ప్లాన్ వేస్తాడు.

లగ్నపత్రికకు నిప్పు

మన అమ్మాయి పెళ్లి జరిగితే అంతే చాలు అని శైలజ అంటే.. మన అమ్మాయిపై కల్యాణ్ ప్రేమ అలాగే చేయిస్తుంది అని సుబ్రహణ్మ అంటాడు. మరోవైపు కావ్య దగ్గరికి వచ్చిన కల్యాణ్ ఈ దేవతకు థ్యాంక్స్ చెప్పాలి. ఇదంతా జరగడానికి మీరే కదా కారణం. ఆ మొక్క నాటింది మీరే అని నాకు తెలుసు వదినా అని కల్యాణ్ అంటాడు. తర్వాతి ఎపిసోడ్‌లో తాంబులాలు ఇచ్చుకుంటారు. లగ్నపత్రికకు పసుపు పెట్టి హారతి ఇవ్వమని ఇందిరా దేవి అంటుంది.

దాంతో కావ్య అలాగే చేస్తుంది. కానీ, లగ్నపత్రికకు నిప్పు అంటుకుని కాలిపోతుంది. లగ్న పత్రికకు నిప్పు అంటుకునే పసుపులో ఏదో కలుపుతుంది రుద్రాణి. నిప్పు అంటుకోవడంతో రుద్రాణి, రాహుల్ సక్సెస్ అన్నట్లుగా సంతోషపడతారు. ఇక లగ్న పత్రికక అలా కాలడంతో ఎందుకు ఇలా చేశావ్. అసలు మీ వదినకు ఈ పెళ్లి ఇష్టమేనా అని కల్యాణ్‌తో కోపంగా అంటుంది అనామిక తల్లి శైలజ.