Brahmamudi December 30th Episode: కావ్య నగలతో సీతారామయ్యకు ట్రీట్‌మెంట్- నిజం బయటపెడతానన్న రుద్రాణి- కల్యాణ్ నిర్లక్ష్యం
Brahmamudi Serial December 30th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 30 ఎపిసోడ్‌లో రాజ్ కావ్య చేసే పనులకు పొంతన లేకుండా ఉన్నాయని అనుమానించిన రుద్రాణి అసలు ఏం జరుగుతుందో నిజం బయటపెడతానని, నీ హెల్ప్ కావాలని ధాన్యలక్ష్మీతో అంటుంది. మారిపోయావ్, మర్చిపోయావ్, చిన్నిల్లు పెట్టావా అని కల్యాణ్‌ను అంటుంది అప్పు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఆడిటింగ్ గురించి రాజ్ చెప్పడంపై ధాన్యలక్ష్మీతో రుద్రాణి చెబుతుంది. రాజ్ అబద్ధం ఆడుతున్నాడని రుద్రాణి అంటే.. రాజ్‌కు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని ధాన్యలక్ష్మీ అంటుంది. కావ్య కోసం చెబుతున్నాడేమో. గత కొన్ని రోజులుగా కలిసి ఉండటం, మనల్ని పనోళ్లకంటే హీనంగా చూడటం, ఇంటిని కంట్రోల్‌లో ఉంచుకోవడం ఇవన్నీ చూస్తే వాళ్లిద్దరు పెద్ద గేమ్ ఆడుతున్నట్లు ఉందని రుద్రాణి అంటుంది.
నిజాన్ని బయటకు తీసుకొస్తాను
మన కార్డ్స్ బ్లాక్ చేయడం, అకౌంట్స్ చెక్ చేయడం రెండింటికి పొంతన లేదు. అయితే, మనకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని డబ్బంతా వాళ్ల అకౌంట్‌కు మళ్లించాలి. లేదా అకౌంట్‌లో డబ్బు లేకుం ఉండాలి. ఎంత పెద్ద కంపెనీ అయినా ఒక్కోసారి కుదేలు అవుతుంది. షేర్ ట్రేడింగ్ తెలుసు కాబట్టి అందులో ఎన్నో కంపెనీలు ఫేడ్ అవుట్ అవడం చూశాను. ఇదొక లెక్క. కాబట్టి నిజాన్ని బయటకు తీసుకొస్తాను. దానికి నీ సహాయం ఉండాలి అని రుద్రాణి అంటుంది.
అలా ఏదైనా జరిగితే నేను చూస్తూ ఊరుకుంటానా అని ధాన్యలక్ష్మీ హెల్ప్ చేస్తానంటుంది. మరోవైపు ఐదు లక్షలు ఎలా తేవాలి. మాట పోకూడదు, ఇంట్లో తెలియకూడదు. డబ్బు కట్టాల్సిందే. ఎవరినైనా ఫ్రెండ్‌ను అడగాల్సిందే అని రాజ్ అనుకుంటాడు. తన క్లోజ్ ఫ్రెండ్ శేఖర్‌కు కాల్ చేసి ఐదులక్షలు అప్పుగా అడుగుతాడు. నెలలో తిరిగి ఇస్తాను. అర్జంట్‌గా అవసరం పడింది అంటాడు. నీకు చాలా చిన్న అమౌంట్ అది కానీ నాకు పెద్ద అమౌంట్. మొన్నే ప్లాట్‌కు అడ్వాన్స్ ఇచ్చా. మీ ఇంట్లోనే కోట్లకు కోట్లు మూలుగుతుంటాయి కదరా అని శేఖర్ అంటాడు.
కాంట్రాక్ట్ పూర్తయ్యకా
నా భార్యతో పందెం కాశాను. డబ్బు అడిగి చూడండి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుస్తుంది అని తను చెప్పింది. అందుకే ప్రాంక్ చేశాను అని రాజ్ కాల్ కట్ చేస్తాడు. అప్పుడే కావ్య వస్తుంది. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు అని రాజ్ అంటాడు. ఇలాంటి పరిస్థితులు మాకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మీకు కొత్త నాకు కాదు అని వెళ్లి బంగారం తీసుకొస్తుంది కావ్య. ఇంటికి కోడలిగా వచ్చినప్పుడు అత్తయ్య ఇచ్చారు. ఇవి బ్యాంక్‌లో పెట్టి ఐదు లక్షలు తీసుకురండి. తాకట్టుపెట్టినట్లు ఎవరికీ తెలియదు. కాంట్రాక్ట్ పూర్తయ్యకా తీసుకొచ్చుకుందాం అని కావ్య అంటుంది.
దాంతో రాజ్ ప్రేమగా చూస్తాడు. ఏం చూస్తున్నారు. అయ్యో ఇంత మంచి భార్యను ఇన్నాళ్లు దూరం పెట్టానే. బెడ్ రూమ్ కాకుండా బూత్ బంగ్లాకు తీసుకెళ్లానే అని గట్టిగా హగ్ చేసుకోవాలనుందా అని కావ్య అంటుంది. దొంగమొహంది. మనసులో మాట పసిగట్టేసింది అని రాజ్ అనుకుంటాడు. ఇప్పుడు ఆలింగనం చేసుకుంటే అవసరానికే చేసుకున్నట్లు ఉంటుంది. కేవలం థ్యాంక్స్ మాత్రమే చెప్పాలనుకున్నాను అని రాజ్ అంటాడు.
మరుసటి రోజు ఉదయం కల్యాణ్‌కు అప్పు కాల్ చేస్తుంది. హాయ్ పొట్టి అని కల్యాణ్ అంటే.. ఆపురా నీ దొంగ ప్రేమ. నేను ఫోన్ చేస్తేనే మాట్లాడుతున్నావ్. నువు చాలా మారిపోయావ్. నన్ను మర్చిపోయావ్ అని మాటలతో ఫైట్ చేస్తుంది అప్పు. ఇలా మాటలతో ఫైట్ చేయడం ఆపు అని కల్యాణ్ అంటాడు. అప్పు దగ్గరికి వీకెండ్‌లో రావడం గురించి అప్పు గొడవ పెట్టుకుంటుంది. ఇక నేను కూడా న్యాయ పోరాటం చేయాల్సిందే అని అప్పు అంటుంది.
తాతయ్య బిల్ క్లియర్
కుటుంబాన్ని లాగకు అని కల్యాణ్ అంటాడు. మరి కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తే ఎలా మాట్లాడాలి. కొంపదీసి హైదరాబాద్‌లో చిన్నిల్లు పెట్టావా ఏంటీ. పెట్టే ఉంటావ్. మీ మగజాతిని నమ్మకూడదు అని అప్పు అంటుంటే ఇంతలో డాక్టర్ వచ్చి కల్యాణ్‌తో హాస్పిటల్ బిల్ ఇంకా పే చేయలేదు. ఇలా చేస్తే హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవని ముందే చెప్పానంటాడు. అది విన్న అప్పు బిల్ ఏంటీ అని అడుగుతుంటే కల్యాణ్ కాల్ కట్ చేస్తాడు.
చెక్ హోల్డ్‌లో ఉంచడం గురించి కల్యాణ్‌తో డాక్టర్ చెబుతాడు. అప్పు కాల్ చేస్తుంటే కల్యాణ్ కట్ చేస్తాడు. చిన్న చిన్న పేమెంట్స్‌లోనే మా అన్నయ్య క్లియర్‌గా ఉంటారు. తాతయ్య బిల్ విషయంలో ఇలా చేయడు. ఎక్కడైన కౌంటర్ దగ్గర ప్రాబ్లమ్ అయిండొచ్చు చెక్ చేయండని కల్యాణ్ అంటుండగా.. నర్స్ వచ్చి వాళ్లు బిల్ చేశారని, వాళ్ల మేనేజర్ వచ్చి ఇప్పుడే క్యాష్ ఇచ్చారని చెబుతుంది. సారీ సర్ అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.
మళ్లీ అప్పు కాల్ చేసి ఏం దాస్తున్నావురా నా దగ్గర. నేను విన్నాను. హాస్పిటల్‌లో ఎవరున్నారు, బిల్ ఎవరు పే చేయాలి. నిజం చెప్పు లేకుంటే నా మీద ఒట్టు అని అప్పు అంటుంది. దాంతో జరిగిందంతా అప్పుకు కల్యాణ్ చెబుతాడు. నాకు ఇన్నిరోజులు ఎందుకు చెప్పలేదు. నేను ఆ ఇంటి కోడలినే కదా. నాకు టికెట్ బుక్ చేయు. నేను వెంటనే బయలుదేరుతాను అని అప్పు అంటుంది. ఇలా అంటావనే చెప్పలేదని కల్యాణ్ అంటాడు.
మధ్యలో వదిలేయడం
నీ లక్ష్యం మధ్యలో వదిలేసి రావడం కరెక్ట్ కాదు. కావ్య వదినకు చెప్పాను. చాలా సంతోషించింది. నీకు చెప్పకంది. నీ లక్ష్యానికి దూరం కాకూడదు. తాతయ్య కోసం మేమంతా ఉన్నాం. ఇవేవి పట్టించుకోకు. తాతయ్య కోమాలో నుంచి బయటకు వచ్చేసరికి నువ్ పోలీస్‌గా ఆయన ముందు నిలబడాలి. అదే నువ్ ఆయనకు ఇచ్చే గౌరవం అని కల్యాణ్ అంటాడు. నువ్ అంత బాధలో ఉంటే ఏదోదో అన్నాను. సారీరా అని అప్పు అంటుంది.
మరోవైపు రాజ్ ఒక లెటర్ చూసి షాక్ అవుతాడు. తలపట్టుకుని కూర్చుంటే కావ్య వచ్చి కాఫీ ఇస్తుంది. మూలిగే నక్కమీద తాటిపండు పడటం చూశావా. ఇప్పుడు చూడు అని ఆ లెటర్ ఇస్తాడు. అందులో రెంటెడ్ కారుల బిల్ మూడు లక్షలా. మన దగ్గర ఉన్నవి రెంటెడ్ కారులా అని కావ్య అంటుంది. కాదు, రెండు కారులు మనవి. నాలుగు కంపెనీ మీరు మీద రెంట్ తీసుకున్నవి అని రాజ్ చెబుతాడు. ఈ డబ్బుతో చిన్న ఫ్యామిలీ సంవత్సరం బతకొచ్చు అని కావ్య అంటుంది.
పరీక్షల మీద పరీక్షలు
ఉన్న కారులే ఎక్కువ తిరిగినట్టున్నారు అని రాజ్ అంటాడు. దేవుడా పరీక్షల మీద పరీక్షలు పెట్టి ఎందుకయ్యా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావ్. సరే మీరు కాఫీ తాగండి. నేను ఆలోచిస్తాను అని కావ్య అంటుంది. ఇప్పుడు మన కారులను ఉంచి రెంటెడ్ కార్లను పంపించేద్దాం. ఇంట్లో వాళ్లు అనడానికి నేను ఉన్నానుగా. తిడితే తిట్టించుకుంటాను. బయటవాళ్ల గురించి పట్టించుకోకండి. ఇప్పుడు మనం డబ్బున్న పేదవాళ్లమే. ఆఫీస్‌కు ఒక కారు. ఇంటికి ఒక కారు ఉంచి మిగతావి పంపించండి. రెంటల్ వాళ్లతో నేను మాట్లాడుతాను అని కావ్య అంటుంది.
మరోవైపు ఏయ్ అని శాంతను పిలుస్తుంది రుద్రాణి. శాంత చూసే టైమ్‌కి రుద్రాణి పేపర్ చదువుతుంటుంది. నన్నేనా.. పేరు పెట్టి పిలిచినప్పుడు చూద్దాంలే అని శాంత అనుకుంటుంది. ఏయ్ సంత అని చిరాకుగా పిలుస్తుంది రుద్రాణి. నా పేరు శాంత అని కొప్పడుతుంది శాంత. కాఫీ ఇవ్వమని అడుగుతుంది రుద్రాణి. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్