Brahmamudi December 28th Episode: కావ్యపై ప్రకాశం కంప్లైంట్.. తప్పు రాహుల్ మీదకు తోసేసిన రాజ్- నిందించిన ధాన్యలక్ష్మీ-brahmamudi serial december 28th episode rudrani doubts raj prakash complaint on kavya star maa brahma mudi highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi December 28th Episode: కావ్యపై ప్రకాశం కంప్లైంట్.. తప్పు రాహుల్ మీదకు తోసేసిన రాజ్- నిందించిన ధాన్యలక్ష్మీ

Brahmamudi December 28th Episode: కావ్యపై ప్రకాశం కంప్లైంట్.. తప్పు రాహుల్ మీదకు తోసేసిన రాజ్- నిందించిన ధాన్యలక్ష్మీ

Sanjiv Kumar HT Telugu
Dec 28, 2024 07:23 AM IST

Brahmamudi Serial December 28th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 28 ఎపిసోడ్‌లో సీతారామయ్య హాస్పిటల్ బిల్ క్లియర్ కాలేదని సుభాష్‌కు కాల్ వస్తుంది. దాంతో కావ్యని పిలిచి ఎందుకు క్లియర్ కాలేదని అడుగుతాడు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ రెచ్చిపోతారు. కావ్యను గట్టిగా ధాన్యం నిలదీయడంతో రాజ్ వచ్చి కవర్ చేస్తాడు.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 28వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 28వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ప్రకాశం రాత్రి అన్నది ధాన్యలక్ష్మీ ఉదయం గుర్తు చేయడంతో సుభాష్‌ని అడగడానికి వెళ్తాడు. నీతో ఒక మాట చెప్పాలి, అడగాలి, మాట్లాడాలి. అది కావ్య గురించి. కావ్య పెట్టిన రూల్స్ వల్ల ఇంట్లో అందరు ఇబ్బంది పడుతున్నారు అన్నయ్య అని ప్రకాశం అంటాడు.

yearly horoscope entry point

నువ్వు మాట చెబితే బాగుంటుంది

అందరూ అంటే ఎవర్రా.. నీ భార్య, ఆ మందర అంతేకదా అని సుభాష్ అంటాడు. అంటే, వాళ్లు బయటపడ్డారు కానీ, బయటపడని వాళ్లు ఇంకా ఉన్నారు అని ప్రకాశం అంటాడు. ఏరా నువ్ నా కోడలిపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అని సుభాష్ అంటాడు. ఛీ ఛీ కావ్యమీద కంప్లైట్ ఇవ్వడానికి రాలేదు. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేస్తే మంచిది కదా అని. ఒక మాట నువ్వు చెబితే బాగుంటుంది కదా అన్నయ్య అని ప్రకాశం రిక్వెస్ట్ చేస్తాడు.

సరే ఎవరిని ఇబ్బందిపెట్టకుండా నేను అని సుభాష్ అంటుండగా కాల్ వస్తుంది. సీతారామయ్య బిల్ ఇంకా క్లియర్ కాలేదు అని అటు నుంచి చెబుతారు. దాంతో కావ్యను పిలుస్తాడు సుభాష్. హాస్పిటల్ బిల్ ఇంకా క్లియర్ కాలేదట. ఎందుకు. అసలు చెక్ ఎందుకు హోల్డ్‌లో పెట్టారు అని సుభాష్ అంటాడు. మనకు మంచి మ్యాటర్ దొరికిందని అని రాహుల్‌తో అన్న రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది. ఎవరిని ఉద్దరించడానికి అంత చిన్న అమౌంట్ ఆపాల్సి వచ్చిందని రుద్రాణి అంటుంది.

హాస్పిటల్ బిల్ ఆపే అధికారం ఈవిడకి ఎక్కడిది. మా మావయ్య గారి హాస్పిటల్ బిల్ నీకు అనవసరం అనిపించిందా అని కావ్య చేసిన పనులు చెబుతూ నిలదీస్తుంది ధాన్యలక్ష్మీ. అది పైనుంచి రాజ్ విన్న రాజ్ అసలు విషయం బయటపడేలా ఉంది. ఏదోటి చెప్పి మ్యానేజ్ చేయాలి అని రాజ్ అనుకుంటాడు. హాస్పిటల్ బిల్ ఆపడానికి కారణం ఏంటీ మాకు సమాధానం చెప్పాలి అని ధాన్యలక్ష్మీ అంటే.. నేను చెబుతాను అని కిందకు దిగుతాడు రాజ్.

పుట్టింటికి తరలిస్తుందా

మేము ఏం మాట్లాడుతున్నామో అసలు నువ్ విన్నావా అని రుద్రాణి అంటే.. ఏ మాటలు బయట కూరగాయలు అమ్మేవాడి దాకా వినిపిస్తున్నాయి. నాకు వినపడవా అని రాజ్ అంటాడు. మా గొంతు బయటకు వినిపిస్తుందిరా.. కానీ, మీ ఆవిడ లోపల చేసే కుంభకోణం కనిపించదు. తాతయ్య హాస్పిటల్ బిల్ ఇంకా క్లియర్ చేయలేదట. ఇప్పుడు చెప్పు ఆ డబ్బు అంతా నీ పెళ్లాం ఏం చేస్తుంది. విదేశాల్లో దాచిపెడుతుందా. పుట్టింటికి తరలిస్తుందా అని రుద్రాణి అంటుంది.

ఇందులో నా భార్య ప్రమేయం ఉందని నీకు ఎవరు చెప్పారు. అన్నింటిని తీసుకొచ్చి కళావతి నెత్తి మీద రుద్దకండి. ఎందుకంటే ఎవరు ఏమన్నా నోరు మూసుకుని పడేది ఈవిడ ఒక్కతే అనా అని రాజ్ అంటాడు. మరి కావ్య ప్రమేయం లేకుంటే నీది ఉందనే కదా. లక్ష అవసరాలు ఉన్న తాతయ్య బిల్ క్లియర్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు అని అపర్ణ అంటుంది. ఇదంతా ఆయన సంపాదించేకదా. ఆయన బిల్‌కు కావాల్సిన డబ్బు కూడా మన దగ్గర లేవా. మనకు ఆ స్థాయి లేదా అని ఇందిరాదేవి అంటుంది.

లేదంటే అంత ఖరీదైన ట్రీట్‌మెంట్ ఎందుకు చేయించాలని అనుకుంటున్నారా అని ధాన్యలక్ష్మీ అంటుంది. చిన్నత్తయ్య.. ఎంత మాట అన్నారు. కోపంలో కూడా అలా ఎలా అనగలుగుతున్నారు. అసలు జరిగింది ఏంటో మీకు తెలిస్తే అని కావ్య చెబుతుంటే.. నేనే చెబుతాను. జరిగినదానికి నేనే కదా బాధ్యుడిని అని రాజ్ అంటాడు. అందరూ నన్ను దోషిని చేసినా మౌనంగానే ఉన్నాను. కానీ, మిమ్మల్ని కూడా అనుమానించే పరిస్థితి వచ్చాక నేను మాట్లాడాను అని కావ్య అంటుంది.

కరెక్ట్ పాయింట్ పట్టావ్

రాజ్ ఏమైందిరా. ఇద్దరు కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారు అని సుభాష్ అంటాడు. ఏదో జరిగింది. ఇద్దరు కలిసి ఏదో పెద్ద విషయమే దాస్తున్నారు అని అపర్ణ అంటుంది. అయ్యో అదేం లేదు. ఆఫీస్‌లో ఆడిటింగ్ జరుగుతుంది. అందుకే ట్రాన్జాక్షన్స్ ఆగిపోయాయి అని రాజ్ అంటాడు. ఇప్పుడు ఆడిటింగే ఏంట్రా. మార్చిలో కదా జరిగేది అని ప్రకాశం అంటాడు. శభాష్ అన్నయ్య అన్ని మర్చిపోయే నువ్వు కరెక్ట్ పాయింట్ గుర్తు పెట్టుకున్నావ్ అని రుద్రాణి అంటుంది.

ఇప్పుడు ఆడిటింగ్ జరగడం ఏంటీ అని రుద్రాణి అంటే.. దానికి నీ కొడుకే కారణం అత్తా అని రాజ్ అంటాడు. ఇది బాగానే ఉంది. అటు ఇటు తిప్పి నన్ను అంటున్నారేంటీ అని రాహుల్ అంటే.. ఇది నా మెడకు చుట్టుకుంది కాబట్టి అని రాజ్ అంటాడు. మధ్యలో నా కొడుకు ఏం చేశాడు అని రుద్రాణి అంటుంది. మధ్యలో వెళ్లి సీఈఓ సీట్‌లో కూర్చున్నాడుగా. అక్కడే మొదలైంది ఇదంతా. అంతా అస్తవ్యస్థం చేసి పడేశాడు. అకౌంట్స్ అన్ని పెండింగ్‌లో ఉంటే గందరగోళంగా కనిపించాయి అని రాజ్ అంటాడు.

అంతా ఫ్రాడ్ చేశానా. లేదే కొంచేమేనే అని రాహుల్ మనసులో అనుకుంటాడు. తర్వాత వెంటనే కళావతిని కూర్చోబెట్టారు. తను కొంచెం క్లియర్ చేసింది. తనే ఇదంతా చేసిన ఇంట్లో ఎవరికి చెప్పలేదు. నేను కూడా చెప్పేవాన్ని కాదు. కావ్యను ఆపాను. కానీ, మీరు చెప్పేదాకా వదిలేలా లేరు. ఆడిటింగ్ మొదలు కాగానే అకౌంట్స్ అన్ని ఆపేసి చేసి లెక్కలన్నీ క్లియర్ చేయాలనుకున్నాను. కానీ, నా లెక్క తప్పింది. తప్పటడుగు పడింది. తాతయ్య ట్రీట్‌మెంట్ కోసం ఇచ్చిన చెక్ క్లియర్ అయిందనుకున్నా. అది కూడా హోల్డ్‌లో పెట్టారని ఇప్పుడే తెలిసింది. ఇందులో కళావతి తప్పు లేదు అని రాజ్ అంటాడు.

మౌనంగా ఉండకండి

ఇది బాగుందిరా. నీ భార్యపై ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో అర్థం కావట్లేదు. తాతయ్య బిల్ కంటే నీ భార్యను వెనుకేసుకురావడమే ఎక్కువ అయింది అని రుద్రాణి అంటుంది. నేను న్యాయం మాట్లాడాను. ఎవరినైనా నిలదీసేముందు ఆలోచించి మాట్లాడాలి. రేపు తాతయ్య బిల్ కట్టేస్తాను. పదా కళావతి అని రాజ్ వెళ్లిపోతాడు. ఇందిరాదేవి వెళ్లి పక్కన కూర్చుంటుంది. కావ్య వెళ్లి మాట్లాడుతుంది. తాతయ్యకు అన్యాయం చేస్తున్నామని సందేహం వచ్చిందా అని కావ్య అడుగుతుంది.

మీకు కోపం వస్తే తిట్టండి. సరిపోకపోతే కొట్టండి. కానీ, మీరు మాట్లాడకపోతే నాకు ఇంకా బాధగా ఉంటుంది. హాస్పిటల్ బిల్ గురించేగా మీ భయం. ఇప్పుడే వెళ్లి కట్టేస్తాం. ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల జరగలేదు. అనుకోకుండా జరిగిన పొరపాటు. అర్థం చేసుకోండి అని కావ్య అంటుంది. మీ మీద కోపం, నమ్మకం లేకపోవటం కాదు. ఇన్ని కోట్ల వ్యాపారం చేసే మనం ఐదు లక్షల బిల్ కట్టకపోవడం ఏంటీ అని. మీరు చెప్పింది ఆ సందర్భానికి తగ్గట్టు సర్దిచెప్పుకున్నట్లు ఉంది అని ఇందిరాదేవి అంటుంది.

మీరు మన ఆస్తు ముక్కలు కాకుండా ఉండేందుకు ఎంత ట్రై చేస్తున్నారో తెలుసు. కానీ, ఈ క్రమంలో మీరు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారేమో అనిపిస్తుంది. రాజ్‌ను కాకుండా నీ మీద నమ్మకంతో ఈ ఆస్తి రాశారు. ఆయన నమ్మకం ఒమ్ము చేయకండి అని ఇందిరాదేవి అంటుంది. నమ్మకమే కాదు. తాతయ్య మాట కూడా పోకుండా చూసుకుంటాను అని కావ్య చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు జస్ట్ మిస్. తాతయ్య షూరిటీ అందరికి తెలిసిపోయేది. అల్లకల్లోలం అయిపోయేది. అర్జంట్‌గా ఐదు లక్షలు కట్టేయాలి అని రాజ్ అనుకుంటూ ఉంటాడు.

రుద్రాణికి డౌట్

ఇంతలో సుభాష్ వచ్చి నీకు ఏమైందిరా ఎందుకు ఇలా ఉన్నావ్. నీ ఎమోషన్‌ని అర్థం చేసుకోగలను. కింద అందరిముందు నువ్ చెప్పింది అబద్ధం కదా. నీ మాటలు అలాగే అనిపించాయి. నువ్వేదో దాస్తున్నట్లు. నిజం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. అలాంటిది ఉంటే ఓపెన్‌గా చెప్పు అని సుభాష్ అంటాడు. అలాంటిదేం లేదని రాజ్ కవర్ చేస్తాడు. నేను కూడా ఆఫీస్ రన్ చేశాను. ఇంట్లోవాళ్లకు చెప్పకుండా నేను చూసుకున్నాను. అందుకే నాన్నలా కాకుండా ఒక ఫ్రెండ్‌లా చెప్పు అని సుభాష్ అంటాడు.

మిమ్మల్ని డైరెక్ట్ అడిగే చనువు ఉంది. నేనేం దాయట్లేదు అని రాజ్ అంటాడు. దాంతో సుభాష్ వెళ్లిపోతాడు. మరోవైపు మా నాన్న ట్రీట్‌మెంట్ ఏమైందంటే ఆ మామిడిపింద మొహం మాడిపోయింది. కానీ, రాజ్ వచ్చి ఆడిటింగ్ అని చెప్పి రాహుల్ మీద తోసేసాడు అని డౌట్ పడినట్లుగా ధాన్యలక్ష్మీతో చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner