Brahmamudi December 27th Episode: కావ్యకు శత్రువులా స్వప్న- కళావతిదే తప్పన్న రాజ్- ధాన్యలక్ష్మీ దారిలోకి వచ్చిన ప్రకాశం-brahmamudi serial december 27th episode prakash in bind with dhanyalakshmi over kavya star maa brahma mudi highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi December 27th Episode: కావ్యకు శత్రువులా స్వప్న- కళావతిదే తప్పన్న రాజ్- ధాన్యలక్ష్మీ దారిలోకి వచ్చిన ప్రకాశం

Brahmamudi December 27th Episode: కావ్యకు శత్రువులా స్వప్న- కళావతిదే తప్పన్న రాజ్- ధాన్యలక్ష్మీ దారిలోకి వచ్చిన ప్రకాశం

Sanjiv Kumar HT Telugu
Dec 27, 2024 08:03 AM IST

Brahmamudi Serial December 27th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 27 ఎపిసోడ్‌లో కావ్య తిట్టడంతో స్వప్న ఫీల్ అవుతుంటే రుద్రాణి, రాహుల్ వెళ్లి పుల్లలు పెట్టేందుకు చూస్తారు. కానీ, వారికి షాక్ ఇస్తుంది. తర్వాత కావ్యకు రివర్స్ అవుతుంది స్వప్న. ఆస్తి రాగానే మారిపోయావని, నిజ స్వరూపం బయటపడిందని స్వప్న అంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 27వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 27వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోడానికి, నన్ను అనడానికి ఇందిరాదేవి, అపర్ణను లాగొద్దని తెగేసి చెబుతుంది కావ్య. దాంతో రాజ్ నీ భార్య ఎలా మాట్లాడుతుందో విన్నావా అని రుద్రాణి అంటుంది. విన్నాను, అంతా చూశాను. నా భార్య ఏం చేసిన ఈ ఇంటి కోసమే చేస్తుంది. ఇంకా మాట్లాడితే మీ అందరిని ఉద్యోగాలు చేసుకుని బతకమంటుంది. అంతదాకా తెచ్చుకోకండి. రా కళావతి అని కావ్య చేయి పట్టుకుని తీసుకెళ్తాడు రాజ్.

yearly horoscope entry point

ఎవరి స్వార్థం వారిదే

అది చూసి అపర్ణ, సుభాష్ పొంగిపోతే.. మిగతా అంతా షాక్ అవుతారు. మరోవైపు అంతమందిలో అక్క అని కూడా చూడకుండా అవమానించింది. ఏ నెక్లెస్ కొంటే అన్ని మాటలు అనాల. చెల్లెలి అని నెత్తిన పెట్టుకుంటే నాకే చివాట్లు పెట్టింది అని స్వప్న ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో వచ్చిన రుద్రాణి సొంత చెల్లి అయినా అత్తారింట్లో ఎవరి స్వార్థం వారిదే, ఎవరి జీవితం వారిదే అని రుద్రాణి ఎక్కించడానికి ట్రై చేస్తుంది.

ఎవరి గురించి అంటున్నారు అని స్వప్న అంటే.. నా ముందే నా భార్యను అవమానించింది కదా కావ్య గురించి అని రాహుల్ అంటాడు. సొంత చెల్లి అని ఇన్నాళ్లు నెత్తినపెట్టుకుని ఊరేగావ్. ఇప్పుడు నెత్తిమీదే శివతాండవం చేసింది. ఆస్తి వస్తే ఇలాగే చేస్తుందని నాకు ముందే తెలుసు కాబట్టి హెచ్చరించాను. కానీ, నా చెల్లెలు అలా చేయదు అని మమ్మల్ని తిట్టావ్ అని రుద్రాణి అంటే.. అంతేకాదు ముసుగేసి కొట్టిందని రాహుల్ అంటాడు. మనకంటూ ఇష్టాయిష్టాలు ఉండవా. ఇలాగే ఉంటే అక్కడిక్కడ పాత బట్టలు కలెక్ట్ చేసి కట్టుకోమంటుంది అని రుద్రాణి అంటుంది.

ఇకనుంచి అయినా తెలుసుకో. కావ్యకు తనవాళ్లు అంటే తన అత్త, మామ, భర్త మాత్రమే అనుకుంటుంది. నువ్ కూడా అలా అనుకున్న రోజే నీకు న్యాయం జరుగుతుంది అని రుద్రాణి అంటుంది. ఇప్పటికైనా నీవాళ్లు అంటే నేను మా మమ్మీ అని తెలుసుకో అని రాహుల్ అంటాడు. చేసిన పొరపాటు తెలుసుకుంటే తనకు సపోర్ట్ చేయడానికి మనం రెడీగా ఉండమా. నీకు నీ చెల్లి గురించి ముందుగానే తెలిసింది. నువ్ జాగ్రత్తపడు. ఇకనైనా మమ్మల్ని నమ్ము. మేము చేసే పోరాటంలో చేతులు కలుపు. అందరం కలిసి మనకు రావాల్సిన ఆస్తిని మనం తీసుకుని నచ్చినట్లు బతుకుదాం అని రుద్రాణి అంటుంది.

ఇంటి విషయాల్లో తల్లిలా

ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్ అని రాహుల్ అడిగితే.. మిమ్మల్ని ఎలా కొడితే మీకు బుద్ధి వస్తుందా అని ఆలోచిస్తున్నాను అని స్వప్న అంటుంది. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. మీకు ఇలా ఎక్కడ ఛాన్స్ దొరికితే పుల్లలు పెట్టే ఆలోచన పోదు. నాకు నా చెల్లి మీద ప్రేమ తగ్గదు. అది నాకన్న చిన్నది అయినా ఇంటి విషయాల్లో తల్లిలా చేస్తుంది. తను ఇంటి ఖర్చులకోసమే చెక్ ఇచ్చింది. నేనే తొందరపడి నెక్లెస్ కొన్నాను. నన్ను అంటే మీకు వచ్చిన బాధ ఏంటీ అని స్వప్న అంటుంది.

ఎప్పుడు ఎలా ముక్కలు చేయాలా అనే ఆలోచిస్తారా. మరి ఇంతలా ఉండకూడదు అని తిట్టేసి వెళ్లిపోతుంది స్వప్న. అంతా విని లాస్ట్‌లో షాక్ ఇచ్చింది. మనం మాట్లాడింది అంతా వేస్టేనా అని రాహుల్ అంటాడు. అది పూర్తిగా కావ్య మాయలో ఉంది. ఇప్పుడే తొలిసారి దెబ్బ తగిలింది. ఇంకోసారి ఇలాగే జరిగితే అప్పుడు పూర్తిగా మార్చేద్దాం అని రుద్రాణి అంటుంది. మరోవైపు కావ్య వంట చేస్తుంటే స్వప్న వెళ్లి కోపంగా చూస్తుంది.

నేను కూడా నీకు పరాయిదానిలా కనిపిస్తున్నానా. నీకు తెలీకుండా నెక్లెస్ కొనుక్కుంటే అందరిముందు అంతలా అనాలా. నీ ఫ్యామిలీ వేరు నా ఫ్యామిలీ వేరు అన్నట్లు అన్నావ్ అని కావ్య అంటుంది. నేను ఎవరిదీ తప్పు అయితే వారిని అంటాను. ఒకరు మనకు హద్దులు చెప్పకూడదు. ఇంట్లో లక్షలకు లక్షలు దుబారా చేస్తున్నారు. నువ్ పది లక్షలు ఖర్చు చేస్తే ఇద్దరిని అనరా అని కావ్య అంటుంది. అనేవాళ్లు అంటూనే ఉంటారు. ఎప్పుడు అననిదానివి నన్ను అన్నావ్ అని స్వప్న అంటుంది.

నన్ను కూడా గెంటెస్తాననా

మరి నేను పుట్టింటికి దోచి పెడుతున్నాను అనుకోవడం కరెక్టా అని కావ్య అంటుంది. అది కాదే.. మీ చిన్నత్త మా అత్త అన్నట్లు ఆస్తి చేతికొచ్చేసరికి నువ్ మారిపోయావ్. నీ అసలు స్వరూపం బయటపడింది అని స్వప్న అంటుంది. చాల్లే ఆపు.. నేనింతే.. నేనింతే.. వాళ్లకు అలానే చెప్పాను. నీకు చెబుతున్నాను. కావాలంటే నీ ప్రాపర్టీ నుంచి ఖర్చు పెట్టుకో. లేదంటే నీ భర్తను అడుగు. ఏదో నేను తప్పు చేసినట్లు అంటున్నావ్. నీకు మీ అత్తకు తేడా ఉందనుకున్నా. నువ్ కూడా ఆవిడలాగే చేస్తే ఈ నీడ కాస్తా పోతుంది అని కావ్య అంటుంది.

ఏంటీ.. ఈ మాత్రం నీడ కూడా లేకుండా పోతుందా. అంటే నన్ను కూడా గెంటేస్తాననా నీ ఉద్దేశం అని స్వప్న బాధతో అంటుంది. అలా అనలేదు అక్క అని కావ్య అంటుంది. ఇంకా ఏం చెప్పకు. నువ్ పూర్తిగా మారిపోయావ్. ఆస్తులు రాగానే అక్కను కూడా పరాయిదాన్ని చేసేశావ్. ఇంతదారుణంగా నీలో మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని ఏడుస్తూ వెళ్లిపోతుంది స్వప్న. దాంతో కావ్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది.

మరోవైపు ప్రకాశం దగ్గరికి వెళ్లిన ధాన్యలక్ష్మీ ఆవేశంతో ఊగిపోతుంది. నీకేమైనా పాము బుసలు కొట్టినట్లు సౌండ్ వస్తుందా అని పంచ్ వేస్తాడు ప్రకాశం. ఈ ఇల్లు రాక్షసులు రాజ్యమేళుతున్నట్లు అయిపోతుంది. నేను అమాయకురాలిని కాబట్టి నా నోరు మూయిస్తారు అని ధాన్యలక్ష్మీ అంటే.. కుక్కలా ఎందుకు మొరుగుతావ్. అసలు విషయం బయటకు కక్కే అని ప్రకాశం అంటాడు. ఈరోజు నాకు రుద్రాణికి జరిగిన అవమానం రేపు మీకు, మన కొడుకు జరగదని ఎలా అనుకుంటున్నారు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

నా దారిలోకి వచ్చాడు

డబ్బు విషయం వచ్చేసరికి సొంత అక్కను కూడా అనకుండా ఉండలేదు. రేపు మరిదిని ఎందుకు అనదు. ఓసారి ఆలోచించండి. డబ్బు విషయం వచ్చేసరికి ఎవరైనా అంతే. మనం జాగ్రత్తపడకపోతే మనకు మన కొడుకు అన్యాయం జరుగుతుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇప్పుడు ఏంటీ ఈ విషయంలో అన్నయ్యను అడగాలి అంతేగా. నేను అడుగుతాను అని ప్రకాశం వెళ్లిపోతాడు. హమ్మయ్యా ఈయన నా దారిలోకి వచ్చాడు. ఇన్నాళ్లు నేను చెప్పింది వినలేదు. ఇప్పుడు అన్నయ్యను అడుగుతానని అన్నారు. ఈయనలో మార్పు మొదలైంది. అవకాశం చూసి పూర్తిగా నావైపు తిప్పుకుంటాను అని ధాన్యలక్ష్మీ అంటుంది.

మరోవైపు కావ్యతో రాజ్ స్వప్న గురించి మాట్లాడుతాడు. స్వప్నను అంతలా అనాలా. నువ్ చాలా తప్పు చేశావ్. స్వప్నను అలా అందరిమందు తిట్టకుండా ఉండాల్సింది. తను కావాలని ఏ తప్పు చేయలేదు. అంత హార్ష్‌గా మాట్లాడకుండా ఉండాల్సింది అని రాజ్ అంటాడు. తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద తప్పే అని కావ్య అంటుంది. కానీ ఆ పరిస్థితి తనకు తెలియదు కదా. అంతలా అవమానించాలా అని రాజ్ అంటాడు.

అందరిముందు చెబితేనే అసలు విషయం తెలిసింది. ఇక మేము చిన్నప్పటి నుంచి కొట్టుకోవడం, మళ్లీ కలవడం అలవాటే అని కావ్య అంటుంది. అది మీ ఇల్లు. ఇక్కడ వేరు. అప్పటి స్వప్నలాగే ఆలోచిస్తుందంటావా. నిన్ను అర్థం చేసుకుని మళ్లీ నీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్లీ తిట్టాలా. నేను పక్కనే ఉన్నాను. అలా అరవాలా అని రాజ్ అంటాడు. తను అన్నదానికి కన్విన్స్ అయితే తాతయ్య మాట గురించి, వంద కోట్ల గురించి చెప్పాల్సి వస్తుంది. చెప్పమంటారా అని కావ్య అంటుంది.

శత్రువుల జాబితాలో స్వప్న

అసలే అక్కకు కంగారు ఎక్కువ. ఇది తెలిసి మరింత కంగారుపడుతుంది. అందరికి చెప్పేస్తుంది. అందుకే తను బాధపడిన సరేగానీ నోరు మూయించినట్లు అవుతుంది. అందుకే అరిచాను అని కావ్య అంటుంది. కానీ, దాంతో మీకు గొడవలు పెరుగుతాయి కదా అని రాజ్ అంటాడు. ఇంట్లో చాలామంది నన్ను శత్రువులా చూస్తుంది. ఇప్పుడు నా తోడబుట్టింది కూడా జాయిన్ అవుతుంది. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం తాతయ్య మాట నిలబెట్టాలని అనుకున్నాం. అది పూర్తి అయ్యేవరకు నన్ను ఎవరు ఎలా చూసిన, తిట్టిన పర్వాలేదు అని కావ్య అంటుంది.

ఉదయం ఆఫీస్‌లో చాలా పనులు ఉన్నాయని పడుకుంటుంది కావ్య. మరుసటి రోజు ఉదయం రాజ్‌తో మాట్లాడుతుంది కావ్య. ఆపరేషన్ థియేటర్‌లో నేను పురిటినొప్పులతో ఉంటే మీరు బయట టెన్షన్ పడుతున్నట్లు ఉంది అని కావ్య అంటుంది. నా టెన్షన్ వేరు. ఐదు లక్షల కోసం ఇంత టెన్షన్ పడాల్సి వస్తుందని అనుకోలేదు అని రాజ్ అంటాడు. డబ్బు విలువ తెలియకుండా ఖర్చు చేస్తే దేవుడు ఇలాగే మొట్టికాయ వేస్తాడు అని కావ్య అంటుంది.

తాతయ్య హాస్పిటల్ బిల్ నిన్న క్లియర్ చేయాలి. చెక్ క్లియరెన్స్ కాకుంటే అందరికి తెలుస్తుంది. ఎవరైనా ఐదు లక్షలు అడగొచ్చు. కానీ, అది కూడా సరఫరా అయి ఇంటి గుట్టు వీధిన ప డుతుంది అని రాజ్ అంటాడు. నిన్న స్వప్న కొన్న పది లక్షల నెక్లెస్ అమ్మేసి హాస్పిటల్ బిల్ కట్టేద్దాం అని కావ్య అంటుంది. వద్దు. నిన్న నువ్ తిట్టిందే నాకు నచ్చలేదు. స్వప్న గారాబంగా పెరిగింది. మా తాతయ్య స్వప్నను ఇంటి కోడలిగానే చూశాడు. అందుకే ఆస్తి రాసిచ్చాడు. మనం నేర్చుకోవాల్సింది అక్కడి నుంచే. డబ్బు వల్ల మీ మధ్య గొడవలు రాకూడదు అని రాజ్ అంటాడు.

నేనే అడుగుతాను

మరి సమస్య ఎలా సాల్వ్ కావాలి అని కావ్య అంటే.. నేనే ఏదోటి చేస్తాలే అని రాజ్ అంటాడు. మరోవైపు మీ అన్నయ్యను కావ్య పద్ధతులు అడుగుతాను అన్నారు కదా అడగండి. మీకు ధైర్యం లేకపోతే నేను వెళ్లి గొడవ చేస్తాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. వద్దులే సెన్సిటివ్ విషయం కదా. నేనే అడుగుతాను అని సుభాష్ దగ్గరికి వెళ్తాడు ప్రకాశం. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner