Brahmamudi December 26th Episode: స్వప్నను నిలదీసిన రాజ్- ఇచ్చిపడేసిన కావ్య- ధాన్యలక్ష్మీకి వార్నింగ్- అక్కాచెల్లి గొడవ
Brahmamudi Serial December 26th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 26 ఎపిసోడ్‌లో స్వప్న వచ్చి పది లక్షలతో నెక్లెస్ కొనుక్కున్నట్లు, కావ్య చెక్ ఇచ్చినట్లు రుద్రాణి, ధాన్యలక్ష్మీకి చెబుతుంది. దాంతో కావ్య రాగానే గొడవ చేస్తారు. స్వప్న కావ్య మధ్య గొడవ అవుతుంది. సమాధానం చెప్పాల్సిన అవసరముందని సుభాష్ అంటాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఆకలికి తట్టుకోలేక తిందామని రుద్రాణి, ధాన్యలక్ష్మీ వస్తారు. కానీ, వేస్ట్ చేయడం ఇష్టంలేక ముష్టివాళ్లకు పడేశాను అని పనిమనిషి శాంత చెబుతుంది. దాంతో మళ్లీ వంట చేయు అని అంటారు. కానీ, కావ్య మేడమ్‌తో ఓ మాట చెప్పించమని శాంత చెబుతుంది.
పది లక్షల నెక్లెస్‌తో స్వప్న
ఇప్పుడు దాని టైమ్ నడుస్తుంది అని రుద్రాణి అంటుంది. అది రాని దాని సంగతి చెబుతాను అని ధాన్యలక్ష్మీ అంటుంటే హాయ్ ఆంటీస్ అంటూ స్వప్న ఎంట్రీ ఇస్తుంది. మెడలో కాస్ట్‌లీ నెక్లెస్‌తో దర్శనం ఇచ్చి వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది. తన నెక్లెస్, చెవి కమ్మల గురించి గొప్పగా చెబుతుంది స్వప్న. దాంతో వాటి గురించి ధాన్యలక్ష్మీ అడుగుతుంది. అవి రోడ్ గోల్డ్ అయింటుందిలే అని రుద్రాణి అంటుంది. కాదు ఇది ప్యూర్ 916 కేటీఎమ్ గోల్డ్, వీటి ధర ఎంతో తెలుసా పది లక్షలు అని స్వప్న చెబుతుంది.
దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ నోరెళ్లబెడతారు. అంత డబ్బు నీకు ఎక్కడిది అని అడుగుతారు. దాంతో కావ్య ఇచ్చిందని చెప్పగానే షాక్ అవుతారు. ఎలా ఇచ్చిందని షాక్ అవుతున్నారమ్మా శాంత అంటుంది. కావ్య చెక్ ఇచ్చింది. నేను అలా వెళ్లి తెచ్చుకున్నాను అని స్వప్న చెబుతుంది. ఇంట్లో వృథా ఖర్చులు వద్దని ఒక్క కర్రీ వండిస్తూ నీకు మాత్రం నెక్లెస్‌కు పది లక్షలు ఇచ్చిందా, నీకు లెక్కలేకుండా డబ్బు ఇచ్చిందా అని ధాన్యలక్ష్మీ, రుద్రాణి అంటారు.
మీ మొహాలు చూస్తే ఇవ్వాలనిపించదు. నా చెల్లి బంగారం అందుకే నా మెడ బోసిపోకూడదని నెక్లెస్ కొనుక్కోమని డబ్బు ఇచ్చిందని స్వప్న చెప్పి వెళ్లిపోతుంది. దాంతో అక్క అని గట్టిగా అరిచిన ధాన్యలక్ష్మీ రుద్రాణితో కలిసి అపర్ణ దగ్గరికి వెళ్తుంది. బావగారు మీరు కూడా వినండి. మాకు న్యాయం చేయాలి అని ధాన్యలక్ష్మీ అంటే సుభాష్ పంచ్‌లు వేస్తాడు. అందరితో హాస్టల్ వార్డెన్‌లా రూల్స్ పెట్టిన కావ్య స్వప్నకు పది లక్షలు పెట్టి నెక్లెస్ కొనిచ్చిందని చెబుతారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి.
అన్ని లెక్కలు తేలుస్తాను
ఇంటి గురించి ఆలోచించేదే అయితే ఇలా ఎందుకు చేస్తుంది. ఈ విషయం నీకు తెలియకుండానే చేసిందా. ఇప్పుడు నువ్ అడగకుండా నీకు తెలిసే జరిగిందని అనుమానాలు వస్తాయని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇలా పుట్టింటికి ఎంత ధారపోస్తుందో అని రుద్రాణి అంటుంది. దాంతో సుభాష్ తిడతాడు. అప్పుడు స్వప్నే స్వయంగా పది లక్షల చెక్ ఇచ్చిందని చెప్పిందని ఇద్దరు చెబుతారు. ఆవిడ గారు రాగానే ఇలా ఎందుకు చేసిందో అడుగుతాను. అన్ని లెక్కలు తేలుస్తాను అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది.
వీళ్ల సంగతి తెలిసిందే. మరి కావ్య కూడా ఎందుకు అలా చేయాలి. డబ్బులు లేవంటూనే స్వప్నకు నెక్లెస్ ఎందుకు కొనియ్యాలి అని సుభాష్ అంటాడు. కావ్య తప్పు చేయదని మీకు కూడా తెలుసు. రాగానే అడిగి తెలుసుకుందాం అని అపర్ణ అంటుంది. రాత్రి అవుతుంది. రాజ్, కావ్య వస్తారు. వచ్చావా. నిన్ను నమ్మి మావయ్య ఆస్తి ఇచ్చారు. ఇవాళ జరిగింది ఆయన చూస్తే ఆస్తి లాక్కునేవారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. మా కార్డ్స్ బ్లాక్ చేశావా అని అడిగితే చేశాను. అనవసరమైన ఖర్చులు వద్దని కావ్య అంటుంది.
మరి పుట్టింట్లో ఎన్ని కార్డ్స్ పుట్టుకొచ్చాయి. అక్కడికి ఎంత పోతుంది అని రుద్రాణి అంటుంది. అత్తింటి సొమ్ము పుట్టింటికి చేరేవసే చీఫ్ క్యారెక్టర్ నాది కాదు అని కావ్య అంటుంది. అవునా మరి స్వప్నకు గోల్డ్ నెక్లెస్ ఎలా పుట్టుకొచ్చింది. మావన్నీ అనవసరమైన ఖర్చులు అయినప్పుడు మీ అక్కకు కొనిచ్చింది అనవసరమైన ఖర్చు కాదన్నమాట అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో స్వప్నను పిలుస్తుంది కావ్య. ఏమైందని స్వప్న అడుగుతుంది.
నువ్వే కదా చెక్ ఇచ్చావ్
ఏంటీ గోల్డ్ నెక్లెస్ గురించి పంచాయితీ పెట్టారా. వాళ్ల గురించి తెలిసిందే కదా. అది వదిలేసి నా నెక్లెస్ ఎలా ఉందో చెప్పు అని స్వప్న అంటుంది. ఈ నెక్లెస్‌ను ఎవరిని అడిగి కొన్నావక్కా అని కావ్య అంటుంది. ఎవరినో అడగడం ఏంటే.. ఇంట్లో అందరూ లక్షలకు లక్షలు దుబారా ఖర్చు చేస్తున్నారు. నేను మాత్రం ఎవరిని అడగాలి. నువ్విప్పుడు ఇంటికి మహారాణివి స్వప్న అంటుంది. ఈ నెక్లెస్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడిది అని కావ్య అడుగుతుంది.
నువ్వే కదా చెక్ ఇచ్చావని స్వప్న అనగానే అంతా షాక్ అవుతారు. దీన్ని ఏమంటారు చిన్నయ్య పెద్దన్నయ్య. ఆస్తులు పంచి పెట్టడం అంటారా. దోచి పెట్టడం అంటారా అని రుద్రాణి అంటుంది. మీరు రాగాలు తీయడం ఆపుతారా. అక్క నేను నీకు చెక్ ఇచ్చి గోల్డ్ నెక్లెస్ కొనుక్కోమని చెప్పానా. ఎవరిని అడిగి ఇంత ఖరీదైన నెక్లెస్ కొన్నావ్. ఆ చెక్‌ను అలా వాడుకోమని నేను చెప్పానా అని కావ్య అంటుంది. ఏం నాటకాలు ఆడుతున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా చెల్లి అబద్ధం చెబుతుంది. అక్క నిజం చెబుతుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది.
దాంతో న్యాయం గురించి రుద్రాణి అంటుంది. పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి అని ఇందిరాదేవి అంటుంది. కావ్యకు అపర్ణ సపోర్ట్ చేస్తుంది. ఇందుకే ఈ ముళ్లకిరీటం నాకు వద్దన్నాను. ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందని అత్తయ్యకు తాళాలు ఇస్తాను అన్నాను, ఆయనకు ఆస్తి పత్రాలు ఇస్తాను అన్నాను. అంతా కలిసి నా చేతులకు సంకెళ్లు వేశారు. ఇప్పుడు నేను పుట్టింటికి దోచిపెట్టినదాన్ని అయ్యాను. ఎందుకు ఈ మాటలు పడాలి అని కావ్య అంటుంది.
అడిగేదాంట్లో న్యాయముందిగా
అబ్బబ్బ సుద్దపూస. నీ స్వార్థం కళ్ల ముందు దగదగ కనపడుతుంటే నువ్వు అనుకున్న మంచితనం ఏది, పరమార్థం ఎక్కడుంది అని రుద్రాణి అంటుంది. ఆపండి. తాళాలు నా చేతిలో, ఆస్తులు నా పేరు మీద ఉండడం మీకు మింగుడు పడటం లేదు. ఇప్పుడు అవకాశం దొరికింది ఇలా మాట్లాడుతున్నారు అని కావ్య అంటుంది. మీ అక్క చెక్ నువ్వే ఇచ్చావంటుంది. వాళ్లు అడిగేదాంట్లో న్యాయం ఉంది. నువ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సుభాష్ అంటాడు.
ఎవరికీ సమాధానం చెప్పాలి డాడీ. నా భార్య ఎందుకు సమాధానం చెప్పాలి. స్వప్న కళావతి నీకు చెక్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పి ఇచ్చింది. నెక్లెస్ కొనుక్కోమని ఇచ్చిందా. ఇంట్లో ఖర్చులకని ఇచ్చిందా. నేను అంతా విన్నాను స్వప్న. నేను అక్కడే ఉన్నాను. నువ్ నెక్లెస్ కొనుక్కోవడం తప్పు బట్టట్లేదు. వీళ్లు నీ చెల్లిని తప్పుబడుతున్నారు కదా. చెప్పు. ఏమని చెప్పి చెక్ ఇచ్చింది అని రాజ్ నిలదీస్తాడు. దాంతో ఇంట్లో ఎవరికైనా అవసరమైతే ఇవ్వమని చెక్ ఇచ్చిందని, కానీ, ఎవరికి ఏ అవసరం రాలేదు. అందుకే ఈ నెక్లెస్ కొన్నాను అని స్వప్న చెబుతుంది.
ఇప్పుడు అర్థమైందా. నా భార్య పుట్టింటికి రూపాయి కూడా దోచిపెట్టట్లేదు అని ధాన్యలక్ష్మీ, రుద్రాణితో మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరికిందా డాడీ అని సుభాష్‌తో అంటాడు రాజ్. ఆ క్లారిటీ నాకోసం కాదు. కోడలిపై నాకు నమ్మకం ఉంది. వాళ్లకోసం అడిగాను అని సుభాష్ అంటాడు. అక్క ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదా. తాతయ్య హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఇలా చేయడం మంచి పద్ధతేనా. పెద్దదానివి అయ్యావ్. నీకున్న నగలు సరిపోవా. ఇప్పుడు ఇంత ఖరీదు పెట్టి కొన్నావ్ అని కావ్య గట్టిగా మందలిస్తుంది.
అమ్మేసుకోని పది లక్షలు తీసుకో
తాతయ్య నీకు ప్రాపర్టీ ఇచ్చారు. అందులో నుంచి ఖర్చు పెట్టుకోవచ్చు కదా. చూడు ఏదైనా కావాలంటే నీ భర్తను అడుగు. అంతేతప్పా దుగ్గిరాల ఇంటి డబ్బును అడక్కుండా ఖర్చు పెట్టుకునే అధికారం నీకు లేదు అని కావ్య వార్నింగ్ ఇస్తుంది. చాలు ఆపు. ఈ నెక్లెస్ కొనడం వల్లేగా నువ్ ఇలా అంటున్నావ్. పది లక్షల కోసమే కదా ఈ ఇంటి సభ్యురాలిలా చూడట్లేదు. అసలు నాకు ఈ నెక్లెసే వద్దు. ఇంతమంది ముందు అవమానించావ్ గా చాలు. ఈ నెక్లెస్ అమ్మెసుకుని పది లక్షలు తీసుకో అని స్వప్న బాధపడుతూ వెళ్లిపోతుంది.
ఇదంతా పెద్ద నాటకం. రాజ్ ముందు అమాయకంగా నటిస్తూ మేము రాద్ధాంతం చేసేసరికి ఇలా మాట్లాడుతుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో అపర్ణ కోప్పడుతుంది. మా కార్డ్‌లన్నీ బ్లాక్ చేయడం తినే తిండిపై ఆంక్షలు పెట్టడం ఏంటీ అని ధాన్యలక్ష్మీ అంటుంది. నేనింతే.. నేనింతే.. ఇప్పుడు చెబుతున్నాను. నేను ఇంతే. ఇప్పుడు మీకు నా నిర్దోషిత్వాన్ని మా ఆయన నిరూపించారు. ఇకనుంచే నేను ఎవరికి సమాధానం చెప్పను, సంజాయిషీ ఇవ్వను. లక్షలకు లక్షలు దుబారా చేసే రోజులు పోయాయి అని తెగేసి చెబుతుంది కావ్య.
ఆస్తి చేతికొచ్చేసరికి ఇంతకాలం జరిగేది ఆపేయాలట. మాకు ఖర్చు పెట్టుకునే హక్కు లేదా, స్వాతంత్య్రం లేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. లేదు.. ఈ విషయంలో సమాధానం చెప్పాల్సిన అవసరం మా అత్తగారికి లేదు. మీ అత్తగారికి లేదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెబుతుంది. తర్వాత హాస్పిటల్ బిల్ క్లియర్ కాలేదంటా ఏమైంది అని కావ్యను అడుగుతాడు సుభాష్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్