Brahmamudi August 27th Episode: బ్రహ్మముడి- రాజ్‌ను వెళ్లగొట్టేందుకు రుద్రాణి స్కెచ్- అత్త భర్తకు స్వప్న సరికొత్త శిక్ష
Brahmamudi Serial August 27th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్, అప్పుకు జరిగిన అవమానం గురించి బాధపడుతూ కాల్ చేస్తాడు రాజ్. అప్పు అదంతా అక్కడే మర్చిపోయిందని కల్యాణ్ చెబుతాడు. తర్వాత రాజ్‌ను కూడా ఇంటినుంచి వెళ్లగొట్టేందుకు రుద్రాణి రాహుల్ ప్లాన్ చేస్తారు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో అప్పును రుద్రాణి, ధాన్యలక్ష్మీ అన్న మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటాడు రాజ్. కల్యాణ్ ఇంటికి రావాలని బలంగా కోరుకున్నాను కానీ, ఇంటికొస్తే అవమానం జరగకుండా ఆపలేకపోయాను. ఎంత మందలించిన పిన్ని, రుద్రాణి అత్త అప్పును దారుణంగా అవమానించారు. అరే తాతయ్య పిలిచారన్న విషయం కూడా మర్చిపోయి పిన్ని అప్పును మాటలు అనడమే ధ్యేయంగా పెట్టుకుంది అని రాజ్ అనుకుంటాడు.
చెంపచెల్లుమనిపించినా అప్పు
పాపం వారిద్దరూ ఎంత బాధపడుతున్నారో అని రాజ్ అనుకుంటూ ఫీల్ అవుతాడు. మరోవైపు కల్యాణ్, అప్పు ఆటో దిగుతుంటే పక్కనుంచే ఒకతను బైక్ వేసుకుని వెళ్తాడు. దాంతో రేయ్ ఆగురా. కళ్లు జేబులో పెట్టుకుని నడుపుతున్నావా అని అప్పు వాన్ని తిడుతుంది. వాడే మూసుకున్నాడు. నీకేంటే అని బైక్ అతను అంటాడు. దాంతో ఏమన్నావురా అని వాడి కడుపులో ఒక్కటి గుద్దుతుంది. చెంపచెళ్లుమనిపిస్తుంది. దాంతో అతను కింద పడి నొప్పితో తల్లడిల్లిపోతాడు.
సారీ అక్క, సారీ, అన్న అని వాళ్లిద్దరికి సారీ చెబుతాడు అతను. ఇంకోసారి ఈ రోడ్‌లో కనిపిస్తే.. బండి ఇనుపసామానులో అమ్ముకోవాలే.. నీ బాడీ హాస్పిటల్‌లో అతుకులు వేయించుకోవాలే అని వార్నింగ్ ఇస్తుంది అప్పు. దాంతో అతను పారితోపాతాడు. థ్యాంక్స్ అప్పు అని కల్యాణ్ చెబుతాడు. ఎందుకు వాడిని కొట్టినందుకా అని అప్పు అంటే.. కాదు. ఒక్క మాట కూడని పడని నువ్ నాకోసం ఇవాళ అన్ని మాటలు పడ్డావని కల్యాణ్ అంటాడు.
నీకు మాట ఇచ్చాను కదా. మీ అమ్మను అంటే నువ్ బాధపడతావ్. ఆ పడేదేదో నేనే పడదామని. అయినా ఇవాళ మీ అమ్మ కొత్తగా ఏమంది. ఆఖరుకు వస్తే మన అనుమానమే నిజం జేశినం అని అప్పు అంటుంది. వాళ్లు చేసిన దానికి సారీ అప్పు అని కల్యాణ్ అంటే.. మన తప్పులకు మనమే.. వాళ్ల తప్పులకు మనమే సారీ చెప్పుకోవాలా. సాల్‌తీ అని అప్పు అంటుంది. పెళ్లయితే అమ్మాయిలు మారుతారంటారు. కానీ, నువ్ ఏం మారలేదు. కానీ, నా మాటకు కట్టుబడి నువ్ ఏమనలేదు చూడు అక్కడ ఫిదా అయ్యాను అని కల్యాణ్ అంటాడు.
ఎప్పుడు పరిష్కారం అవుతాయ్
ఇంతలో రాజ్ కాల్ చేసి జరిగినదానికి చాలా ఫీల్ అవుతున్నట్లు చెబుతాడు. దాంతో కల్యాణ్ నవ్వుతాడు. నేను సారీ చెబితే సాల్ తి నీ ఓవరాక్షన్ అంది. ఆ ప్యాలెస్‌లో జరిగింది అక్కడే దులిపేసుకుని వచ్చినా అందని. మేము అక్కడికి వస్తే ఇదే జరుగుతుందని మాకు ముందే తెలుసు అని కల్యాణ్ అంటాడు. దాంతో రిలీఫ్‌గా ఫీల్ అయిన రాజ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పుడు సాల్వ్ అయితాయిరా అని రాజ్ అంటాడు. నేను ఏదోటి సాధించేవరకు ఇలాగే ఉంటుంది. నీ ప్రయత్నాలు ఏవి వాళ్లు సాగనివ్వరు. కానీ, నువ్ దీనికి వదినను నిందించకు అని కల్యాణ్ చెబుతాడు.
సరేనని రాజ్ కాల్ కట్ చేస్తాడు. ఆ మాటలు విన్న పెళ్లయిన తర్వాత నేను కాదురా నువ్ మారిపోయావ్. మొహమాటం పక్కన పెట్టేశావ్. నువ్ మంచోడివిరా కూచి అని అప్పు అంటే.. నువ్ కాస్తా రౌడీవే పొట్టి అని కల్యాణ్ అంటాడు. మరోవైపు రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. రాజ్ మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. నీకు మంచి స్టఫ్ దొరికింది కదా. నీకు చెప్పినట్లు ఓడిపోయాను కదా. నేను చెప్పినట్లే జరిగింది కదా. ఇప్పుడు నీకు అడ్డంగా దొరికిపోయాను కదా అని ఏదోటి అంటూనే ఉంటాడు రాజ్.
నేను ఏం అనలేదు. అన్నీ మీరే అనుకుంటున్నారు అని కావ్య అంటుంది. నీకు అనే ఛాన్స్ ఇవ్వలేదు. నాకు నేనే అనుకుంటున్నాను. దటీజ్ స్వరాజ్ అని రాజ్ అంటాడు. పోనిలేండి ఇన్నాళ్లు మీరెంత ఫూలిష్‌గా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకున్నారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నారు అని సెటైర్లు వేస్తుంది కావ్య. ఏంటే నేను ఇన్ని అనుకున్నా నువ్ సెటైర్లు వేస్తున్నావ్ అని రాజ్ అంటే.. దటీజ్ కళావతి.. డాటర్ ఆఫ్ కనకం అని కావ్య అంటుంది.
అనడానికి ఒకటి ఉంటుంది
రాజ్ వెళ్లిపోతుంటే.. కావ్య ఆపి దూరమైన కొడుకుని చూసి మీ పిన్నిగారు చలించిపోయి అప్పును కోడలిగా అంగీకరిస్తారు అనుకున్నారు. పాపం మీ అంచనాలన్నీ పటాపంచలు అయిపోయాయి. మిమ్మల్ని మీరు అనుకోవడం ప్రారంభించారు. అక్కడ కూడా మీరు ఓడిపోయారు. మిమ్మల్ని అనడానికి టైమ్ దొరికితే భార్యలకు పేజీలు పేజీలు అంటాం. మీరెంత అనుకున్నా మాకు అనడానికి ఒకటి ఉంటుంది అని కావ్య అంటుంది.
కల్యాణ్ ఇక్కడ ఉండి ఈ ఆడ లేడీస్‌తో వాడేం ఏగేవాడే. అనడానికి తప్పు ఉండాల్సిన అవసరం లేదని తెలుసుకున్నాను. నా జ్ఞాన చక్షువులు తెరచుకున్నాయి. సమస్య వాడిలో లేదు. ఈ ఇంట్లో ఉంది. వీళ్లు మారితేనే వాడి మనసు మారి రావాలనుకుంటాడు. వాడు జీవితంలో పోరాడి గెలిచి రావాలనుకుంటాడు. కానీ, జీవితాంతం పోరాడుతుంటాను నాకు భయంగా ఉంది. కానీ, ఈ గొలుసుకట్టు తెగేది ఎక్కడ అని రాజ్ అంటాడు.
ఏవండి మన దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. కాలం కచ్చితంగా సమాధానం చెబుతుంది. పరిష్కారం కచ్చితంగా చూపిస్తుంది. అప్పటివరకు ఓపికగా ఎదురచూడక తప్పదు అని కావ్య అంటుంది. మరి నేను ఏం చేయాలి అప్పటివరకు అని రాజ్ అంటే.. ఏవండి మీకో జీవితం ఉంది. మీరు జీవితాంతం పోరాటం చేయకండి. మిమ్మల్ని నమ్ముకుని ఓ జీవి ఉంది. మీరు ఓ కంపెనీ కొనుక్కున్నారు. దాన్ని పడేయకుండా బాగా చూసుకుంటారు కదా. అలాగే నన్ను బాగా చూసుకోవడం అలవాటు చేసుకోండి అని కావ్య వెళ్లిపోతుంది.
రుద్రాణి రాహుల్ సెలబ్రేషన్
ఈ రాత్రంతా బాగా ఆలోచించి కంపెనీ బాగోగులు పట్టించుకోవాలి అంతేకదా అని రాజ్ అనుకుంటాడు. మరోవైపు ప్లాన్ సక్సెస్ అయినందుకు రుద్రాణి, రాహుల్ డ్రింక్ తాగుతుంటారు. మొదటిసారి విజయం దక్కింది. ధాన్యలక్ష్మీ పిచ్చిది కాకపోతే నేను చెప్పిన మాటలు విని కొడుకును దూరం చేసుకుంది అని రుద్రాణి అంటుంది. కల్యాణ్ ఇక ఇంటికి రాడు. రాజ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి కంపెనీ జోలికి కల్యాణ్ రాడు. కల్యాణ్ వచ్చేదాక రాజ్ కంపెనీ జోలికి రాడు అని రాహుల్ అంటాడు.
కానీ, కావ్య ఉంది. అది ఏదోటి చేస్తుంది కాబట్టి. రాజ్ ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేయాలి. వాడు ఒంటరివాడై డిప్రెషన్‌లోకి వెళ్లాలి. అప్పుడే మనకు ఈ కంపెనీ దక్కుతుంది అని రుద్రాణి అంటుంది. అప్పుడే అటువైపుగా వెళ్తున్న స్వప్న వాళ్లను చూస్తుంది. వాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం చూసి.. నా చెల్లిన అవమానించి సిగ్గులేకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నారా. మీ సంతోషమే మీకు శాపంగా మారేలా చేస్తాను అని స్వప్న అనుకుంటుంది.
మరోవైపు ధాన్యలక్ష్మీ దగ్గరికి అపర్ణ వెళ్తుంది. కొడుకు వెళ్లిపోయాడని బాధపడుతున్నావా. లేదా నీ పంతం నెగ్గించుకున్నానని సంతోషపడుతున్నావా. నువ్ తప్పు చేయలేదు. మోసం చేశావ్. ఆఖరికి నీ కొడుకును మోసం చేశావ్. ఒక మనిషి నచ్చకపోతే దూరంగా ఉండాలి. లేకుంటే దగ్గరికి పిలిచి ఆ విషయం చెప్పాలి. కానీ, ఇలా చేయకూడదు. నీ కొడుకు పెళ్లి చేసుకున్నదాన్ని అందరి ముందు అవమానించావ్. దానివల్ల నీకు వచ్చింది. ఒంటరితనమే కదా. ఇవాళ నీ కోపం ఖరీదు నీ కన్నన కొడుకుని శాశ్వతంగా దూరం చేసుకోవడం అని అపర్ణ అంటుంది.
అద్భుతంగా చెప్పావ్
ఇకనుంచి నీ తప్పు తెలుసుకుని. అప్పును కోడలిగా ఒప్పుకుని. కొడుకుని క్షమించమను. వాళ్లిద్దరిని ఇంటికి తిరిగి తీసుకురా. అప్పుడు కానీ నీ బాధ తీరదు. నేను చేసిన తప్పు నువ్ చేయకు. కావ్య ఇంటికి వచ్చినప్పుడు తనను బాధపెట్టాను. అది గుర్తుకువ్చినప్పుడల్లా నన్ను క్షమించుకోలేను. అలా నువ్ కావొద్దు అని అపర్ణ అంటుంది. చాలా అద్భుతంగా చెప్పావ్ అక్క. ఒక రాజకీయనాయకురాలిలాగా బాగా నీతులు చెప్పావ్. ఇలా చెప్పమని నీ కోడలు చెప్పిందా అని ధాన్యలక్ష్మీ అంటుంది.
నీ కోడలు ఎప్పుడో నిన్ను మార్చేసి తన గుప్పిట్లో పెట్టుకుంది. నువ్ మాట్లాడే మటాలు తను మాట్లాడినట్లే ఉంది. నీ కోడలు గురించి నాకు బాగా తెలుసు. అప్పును నా కొడుకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూనే అప్పును ఈ ఇంటికి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. అందులో సగం గెలిచింది కూడా. కానీ, దాన్ని పూర్తిగా గెలవనివ్వను. అప్పును కోడలిగా అంగీకరించను అని ధాన్యలక్ష్మీ అంటుంది.
నీ కోపం వల్ల నువ్ ఏం కోల్పోతున్నావో నీకు తెలియట్లేదు. మంచి మాటలు కూడా నీకు చేదుగా అనిపిస్తున్నాయి. మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు. చివరికీ ఆ చెట్టే బూడిద అవుతుందని తెలుసుకో అని అపర్ణ వెళ్లిపోతుంది. ఆ కావ్యను కోడలిగా చేసుకోవడం వల్ల ఈవిడకు నష్టం జరిగింది. నాకు కూడా అలాగే జరగాలని చూస్తుంది. ఎవరేం చెప్పిన ఆ అప్పును నా కోడలిగా ఒప్పుకోను అని ధాన్యలక్ష్మీ అనుకుంటుంది. మరోవైపు రుద్రాణి బెడ్ రూమ్‌లో బెలూన్స్ పెడుతుంది.
స్వప్న శిక్ష
బెలూన్స్‌లో లాఫింగ్ గ్యాస్ ఉంటుంది. బెడ్ రూమ్ నిండ బెలూన్స్ ఉండటంతో అత్త వాళ్లు ఏదో బెలూన్‌ను పగులగొడతారు. అప్పుడు లాఫింగ్ గ్యాస్ బయటకు వచ్చి రాత్రంతా నవ్వుతూనే ఉంటారు అని స్వప్న అనుకుని వెళ్లిపోతుంది. రుద్రాణి, రాహుల్ మాట్లాడుకుంటూ రూమ్‌లోకి వెళ్లిపోతారు. నేను ఇందాక వచ్చేటప్పుడు తలుపు తీసే ఉంది కదా. ఇప్పుడు లాక్ ఎలా ఉందని రుద్రాణి రాహుల్‌తో అంటుంది. దీనికి కిక్ ఎక్కిన లాజిక్ మాత్రం మరిచిపోలేదు అని స్వప్న అనుకుంటుంది.
గాలికి తలుపు పడి ఉంటుంది. మమ్మీ అని తలుపు తీస్తాడు రాహుల్. రూమ్‌లో బెలూన్స్ చూసి షాక్ అవుతారు ఇద్దరు. నా బెడ్ రూమ్‌లో ఇన్ని బెలూన్స్ ఎవరు పెట్టారు అని రుద్రాణి అంటుంటే.. హ్యాపీ బర్త్ డే మమ్మీ అని బెలూన్ పగులగొడతాడు రాహుల్. దాంతో లాఫింగ్ గ్యాస్ బయటకు వచ్చి ఇద్దరూ నవ్వుతూ ఉంటారు. ఇలా వాళ్లకు స్వప్న శిక్ష వేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కావ్య రాజ్ మధ్య రొమాన్స్ చూపిస్తారు.