Brahmamudi April 4th Episode: రుద్రాణిని పిచ్చిదాన్ని చేసి ఆటాడుకున్న స్వప్న, అప్పు- రాజ్‌కు యామిని గిఫ్ట్- భయపడిన రామ్!-brahmamudi serial april 4th episode swapna appu prank rudrani yamini gift star maa brahma mudi today disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 4th Episode: రుద్రాణిని పిచ్చిదాన్ని చేసి ఆటాడుకున్న స్వప్న, అప్పు- రాజ్‌కు యామిని గిఫ్ట్- భయపడిన రామ్!

Brahmamudi April 4th Episode: రుద్రాణిని పిచ్చిదాన్ని చేసి ఆటాడుకున్న స్వప్న, అప్పు- రాజ్‌కు యామిని గిఫ్ట్- భయపడిన రామ్!

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Serial April 4th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 4 ఎపిసోడ్‌లో రుద్రాణిని ఓ ఆట ఆడుకోవాలని స్వప్న, అప్పు ప్లాన్ చేస్తారు. దానికి రాహుల్‌కు గాలం వేసి బయటకు పంపిస్తుంది స్వప్న. రాజ్ గురించి ఆలోచిస్తున్న కావ్య దగ్గరికి సుభాష్ వచ్చి ఊహల్లో నుంచి బయటకు రమ్మని సలహా ఇస్తాడు. కానీ, కావ్య వినదు.

బ్రహ్మముడి సీరియల్‌ ఏప్రిల్ 4వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య గురించి రుద్రాణి చేసింది తలుచుకుని రగిలిపోతుంది. ఇంతలో అప్పు వచ్చి ఏమైందని అడుగుతుంది. దాంతో రుద్రాణి గురించి చెబుతుంది స్వప్న. కావ్య పరిస్థితిని ఆవిడకు ఫేవర్‌గా చేసుకుని కావ్యను పిచ్చిదాన్ని చేయాలని చూస్తుంది అని స్వప్న అంటుంది.

ఒంటరిగా ఉంటుంది

ఇంకొకసారి అలా మాట్లాడకుండా గట్టిగా వార్నింగ్ ఇద్దాం అని అప్పు అంటుంది. లేదు ముల్లును ముల్లుతోనే తీయాలి. కావ్యను పిచ్చిదానిలా చూస్తున్న మా అత్తను మనం పిచ్చిదాన్ని చేసి ఒక ఆట ఆడుకోవాలి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా గట్టిగా బుద్ధి చెప్పాలి. ఆవిడకు తోడుగా నా మొగుడు ఎప్పుడు తోడుంటాడు. ఆ ఘనుడిని ముందు బయటకు పంపాలి. అప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంటుంది. ఆడుకోవడం ఈజీ అవుతుందని స్వప్న అంటుంది.

మరి నీ మొగుడుని బయటకు పంపడం ఎలా అని అప్పు అడుగుతుంది. గాలం వేస్తా.. చాలా మంది గాలం వేసి పులిహోర కలుపుదామని చూస్తాడు. అదే గాలం రాహుల్‌కు వేస్తాను. మాములు కళాకారుడు కాదు. ఏదో రోజు అందరితో కొట్టించుకునే కళాకారుడు. ఇంట్లో పనికిరానివాళ్లే బయట కథలు పడుతుంటారు. ఇవాళ నువ్ నాలో కొత్త టాలెంట్‌ను చూస్తావ్ అని స్వప్న అంటుంది. వారం క్రితం కొత్త నెంబర్ తీసుకున్నా, గొంతు మారుస్తా అని చెప్పిన స్వప్న రాహుల్‌కు కాల్ చేస్తుంది.

హాయ్ డియర్, నేను రాహుల్, టీనాను. ఒకసారి పార్టీలో కలిసాం. ఇవాళ కలుద్దామనుకుంటున్నాను. కుదుర్తుందా అని గొంతు మార్చి స్వప్న అంటుంది. ఇన్నాళ్లకు కలవాలనిపించిదా. నేను 24 గంటలు ఫ్రీనే. ఎక్కడికి రావాలి అని రాహుల్ అంటే.. ఇంట్లో మీ ఆవిడ ఏం అనదా అని స్వప్న అడుగుతుంది. అసలు నాకు పెళ్లే కాలేదు. బ్యాచిలర్‌గా ఉంటేనే కదా మీలాంటి గర్ల్స్‌తో చాటింగ్ అయినా మీటింగ్ అయినా. లొకేషన్ షేర్ చేయి, వెయిట్ చేస్తుంటా అని రాహుల్ అంటాడు.

మగాళ్లను అడగకూడదు

స్వప్న కాల్ కట్ చేస్తుంది. చూశావుగా, వీడి వేశాలు, కూతురు ఉన్న కూడా పెళ్లి కాలేదని అబద్ధాలు ఆడుతున్నాడు అని స్వప్న అంటుంది. నాకు ఒక అవకాశం ఇవ్వు. స్టేషన్‌లో వేసి మళ్లీ ఇంకోసారి ఇలా చేయకుండా బుద్ధి చెబుతాను అని అప్పు అంటుంది. వాడి సంగతి నేను చూసుకుంటాగా అని స్వప్న అంటుంటే.. రాహుల్ బయటకు బయలుదేరుతాడు. ఎక్కడికి వెళ్తున్నావ్ అని స్వప్న అడిగితే.. మగాళ్లను ఎక్కడికి అని అడగొద్దని తెలియదా అని చిరాకు పడతాడు రాహుల్. అది సంపాదించేవాళ్లకు అని స్వప్న అంటుంది.

చూస్తుండు రాజ్‌ను రీప్లేస్ చేసేది నేనే. కంపెనీని ఒంటిచేత్త నడిపించేది నేనే అని రాహుల్ అంటాడు. మీడియాలో అదే చెప్పుకుంటున్నారు అని అప్పు పంచ్ వేస్తుంది. అర్జంట్ పని ఉంది వెళ్లాలి అని రాహుల్ వెళ్తాడు. అక్క నైట్‌కు కచ్చితంగా రాడుగా అని అప్పు అంటే.. రానివ్వనుగా అని స్వప్న అంటుంది. అయితే, రుద్రాణి గారిని ఒక ఆట ఆడుకోవాలి అని అప్పు అంటుంది. మాములు ఆట కాదు ఫుట్ బాల్ ఆడుకోవాలని స్వప్న అంటుంది.

మరోవైపు కావ్య హడావిడిగా వెళ్లడం గురించి రాజ్ ఆలోచిస్తుంటాడు. నా ప్రవర్తన తప్పుగా అనిపించిందా, కనుక్కోవాలని హాయ్ అని మెసేజ్ చేస్తాడు రాజ్. కావ్య సంతోషించి రిప్లై ఇస్తుంది. దాంతో తనమీద ఏ కోపం లేదన్నమాట అని రాజ్ అనుకుంటాడు. మిమ్మల్ని ఏమైనా బాధపెట్టానా అని రాజ్ అడిగితే.. ఏం లేదని చెబుతుంది కావ్య. కాఫీ షాప్ నుంచి ఎందుకు వెళ్లిపోయారు అని రాజ్ అంటే.. మీరు చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయేది. యామిని కూడా వస్తుందని తెలిసింది. యామిని గొడవ పెట్టుకుంటే అన్ని నిజాలు బయటపడతాయ్. అవి మీరు తట్టుకోలేరు అని కావ్య అనుకుంటుంది.

ఇంత ప్రేమ చూపించకండి

హెడెక్‌గా ఉండి వచ్చేశాను అని కావ్య చెబుతుంది. దాంతో రాజ్ కాల్ చేసి తలనొప్పిగా ఉంటే చెప్పాలి గానీ అలా వెళ్తారా. అడ్రస్ పెట్టండి. తలనొప్పిగా ఉందన్నారుగా. ఇద్దరం కలిసి హాస్పిటల్‌కు వెళ్దాం అని రాజ్ అంటాడు. మీరు ఇంత ప్రేమ చూపించకండి. నిజం చెప్పేసేలా ఉన్నాను అని కావ్య అనుకుంటుంది. నేను ఇందాకే ట్యాబ్‌లెట్ వేసుకున్నాను. తగ్గింది కూడా. దీనికి హాస్పిటల్‌కు ఎందుకు అని కావ్య చెబుతుంది.

నేను కెఫెలో నిజమే చెప్పాను. నాకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపించింది. నాకు గతం గుర్తుకు లేదు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియడం లేదు. కళావతి గారు నిజంగా నేను మీకు తెలియదా అని రాజ్ అంటే.. అమ్మమ్మ పిలుస్తున్నారు అని అబద్ధం చెప్పి కాల్ కట్ చేస్తుంది కావ్య. అప్పుడే రాజ్ పక్కన యామిని ఉంటుంది. దాంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటీ అలా సైలెంట్‌గా వచ్చావ్. సడెన్‌గా చూసేసరికి భయపడ్డాను తెలుసా అని రాజ్ అంటాడు.

నీ దగ్గరికి రావడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా. నా మీద ఇంకా కోపం పోలేదా. నేను తప్పు చేశాను. సారీ. నీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నువ్ ఒంటరిగా వెళ్తే ప్రాబ్లమ్ అవుతుందని బాధపడ్డాను. నువ్ ఎక్కడికి వెళ్లిన నీకు తోడుగా ఉండాలనుకున్నా. అంతేకానీ నీ ప్రైవేసీని లాగేసుకోవాలని కాదు అని యామిని ప్రేమగా మాట్లాడుతుంది. నువ్ చెప్పింది నిజమే. కానీ, నేను చిన్న పిల్లాడిని కాదుగా అని రాజ్ అంటాడు.

ప్రమాదంలోకి నెట్టేయలేను

అది నాకు ఇందాకే అర్థమైంది. నీకో గిఫ్ట్ తీసుకొచ్చాను. ఈరోజు నుంచి ఈ కారు నీదే బావ. ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లొచ్చు. ఇంట్లో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని కారు కీస్ ఇస్తుంది. ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్ బావ అని వెళ్లిపోతుంది యామిని. మరోవైపు పెళ్లి ఫొటో పట్టుకుని కావ్య ఏడుస్తుంది. నిజం చెప్పి మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేయలేను. అందుకే కాల్ కట్ చేశాను అని కావ్య అనుకుంటుంది. ఇంతలో సుభాష్ వస్తాడు.

ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావ్ అని సుభాష్ అంటే.. రుద్రాణి మాటలే నమ్ముతున్నారా అని కావ్య అంటుంది. లేదు నీ మాటలే నమ్ముతున్నాను. ఇన్నాళ్లు మీ అత్త నీ మాటలే నమ్ముతుంది. కానీ, నువ్ కేఫ్‌లో మాట్లాడింది చూసి తన నమ్మకం చచ్చిపోయింది. నిన్ను కన్నకూతురులా చూసుకున్నాను. నువ్ కూడా నాకు అంతే సపోర్ట్ చేశావ్. ఇంటిని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడావ్. నిజాన్ని నమ్ము కావ్య. ఊహల్లోంచి బయటకురా అని సుభాష్ అంటాడు.

నీకేం అయిపోతుందేమో అని భయంగా ఉంది. ఆ రుద్రాణి అడిగింది అని కాదు. నువ్ నిజంగా రాజ్‌ను చూసి ఉంటే వాడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని సుభాష్ అంటాడు. దాంతో కావ్య సైలెంట్‌గా ఉంటుంది. క్షమించండి, ఇప్పుడు నేను చెప్పలేను అనుకుంటుంది. నీ దగ్గర సమాధానం లేదు. కానీ, నేను నమ్మడానికి సాక్ష్యాలు ఉన్నాయి. నువ్ నమ్మడానికి ఊహలు మాత్రమే ఉన్నాయి అని సుభాష్ అంటాడు. కొన్నిసార్లు మన కళ్లు కూడా మనల్ని మోసం చేస్తాయి అని కావ్య అంటుంది.

గుడ్డిదాన్ని చేయదు

ఎంత చెప్పిన నీ మొండితనమే కానీ మా మాట అర్థం చేసుకోవా అని సుభాష్ అంటాడు. మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్ చెప్పగలను. కానీ, మీరు నమ్మిన దారిలో మేము నడవలేను అని కావ్య అంటుంది. నువ్ నమ్మిన దారిలో చీకటి తప్ప ఇంకేముందని సుభాష్ అంటాడు. నేను ఆయన్ను గుడ్డిగా ప్రేమించొచ్చు. కానీ, ఆయన ప్రేమ నన్ను గుడ్డిదాన్ని చేయదు అని కావ్య అంటుంది. దాంతో సుభాష్ వెళ్లిపోతాడు. ఫొటో పట్టుకుని ఏంటండి నాకీ శిక్ష అని కావ్య అనుకుంటుంది.

తర్వాత అంతా ఓకే కదా అని లంచ్ టేబుల్ దగ్గర అప్పు, స్వప్న అనుకుంటారు. ఇంతలో రుద్రాణి వచ్చి టైమ్‌కు ఫుడ్ తినకుండా హెల్త్ పాడు చేసుకుంటున్నారు అని అంటుంది. ఇవాళ వంటలు ఘుమఘుమలాడిపోతున్నాయి అని స్వప్న అంటుంది. నాకు రాని వాసన మీకు ఎలా వస్తుందో అని రుద్రాణి అంటే.. పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని స్వప్న అంటుంది. అంత ఘుమఘుమలాడేలా ఏం చేశారో అని డిష్ ఓపెన్ చేస్తుంది రుద్రాణి.

పిచ్చిదానిలా రుద్రాణి

అందులో బతికి ఉన్న చేపలు చూసి ఉలిక్కిపడుతుంది రుద్రాణి. హేయ్ లైవ్ ఫిష్ అని రుద్రాణి అంటే.. హెల్త్‌కి మంచిదని బతికి ఉన్న ఫిష్‌ చేసింది శాంత అని స్వప్న అంటుంది. అది కాదు బతికి ఉన్న చేపలు పెట్టారు అని రుద్రాణి అంటుంది. మంచి ఘుమఘులాడే ఫిష్ కర్రీ చేశారు అని అప్పు అంటుంది. దాంతో పిచ్చిదానిలా చూస్తుంది రుద్రాణి. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం